If you live in Hyderabad this might be useful to you - my friend made a map of all bus routes in Hyderabad - all using @ChatGPT Work!
https://t.co/BRWQoZcpCP
నూటికి తొంభై మంది మనగురించి ఆలోచించరు.
ఆలోచించే వాళ్ళలో తొంభై శాతం మంది మన గురించి నెగటివ్ గా ఆలోచించరు.
అలా నెగటివ్ గా ఆలోచించే వాళ్ళలో తొంభై శాతం మంది బయటికి వ్యక్త పరచరు.
అలా వ్యక్తపరిచే వాళ్ళలో ఎక్కువమంది నీ మంచి కోరి చెప్పే శ్రేయోభిలాషులు, ఇక మిగతా వాళ్ళు నీకు ఇప్పటికే అక్కర్లేనివాళ్లో, శత్రువులో, వాళ్ళకి పనిలేకో లేక అసూయతో కూడిన వ్యక్తిత్వ లోపాలు (పర్సనాలిటీ డిజార్డర్) ఉన్నవాళ్ళో అవుతారు. అయితే అలాంటి వాళ్ళు ఏమనుకుంటారో అని మనం ఆలోచించటం అంత వ్యర్థమైన విషయం లేదు.
మీ పిల్లల ఆరోగ్యానికి సూత్రాలు.
1. మీ పిల్లలు ఎంత తినాలో వాళ్లకే వదిలేయండి, ఏ బిడ్డ కడుపు మాడ్చుకోదు. పెద్దవాళ్లే ఉపవాసం, నిరాహార దీక్షలు చేసేది.
2. ప్రతిరోజూ బ్రేక్ఫాస్టు తప్పనిసరిగా తినాలి.
3. ప్రతిరోజూ వాళ్ళకి ప్రేరణనివ్వాలి.
4. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు ఇవ్వాలి. వీటితో పాటు గుడ్లు, మాంసం మంచివి. పప్పులు, నట్స్ ఇవన్నీ అదనం.
5. పిల్లలకు అవసరమైన పానీయాలు రెండే- ఒకటి నీళ్లు, రెండోది పంచదార కలపని పాలు. పండ్ల రసాలు అయితే 100ఎంఎల్ మించి ఇవ్వక్కర్లేదు. దానికి బదులు పండు ఇవ్వండి తినడానికి.
6. పిల్లలకి ఎక్కువ కొవ్వు, ఎక్కువ పిండి ఉన్న పదార్థాలు పెట్టకండి. బయటి తిండి కంటే ఇంట్లో వండినది శ్రేష్ఠం. అన్ని డీప్ ఫ్రైడ్ పక్కనపెట్టాలి. కడుపు నిండాక ఇంకా స్నాక్స్ పెట్టవద్దు.
7. పిల్లలు తక్కువ కూర్చోవాలి, ఎక్కువ తిరగాలి. రోజుకి కనీసం ఒక గంటకి పైగా అలసిపోయేలా ఆడాలి.
8. పిల్లలు రోజుకి రెండు గంటల మించి టీవీ,ట్యాబ్లెట్,మొబైల్ ఏదైనా మొత్తంగా చూడకూడదు. వాళ్ళు పడుకునే గదిలో ఇవి ఉండకూడదు.
9. ఒకపూట అయినా భోజనం ఇంట్లో అందరూ కలసి తినాలి. నెమ్మదిగా తినడం నేర్పాలి. రెండోసారి అడిగినపుడు కాసేపు ఆగి వడ్డించాలి.
10. మరీ గిరిగీసి పిల్లల్ని పెంచకూడదు. వాళ్ళతో అప్పుడప్పుడూ వాళ్ల ఇష్టాలను బేరమాడుతూ వాళ్ళకి కూడా వాళ్ళకేం కావాలో చెప్పగలిగే పొందగలిగే స్వేచనివ్వగలగాలి.
ప్రొటీన్లు- ప్రశ్నలు
ఎందుకు?
