ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం
* రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
* నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
* రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు.
• నవంబర్ నుంచి పనులు ప్రారంభం
ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
@iitmadras
ప్రకృతిని పూజించే అడవితల్లి బిడ్డలు, మన సంస్కృతి పరిరక్షకులైన ఆదివాసీలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.
కేవలం ఓట్లకో, జనాభా లెక్కలకో కాదు. ఆదివాసీలకు కూడా అందరిలా అన్ని మౌలిక సదుపాయాలు అందాలని వారి జీవనాభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, కరెంటు సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
#Aadiwasi
#WorldTribalDay
నరసాపురం క్రోచెట్ లేస్ కళాకారులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది క్రోచెట్ లేస్ హస్తకళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా లేసు కళాకారులకు ఈ కళ్లజోళ్లను పంపిణీ చేశారు. విజయవాడలో జరిగిన హస్తకళా మహోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హస్తకళాకారులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఆ ఆదేశాల మేరకు గత నెలలో నరసాపురంలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 141 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి అవసరమైన 141 మంది కళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు. కళాకారులకు అందించే కళ్లజోళ్ల నాణ్యత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరి క్యాంపు కార్యాలయంలో స్వయంగా పరిశీలించిన అనంతరం కళాకారులకు పంపించారు.
(1/2)
డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో ‘ఆడవి తల్లి బాట’కు కొత్త ఊపిరి! 🚜
గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ ఏకంగా 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తి చేశారు.
ఏళ్లుగా రహదారుల కోసం ఎదురుచూసిన గిరిజన గ్రామాలకు ఇప్పుడు అభివృద్ధి బాటలు తెరుచుకున్నాయి.
పవన్ కళ్యాణ్ గారి పాలనలో అడవిబిడ్డలకు అభివృద్ధి చేరువైంది! 🔥
@APDeputyCMO
మూడు తరాల ఎదురుచూపులకు ముగింపు…
ప్రజల కలను నిజం చేసిన @PawanKalyan గారి సంకల్పం! 🚜
కానడ గ్రామానికి కొత్త రహదారి నిర్మాణం పూర్తవడంతో ఎన్నో ఏళ్ల ప్రజల ఆకాంక్ష సాకారమైంది.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు బలోపేతం చేసి, ప్రతి పల్లెకు అభివృద్ధి ఫలాలు అందించాలనే #PawanKalyan గారి దూరదృష్టికి ఇది మరో నిదర్శనం.
మాటల్లో కాదు… పనుల్లో చూపిస్తున్న నాయకత్వం! 🔥
@mvrkteja@vbgramgap@mopr_goi
నేను నమ్మినోడు గొప్పోడు ✊
Great Green Wall of Andhra Pradesh - Initiative by AP Deputy CM @PawanKalyan garu🫡🙏
A pledge for Greening Coast and Guarding Lives! 🙏
గిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి
• అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
• అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
• విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి
• పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రివర్యులు
• మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
• అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి
• వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి
• డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారి పర్యవేక్షణలో డోలీరహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా చేపట్టిన అడవితల్లి బాట పనులు స్పష్టమైన పురోగతి దిశగా సాగుతున్నాయి. అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్ల అంచనా వ్యయంతో 1,069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ అడవితల్లిబాట 2.0ను ప్రారంభించడం జరిగింది. ఈ విస్తరణతో మొత్తం ప్రాజెక్టును రూ. 2,078 కోట్ల అంచనా వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి విస్తరించడం జరిగింది. ఇందులో ఇప్పటికే 905 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తైంది. అడవితల్లిబాట కార్యక్రమం మొదటి రోజు నుంచి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచనలు చేస్తున్నారు.
• సవాళ్ల నడుమ రోడ్డు నిర్మాణం
అడవితల్లిబాట కార్యక్రమంలో భాగంగా చాలా గ్రామాలకు రోడ్డు వేయడం కంటే ముందు దారి నిర్మించేందుకు సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ద్వారా బ్రేక్ చేసి, రాళ్లు పగలగొట్టి దారి ఏర్పాటు చేశారు. ఆ దారిపై రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. దారులు వేసిన తర్వాత కొన్ని ప్రాంతాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించక నిర్మాణ సామాగ్రి చేరుకోవడం కష్టతరంగా మారింది. అలాంటి సవాళ్ల మధ్య గిరిశిఖర గ్రామాలకు సైతం డోలీ కష్టాల నుంచి విముక్తి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తున్నారు.
