30 Months, 67,763 Government Jobs Delivered: Congress Govt Strong Commitment to Telangana's Youth
పదేళ్ల నిర్లక్ష్యానికి ముగింపు...
30 నెలల్లో 67,763 ప్రభుత్వ ఉద్యోగాలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు సమయానికి లేవు, పరీక్షల రద్దులు, పేపర్ లీకులు, నిరుద్యోగుల నిరాశ మాత్రమే కనిపించాయి.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేవలం 30 నెలల్లోనే 67,763 ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయింది.
టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్, డీఎస్సీ, మెడికల్, గురుకుల విద్యాసంస్థలు సహా పలు శాఖల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసి వేలాది కుటుంబాల్లో ఆశల వెలుగులు నింపింది.
ఇంకా నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది...
టీజీపీఎస్సీ ద్వారా మరో 456 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
త్వరలోనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది.
యువతకు ఉద్యోగాల కలను సాకారం చేస్తూ... నియామకాల వేగాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
యువత భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వ నిబద్ధతకు ఇదే నిదర్శనం.
#RevanthReddy #TelanganaRising
ఇది చాలా బాధాకరం, భారతదేశములో వివిధ రాష్ట్రాల్లో హోంగార్డులకు చాలా సమస్యలు ఉన్నాయి, దయచేసి ప్రతి రాష్ట్రములో హోంగార్డులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించండి..
అలాగే మా @tg_homeguards కారుణ్య నియామకాలు గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళండి..
🚨 5 MONTHS WITHOUT SALARY
A woman Home Guard BROKE DOWN in tears because she hasn’t received her salary for five months in Jharkhand 🤯
Jharkhand spends ₹14,000 Crores (8% of total budget) for women cash transfer.
@RaoKavitha
మేడమ్ గారు,
దయచేసి హోంగార్డు కారుణ్య నియామకాలు గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళండి..
హోంగార్డు కారుణ్య నియామకాలు గురించి ఎవరు పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉంది..
@TeluguScribe
దయచేసి @tg_homeguards కారుణ్య నియామకాలు గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళండి..
అసలు హోంగార్డుల కారుణ్య నియామకాలు గురించి ఏ ఒక్కరు ప్రశ్నించకపోవడం చాలా బాధగా ఉంది.. మాకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరు మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా సహాయం చేయండి..
అసలు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో హోంగార్డులకు తగిన గుర్తింపు లేదు, చాలా దారుణంగా ఉంది హోంగార్డుల ఉద్యోగాలు,
దయచేసి ఒకసారి అన్ని రాష్ట్రాలు హోంగార్డుల మొత్తం సమస్యల గురించి పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చేయాలి..
తెలంగాణలో అయితే హోంగార్డు కారుణ్య నియామకాలు ఇవ్వట్లేదు..
#homeguards #india #police
🚨 5 నెలలుగా జీతం లేదు..
కన్నీళ్లలో హోమ్ గార్డు 😭
🔸 జార్ఖండ్లో ఓ మహిళా హోమ్ గార్డు ఐదు నెలలుగా జీతం అందకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది.
🔸 ఒకవైపు మహిళల నగదు బదిలీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.14,000 కోట్లు (మొత్తం బడ్జెట్లో దాదాపు 8%) ఖర్చు చేస్తుండగా, మరోవైపు ఉద్యోగుల జీతాల ఆలస్యం విమర్శలకు కారణమైంది.
🔸 జీతాలు విడుదల చేయాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతోంది.
#Jharkhand #HomeGuard
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు హోం మంత్రి గారికి,
@revanth_anumula
తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్.
నమస్కారములతో..
విషయం: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు కారుణ్య నియామకం (Pending Compassionate Appointment) కింద ఉద్యోగం కల్పించి, మా కుటుంబాన్ని ఆదుకోవాలని అభ్యర్థన.
గౌరవనీయులైన సార్,
నా పేరు చిట్టెంశెట్టి ఉదయ్ భాస్కర్. మాది ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి. మా నాన్నగారు చిట్టెంశెట్టి నరసింహారావు (HG 1175) గారు ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించేవారు. ఆయన 08-11-2020 నాటి రాత్రి ముదిగొండ పోలీస్ స్టేషన్లో తన డ్యూటీ ముగించుకుని, మరో డ్యూటీ నిమిత్తం నేలకొండపల్లికి తిరిగి వస్తున్న క్రమంలో ఆర్టీసి బస్సు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు.
