మొన్న నా చొక్కా జేబులోంచి ఇంత పెద్ద రేనాల్డ్సు బాల్పెన్ను జారి పడిపోయిందెక్కడో. దానికి నే ఏడ్చానా? జస్టు నిట్టూర్చా.
మరి, అంత పేఏఏఏద్ధ కారులోంచి ఓ బుల్లి క్లచ్చిప్లేటు పోయిందని ఏడుస్తాడేంటి, వీడూ!? డబ్బున్నాళ్ళ పిసినారితనం అంటే ఇది కదూ! 🙊
కూర్చోడం కొత్త సిగరెట్ వ్యసనం లాంటిది.
పొద్దున్న లేచి కమోడ్ మీద కూర్చుంటావు,
చేతిలో మొబైల్ ఉంటే అది అరగంటో గంటో అవుతుంది,
కూర్చుని తింటావు,
కూర్చుని కాఫీ తాగుతావు,
కార్లో కూర్చుని పనికెళ్తావు,
కూర్చుని ల్యాప్‌టాప్‌లో పనిచేస్తావు,
కూర్చుని ఆలోచిస్తావు,
కూర్చుని కబుర్లు చెప్తావు,
తగువొస్తే దా కూర్చుని మాట్లాడుకుందాం అంటావు,
కూర్చుని సినిమా చూస్తావు,
కూర్చుని పుస్తకం చదువుతావు,
కూర్చుని పెయింటింగ్ వేస్తావు, గిటార్ వాయిస్తావు,
కూర్చుని కూరగాయలు కోస్తావు,
కూర్చుని స్కాన్లు చేస్తావు, పేషెంట్లని చూస్తావు,
కూర్చుని పిల్లలకి చదువు చెప్తావు…..
ఇలా రోజంతా కూర్చునే ఉంటే
నీ ఒంట్లో శక్తి ఎప్పటికి కరిగేను, నీ కండలకి బలం ఎలా వచ్చేను?
స్వామి వివేకానంద చెప్పినట్లు “లే, లేచి నడువు”
శ్రీ శ్రీ చెప్పినట్లు “ తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా!”
పోనీ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు “ లే లే లేలే ఇవ్వాళే లేలే” ఇలా వీళ్ళంతా నడవమనే చెప్తారు లేదా లేచి నిల్చోమని అంటారు.
ఇప్పుడు నేనేమంటానంటే నిల్చుని అన్ని పనులు చెయ్యలేం, కొన్ని కూర్చునే చెయ్యాలి. కానీ యాక్టివ్ గా ఉండండి అంటున్నాను. అలసిపోతే కూర్చోవాలి గానీ, అదేపనిగా కూర్చోకూడదు.
నేను పుస్తకం చదివేటప్పుడు అటూఇటు నడుస్తాను,
పేషెంటు నోట్సు రాసేటప్పుడు నిలబడి రాస్తాను,
మా శ్రీమతితో నడకకి వెళ్తూ మాట్లాడతాను ఇలాంటి చిన్న చిన్న వీలైన మార్పులు చేసుకుంటాను.
ఇప్పుడు ఇది కూడా నిల్చోనే రాశాను.
మరి మీరేం చెయ్యాలో తెలుసుగా…
ఒకే మైదానం.
ఒకే కోచ్.
ఒకే కల.
ఒకే వయసు.
కానీ... ఒకరి కథ ప్రపంచ క్రికెట్ చరిత్రగా మారితే, మరొకరి కథ ‘ఇలా ఎందుకు జరిగింది?’ అనే ఒక ప్రశ్నగా మిగిలిపోయింది.
80వ దశకంలో
ముంబయి స్కూల్ క్రికెట్లో
సచిన్, వినోద్ కాంబ్లీల ద్వయం ఒక సంచలనం. శారదాశ్రమ విద్యామందిర్ తరఫున సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ కలిసి 664 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అందులో కాంబ్లీనే 349 పరుగులు చేశాడు.
ఆ రోజే చాలా మంది ఊహించారు
భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోవటానికి
ఇద్దరు ధ్రువ తారలు ఉదయించారని.
కొంతకాలానికే సచిన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ వెనుకే కాంబ్లీ కూడా. 1993లో ఇంగ్లాండ్‌పై 224, ఆ తర్వాత జింబాబ్వేపై 227 పరుగులు చేసి టెస్టు క్రికెట్‌ను మెరిపించాడు కాంబ్లీ.
ఒక దశలో సచిన్ కంటే వేగంగా డబుల్ సెంచరీల వైపు దూసుకెళ్లాడు.
చాలా మంది కాంబ్లీకి ఇక తిరుగులేదనుకున్నారు.
కానీ కథ మలుపు తీసుకుంది ఇక్కడే.
ఎందుకంటే ఒక్కసారిగా వచ్చిన స్టార్డమ్ హ్యాండిల్ చేయడం ఒక ఆర్ట్.
ఎంత లైమ్ లైట్ వచ్చినా.
సచిన్ దాన్ని తలకు ఎక్కించుకోలేదు.