ఒంట్లో కండ పెరిగేందుకు,
కండలోపల ఎముక పెరిగేందుకు,
కండ పైన తోలు పెరిగేందుకు,
పాడైన పార్టులు బాగయ్యేందుకు,
ఇమ్యూనిటీ బాగుండి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు,
మెదడులో నరాలు మాట్లాడేందుకు,
తిన్న తిండి అరిగేందుకు,
రక్తం పెరిగేందుకు,
కడుపులో బిడ్డ పెరిగేందుకు,
బిడ్డని కనేందుకు బాడీ సిద్ధమయ్యేందుకు,
జుట్టు పెరిగేందుకు,
రక్తం గడ్డకట్టేందుకు,
రక్తం చిక్కగా ఉండేందుకు,
ఎత్తు పెరిగేందుకు,
షుగరు అదుపులో ఉండేందుకు,
ఎందులో?
గుడ్లు, పాలు, మాంసం,
చిక్కుళ్ళు, పప్పులు, వేరు శనగ, బాదాం, పిస్తా…
అన్నం, చపాతీలో?
ఉంటుంది కానీ సరిపడదు.
శ్రేష్ఠమైన సహజ ప్రోటీను?
గుడ్డు
శ్రేష్ఠమైన తయారీ ప్రోటీను?
పాల పొడి, వే ప్రోటీను - ఇవి సురక్షితం.
శ్రేష్ఠమైన అంటే?
తిన్న మొత్తం ప్రోటీను ఒంట్లోకి వెళ్లి పనిచెయ్యడం. కొన్ని ఆహారాల్లో ఉన్న ప్రోటీను మనకి కావాల్సినవి అందించలేదు.
అంటే?
ప్రోటీన్లలో ఇరవై రకాల అమైనో ఆమ్లాలుంటాయి, ఈ ఇరవై ఉంటేనే ప్రొటీన్లు తయారవుతాయి ఒంట్లో. వీటిలో 11 మన దేహం తయారుచేసుకుంటుంది, కానీ 9 బయటినుంచి తిండిలో తప్పనిసరిగా తీసుకోవాలి. గుడ్డు, పాలలో పుష్కలంగా ఉంటాయిఇవి. మిగతావాటిలో అంతగా ఉండకపోవచ్చు.
ప్రొటీన్లు తిండిలో తగ్గితే?
పిల్లల్లో బుద్ధి మాంద్యం, ఒళ్లంతా పొంగడం, పొట్టిగా ఉండిపోవడం, గుండె అలసిపోవడం, పాలిపోవడం, ఎముకలు బలహీనపడటం
పెద్దల్లో ఇన్ఫెక్షన్లు సులువుగా రావటం, పుండు మానకపోవడం, జుట్టు ఊడిపోవడం, కండరాలు బలహీనపడటం.
రక్తపరీక్ష?
సాధారణంగా రక్తంలో ప్రొటీన్లు 6.5 నుంచి 8.5 గ్రా/డెసి లీ. ఉంటాయి. మీరు తినే తిండి మరీ దారుణం కాకపోతే 6.5 కి తగ్గదు. మీరు ఎంత తిన్నా 8.5 కంటే పెరగదు. అంటే దేహం రక్తంలో ఉండే ప్రొటీన్లను బాగా టైట్ గా కంట్రోల్ చేస్తుంది(నియంత్రిస్తుంది). ఉన్న దానికంటే పెరిగితే దేహంలో ఏదో సమస్య ఉన్నట్లు లెక్క. తక్కువ ఉంటే తక్కువ తినడమో లేక ఇంకెక్కడో ప్రొటీన్లు పోవడమో జరుగుతుందని. మొత్తంగా చెప్పేది ఏంటంటే ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే ఒంట్లో ఐరన్ ని లెక్క వేసినట్లు, ప్రొటీన్లు తింటే ఒంట్లో ప్రొటీన్లని రక్త పరీక్ష ద్వారా లెక్క వెయ్యలేం.
ఎంత తినాలి?
పెద్దలు- 1 గ్రా/కేజీ బరువుకి. అరవై కేజీల బరువు ఉంటే 60 గ్రా తినాలి.