• ప్రతి గిరిజన గ్రామం డోలీ రహితం కావాలి : శ్రీ పవన్ కళ్యాణ్ గారు
అడవితల్లిబాట పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల మధ్య సమన్వయ బాధ్యత తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకాలు ఏర్పడిన ప్రాంతాలు మినహా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో పనులు నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను చేరువ చేయాలన్న బలమైన సంకల్పంతో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో చేపట్టిన అడవితల్లి బాట పనుల్లో నాణ్యతా లోపాలకు తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని తెలిపారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
#AdaviThalliBata
(1/2)
Varun Tej and Nagababu donated to the Janasena Party in its initial days.
Padmaja garu participated in the door-to-door campaign in Bhimavaram and Pithapuram.
Janasainiks always stand by Varun Tej.
రాజమహేంద్రవరం ప్రమాద ఘటనపై స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
రాజమహేంద్రవరంలో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఏలూరు రేంజి డీఐజీతో మాట్లాడి ఈ ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకోవాలన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థులు ప్రియాంక, ఉమేష్‌ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
కొన్ని హామీలు ఓట్ల కోసం ఇస్తారు…
కొన్ని హామీలు జీవితాలను మార్చడానికి నిలబెడతారు.
ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి ₹12.60 కోట్లను మంజూరు చేసి, విద్యార్థుల కలలకు బలమైన పునాది వేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
కృతజ్ఞతతో విద్యార్థులు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఇది ఒక నాయకుడిపై అభిమానమే కాదు…
తమ భవిష్యత్తుపై నమ్మకానికి చేసిన అభిషేకం.
జిలేబి జిలేబి అని ఎగిరేవారు ,బజ్జీలు అని 2 రోజులు ట్వీట్లు ఏస్తే TL లో జిలేబి అనే మాట లేకుండా క్రమశిక్షణ లోకి వచ్చేసారు తమ్ముళ్లు 👍❤️
ప్రాచీన సామెతలు /నానుడి lu ఉల్లిపాయంత కాపు లాగే గుమ్మం బయట చెప్పులు కూడా ఒక్క రెండు రోజులు ట్రెండింగ్ లోకి తీసుకొస్తే,అన్నీ తెల్సిన నువ్వు ఇలా "ivem vinaledu bro” అనే ఆస్కారం లేకుండా చెయ్యొచ్చు 👍
Btw chaalaa famous “గుమ్మం బయట చెప్పులు "kaavaali ante inkaa famous cheyyocchu Bajjeelu laaga👍
మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర ప్రసాద్ గారు”
ఈ కథనం బాక్సాఫీస్ గురించీ కాదు.
రికార్డుల గురించీ అస్సలు కాదు.
“చిరంజీవి సినిమా బాగుందంట…”
ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది.
మన శంకర వర ప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయ్యాక…
రెండో రోజు నుంచే ఒక ఫీలింగ్ మొదలైంది.
పబ్లిసిటీ కాదు… రికార్డులు కాదు…
సాధారణంగా జనం చెప్పుకునే మాట —
“చిరంజీవి సినిమా బాగుంది” అని.
ఈ సినిమా ఎందుకు పనిచేసిందో…
చిరంజీవి ఎందుకు ఇంకా మెగాస్టార్ గానే ఉన్నాడో చెప్పే ప్రయత్నం.
కొంతమంది హీరోలు నటిస్తారు.
కొంతమంది హీరోలు సినిమాను నడిపిస్తారు.
కానీ చిరంజీవి మాత్రం…
సినిమానే బ్రతికించే వ్యక్తి.
మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో
ఆయన ఎక్కడా అరవడు…
ఎమోషన్‌ను బలవంతంగా చూపించడు…
తన గొప్పతనం చాటుకోవడానికి ట్రై చేయడు…
సింపుల్‌గా ఆ పాత్రగా మారిపోతాడు.
అందుకే ఆ నటన నిజంగా అనిపిస్తుంది.
అందుకే థియేటర్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా మనసులో ఉంటుంది.
