@EastCoastRail@DRMKhurdaRoad
We are very much thankful to you all for your great efforts and encouragement given to us to work together to develop the railway in our area till today.
...
Rail Users Committee, Ichchapuram. (Regd.,)
& Uttarandhra Rail Users - IPM.
Hoping that now Saluru will be well connected with Visakhapatnam by railway, by extending the train from Vijayanagaram to Saluru via Bobbili.
#SouthCoastRailway#VisakhapatnamDivision
We are the "Rail Users Committee, Ichchapuram".(Regd) &
Uttarandhra Rail Users- IPM, Welcomes the starting function
of "Visakhapatnam Division" &
"South Coast Railway Zone"
1st June 2026 onwards.
@DRMWaltairECoR
#VisakhapatnamDivision#SouthCoastRailway
శంకరాభరణం కథామర్మం
మహమ్మద్ ఖదీర్‌బాబు
‘పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో’
ఎవరు?
బెంగళూరు నాగరత్నమ్మ.
విశ్వనాథ్ గారు తన చివరి రోజుల వరకూ కూడా శంకరశాస్త్రి, తులసి పాత్రలకు ఇన్స్పిరేషన్ ఎవరని చెప్పలేదు. వనిత టీవీ ఇంటర్వ్యూలో మాత్రం ‘అదొక క్షేత్ర పురాణం’ అన్నారు.
అవును క్షేత్ర పురాణమే. త్యాగరాజ క్షేత్ర పురాణం. తిరువయ్యారు క్షేత్ర పురాణం.
శంకరాభరణం కథకు ఇన్స్పిరేషన్. నాటి త్యాగయ్యే నేటి శంకర శాస్త్రి! నాటి బెంగళూరు నాగరత్నమ్మే నేటి తులసి!
‘నిరాదరణ పొందుతున్న శాస్త్రీయ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృతవాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది’ అంటాడు శంకరశాస్త్రి క్లయిమాక్స్‌లో.
శంకరాభరణం అంతిమ మెసేజ్ ఇదే. కళాకారులు, పోషకులు. లేకపోతే కళ లేదు. శంకరాభరణం ఈ ఇరువర్గాల ప్రతినిధుల కథ. కళాకారుడు శంకరశాస్త్రి. పోషకురాలు తులసి.
త్యాగరాజస్వామి, బెంగళూరు నాగరత్నమ్మ కథ కూడా ఇదే.
1920ల నాటికి బెంగళూరు నాగరత్నమ్మకు 2 లక్షల ఆస్తి ఉండేదని ‘గృహలక్ష్మి’ పత్రిక రాసింది. గొప్ప విద్వాంసురాలిగా, నాట్యకత్తెగా, దేవదాసీగా (అందుకు ఆమె గర్విస్తుంది) ఆమెకు ఒక అస్తిత్వం, జీవనం ఉన్నా దానంతటినీ త్యజించి త్యాగరాజస్వామి కొరకు జీవితాన్ని అంకితం చేసిందామె. జీర్ణస్థితిలో ఉన్న త్యాగయ్య సమాధిని పునరుద్ధరించి, గుడి కట్టి, సత్రాలు నిర్మించి, ఆరాధనోత్సవాల్లో ముందంజ వేసి, ఆస్తి ధారబోసి ఆ మహనీయుడికి వర్తమానంలో పునర్ఘనతను తెచ్చి– అచ్చు శంకరశాస్త్రి పాదాల మీద పడి తులసి ప్రాణం విడిచినట్టే తాగయ్య సమాధి చెంతే ప్రాణం విడిచింది. అక్కడే సమాధి అయ్యింది.
నేటికీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో పంచకృతులు పాడి త్యాగయ్యను ఆరాధిస్తే, నాదస్వర గానంతో బెంగళూరు నాగరత్నమ్మకు నివాళి అర్పిస్తారు.
రెండు వేరువేరు కాలాల్లో జీవించి మరణించిన ఈ ఇరువురిని వర్తమానంలో తెచ్చి, వారి చుట్టు ఒక కథను అల్లడం కె.విశ్వనాథ్ మేధోసృజనకు ఉదాహరణ. మరి ఈ విషయం ఎందుకు బయటకు చెప్పలేదు? చెప్తే అనేక లేనిపోని చర్చలు! ఉదాహరణకు త్యాగయ్యది రామభక్తి. శంకరశాస్త్రిది శైవారాధన. విశ్వనాథ్ గారి సబ్/కాన్షియస్ మైండ్ ఈ కథ అల్లికలో ఇది త్యాగయ్య, నాగరత్నమ్మల స్ఫూర్తి అని హింట్స్ వదలుతూనే ఉంటుంది.