బాలింతలు, గర్భిణీలు, ఎదిగే పిల్లలు, ఆపరేషన్ అయ్యి కోలుకుంటున్నవాళ్ళు, ఐసీయూ నుంచి డిశ్చార్జి అయినవాళ్ళు, బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, ముసలివాళ్లు - 2 గ్రా/ కేజీ బరువుకి.
ఒక్క ప్రొటీన్ తింటే సరిపోతుందా?
సరిపోదు. దేహానికి శక్తి అవసరం అది కార్బోహైడ్రేట్లు, కొవ్వులనుంచి వస్తుంది. అవి దొరకనప్పుడు దేహంలో ఒంట్లో నిల్వని ఖర్చు చేస్తుంది, అవీ అయిపోయాక ఇంకా ఒంట్లో ప్రొటీన్లని వాడుకుంటుంది శక్తి కోసం.
గుడ్లు సురక్షితమా?
సురక్షితం. పిల్లలు పూర్తి గుడ్డు తినవచ్చు. పెద్దలు తెల్లసొన మాత్రం తింటే సరిపోతుంది.
గుడ్లు ఎలా తినాలి?
పచ్చిది వద్దు. ఉడకబెట్టి, ఆమ్లెట్, ఉక్కిరి ఎలా అయినా తినవచ్చు.
తల్లిదండ్రులు పిల్లలకి గుడ్డు పెట్టాలా?
పెట్టాలి.
ప్రభుత్వం పెట్టాలా?
పెట్టాలి.
గుడ్డుకి ప్రత్యామ్నాయం ఉందా?
లేదు. గుడ్డు లో ఉండేపోషకలు ఇంకో ఆహారం ద్వారా తినాలి అంటే ఎన్నో తినాలి, బరువుపెరుగుతారు అనవసరంగా, ఇప్పటికే పిల్లల్లో స్థూలకాయం పెరుగుతోంది. పైగా ఖర్చు, తయారుచేసేందుకు సమయం వృధా.
రోజుకి ఎన్ని గుడ్లు తినవచ్చు?
ఎన్నైనా తినవచ్చు. నేను 4-8 తింటాను.
గుడ్డు తినడం వలన అనర్థాలు ఏమన్నా ఉన్నాయా?
లేవు.
మరి శాకాహారులు?
వే తినవచ్చు. ఖరీదు అలాగే అనవసర పదార్థాలు కలుపుతారు అందులో, అలాగే నాణ్యత కచ్చితంగా ఉంటుందని చెప్పలేం. కొందరిలో బాగా అపానవాయువు వస్తుంది.
గుడ్డు కంటే ఫలానాది మంచి ప్రోటీను ఇది అని అంటే?
గుడ్డు తెలుసురా నీకు అని అనండి.
సండే యా మండే, రోజ్ అండే ఖావ్.
Drove the Skoda Kylaq today
- the 1.0L TSI has so much torque,
I didn't need to lower the gears down in traffic
(It felt like a Diesel almost)
It likes to be revved out,
I did that...felt good
The manual gearbox, I don't know why but felt the gears were hard to shift
(reminded me of my old Indica Vista)
- Suspension, a little bit of horizontal movement over the rumble strips....but otherwise it was good, very controlled, reasonably comfortable
A well balanced setup, I like it.
- the car felt Natural to drive from the get go, no ergonomic issues.
I did not have to worry about seating position, clutch bite point or anything like that.
- Around the corners, the chassis came into it's own...the steering feedback is very good too for an EPS
Not the most "sporty" handling car, but it's a great balance of fun and practicality.
- I took it out on the highway and in city traffic, enjoyed the experience in both conditions
- Both the front and backseats have good knee room, and head room
(3 people in the back is difficult because it's narrow, that's the only concern I have)
It's a really excellent car for travel,
be it short or long distances with 4 people...you'll love it!
- It was a relatively cool day,
So I didn't have to worry about AC...it was cooling very well
(on a hot sunny day, I'm not sure how it'll perform)
- Cabin Insulation really impressed me, it was quiet and smooth throughout.