మైదానంలోనూ, బయట తన ఆటపైనే మనసు లగ్నం చేశాడు.
కాంబ్లీ కథ మరోలా సాగింది. ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ ను, దాంతో పాటు వచ్చిన అపారమైన బ్యాంక్ బ్యాలెన్స్ ను డీల్ చేయలేకపోయాడు. వ్యక్తిగత జీవితం, రాత్రి వేళల అలవాట్లు, క్రికెట్‌పై తగ్గిన శ్రద్ధ. చెడు స్నేహాలు... అతని కెరీర్‌ను ప్రభావితం చేసాయి. 17 టెస్టుల్లో 54.20 సగటు ఉన్నప్పటికీ, 1995 తర్వాత అతడు టెస్టు జట్టులోకి తిరిగి రాలేకపోయాడు.
ఇద్దరూ ఒకే చోట మొదలయ్యారు. ఇద్దరిలోనూ ప్రతిభకు కొదవ లేదు. అవకాశాలు ఇద్దరికీ వచ్చాయి.
కానీ ఒకరు క్రమశిక్షణతో ముందుకుసాగితే
ఇంకొకరు దారి తప్పారు.
కాంబ్లీ తర్వాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. 2024 డిసెంబరులో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టడం సహా సమస్యలను గుర్తించారు. 2025లో ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ మొత్తం ఎపిసోడ్ ను
సచిన్ గెలిచాడు, కాంబ్లీ ఓడిపోయాడు అనే కోణంలో చూడకూడదు.
కష్టపడితేనే ఎవరికైనా అవకాశాలు వస్తాయి. ఆరంభ రోజుల్లో సచిన్ ఎంత కష్టపడ్డాడో.. కాంబ్లీ కూడా అంతే శ్రమించాడు.. కానీ స్టార్డం వచ్చిన తర్వాత ఆ వెలుగులో కళ్లు చెదరకుండా సచిన్ నిలబడితే.. కాంబ్లీ ఆ మాయలో పడి దారి తప్పాడు
ఇది ఓ ఇద్దరి స్నేహితుల కథ మాత్రమే కాదు.. మనకు జీవిత ఆరంభంలో కనిపించే రెండు దారుల కథ కూడా..
ఏ దారిలో వెళ్తామన్నది ఎవరికి వారే తేల్చుకోవాలి.🙏
పళ్ళూడే వయసులో ఉన్న ఓ కుళ్ళు పళ్ళ డాక్టరు పళ్ళెంలో ఉన్న ఉప్మాను చూసి పళ్ళికిలించాడని పళ్ళు నూరుతూ పళ్ళు రాల్తాయి జార్త అని పెళ్ళామంటే , కుళ్ళబొడుస్తుందేమోనని భయపడి ఉన్న కాసిని పళ్ళమధ్య నీళ్ళు నములుతూ కళ్ళంట నీళ్ళు కారగా , కుళ్ళి కుళ్ళి ఏడ్చి మరీ పళ్ళెమట్టుకుని ఒళ్ళు దగ్గరెట్టుకు తిని మళ్ళీ మళ్ళీ కావాలని వేయించుకుని కుళాయి నీళ్ళు తాగి, గుళ్ళోకెళ్ళి ఊళ్ళోజనాలకి ఉప్మా గొప్పతనం గురించి మేళ తాళాలు వాయించి మరీ చెప్పి కిళ్ళీ బిగించి వెళ్ళాడట!
జై #ఉప్మా ! జై #ఉప్రేసం.
అందరికి నమస్కారం 🙏. చిత్తూరు నగర పార్టీ అధ్యక్షుడు గా అవకాశం ఇచ్చిన మా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి @ncbn గారికి, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh అన్న కి , మా శాసనసభ్యులు శ్రీ @JM_Gurajala గారికి, మా పార్లమెంట్ సభ్యులు @DaggumallaPR గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బాధ్యతను శక్తి వంచన లేకుండా కృషి చేసి, ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికీ ఈ పసుపు జెండాకు విధేయుడిగా ఉంటా. Thank you to each one of you who sent me the wishes .
జై తెలుగుదేశం . 🙏.
UPI వచ్చాక డబ్బు ఖర్చు చేయడం కాదు ..డబ్బు ఎక్కడికి పోతుందో కూడా తెలియడం లేదు..!
₹100, ₹200 అంటూ రోజూ కొడుతూ పోతే…నెలాఖరుకి Bank Balance Single Digit కి వచ్చేస్తుంది.!
మనం Savings అనే విషయాన్ని మర్చిపోయాం..
మళ్లీ Cashకి రండి… ఖర్చు చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి...
నాకు పాతికేళ్లకి పైగా ఒక వ్యక్తితో స్నేహం ఉంది.
పదిహేనేళ్ళప్పుడు- టెన్త్ స్కోరెంత?
పాతికేళ్లప్పుడు- పీజీ ర్యాంకు ఎంత?
ముప్ఫై ఐదేళ్లప్పుడు- ఓపీ ఎంత?
ఇప్పుడు- హెచ్‌బీ ఏవన్సీ ఎంత?