Warm birthday wishes to Shri @NitinNabin Ji, the youngest-ever National President of @BJP4India.
Your dedication, dynamic leadership, and unwavering commitment to public service continue to inspire countless people across the nation. Wishing you good health, happiness, strength, and many more years of service towards the progress of the nation and the welfare of the people.
May you continue to achieve greater milestones in your inspiring journey of leadership.
పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదాం..!
* స్వచ్ఛ రథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానం ప్రజల్లోకి తీసుకువెళ్లండి
* రోడ్ల పురోగతి తెలిసేలా ప్రత్యేక డ్యాష్ బోర్డు
* స్వమిత్వ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే శాఖలతో సమన్వయం అవసరం
* పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయండి. దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూళ్లు చేసిందని చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరులు మరింత పెంచుకొని ముందుకు సాగాలని, ఇదే రీతిలో సమష్టి కృషిని కొనసాగించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటులో భాగంగా తీసుకొచ్చిన స్వచ్ఛరథాల విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. స్వచ్ఛందంగా ప్రజలు రథాల వద్దకు వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి, నిత్యావసరాలను తీసుకెళ్లడం బాగుంది. దీన్ని ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నాం. ఈ విధానాన్ని మరింత విస్తరించేలా ఆలోచన చేయండి. దీంతోపాటు గ్రీన్ షాప్ పేరుతో తిరుపతి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన విధానాన్ని మరింత విస్తరించి, రాష్ట్రమంతటా అమలు చేయాలి. స్వచ్ఛరథాల ద్వారా ఏప్రిల్ నెలలో 18.86 లక్షల కేజీల చెత్తను సేకరించాం. ఆ వ్యర్థాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. గ్రీన్ షాపులను ఇదే స్ఫూర్తితో ప్రజలకు దగ్గర చేయాలి. పొడి వ్యర్థాలను గ్రీన్ షాపుల్లో ఇస్తే, ప్రజలు నిత్యావసరాలను తీసుకెళ్లొచ్చని విస్తృత ప్రచారం కల్పించండి. తద్వారా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన పెంచండి
•రోడ్లు పూర్తి చేయడానికి నిర్దుష్ట సమయం
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు నిర్దుష్ట సమయంలో నాణ్యతతో పూర్తయ్యేలా చూడండి. రోడ్ల నిర్మాణం, పనుల పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేకమైన డ్యాష్ బోర్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. రోడ్ల నిర్మాణ పనులను అధికారులు బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి పని మొదలుపెట్టే ముందు కచ్చితంగా ఎప్పటిలోగా పూర్తి చేస్తామనేది సమయం పెట్టుకోండి. ప్రజల వినతుల ద్వారా వచ్చే ప్రతి రోడ్డు పని చక్కగా జరగాలి. ప్రజలకు శాఖ తరఫు నుంచి పూర్తి జవాబుదారీ తనం కనిపించాలి. రోడ్ల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు ఉంటేనే రోడ్ల పరిస్థితి అర్ధం అవుతుంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి” అని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ శ్రీ బాలునాయక్ పాల్గొన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రస్తుతం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు
- ప్రధానంగా వీబీ-జి రామ్ జి, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చిస్తున్నారు
- ఈ వేసవిలో వేగంగా పనులు సాగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు
- పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులు వివరిస్తున్నారు
జనసేన పార్టీ నిర్మాణానికి పక్కా ప్రణాళిక ప్రకటించిన జనసేనాని శ్రీ @PawanKalyan గారు
జనసేన పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేవారు “రక్షాదళ్”
పార్టీ కమిటీ సభ్యులు “నిర్వాహక్ దళ్”
పార్టీ రాజకీయ నాయకులు “పరిపాలక్ దళ్”
A defining milestone in Andhra Pradesh’s journey towards becoming a powerhouse in Defence, Aerospace & Deep Technology.
The establishment of the Aircraft Integration & Flight Test Centre, along with major Defence and Drone ecosystem projects across 650 acres with an investment of ₹15,800 crore, marks a historic step towards innovation-driven growth and tactical self-reliance. This transformative initiative is expected to create over 7,500 employment opportunities while accelerating industrial and technological advancement in the state.
This visionary initiative will strengthen India’s indigenous defence capabilities, attract global investments, empower our youth with high-value opportunities, and position Andhra Pradesh at the forefront of next-generation manufacturing and innovation.
I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for his unwavering commitment towards building an Aatmanirbhar Bharat and empowering states through transformative national initiatives. My sincere thanks to Hon’ble Defence Minister Shri @rajnathsingh Ji for his continued support towards strengthening Andhra Pradesh’s role in India’s tactical defence ecosystem.
Under the leadership of Hon’ble Chief Minister Shri @ncbn Garu, Andhra Pradesh continues to strengthen its vision for industrial growth, innovation and future-ready investments.
This initiative will accelerate economic growth, create meaningful opportunities for our youth, and strengthen Andhra Pradesh’s position in India’s tactical and technological ecosystem.
@PMOIndia@SpokespersonMoD@AndhraPradeshCM
#ChooseSpeedChooseAP
#AndhraPradesh
ఈ రోజు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ పరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళుతూ, "జనసేన ఉద్యమి" సభ్యత్వాల నమోదులో కీలకంగా వ్యవహరించిన "జనసేన సాధక్"ల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించిన జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#janasenaudyami
#PawanKalyanTransformsAP#Chapter2
మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో @NameisNani గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి "స్వచ్ఛ భారత్" మరియు "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పరామర్శించేందుకు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు స్వాగతం పలికారు.
రేపటితో ముగియనున్న జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం.
• పార్టీలో గుర్తింపుకు, కమిటీల్లో స్థానం కొరకు, కార్యకర్త నుండి నాయకుడిగా ఎదిగేందుకు ఉద్యమి సభ్యత్వం తప్పనిసరి
• పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే జనసైనికుల జీవితాలకు భద్రత కల్పించేలా సభ్యత్వంతో పాటుగా ప్రమాద బీమా సదుపాయం
ఇప్పటివరకు సభ్యత్వం నమోదు చేసుకొని వారు వెంటనే మీ సమీప సాధక్ లేదా స్థానిక నాయకులను సంప్రదించి సభ్యత్వ నమోదు చేయించుకోగలరు.
#JanasenaUdyami
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
Kalyan Babu has successfully undergone a medical procedure and is now safe, stable, and recovering well.
As per the doctors, it may take about a week for him to return to his normal routine. There is no cause for concern.
Thank you all for your love, concern, and prayers. Let us keep him in our thoughts and wish him strength, comfort, and a speedy recovery.
@PawanKalyan
Thank you, Hon’ble Prime Minister Shri @narendramodi Ji, for your kind words and for taking the time to speak with me and enquire about my health following the surgery. Your concern, encouragement, and wishes for a speedy recovery give me great strength.
I remain grateful for your continued guidance, support, and healing wishes.
@PMOIndia
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు.
వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు.
- పి.హరి ప్రసాద్
అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి