#NijamGelichindi
గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం @ncbn గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు గారు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. నిజం గెలిచింది. నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
వెలిగొండ సంబరం-కృష్ణమ్మకు వందనం..!
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ఈరోజును నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేను. రైతులు, నిర్వాసితులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన నేను... మూడు దశాబ్దాల తర్వాత వెలిగొండలో కృష్ణమ్మ జలాలను ఆహ్వానించడం, కరువు నేలపై జలసిరులను చూడటం ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది. కరువుతో పోరాడిన రైతన్నలు, ఫ్లోరైడ్ బాధలు అనుభవించిన కుటుంబాల సమస్యలు ఇకనుంచి తీరనున్నాయి. వెలిగొండ కేవలం ఒక ప్రాజెక్టు కాదు... పశ్చిమ ప్రకాశం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బంగారు కొండ. ఈ ప్రాంత అభివృద్ధికి ఇది కొత్త అధ్యాయం. అందరికీ శుభాకాంక్షలు... వెలిగొండను సాకారం చేయడానికి కృషి చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు, ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు. వెలిగొండ మొదటి దశతో మార్కాపురం ప్రాంతానికి గుడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఇక మార్కాపురం అన్ స్టాపబుల్...
వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు.
#VeligondaProject
మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు...
మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు....
మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల... కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోంది.
కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. నా మనసుకు ఎంతో సంతోషానిస్తోంది.
వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు...
కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా...
ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత...
వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు...
పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం....
మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు.... ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయి.
అందుకే రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు...అభివృద్ధికి రెక్కలు.
రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం!
#VeligondaProject
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే APPSC గ్రూప్ - 1 ఉద్యోగాల పేరిట అతిపెద్ద పరీక్షా కుంభకోణం ఎలా జరిగింది? వేలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలతో, వారి కలలతో జగన్ ఎంత వికృతంగా ఆడుకున్నాడు. యువ ప్రతిభను ఎలా కాలరాశాడు... ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మనం చెప్పుకోబోయేదంతా సిట్ దర్యాప్తు చేసి ఇచ్చిన నివేదికలో ఉన్న కఠోర వాస్తవాల కథనం.
#JaganAPPSCrecruitmentScam
#PsychoFekuJagan
#AndhraPradesh
#SuzlonComesToAP
It gives me immense satisfaction to see @Suzlon deepen its commitment to Andhra Pradesh with ₹10,500 crore of new wind energy projects and an expanded manufacturing presence in Anantapur.
My association with Suzlon goes back many years, to my friendship with its visionary founder, the late Shri Tulsi Tanti. He believed deeply in the future of renewable energy long before it became a global imperative. I remember with warmth his faith in Andhra Pradesh and his commitment to building here. Today, as Suzlon begins a new chapter in our State with 1,325 MW of wind projects, creating thousands of livelihoods, I feel we are carrying forward that shared vision.
Andhra Pradesh will continue to honour long-standing partnerships, keep its commitments, and build a clean, sustainable energy future for generations to come.
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. 10,060 పోస్టులను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం 'జాబ్ క్యాలెండర్ 2026' విడుదల చేసింది. గత ఏడాది 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిన మంత్రి లోకేష్ ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
Yesterday, the ED arrested a former @YSRCParty Minister for illegal transportation in the liquor scam.