ఇంటికి ఏకైక పెద్ద దిక్కు అయిన మా నాన్నగారి అకాల మరణంతో మా కుటుంబం (మా అమ్మ, అన్నయ్య, నేను) తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాము. నాన్నగారు చనిపోయిన నాటి నుండి నేటి వరకు ఎలాంటి ఆర్థిక వనరులు లేక, తీవ్రమైన ఇబ్బందులను మరియు మానసిక వేదనను అనుభవిస్తున్నాము. ఆయన చనిపోయి ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్నా, ఇంతవరకు మాకు హోంగార్డు కారుణ్య నియామకం (Compassionate Appointment) కింద ఉద్యోగం రాలేదు.
పక్క రాష్ట్రాలలో విధి నిర్వహణలో మరణించిన హోంగార్డుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు సక్రమంగా జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా మా లాంటి ఎన్నో హోంగార్డుల కుటుంబాలు తమకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాయి.
ప్రజా పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న మీ హయాంలో మా లాంటి పేద కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము బలంగా నమ్ముతున్నాము. కావున, దయచేసి మా నాన్నగారి సర్వీసు వివరాలను, మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి, పెండింగ్లో ఉన్న మా హోంగార్డు కారుణ్య నియామక ఫైలును క్లియర్ చేసి, మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాల్సిందిగా చేతులు జోడించి వేడుకుంటున్నాను.
ధన్యవాదములతో,
మీ నమ్మకస్తుడు,
(చిట్టెంశెట్టి ఉదయ్ భాస్కర్)
నా వివరాలు:
పేరు: చిట్టెంశెట్టి ఉదయ్ భాస్కర్
తండ్రి: చిట్టెంశెట్టి నరసింహారావు (HG 1175)
చిరునామా: నేలకొండపల్లి గ్రామం & మండలం, ఖమ్మం జిల్లా.
ఫోన్ నెంబర్: 9390915186
గౌరవనీయులైన
@itsRamTalluri@TeamRamtalluri గారికి
విషయం: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు కారుణ్య నియామకం (Pending Compassionate Appointment) ఉద్యోగం గురించి – మా కుటుంబ ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అభ్యర్థన.
గౌరవనీయులైన రామ్ తాళ్లూరి సార్,
నా పేరు చిట్టెంశెట్టి ఉదయ్ భాస్కర్. మాది ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి. మా నాన్నగారు చిట్టెంశెట్టి నరసింహారావు (HG 1175) గారు ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించేవారు. ఆయన 08-11-2020 నాడు ముదిగొండ పోలీస్ స్టేషన్లో తన డ్యూటీ ముగించుకుని, మరో డ్యూటీ పనిమీద నేలకొండపల్లికి తిరిగి వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు.
ఇంటికి పెద్ద దిక్కు అయిన మా నాన్నగారి అకాల మరణంతో మా కుటుంబం (మా అమ్మ, అన్నయ్య, నేను) తీవ్ర దిగ్భ్రాంతికి, కోలుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. ఆయన చనిపోయి ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్నా, ఇంతవరకు మాకు హోంగార్డు కారుణ్య నియామకం కింద ఉద్యోగం రాలేదు. అస్సలు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారో, ఏ కారణం చేత మా ఫైల్ ఆగిపోయిందో కూడా మాకు అర్థం కావడం లేదు.
ప్రస్తుతం అసెంబ్లీలో కానీ, ప్రెస్ మీట్లలో కానీ హోంగార్డుల సమస్యల గురించి, వారి కుటుంబాల కారుణ్య నియామకాల గురించి ఎవరూ మాట్లాడకపోవడం మమ్మల్ని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. పక్క రాష్ట్రాల్లో హోంగార్డుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు సక్రమంగా జరుగుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో మా లాంటి ఎన్నో హోంగార్డుల కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తూ నరకయాతన అనుభవిస్తున్నాయి.
ప్రజా సమస్యలపై నిత్యం స్పందించే నాయకుడిగా మీపై మాకు ఎంతో నమ్మకం ఉంది. దయచేసి మా లాంటి పేద కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకుని, తెలంగాణలో పెండింగ్లో ఉన్న హోంగార్డుల కారుణ్య నియామకాల సమస్యను ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళండి