స్వాతంత్ర్య దినోత్��వం సందర్భంగా ఈరోజు ఖమ్మం కలెక్టరేట్లో లబ్ధిదారులకు అత్యున్నత సాంకేతికతతో కూడిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది.
ప్రజల కోసమే పనిచేస్తున్న మన ప్రజా ప్రభుత్వం, తెలంగాణ ప్రజల ��జ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తోంది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో నకిలీలను పూర్తిగా అరికట్టేందుకు ఈ కొత్త స్మార్ట్ కార్డులలో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, ప్రత్యేక హోలోగ్రామ్, వాటర్ మార్క్, యూవీ లోగో సహా 9 రకాల పటిష్టమైన భద్రతా ఫీచర్లను పొందుపరిచాం. ఈ-పాస్ యంత్రాలతో బయోమెట్రిక్ విధానాన్ని అనుసంధానించి రేషన్ పంపిణీలో నూరు శాతం పారదర్శకతను తీసుకువస్తున్నాం.
రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా 3.42 కోట్ల మందికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ సరికొత్త డిజిటల్ కార్డులు మంజూరు చేస్తూ, వాటి ద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాం.
పేదలకు మెరుగైన వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కల సాకారం, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మన ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లేలా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.
తెలంగాణ భవిష్యత్ లక్ష్యాలను, ప్రజా ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని, రాబోయే సంవత్సరాల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించాను.
30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ, 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులతో తెలంగాణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం.
భారతదేశ నిర్మాణంలో తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టేందుకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, స్పష్టమైన లక్ష్యాలతో, దీర్ఘకాలిక ప్రణాళికతో ప���రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.
అమరవీరుల త్యాగాల ��్ఫూర్తితో.. అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణమే మా సంకల్పం.
#80thIndependenceDay #TelanganaRising #PrajaPrabhutvam
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సందేశాన్నిచ్చారు. దేశ స్వాతంత్య్ర కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
#IndependenceDay #80thIndependenceDay #GolcondaFort #Telangana
విద్యార్థులకు శుభవార్త. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఇకనుంచి ప్రతి ఏటా అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులను ముందుగానే వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
✅నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించి ఆ మహనీయులకు నివాళులర్పించారు.
✅ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, మంత్రులు @OffDSB గారు, @iamkondasurekha గారు, @Ponnam_INC గారు, @Vakiti_srihari గారు, @azharflicks గారు, సలహాదారులు కే కేశవ రావు గారు, వీ హనుమంత రావు గారి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు @Bmaheshgoud6666 గారితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
���ఈ సందర్భంగా హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, "ఫీజులు కట్టలేదని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపడానికి వీలులేదు. విద్యార్థులు అడక్కుండానే వారి ఖాతాలో డబ్బులు వేస్తాం.
✅ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి ముందస్తుగా బ్యాంకు ఖాతాల్లో సిద్ధంగా పెడుతున్నాం. ఈ విధానాన్ని ప్రక్షాళన చేసి, ప్రతి ఏటా రూ. 2,400 కోట్లు విద్యార్థుల ఖాతాల్లో వేసి ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది" అని తెలిపారు.
✅"మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఒకప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. అందుకే నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్య, ఆ తర్వాత స్కిల్స్ నేర్పాలి. సాంకేతిక నైపుణ్యం ఉన్న వారిక�� ఈ సమాజం రెడ్ కార్పెట్ పరుస్తుంది. కేవలం సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వస్తుందో రాదో.. చెప్పలేం" అని పేర్కొన్నారు.
✅"ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నది. ఏటీసీలు, పాలిటెక్నిక్, #SkillsUniversity.. ఇతర సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోండి. ఆడపిల్లలు నర్సింగ్ చదువుకుంటే రూ. 2 లక్షలతో జపాన్ , జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి.
✅ఇప్పుడు చ���ువుల్లో పోటీ పెరిగింది. చా��ా మందికి 90 శాతం పైగా మార్కులు వస్తున్నాయి. చదువు మాత్రమే కాదు. సాంకేతిక నైపుణ్యంలో రాణించే వారూ ఉంటారు. కొందరు క్రీడల్లో రాణించే వారుంటారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయి" అని పేర్కొన్నారు.
✅యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కోటి రూపాయల నగదు బహుమతిని అందిస్తామని ముఖ్యమంత్రి గారు బాక్సింగ్ చాంపియన్ కు నిఖత్ జరీన్, సిరాజ్, దీప్తీ దివాంజీలను ఉదహరించారు.
✅"మీరూ క్రీడల్లో రాణించండి. రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించండి. దేశ స్థాయిలో గౌరవాన్ని తీసుకురాండి. #Olympics లో మెడల్స్ సాధించండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి.. నగదు నజరానాలు ఇచ్చే బాధ్యత నాది.
✅కేవలం చదువుకుంటేనే బతుకులు మారుతాయి. చదువుకుంటేనే మన తలరాతలు మారుతాయి. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవకాశాల కోసం పోటీ పడాలి.
✅ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే అమెరికాలో ఉద్యోగం వచ్చేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సాంకేతిక విప్లవం వచ్చింది. #AI వల్ల ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, ��టీ నిపుణుల ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం తలెత్తింది. ఏ విధంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలో మనం ఆలోచన చేయాల్సిన అవసరముంది.
✅కులాల మధ్య అంతరాలను తగ్గించడానికి అన్ని వర్గాలు ఒకే చోట కలిసిమెలిసి జీవించడమనే లక్ష్యంతో రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధానం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్నాం" వివరించారు.
✅జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే లాంటి మ���నీయుల జీవిత విశేషాలను వివరిస్తూ విగ్రహాలు చేయడం ఏర్పాటు కేవలం జయంతి, వర్ధంతులను నిర్వహించడానికి కాదని, గొప్ప వ్యక్తులు చేసిన త్యాగాలు, వారి గొప్పతనాన్ని విగ్రహాల ద్వారా స్ఫూర్తి పొందడానికి వేదికలుగా నిలుస్తాయని అన్నారు.
✅మహనీయుల స్ఫూర్తితో విద్యలో రాణించడమే కాకుండా సామాజిక చైతన్యంతో, సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలన్న ఉద్దేశంతో ఇక్కడ విగ్రహావిష్కరణ చేశామని చెప్పారు.
#MahatmaJyotiraoPhule #SavitribaiPhule #Hyderabad #Telangana #FeeReimbursement #SkillDevelopment
ఒక వైపు అంబేద్కర్...
మరో వైపు ఇందిరా గాంధీ...
మరో వైపు పీవీ నరసింహారావు...
మరో వైపు జ్యోతి బాఫూలే విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించుకున్నాం..
వారి స్పూర్తితో విద్యలో రాణించాలి..
#RevanthReddy#Telangana
పేదల ఇంట్లో ఆకలి ఉండకూడదు…
ప్రతి కుటుంబానికి ప్రభుత్వ అండ ఉండాలి…
ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందాలి — ఇదే కాంగ్రెస్ ప్రజా పాలన.!!
#revanthreddy#PrajaPalana#trending#telangana
హస్తం.. తెలంగాణ ప్రజల నేస్తం..!
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు... హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్...
హైదరాబాద్‌లో వందల కోట్ల విలువైన స్థలంలో తొలి దశలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల మహాయజ్ఞానికి శ్రీకారం...
నగరం నడిబొడ్డునే సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసే చారిత్రాత్మక శుభకార్యం...
వచ్చే ఏడాది ఇందిరమ్మ ఇండ్ల నుంచే బోనాల సంబురం...
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి @revanth_anumula గారి నాయకత్వంలో, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి @INC_Ponguleti గారి ఆధ్వర్యంలో... హైదరాబాద్‌లో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ప్రగతి పథం... సకల జనహితం... మన ప్రజా ప్రభుత్వం.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల శుభ సందర్భంగా తెలంగాణలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ���యమంత్రి శ్రీ @revanth_anumula గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
✅గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుంటే, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా #RationCards జారీ చేసి 62 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో ��రోజుకు మొత్తం 3 కోట్ల 42 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా, వారందరి స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
✅గత ఏడాది నిర్వహించినట్లే, ఈ ఏడాది కూడా #TelanganaRisingGlobalSummit 2.0 నిర్వహించాలని తీర్మానించింది. ఈ సదస్సును డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
✅ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, మంత్రులు @OffDSB గారు, @UttamINC గారు, @VivekVenkatswam గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశం భావించింది.
✅ఈసారి #InvestTelangana థీమ్‌తో సదస్సు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా #BharatFutureCity ప్రణాళికను ఆవిష్కరిస్తారు. ప్రధానంగా రాష్ట్రంలో డిఫెన్స్, ఏరో స్పేస్, ఫార్మా రంగాల్లో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సదస్సు నిర్వహిస్తారు.
✅మంత్రి @INC_Ponguleti గారు, @minister_adluri గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ మంత్రిమండలి సమావేశ వివరాలను వెల్లడించారు.
✅వానాకాలం పంటకు సంబంధించి ��డు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించి, ఆ ఏడు రకాల సాగును పెంచడానికి రైతులకు అవగాహన కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది.
✅యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఈసారి గతంలో ఎన్నడూలేని విధంగా 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసిన అంశంపై చర్చించింది. ��ందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించాలని తీర్మానించింది.
✅ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబట్టుకున్న నేపథ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.2389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి, ఈ వేలం (e-Auction) ద్వారా ధాన్యం విక్రయించాలని నిర్ణయించారు.
✅రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తేవడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న వీటన్నింటినీ ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేస్తారు.
✅కొత్తగా ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి మం���్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో తొలి విడతగా 113 నియోజకవర్గాల్లో #YIIRS కాంప్లెక్స్ లను నిర్మించగా, ఇప్పటివరకు 86 స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుమతులు మంజూరయ్యాయి.
✅#CURE పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి, హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. #Hyderabad లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలున్నాయి. వాటిని ఈవీ లుగా మార్చేందుకు రూ. 200 కోట్లతో ప్రత్యేక పథకం (తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర���షన్ స్కీమ్) అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
✅ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1 లక్ష 50 వేలు సబ్సిడీ అందిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నారు.
✅హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన #HILT పాలసీ దరఖాస్తు గడువును మంత్రిమండలి మరో 3 నెలలు ప��డిగించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
✅మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-II పనుల కోసం రూ. 2,100 కోట్ల అంచనా వ్యయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరు, ఆ ప్రాంతంలో తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు ఈ ఎత్తిపోతల నుంచి అందుతుంది.
✅గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీలకు పెంచటంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ నియామకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
#TelanganaRising2047 #SmartRationCards #FoodSecurity #PaddyProcurement #SkillDevelopment #YoungIndia #ElectricVehicles #CabinetDecisions
పదేండ్లు ఆ సారు చేసిన విధ్వంసాన్ని…
రెండేండ్లు మేము చేసిన ప్రగతిని చూడండి.
ఆయన చేసిన అప్పుల భారాన్ని మోస్తూనే…
ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నాం.
ప్రజల కోసం, తెలంగాణ కోసం
రోజుకు 18 గంటలు కష్టపడే శక్తిని దేవుడు నాకు ఇచ్చిం��ు.
మీ కోసం… మీ భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడతా.
— శ్రీ రేవంత్ రెడ్డి గారు
గౌరవ ముఖ్యమంత్రివర్యులు