ప్రజాస్వామ్య వ్యవస్థపై @ncbn నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్రూరంగా చేసిన దాడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్షంగా చూసింది. స్థానిక ఎన్నికల నామినేషన్ల తొలిరోజే వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాల దాడులతో పాటు, హత్య చేస్తామని బెదిరించడంతో పాటు, చివరకు నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారు. ఇంత జరుగుతున్నా శాంతి భద్రతలను కాపాడుతూ, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. కొన్ని చోట్ల ఈ దౌర్జన్యాల్లో భాగస్వాములుగా కూడా మారారు. తమ విధులను నిర్వర్తించని పోలీసులు చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారు.
పుంగనూరులో వైయస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు వెళ్లిన ఆయన వాహనశ్రేణిపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశాయి. ఆయనకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిని గాయపరిచాయి. వాహనాలను ధ్వంసం చేశాయి. మా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నాయి. నామినేషన్ల స్వీకరణ కేంద్రం ప్రాంగణంలోనే పోలీసుల కళ్లెదుట ఇదంతా జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా మా అభ్యర్థులను మూడు గంటలకు పైగా వేచి ఉంచిన అధికారులు వారి నామినేషన్ పత్రాలను మాత్రం స్వీకరించలేదు. లోక్‌సభలో మా పార్టీ పక్ష నేతకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలాంటి భద్రత ఉంటుందని ఆశించగలం?
రాయచోటిలో మా అభ్యర్థులను నామినేషన్లు వేయవద్దంటూ బెదిరించారు. ఆ బెదిరింపులను లెక్కచేయకుండా ముందుకు వెళ్లడంతో టీడీపీ గూండాలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయంపై దాడి చేశాయి. పార్టీ కార్యాలయానికి, వాహనాలకు నిప్పుపెట్టాయి. మా కార్యకర్తలను గాయపరిచాయి. ఈ దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, మా అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ పత్రాల తయారీ కోసం మా పార్టీ కార్యాలయంలో సమావేశమైన కార్యకర్తలనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మా పార్టీ కార్యాలయానికి నిప్పు పెడుతున్నా పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు.
తిరుపతిలో మా పార్టీ మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారు. మా నాయకులపై దాడులు చేశారు. ధర్మవరంలో పోలీసుల సమక్షంలోనే అభ్యర్థులపై దాడి చేసి, నామినేషన్ పత్రాలను లాక్కున్నారు. కడపలో 30వ డివిజన్ అభ్యర్థిని అడ్డుకోవడమే కాకుండా, రిటర్నింగ్ అధికారికి సమర్పించిన నామినేషన్ పత్రాలను కూడా లాక్కుని చించివేశారు. అయినా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. పోలీసుల ఈ సిగ్గుమాలిన నిర్వాకంతో టీడీపీ శ్రేణులు బహిరంగంగానే ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు తెగబడుతున్నాయి. దాచేపల్లిలో మా నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి వాహనంలో మద్యం సీసాలు పెట్టి ఆయనను నామినేషన్ వేయకుండా నిర్బంధించారు.
ప్రభుత్వ యంత్రాంగం తన పార్టీ సొంత ఆస్తి కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి. ఇలా హింస, దౌర్జన్యాలతో ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని టీడీపీ తిరిగి పొందలేదు. ఇలాంటి ప్రతి దాడి, ప్రజల పక్షాన నిలబడి, వారి ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలన్న మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
వైయస్సార్సీపీ కార్యకర్తలందరికీ నేను అండగా నిలబడతాను. బెదిరింపులకు లొంగేది లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని వీడే ప్రసక్తే లేదు. ప్రతి ఘటనపైనా సమగ్ర దర్యాప్తు జరగాలి. దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేయాలి. ఈ హింసకు సహకరించిన ప్రతి అధికారిని కూడా జవాబుదారీగా నిలబెట్టాలి.
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తక్షణమే జోక్యం చేసుకోవాలి. దాడులు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలి. కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలకు భద్రత కల్పించాలి. అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా పోటీ చేసే పరిస్థితులు ఉండాలి. ప్రజలు తమ ప్రతినిధులను స్వేచ్ఛగా ఎన్నుకునే వాతావరణం కల్పించాలి.