– శంకరాభరణం ఫస్ట్సీన్లో శంకరశాస్త్రి నది ఒడ్డున జీర్ణవస్త్రాన్ని ఉతికి ఆరబెడతాడు. తులసి చూస్తుంది.
తిరవయ్యారులో అడుగుపెట్టిన నాగరత్నమ్మ త్యాగయ్య వైభవం జీర్ణస్థితికి చేరిందని అర్థమయ్యి తల్లడిల్లింది. త్యాగయ్యకు గుడి కట్టి మరణించింది. ‘శంకరాభరణం శంకరశాస్త్రి కళామందిరం’ కట్టి అంతే ధన్యురాలై తులసి మరణించింది.
కథాభావం: నాడు సామాజిక అభ్యంతరాలున్న దేవదాసీ సమూహంలో జన్మించి, త్యాగయ్యను ఆరాధించి, పునీతురాలైంది బెంగళూరు నాగరత్నమ్మ. పాము శివుడి మెడకు చేరి శంకరాభరణం అయినట్టు. అదే నేపథ్యంలో పుట్టి, శంకరశాస్త్రిని ఆరాధించి, సంగీతానికి సేవలు చేసి సద్గతిని పొందింది తులసి– కొడుకును శంకరశాస్త్రి వారసత్వానికి ఆభరణం చేసి– శంకరాభరణం చేసి.
– త్యాగయ్య జీవితంలో కావేరి నది, శంకరశాస్త్రి జీవితంలో గోదావరి నది.
– త్యాగయ్యకు మొదటిభార్య చనిపోయింది. రెండవ భార్య వల్ల సీతమ్మ అనే కూతురు పుట్టింది. శంకరశాస్త్రి భార్య మరణించింది. కూతురు శారద.
– త్యాగయ్య సన్మానాలను, సత్కారాలను లెక్క చేయడు. శంకరశాస్త్రి కూడా.
– త్యాగయ్య సీతారాములను ఇంట పెట్టుకుని పూజించాడు. శంకర శాస్త్రి నటరాజ స్వామిని పూజిస్తుంటాడు. శారద తప్పు పాడితే ఆ విగ్రహం ఎదుట అరచేత కర్పూరం వెలిగించి ప్రాయశ్చితం చేసుకుంటాడు.
– ‘శంకరాభరణం’ సినిమా మొదలులో దర్శకుడు నాంది వాక్యాలు పలికి త్యాగరాజ కృతి ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అంటూ ముగిస్తాడు. క్లయిమాక్స్‌ను త్యాగరాజ కృతి మకుటం ‘దొరకునా ఇటువంటి సేవ’తో ముగిస్తాడు.
– సినిమాలో శంకరశాస్త్రికి సన్మాన ఆహ్వానం కన్నడదేశం నుంచి వస్తుంది. తమిళనాడు కుంభకోణం నుంచో కేరళ పాలక్కాడ్ నుంచో కాదు. బెంగళూరు నాగరత్నమ్మ పుట్టి పెరిగిన కన్నడసీమకు దర్శకుడి కృతజ్ఞత అది.
తులసి పాత్రకు మంజుభార్గవిని ఎంపిక చేయడంపై ఆ రోజుల్లో అందరూ ఆశ్చర్యపోయారట. కె.విశ్వనాథ్ గారు అమాయకులు కాదు. నాగరత్నమ్మ వలే భారీ విగ్రహం ఉన్న నటీమణిని తీసుకున్నారు. తులసి వినమ్రురాలైనా ఏదైనా చేయగల ధీశాలి. ఆ పాత్రకు బేలరూపం పనికి రాదు.
– బెంగళూరు నాగరత్నమ్మ జీవితంలో అడ్వకేట్లు, జడ్జీలు కీలకపాత్ర పోషించారు. అల్లు రామలింగయ్య పాత్ర ప్లీడరు కావడం ఇందుకే.
ఒకరి Facebook పోస్టు!
Edited to shorten the length to fit here!
ఇతన్ని సమర్థిస్తున్నా అని కాదు గానీ, నౌపాడ గుణుపూరు రైల్వే డెడ్ ఎండ్ లైన్. అయినా ఒరిస్సాలో అంగుళం కూడా దక్షిణ కోస్తాలో ఉండకూడదు అని పట్టుబట్టి మనకు పాతపట్నం వరకే ఇచ్చారు.మనం కొత్తవలస నుండి పాడువా, పలాస నుండి ఇచ్చాపురం 150 km వాళ్ళకి ఇచ్చాము. కనీసం మాట్లాడారా దీనిగురించి? @RamMNK