నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
Two years of a historic NDA victory,
Two years of Jana Sena Party’s 100% strike rate,
Two Years of Sri @PawanKalyan Leadership in Action
JanaSenani Sri Pawan Kalyan leadership has been defined by commitment, accountability, and action. From being the voice of the people to delivering results through governance, these two years reflect a relentless commitment to public welfare, development, and a stronger Andhra Pradesh.
ఏం కావాలి ఇంతకన్నా 🙏🏻🙏🏻🙏🏻
చాలు ఈ జన్మకి 😇
కట్టే కాలెంత వరకు మీతోనే కళ్యాణ్ సర్ @PawanKalyan
మీరు ఇచ్చిన ప్రోత్సాహానికి ఈ జన్మ లో మీ రుణం తీర్చుకోలేను రామ్ సర్ @itsRamTalluri
తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం జనసేన తరపున పని చేస్తూనే ఉంటాను
జై జనసేన
జై తెలంగాణ
జై హింద్
Sharing a few memorable moments from the visit of Hon’ble Prime Minister Shri @narendramodi ji to my residence today.
A truly special , honoured and cherished occasion for me and my family.
@PMOIndia
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు… కొత్త స్కూలు నిర్మించారు…
•పెదపాడు పాఠశాలకు కొత్త భవనం
•అడవితల్లి బాట ప్రారంభోత్సవంలో ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉపముఖ్యమంత్రివర్యులు
•రూ. 17.50 లక్షలతో భవన నిర్మాణం
అడవితల్లి బాటకు శ్రీకారం చుట్టిన శ్రీ @PawanKalyan గారు, ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన పెదపాడు గ్రామ విద్యార్ధుల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది.
రూ. 17.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన భవనంతో ఆ గ్రామ విద్యార్ధులు, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 7వ తేదీ డోలీ రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా అరకు నియోజకవర్గం, డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆ గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. పెదపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చక్కటి భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాల భవనం, త్వరలో మొదలయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకి అందుబాటులోకి రానుంది.
శ్రీరామజయం....!
ఆ శ్రీరాముని అడుగుజాడల్లో నడిస్తే మనదే విజయం..!
ఈ ఏడాది శ్రీరామనవమి రోజు యాదృచ్చికంగా చరణ్ బాబు పుట్టినరోజు కలిసి రావడం ఎంతో సంతోషం.
ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పాటు…
రాముని చరణాల వద్ద తేజోరూపూడై కొలువుండే మా ఇలవేల్పు హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ….
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
జై శ్రీరామ్...!
@AlwaysRamCharan
అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిన రోడ్లు మంజూరు
• ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ఆదేశాలు
• మధ్యాహ్నం కోరిన రహదారులకు సాయంత్రానికల్లా పాలనా అనుమతులు
ప్రపంచ కప్ గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన దీపిక తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వచ్చారు. తమ ఊరు తంబలహెట్టి రోడ్డు వేయించమని కోరారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలో అంధ మహిళల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దీపిక తమ ఊరికి రోడ్డు గురించి అడిగారు. ఆమె మధ్యాహ్నం అడిగిన రోడ్డుకి సాయంత్రానికి అనుమతులు వచ్చేలా ఆయన చర్యలు చేపట్టారు.
క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు రోడ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా రూపొందించారు. వీటికి అనుమతులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు.
@blind_cricket
#WomensBlindCricket
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత ప్రధాని శ్రీ @narendramodi గారితో కలిసి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ గారితో సరదాగా ముచ్చటించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
#AndhraPradesh
ప్రజలచే ఎన్నుకోబడిన ఏ ప్రజా ప్రతినిది ఇంతవరకూ ఎప్పుడూ ఇలా సభ పెట్టి ,ఇంత నిజాయితీ తో ,నిబద్ధత తో మాట్లడలేదు 🙏🏼
@JanaSenaParty ✊🏻
Hon @APDeputyCMO@PawanKalyan
పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ... https://t.co/u87czRChaN via @YouTube
ఉప్పాడ సమీపంలో నిర్మితమవుతున్న హార్బర్ డిజైన్ లో లోపం ఉందని మత్స్యకారులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి తెలియచేశారు. ఆ నిర్మాణాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు.
కాకినాడ జిల్లాకు చెందిన 18 మత్స్యకార సోదరుల కుటుంబాలకు నష్టపరిహారం.
సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన 18 మంది మత్స్యకార సోదరుల కుటుంబాలకు అందిన నష్టపరిహారం.
ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున మొత్తం 90 లక్షలు ప్రభుత్వం ద్వారా అందించిన ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#Pithapuram #AndhraPradesh
#PawanKalyanForFisherman
PAWAN KALYAN and RECORDS Can never be separated 🔥🔥
ALL TIME HIGHEST PREMIERE SHOWS in NIZAM - 366+ and all going HOUSEFULLS 🤙🏻🤙🏻
#OG#TheyCallHimOG@SVC_official
#OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#TheycalllHimOG@PawanKalyan