నామినేషన్ల దాఖలుకు కేంద్రీకృత విధానాన్ని లేదా పారదర్శకమైన, సురక్షితమైన ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు రావాలి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రత్యక్ష ప్రసార ఫుటేజీ అందుబాటులో ఉంచాలి. బ్యాలెట్ బాక్సులను ట్యాంపరింగ్ చేయకుండా నిరోధించేందుకు అన్ని స్ట్రాంగ్ రూమ్‌లలో సీసీటీవీ ప్రత్యక్ష ప్రసార పర్యవేక్షణ ఉండాలి. అన్ని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ సీసీటీవీ ప్రత్యక్ష ప్రసార పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. బ్యాలెట్ పేపర్ అకౌంట్లోని సంతకాలను సక్రమంగా పరిశీలించడంతో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించాలి.
స్థానిక ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పారా మిలిటరీ బలగాలను రప్పించాలి.
విజయవాడలో పోలీస్ లాకప్‌డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు, నాలుగు వారాల్లోగా ఆయన తల్లికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను. ఈ తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. రాజధానిలో పోలీసులు అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డారు. పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా కనీస పశ్చాత్తాపం కూడా లేకపోవడం అత్యంత దారుణం!
ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌తో సహా ఉన్నతాధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మేం మొదటి నుంచీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంతటి రాజకీయ అండదండలు ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయాన్ని గుర్తించాలి.
ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాల్సిన చంద్రబాబు, అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, కేసును తొక్కి పెట్టేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో జరిగిన లోపాలకు, ఉన్నతాధికారుల పాత్రను సమగ్రంగా పరిశీలించడంలో విఫలమైనందుకు @ncbn ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాల్సిందే. ఈ వైఫల్యాల కారణంగానే ఇవాళ సీబీఐ విచారణ అవసరం ఏర్పడింది. విచారణ ఎదుర్కోవాల్సిన వారిని కాపాడేందుకు ‘సిట్’ ఏర్పాటు ఒక సాకుగా మారకూడదు.
ఈ కేసులో పూర్తి వాస్తవాలను సీబీఐ వెలికి తీయాలి. ఎవరి బాధ్యత ఏమిటో నిగ్గు తేల్చాలి. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నవారైనా సరే, ఈ నేరంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి న్యాయం జరిగేలా చూడాలి. తన ప్రభుత్వ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. సాయికృష్ణ తల్లికి తన కుమారుడి మరణం వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు తెలియాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆమెకు న్యాయం జరగాలి. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేం వారికి అండగా నిలబడతాం.
Hi Abhijeet @abhijeet_dipke
look at the incidents happening in places like Punganur, Rayachoti, and Tirupati in Andhra Pradesh
While you’re fighting against electoral malpractice, let us all first fight to ensure that nominations are accepted and that elections are allowed to take place in Andhra Pradesh.
Only then can we discuss irregularities in how they are conducted.
@ysjagan@YSRCParty@peddireddyysrcp@MithunReddyYSRC
Andhra Pradesh today witnessed a brutal attack on democracy under @ncbn's coalition government. On the first day of municipal nominations, YSRCP candidates faced attacks, death threats and attempts to stop them from filing nominations. Vehicles were burnt and nomination papers snatched and torn. Police remained mere spectators, in some cases party to the crime as well, dancing to Naidu's tunes instead of maintaining law and order and upholding the Constitution.
I strongly condemn the murder attempt on YSRCP Lok Sabha Floor Leader and Rajampet MP, P. V. Midhun Reddy in Punganur. TDP workers attacked his convoy, which had gone there to file the nominations, with stones, sticks and iron rods, injured his CRPF security staff, damaged vehicles and blocked our candidates from filing nominations while police watched all this in the premises of the nomination filing centre. Even after this, officials did not accept their nomination papers despite making them wait for over three hours. If our Lok Sabha Floor Leader is unsafe, what protection can ordinary people expect?
In Rayachoti, our candidates were threatened not to file nominations. When they proceeded despite these threats, TDP workers attacked former MLA Srikanth Reddy's office, set it and vehicles on fire, and injured our workers. Instead of registering cases against those responsible and protecting our candidates, police ordered our workers to leave our party office, where they had gathered to select candidates and prepare nomination papers, while it is our own party office that was set on fire while police remained mute spectators.