Engine does get a bit noisy above 3000rpm or so, but I don't see it being a deal breaker.
- Cabin plastics felt a little bit creaky in some places...not the most premium cabin to be in
Korean cars and Indian cars in the segment will easily feel more appealing in interior feel.
- For the less important stuff,
the infotainment screen worked very well, wireless Android Auto was smooth in my limited testing.
the driver's instrument cluster was.....less impressive, but good enough.
Rear camera, very poor quality but it does the job
(I'm not obsessed with cameras and screens in my car)
Speakers were alright,
Midrange was decent but the bass was bloated and not tight enough.
(Not a deal breaker for me)
Overall, a great package
The balance between driver's pleasure and passenger comfort is excellent here.
Skoda really pulled something special with the Kylaq.
శాకాహారం అంటే కష్టమే, కానీ ప్రయత్నిద్దాం.
రోజూ గుప్పెడు నట్స్ (అన్నీ కలగలిపినవి)
రెండు గుప్పెళ్ల అన్నం - అంతకంటే వద్దు.
ఉడికించిన కూరగాయలు (కడుపునిండా)
ఉడికించిన చిక్కుడు పిక్కలు.
ఏదైనా ఆకుకూర వేసిన పప్పు.
ఒకట్రెండు చెంచాల నెయ్యి.
ఒక పెద్ద గ్లాసు వెన్న తీసిన పాలు.
అన్నీ ఇంట్లో వండాలి. తినాలి.
పంచదార, నూనె, ఐస్క్రీము, స్వీట్లు, కారా బూందీ, సమోసాలు, బయటి తిండి, అరిసెలు, పచ్చళ్లు ఇలా చిట్టా చెప్తే చాలా ఉంటుంది, ఇవన్నీ మానెయ్యాలి.
ఒక బాణలిలో జీడిపప్పు, బాదాం, పిస్తా, వాల్నట్లు ఇంకేవైనా దొరికితే అవి వేసి కొంచెం నెయ్యి వేసి దోరగా వేయించి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్సీ వేసి పొడి చేసి, అందులో కొన్ని మిక్సీ వేసి ముద్ద చేసిన ఖర్జూరాలు వేసి కలిపి ఉండలు చేసుకుని మీరు మీ పిల్లలు తినండి. ఒంటికి మంచిది.
మగవాళ్లని ఎలా చూసుకోవాలి.
ఓకే మీకే గనక ఒక భర్త లేదా దీర్ఘకాలిక పార్ట్నర్ ఉంటే వాళ్ల నుంచి మీకు కావాల్సిన ప్రేమ రాబట్టడానికి వాళ్ళని ఈ విధంగా అర్థం చేసుకుంటే మంచిది. ఇక్కడ చెప్పేవి సమగ్రం కాదు, అందరికీ వర్తిస్తాయని కాదు. ఇలా కాకుండా కాదు కూడదు నాకు నచ్చినట్లు నేను సాధిస్తా అంటే మీ బంధం వాళ్ళ ఓపిక మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇక.
1. మగవాళ్ళు మనసులోకి తొంగి చూడలేరు. అంటే మీకు ఏది కావాలో అన్నది వాళ్ళకి వాళ్లే తెలుసుకుని చేయడం చాలా కష్టం. వాళ్ళకి ఒక అల్గారిథమ్ రాసిస్తే ఎగ్జిక్యూట్ చెయ్యగలరు గానీ, మీరు విషయం చెప్పకుండా అలగటం వలన ప్రయోజనం లేదు. మనసులోది చెప్తే వాళ్ళు వింటే అర్థం చేసుకునే అవకాశం ఉంది.
2. ఇప్పుడు సరాసరి మొహం మీద చెప్తేనే అర్థం చేసుకోవడం అంతంతమాత్రం అయిన వాడికి, ఇలా అంటే ఏమంటాడో చూద్దాం అని గూగ్లీలు వెయ్యకూడదు. మగాడు రిషబ్ పంత్ లాంటివాడు గూగ్లీ, దూస్రా అని చూడడు ఊపడం ఒక్కటే తెలుసు. గూగ్లీ వేసి మీరనుకున్న సమాధానం రాక మీరు బాధపడి ప్రయోజనం లేదు.