ఈ సినిమా “చిరంజీవి ఎవరొ” అని గుర్తు చేయదు.
“ఇప్పటికీ ఆయన ఎవరో” అన్నదే మెల్లగా చెబుతుంది.
శబ్ధం కాదు… సున్నితమైన భావాలే బలం:
ఈ సినిమాలో చిరంజీవిని ప్రత్యేకంగా నిలబెట్టింది – నియంత్రణ.
మౌనంలో చెప్పిన భావం:
కొన్ని సీన్లలో డైలాగ్ ఉండదు.
క్లోజప్‌లో కెమెరా నిలబడుతుంది.
తన పిల్లలే తనని గుర్తించకుండా
“మీరు మా నాన్న కాదా?” అని అడిగే క్షణం…
కళ్లలో బాధ.
ముఖంలో ఓ చిన్న నవ్వు.
మాట ఒక్కటీ లేకుండా సీన్ ముగుస్తుంది.
అక్కడే నటన గెలుస్తుంది.
హాస్యంలో కూడా హద్దు:
మొదట్లో ఆయన క్యారెక్టర్ కాస్త తేలికగా, సరదాగా ఉంటుంది.
ఆడియన్స్ రిలాక్స్ అవుతుంది.
కానీ విలన్ ఎంటర్ అయిన వెంటనే
ఒక్క లుక్‌తో సినిమా టోన్ మారిపోతుంది.
అప్పుడే అర్థమవుతుంది –
ఇది అజ్ఞానం కాదు… ప్లాన్.
బలహీనతలోనూ గౌరవం:
వెంకటేష్ ముందు, భార్య రెండో పెళ్లికి ఒప్పుకునే సన్నివేశంలో
హీరోయిజం కనిపించదు.
అక్కడ ఒక మనిషి కనిపిస్తాడు.
తన ప్రేమను కోల్పోతానేమో అనే భయం ఉన్న వ్యక్తి.
అలాంటి చిన్న చిన్న క్షణాలే
సినిమాను నిజంగా నిలబెడతాయి.
ఇవి యాదృచ్చికం కాదు… అనుభవం ఫలితం:
ఇలాంటి నటన యాదృచ్ఛికంగా రాదు.
కెమెరా ఎలా పనిచేస్తుందో తెలిసిన నటుడికే ఇది సాధ్యం.
చిరంజీవికి తెలుసు…
• ఎప్పుడు మౌనం పని చేస్తుందో
• ఎప్పుడు కళ్లే మాట్లాడాలో
• ఎప్పుడు డైలాగ్ అవసరమో
• ఎప్పుడు వెనక్కి తగ్గాలో
అందుకే ఆయన నటన ఎప్పుడూ ఓవర్‌గా అనిపించదు.
ఖాళీగా కూడా అనిపించదు.
కెమెరాను ఎదుర్కొనే నటుడు కాదు…
కెమెరాతో ప్రేమలో ఉన్న నటుడు చిరంజీవి.
వయసు కాదు… వినయమే ఆయన బలం:
70 ఏళ్ల వయసులో కూడా
డాన్స్‌లో గానీ, లుక్‌లో గానీ
ఏమీ రుజువు చేసుకోవాలన్న ఆతృత లేదు. ఉండదు.
కానీ…
ప్రతి స్టెప్ కంట్రోల్లో ఉంటుంది.
ప్రతి మూవ్మెంట్లో గౌరవం ఉంటుంది.
క్లైమాక్స్‌లో ఫెరారీ నుంచి దిగుతూ,
బ్లూ డెనిమ్ జాకెట్, వైట్ టీ-షర్ట్,
సిగార్ వెలిగించి నడిచి వచ్చే సీన్…
ఎటువంటి అరుపు లేదు.
హడావుడి లేదు.
కేవలం కమాండ్.
ఇది నటన కాదు… అనుభవం.
అందుకే ఆయన ఇంకా మెగాస్టార్:
చిరంజీవికి ఒక విషయం బాగా తెలుసు —
సినిమా అందరికీ కావాలి.
పిల్లలకు,
మహిళలకు,
యువతకు,
కుటుంబాలకు…
అందరికీ ఏదో ఒకటి ఉండాలి.
