Only trolling has not change the people's mind. Social Media is very powerful tool. Don't use this like a shit. Please understand the Core Power of Social Media
భారత్లో దక్షిణ కొరియా రాయబారి లీ సియోంగ్ హోను ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో కొరియన్ కంపెనీల విస్తరణ, భవిష్యత్తులో ఇరుదేశాల నడుమ మరింత సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు.
#NaraLokesh
విద్యతోనే సమాజంలో వికాసం వస్తుందని నమ్మే వాడిని. అందుకే మేము అధికారంలో రాగానే, కరిక్యులం మొత్తం మార్చేసాం. చదువు ఒక్కటే కాదు, నైతిక విలువలు నేర్పిస్తున్నాం.
#ExpressAdda#NaraLokesh#AndhraPradesh
ఈ నెల 25న జరగనున్న తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి ఎన్.ఎస్.బోసురాజు, ఎమ్మెల్యే బసవరాజు, ఎమ్మెల్సీ బసవన్న గౌడ నేడు ఆహ్వానపత్రిక అందించారు.
#AndhraPradesh
#25yrsOfBasavatarakamHospital
ప్రతి ఒక్క సక్సెస్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది. మా అత్తగారు క్యాన్సర్ బారిన పడి, ఆవిడ పడిన బాధలు కళ్ళారా చూసాం. మా అత్తగారి పేరు శాశ్వతం కావాలనే సంకల్పంతో, ఆమె పేరుతో నాడు ఎన్టీఆర్ గారు పేదల కోసం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించారు. క్యాన్సర్ ఆసుపత్రికి మొదటి మ్యానేజింగ్ ట్రస్టీగా కోడెల శివ ప్రసాద్ గారు, అన్ని బాధ్యతలు తీసుకుని నడిపించారు. అందరి సహకారంతో బసవతారకం ఆస్పత్రి 25 ఏళ్లలో ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు అండగా నిలబడింది.
#ChandrababuNaidu
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమక్షంలో, నాటి ప్రధాని వాజ్పేయి గారు ప్రారంభించారు. నేడు దేశంలోనే ప్రముఖ ఆస్పత్రిగా పేరు తెచ్చుకుంది.
#25yrsOfBasavatarakamHospital#NandamuriBalakrishna
నా పుట్టినరోజు వేడుకను ఎన్టీఆర్ మెమోరియల్ తలసేమియా కేర్ సెంటర్లోని చిన్నారులతో కలిసి జరుపుకోవడం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. వారి చిరునవ్వుల్లో కనిపించిన సంతోషం, వారితో కలిసి భోజనం చేస్తూ గడిపిన ఆ మధుర క్షణాలు నా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. తలసేమియాతో ధైర్యంగా పోరాడుతున్న చిన్నారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మా ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో పది సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రణాళికా విభాగం, కేఆర్ఈఏ యూనివర్సిటీ సారధ్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి శ్రీ పీయూష్ కుమార్, ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఒప్పంద ప్రతులు మార్చుకున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, వృద్ధిరేటు సాధనలో పది సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతో పాటు పర్యవేక్షణపై ఐఎఫ్ఎంఆర్ పని చేయనున్నది. జీరో పావర్టీ, వాటర్ సెక్యూరిటీ, డీప్ టెక్ మిషన్లపై కూడా ఫోకస్ చేస్తారు.
#AndhraPradesh
ఐటీ, ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్ రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తే, యువ నాయకత్వ బృందం ఆ లక్ష్యాలను కార్యరూపంలోకి తీసుకువస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గూగుల్ డేటా సెంటర్.
#RepublicSummit2026#NaraLokesh#AndhraPradesh
#RepublicSummit2026
న్యూఢిల్లీలో రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కాంక్లేవ్ కు అతిధిగా హాజరైన విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సీఎం చంద్రబాబు గారి లక్ష్యానికి అనుగుణంగా కేబినెట్ అంతా పనిచేస్తోందన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో ఏపీ విజయరహస్యం స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అని వివరించారు.
#NaraLokesh
#AndhraPradesh
#25yrsOfBasavatarakamHospital
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పేదల సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా అత్తగారు, కీర్తిశేషులు శ్రీమతి నందమూరి బసవతారకం గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నిరంతరాయంగా అందిస్తున్న సేవలు ఎంతో మంది జీవితాలకు వెలుగులు పంచుతున్నాయి. మహిళలు, చిన్నారులు, పేద ప్రజలు ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు నిష్ణాతులైన వైద్యులు వారి సిబ్బంది లక్షలాది ఆపరేషన్లు చేయడం అభినందించదగిన అంశం. సినీ రాజకీయ రంగాలలో ఎంతో బిజీ గా ఉండికూడా క్యాన్సర్ రోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణను అభినందిస్తున్నాను.