3. ఎప్పుడూ మెన్షన్ చెయ్యనిది ఇప్పుడు మీకు మెన్షన్ చేశారు అంటే కచ్చితంగా అందులో అతనికి మీ సహాయం కావాలి అనీ. ఆఫీసులో రాజకీయాలో, కుటుంబంలో తగాదానో, ఒంట్లో ఏదో బాగోలేదనో ఇలాంటివి చెప్తే మీరేం సహాయం చేయలేకపోయినా వినాలి. అదే చాలు. మీకు చెప్పారు అంటే ఆ విషయం వలన వచ్చిన ఒత్తిడి వాళ్ల సైకలాజికల్ బఫరింగ్ కెపాసిటీని దాటేసింది అని అర్థం.
4. ఎప్పుడూ మీ భర్తని మీ నాన్న, అన్న దమ్ములతో పోల్చవద్దు. వాళ్ళని పొగుడుకోవచ్చు ఇబ్బంది లేదు. పోల్చడం వలన ప్రయోజనం లేదు. అతని మనసుకి దూరం అవ్వటం తప్ప మార్చే పని చెయ్యలేరు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ భర్తలో లోపాలు ఉన్నట్లే అతనిలో బలాలు కూడా ఉంటాయి. అవే నాన్న, అన్నదమ్ముల్లో కూడా ఉంటాయి. ఇక మీ భర్తని కొలీగు, బాసులతో పోల్చారు అంటే ఇక టాటా బై బై చెప్పొచ్చు.
5. భర్తని కించపరచడం ఇంకా సూటిపోటి మాటల వలన మీరు మార్చలేరు, మార్చినా అదొక నటనగా మిగిలిపోతుంది. ఇది దాదాపు గృహహింస కిందకి వస్తుంది. మీకు ఏం నచ్చలేదో చెప్పి, ఎందుకు నచ్చలేదో చెప్పటం చాలా సులభమైన పద్ధతి.
6. మగవాళ్ళకి కొన్ని ఇష్టాలుంటాయి. సినిమా చూడటం, క్రికెట్ చూడటం, బయటికెళ్లి తినడం లాంటివి. అటువంటి వాటికి మీరు కూడా వెళ్ళటం వాళ్ళకి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇప్పుడు మగవాళ్ళకి చీరల షాపింగ్ ఎంత విసుగో మీక్కూడా అది విసుగు అనిపించవచ్చు. కానీ ప్రేమంటే ఇవ్వటమే కదా.
7. ఇకపోతే సరైన కారణం ( ఆరోగ్యం, పీరియడ్స్, వ్రతం) లేకుండా సెక్సులో పాల్గొనటానికి పదే పదే నిరాకరించడం, మీరు అలిగి ఆ కారణం వాళ్ళకి తెలీక మీరు ముభావంగా ఉండటం వాళ్ళు ప్రేమరాహిత్యంగా భావిస్తారు. సెక్సు లేదు అన్నదానికంటే ప్రేమ లేదు అన్నది ఎక్కువ బాధించే విషయం.
8. మగవాళ్లకి ప్రేమతో సెక్సులో పాల్గొనటం అనేది వాళ్ళ యొక్క అత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. చాలామంది ఆడవాళ్లు చేసే పొరపాటు- ట్రాన్సాక్షనల్ లవ్ లేదా సెక్స్, అంటే భర్త తమకి నచ్చింది కొన్నాడనో, చేశాడనో దానికి ప్రతిఫలంగా చెయ్యటం. మొదట్లో మగవాళ్ళు పెద్దగా ఆలోచించరు దీనిగురించికానీ ఇలా జరుగుతోంది అని తెలిసాక దూరం జరుగుతారు.
