అసలు వార్త: స్వామివారి ప్రసాదం నకిలీ నెయ్యితో తయారైంది. నిందితుడు అరెస్ట్. ✅
సాక్షి వార్త: "జంతు కొవ్వు లేదు." ❌
@ysjagan - ED ప్రకటనలో "జంతు కొవ్వు లేదు" అనే మాట ఎక్కడ ఉంది? ఒక్క లైన్ చూపించండి.
ఇంత సిగ్గులేని నీచులని దేశంలో ఎప్పుడైనా చూసారా .. మరి ఇంత బరితెగింపా ..?
#YSRCPNeverAgain #AndhraPrasesh
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది. “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వెలిగొండ సంబరం-కృష్ణమ్మకు వందనం..!
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ఈరోజును నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేను. రైతులు, నిర్వాసితులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన నేను... మూడు దశాబ్దాల తర్వాత వెలిగొండలో కృష్ణమ్మ జలాలను ఆహ్వానించడం, కరువు నేలపై జలసిరులను చూడటం ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది. కరువుతో పోరాడిన రైతన్నలు, ఫ్లోరైడ్ బాధలు అనుభవించిన కుటుంబాల సమస్యలు ఇకనుంచి తీరనున్నాయి. వెలిగొండ కేవలం ఒక ప్రాజెక్టు కాదు... పశ్చిమ ప్రకాశం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బంగారు కొండ. ఈ ప్రాంత అభివృద్ధికి ఇది కొత్త అధ్యాయం. అందరికీ శుభాకాంక్షలు... వెలిగొండను సాకారం చేయడానికి కృషి చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు, ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు. వెలిగొండ మొదటి దశతో మార్కాపురం ప్రాంతానికి గుడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఇక మార్కాపురం అన్ స్టాపబుల్...
వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు.
#VeligondaProject
#SuzlonComesToAP
It gives me immense satisfaction to see @Suzlon deepen its commitment to Andhra Pradesh with ₹10,500 crore of new wind energy projects and an expanded manufacturing presence in Anantapur.
My association with Suzlon goes back many years, to my friendship with its visionary founder, the late Shri Tulsi Tanti. He believed deeply in the future of renewable energy long before it became a global imperative. I remember with warmth his faith in Andhra Pradesh and his commitment to building here. Today, as Suzlon begins a new chapter in our State with 1,325 MW of wind projects, creating thousands of livelihoods, I feel we are carrying forward that shared vision.
Andhra Pradesh will continue to honour long-standing partnerships, keep its commitments, and build a clean, sustainable energy future for generations to come.
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే APPSC గ్రూప్ - 1 ఉద్యోగాల పేరిట అతిపెద్ద పరీక్షా కుంభకోణం ఎలా జరిగింది? వేలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలతో, వారి కలలతో జగన్ ఎంత వికృతంగా ఆడుకున్నాడు. యువ ప్రతిభను ఎలా కాలరాశాడు... ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మనం చెప్పుకోబోయేదంతా సిట్ దర్యాప్తు చేసి ఇచ్చిన నివేదికలో ఉన్న కఠోర వాస్తవాల కథనం.
#JaganAPPSCrecruitmentScam
#PsychoFekuJagan
#AndhraPradesh
వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు
ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నాం. తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నాడు ముఖ్యమంత్రిగా 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాను. మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాను. 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు విడుదల చేయబోతున్నాం. ఈ చారిత్రక ఘట్టానికి ఈ నెల 31వ తేదీ మార్కాపురం జిల్లా వేదిక కాబోతోంది. ఫేజ్-1తో 1.19 లక్షల ఎకరాలకు... ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరును... అలాగే లక్షలాది మందికి తాగునీటిని అందించి, తరతరాలుగా కరువుతో పోరాడిన ప్రజలకు ఉపశమనం కల్పించడమే మా లక్ష్యం. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ... వెలుగుల దండ అవుతుంది. వెలిగొండ జల విజయంతో కరువు ప్రాంతంలో కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్నాం. నెర్రెలు బారిన నేలను కృష్ణా జలాలతో తడపబోతున్నాం. 31వ తేదీ నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు... ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడుగుతాయి. ఈ జలంతోనే జీవం-జీవితం... సాగు–బాగు.