In Tirupati, a woman candidate's papers were snatched and torn, and our leaders were attacked. In Dharmavaram, candidates were attacked and their papers snatched in police presence. In Kadapa, our 30th Division candidate was
obstructed, and papers submitted to the Returning Officer were snatched and torn. Yet no case was registered and no action was taken against them. This shameful inaction gives TDP workers a free hand to obstruct elections in full public view. In Dachepalli, police planted liquor and forcibly detained our Nagar Panchayat chairman candidate to prevent him from filing his nomination.
Chandrababu Naidu must understand that government machinery is not his party's property. Violence cannot give the TDP the public confidence it has lost. Every attack strengthens our resolve to stand with the people and defend their democratic rights.
I stand firmly with every YSRCP worker. We will not surrender to threats or abandon our democratic fight. Every incident must be investigated, every attacker held accountable, and every officer who enabled this violence made answerable.
The SEC must intervene immediately, ensure that all affected candidates can file nominations, and secure the deployment of Central forces. Candidates must be able to contest without fear, and people must be free to choose their representatives.
Centralised or transparent and safe online nominations should be made available. Proper CCTV live footage should be put in place in polling stations. CCTV live footage should be placed in all strong rooms to prevent tampering of ballot boxes. CCTV live footage should be in place in all counting stations to ensure proper verification of the signatures on ballot paper account and to monitor the counting process in the counting stations. Central government forces (Paramilitary forces) should be brought in to ensure that free and fair elections are conducted.
#SaveDemocracyInAP
ఏపీ రాజకీయాల్లో ఇంత హింస ఎందుకు పెరిగింది.?
చేసిన మంచి చెప్పుకుని మీరు గెలవలేరా?
ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదు. Underline these words sir.
పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ ఎలా చెబితే అలా ఆడే మనిషి.💯🤷
బాబు గారు మిమ్మల్ని అరెస్ట్ చేసే విషయం కూడా పవన్ కి తెలుసు. చివరికి తనే మిమ్మల్ని కాపాడాడు అనే విధంగా తను ప్రాజెక్ట్ చేసుకున్నాడు. 💯
బాబు గారు మీరు రాజకీయంగా అస్తమిస్తున్న సూర్యుడు. 2029 లో జగన్ వస్తాడు 💯🤷 @ysjagan 🦁
లోకేష్ ఆ pressure తట్టుకొని నిలబడగలడు అని మీరు అనుకుంటే ఏమైనా చేయండి. Your wish 🤷
It's a sweet warning to TDP cadre @KethireddyMla@MithunReddyYSRC@Venkat_karmuru
#TDPGoons #andhrapradesh #YSJaganMohanReddy #tirupati #chittoor #kadapa #rayachoti #CBNTurnedAPIntoBihar #ncbn
నిజంగా మీ పార్టీకి సత్తా ఉంటే నామినేషన్ వేసిన తర్వాత.
కుప్పంలో జగనన్న ప్రజాస్వామ్యం బద్దంగా ఏ విధంగా ఎన్నికలు జరిపారో
ఆ విధంగా జరిపి గెలవండి.
అధికారం ఎప్పుడూ ఒక వైపే ఉంటుందని భావించడం అనేది మూర్ఖుడు చేసే పనులు.
అధికారం అనేది అటు ఇటు మారుతుంది అనేది జగం ఎరగని సత్యం.
అధికారం ఉన్నప్పుడు విర్రవీగి అధికారం లేనప్పుడు పారిపోయే రకం కాదు.
- మిధున్ రెడ్డి
మేము ఊరుకోం.. పుంగనూరులో దాడులకు తెగబడతాం..
బహిరంగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న శాప్ చైర్మన్ రవినాయుడు
ప్రేక్షకపాత్ర వహిస్తూ.. చూస్తూ నిలబడిపోయిన పోలీసులు
@CEOAndhra@ECISVEEP
ప్రతి నియోజకవర్గంలో ఇలా చేస్తే ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది.
ధర్మవరం కేతిరెడ్డి నిరసన.
టీడీపీ నేతల దాడికి కేతిరెడ్డి నిరసన ప్రదర్శన.
బాధితులను స్ట్రెచర్‌పై తీసుకెళ్తూ ర్యాలీ నిర్వహించిన కేతిరెడ్డి.
We want Free and Fair Elections✅️
@ECISVEEP@ECISVEEP