9. చాలామంది మగవాళ్ళు ఒంటరివాళ్ళు. వాళ్ళు జీవితంలో తీసుకునే చిన్న చితకా లేదా పెద్ద నిర్ణయాలని అవి సరైనవో కావో అని దిక్సూచి లేక వాయిదా వేస్తుంటారు. అలాంటి సమయాల్లో మీరు జస్ట్ పక్కనే ఉండి వెన్నుతడితే చాలు. దూసుకెళ్లిపోతారు. అందుకే ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు.
10. పెళ్లయ్యాక మీరు మీ కుటుంబానికి భౌతికంగా ( అంటే చనిపోవడం కాదు) ఎలా దూరం అవుతారో, మగవాళ్ళు కూడా మానసికంగా దూరం అవుతారు. ఒకట్రెండు రోజులు వాళ్ల అమ్మ నాన్నతో, నేస్తాలతో గడపడానికి వదిలేస్తే కొత్త ఉత్సాహంతో తిరిగివస్తారు.
11. మగవాళ్ళు ఆంబిగ్విటీ లేకుండా క్లియర్ గా ఉండే సిగ్నల్స్ లేదా మాటలకి బాగా రెస్పాండ్ అవుతారు. ఖచ్చితమైన బౌండరీలు సెట్ చేస్తే వాటిని రెస్పెక్ట్ చేస్తారు. మీ మాటనే వాళ్ళు మీ ఉద్దేశ్యంగా తీసుకుంటారు, మాట వెనక ఉద్దేశ్యం వాళ్ళకి అనవసరం అలాగే అలాంటిది ఒకటి ఉంటుందని కూడా చాలామందికి తెలీదు.
12. మగవాళ్ళు పూర్ణత్వంగా అందాన్ని చూస్తారు. అంటే మిమ్మల్ని చూసి అబ్బా ఎంత బాగున్నావు అనగలరు కానీ ఆ జుంకీలు బాగున్నాయి, పట్టీలు కొత్తవా అని అడగలేరు. మొత్తంగా చూసి మిమ్మల్ని ముద్దుపెట్టుకుంటారు. అలాగే వాళ్ళకోసం మీరు చేసేవాటిని కచ్చితంగా ఆస్వాదిస్తారు. మీరు చేసింది ఆబగా తినడమే వాళ్ల ఉద్దేశ్యంలో బాగుంది అని చెప్పడం.
ఏదో మీకు పనికొస్తుందని రాశా, లేదంటే నేనూ ఒక భర్తనే కాబట్టి చెప్పింది కూరలో కరివేపాకులా పక్కన పడెయ్యండి.
#Hyderabad—-New Four Police Commissionerates
The existing three commissionerates have been reorganised, and the following four Police Commissionerates have been established:
•Hyderabad
•Cyberabad
•Malkajgiri
•Future City
Bhuvanagiri district excluded from the Commissionerate jurisdiction.
As part of the reorganisation of the (GHMC) and the development of Future City, the State Government has decided to restructure the police system into four Police Commissionerates to ensure better public services, effective law and order maintenance, and improved crime control.
The GHMC area has been reorganised into 12 zones, 60 circles, and 300 wards. In line with this, the government decided to reorganise other departments, including the police.
Four Police Commissionerates
Key locations such as the Assembly, Secretariat, Begumpet, Shamshabad Airport, and Budvel High Court have been brought under the Hyderabad Commissionerate.
IT hubs including Gachibowli, Financial District, Nanakramguda, Madhapur, and Raidurg, along with industrial areas like Patancheru, Genome Valley, RC Puram, and Ameenpur, will fall under the Cyberabad Commissionerate.
The Rachakonda Commissionerate has been reorganised and renamed as the Malkajgiri Commissionerate, covering areas such as Keesara, Shamirpet, Quthbullapur, and Kompally.
The Bhuvanagiri area, which was earlier under Rachakonda, has been excluded from the commissionerate system and will function as a separate police unit, with an SP to be appointed for Yadadri Bhuvanagiri district.
Future City Commissionerate
A new commissionerate has been created covering areas such as Chevella, Moinabad, Shankarpally, Maheshwaram, and Ibrahimpatnam.
The Government has issued orders appointing Police Commissioners for the four commissionerates and an SP for Yadadri Bhuvanagiri district.