పశ్చిమ ప్రకాశం ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చాం. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా చేసేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. నేషనల్ హైవేలు, పోర్టులతో ఈ ప్రాంతానికి లాజిస్టిక్స్ లోటు లేకుండా చేస్తున్నాం. బెంగుళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టులతో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తున్నాం. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ప్రజల జీవితాలు మార్చాలి, వెనుకబాటును దూరం చేయాలనే గట్టి పట్టుదలతో శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మను తీసుకువస్తున్నాం.
ప్రతి రైతు పొలానికి నీరు... ప్రతి యువకుడికి ఉపాధి... ప్రతి కుటుంబానికి భరోసా... ఇదే ‘సీబీఎన్ అనే నేను’ సంకల్పం. ప్రతి పౌరుడూ అనే నేను స్ఫూర్తితో పనిచేసి వ్యక్తిగత విజయాలు సాధిస్తూ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను.
#VeligondaProject
#EDArrestsJaganAide#LiquorScamByJagan#ScamsterJagan#YCPScams
.@ysjagan తన హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో రవాణా ధరను కిలోమీటర్‌కు రూ. 13 నుంచి రూ. 35కు పెంచినట్లు ఈడీ గుర్తించింది. సుమారు రూ. 195.33 కోట్ల మేర అక్రమాలలో, హవాలా లావాదేవీల్లో కారుమూరికి రూ. 15 కోట్లు చేరినట్లు ఈడీ విచారిస్తోంది. ఆయనకు మిగిలేది రూ. 2 కోట్లే అంటున్న జగన్, మిగిలిన సొమ్మును తానే తీసుకున్నాడా, ఎవరి వాటాలు ఎంతో కూడా చెప్పాలి కదా?
#PsychoFekuJagan
#AndhraPradesh
We stand with you @Anitha_TDP Garu
Political debate is an essential part of democracy. However, public discourse must always be guided by mutual respect, dignity, and responsibility.
I strongly condemn the remarks made against Smt. Anitha Garu. While differences in opinion and political criticism are natural, personal comments that diminish the stature of a public representative do not contribute to healthy democratic debate.
Smt. Anitha Garu has earned her place in public life through years of hard work, perseverance, and dedicated service to the people of Andhra Pradesh. As Home Minister, she has been discharging her responsibilities with commitment and sincerity.
Women in politics continue to break barriers and take on leadership roles across sectors. It is our collective responsibility to ensure that political discourse remains respectful and encourages greater participation of women in public life. Every woman leader deserves to be evaluated on her work, leadership, and contributions to society.
Let us focus on issues, governance, and constructive dialogue that strengthen our democracy and inspire future generations of women leaders.
We stand with Smt. Anitha Garu and reaffirm our commitment to a culture of respect, dignity, and meaningful political engagement.
#WeStandWithAnithaGaru #RespectWomenLeaders
నమ్మకానికి నిలువెత్తు రూపం.. రెండేళ్ల ప్రగతి ప్రస్థానం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన 'రెండేళ్ల నమ్మకం' ఇటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తోంది. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, 20 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాల సృష్టితో యువతకు భరోసానిచ్చింది. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం 2.0, స్త్రీ శక్తి వంటి విప్లవాత్మక పథకాలతో ప్రతి ఇంటా వెలుగులు నింపింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, సుపరిపాలనే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం రేపటి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న చంద్రబాబు, లోకేష్ ల నాయకత్వానికి ఇవే ఘన అభినందనలు!
#MSMEwaveInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#2YrsOfTrustDevelopmentWelfare
ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం–అభివృద్ధి–సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ... రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్దిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ...జై ఆంధ్రప్రదేశ్!
@narendramodi@PawanKalyan
డీఎస్సీ జరగకుండా గొడ్డలి పార్టీ వేసిన కేసులు: 226
మేము 226 కేసులు వేసి అడ్డుకున్నా, టీచర్ ఉద్యోగాలు ఎలా ఇస్తారు? యువతపై కక్షతోనే జగన్ రెడ్డి గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది..
#PsychoFekuJagan#AndhraPradesh
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు దుర్మరణం పాలయ్యారని తెలిసి కలత చెందాను. సంబంధిత అధికారులతో మాట్లాడి, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించాను.
‘మై టీడీపీ యాప్’ టాప్ 10 పెర్ఫార్మర్స్‌తో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖాముఖి మాట్లాడాను. ప్రతిఒక్కరినీ పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నాను. కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ‘మై టీడీపీ యాప్’ ఉత్తమ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాను. అనంతరం వారిని సత్కరించాను.