అందుకే ఈ ఒక్క వాక్యం ఇప్పటికీ పనిచేస్తుంది:
“చిరంజీవి సినిమా బాగుందంట…”
అది పబ్లిసిటీ కాదు.
అది నమ్మకం.
ప్యాషన్ కంటే గొప్ప ప్రేమ:
ఈ వయసులో కూడా
చిరంజీవి ఇంకా పనిచేస్తున్నాడు.
ఇంకా నేర్చుకుంటున్నాడు.
ఇంకా ప్రేక్షకుడికి ఏం ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాడు.
ఇది డబ్బుకోసం కాదు.
పేరు కోసం కాదు.
రికార్డుల కోసం కాదు.
ఇది ప్రేమ.
సినిమాపై ప్రేమ.
ప్రేక్షకులపై ప్రేమ.
సినిమా చిరంజీవికి పేరు ఇవ్వలేదు.
సినిమానే ఆయన జీవితం అయింది.
అందుకే ఇప్పటికీ
“చిరంజీవి సినిమా బాగుందంట”
అనేది ఓ వార్త కాదు…
ఒక పండుగలా అనిపిస్తుంది.
ఎందుకంటే…
👉 చిరంజీవి అంటేనే సినిమా. 🎬🔥
#Chiranjeevi #MSGBlockBuster #MegastarChiranjeevi #ManaShankaraVaraPrasadGaru #Megastar #ChiruMagic #ChiruForever #ChiranjeeviPerformance #ChiranjeeviFans #BossIsBack
@SarigamaCinemas@KChiruTweets@venkymama@AnilRavipudi
#Nayanthara
@Shine_Screens@GoldBoxEnt
ఎండాకాలంలో ఏమీ ఎరుగని కొత్త పెళ్ళం లాగా అణిగిమణిగి ఉంటుంది
ఆగస్టు మాసంలో
అందర్నీ మింగేసే గయ్యాళి పెళ్ళాంలా ఉరకలు పరుగులు పెడుతుంది,
భద్రకాళి అవతారంలో భయపెడుతుంది!
నేను చూసిన మొదటి హీరో మా మామయ్య…
ఆయన జీవితం నాకు ఆదర్శం..
మామ చేతి నడకే ఈ రోజు నా పయనం..
ఆయన నేర్పిన నడవడికే ఓ జీవిత పాఠం..
మామయ్యే నా సర్వస్వం…
కష్టమైనా, సుఖమైనా.. ఆయన తోడుంటే అదే కొండంత ధైర్యం..
మామయ్య మాటే నాకు శాసనం.. ఎప్పటికీ ఆయనే నా బలం..
మీ మెగాస్టార్.. మన మెగాస్టార్.. నా ముద్దుల మామయ్య చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు..
మీ మేనల్లుడు తేజూ
#HBDMegaStarChiranjeevi mama❤️
"నేను తల్చుకుంటే ఈ షాప్‌నే కొంటాను"
అవతల ఉన్నది అమ్మాయి అని కూడా చూడడు.
స్టార్ లీగ్‌లోకి అడుగు పెట్టిన మూడేళ్లలోపే నెగటివ్ క్యారెక్టర్ చేశారు చిరంజీవిగారు. ఈ మధ్య మనందరం #Attitude అని తెగ కబుర్లు చెబుతున్నాం, ఇవన్నీ ఆయన 86లోనే చూపించేశాడు. ఏరా! ఊరికే అయిపోతారా మెగాస్టార్లు!? 😅
అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే సర్ @KChiruTweets 🎂🎈♥️
నేను ఆగిపోయాను సార్ …
నేను ఓడిపోయాను సార్..😞😍మిమ్మల్ని పొగుడుతూ రాద్దాం అనుకునే పొగడ్తల అక్షరాల మధ్య యుద్ధంలో ..
నేను అలిసిపోయాను సార్ ..
కారణం .,మీ గెలుపు అలాంటిది .🔥
మీరెప్పుడూ గెలవాలని ..స్పూర్తినివ్వాలని కోరుకునే ఈ మెగా అభిమాని తరఫున మనస్పూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు @KChiruTweets సర్ 💐💐😍🙏
#HBDChiranjeevi sir💐
#HBDMegaStarChiranjeevi sir 😍💐
Lyrics: #lakshmibhoopal
Fan made Edit source: @OGeditss 💥👌😍