Their leader @ysjagan gives him a clean chit saying: the proceeds would be “at most ₹2 crore.” Didn’t know the @YSRCParty had imposed a MSP (Minimum Scam Price) on corruption - only above 2 crores can be prosecuted! 😂🙏
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
తమిళనాడు శాసనసభలో చంద్రబాబు పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పేద ప్రజలకు ఫోర్టిఫైడ్ సన్న బియ్యం అందించడంతో పాటు బియ్యం బస్తాలపై క్యూఆర్ (QR) కోడ్ ద్వారా రైతు నుంచి రేషన్ దుకాణం వరకు పారదర్శక ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దళారుల అక్రమాలకు చెక్ పెడుతూ నాణ్యమైన రేషన్‌ను అందిస్తున్న ఈ తీరుపై ఇటీవల తమిళనాడు అసెంబ్లీలోనూ ప్రశంసల చర్చ నడిచింది. వాహనాల సంఖ్య కంటే ప్రజల కంచంలో పడే బియ్యం నాణ్యతే అసలైన కొలమానంగా భావించి చేపట్టిన ఈ సంస్కరణలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో కూడిన సుపరిపాలనకు మరియు ప్రజా సంక్షేమానికి అద్దం పడుతున్నాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh
#TeachersVersusYSRCP#MegaDSC#DSCFakesByYCP
ఇంట్లో కూర్చోడానికి కుర్చీలు లేవు. కోచింగ్ తీసుకోడానికి 40 వేలు ఇమ్మంటే తండ్రి తనకు అంతటి ఆర్థిక పరిస్థితి లేదన్నాడు. ఇటువంటి కుటుంబం డబ్బు పోసి ఉద్యోగం కొనుక్కుంది అంటున్నావు. ఎనిమిదేళ్లు కష్టపడి చదివి సంపాదించిన ఉద్యోగాన్ని ఊడగొడతా అంటూ ఎగురుతున్నావు. నిన్ను ఏమనాలి జగన్?
#AndhraPradesh
జయహో బీసీ!
జనాభాలో 50 శాతంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు వెన్ను దన్నుగా నిలిచేందుకు ఇవాళ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ.... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ బీసీలకు రాజకీయ సాధికారత కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించే అంశంలో కూటమి ప్రభుత్వ నిబద్ధత ఇది. బీసీలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించి, వారి హక్కులను కాపాడుతూ నాయకత్వాన్ని ఇచ్చేలా ప్రోత్సహిస్తాం. 28 జిల్లాలకు ప్రజా పరిషత్ లు ఏర్పాటు చేసి స్థానిక పాలనకు నిజమైన అర్థాన్ని ఇస్తాం. ప్రజల భాగస్వామ్యంతో మేయర్, మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టేలా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నాం.
#JayahoBC
#TDPWithBCs
అధికారంలో ఉన్నంత కాలం గంజాయి, అక్రమ మద్యం వ్యాపారాల్లో మునిగితేలిన వైకాపా నాయకులు, అధికారం కోల్పోయినా చట్టం కళ్లగప్పి తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు. అయితే అక్రమార్కుల పాలిట ఛండశాసనుడైన నారా చంద్రబాబునాయుడు గారు అధికారంలో ఉండటం తో వారి ఆటలు సాగడం లేదు.
గోవా నుంచి తాడిపత్రికి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకుని సీజ్ చేయగా, ఆ కేసును తప్పుదోవపట్టించే విధంగా వైకాపా నేతలు దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు అంటగట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వాస్తవంగా గోవా నుంచి తాడిపత్రికి అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రధాన అనుచరుడు పుట్లూరు రామాంజినేయ రెడ్డి (తాడిపత్రి టౌన్). కాగా అతడిని పోలీసులు పట్టుకోవడంతో వైకాపా నేతలు దొంగనాటకాలను మొదలు పెట్టారు.
వాస్తవానికి జరిగింది ఏమిటంటే:
తాడిపత్రి పట్టణంలో నందలపాడు ప్రాంతంలో NH-544 D ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన 18 తేదీ ఉదయం నుంచి ఒక లారీ (నెంబర్ KA01 AM6363) నిలిచి ఉన్నదని మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తాడిపత్రి పోలీసులకు సమాచారం అందింది. ఎన్నో ఎక్సయిజ్ కేసుల్లో నిందితుడైన పుట్లూరు రామాంజనీయ రెడ్డి ఆ లారీని అక్కడ నిలిపినట్లు కూడా పోలీసులకు సమాచారం అందింది. దాంతో తాడిపత్రి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పీ. ఆరోహణరావు తనకు అందిన సమాచారాన్ని ఎక్సయిజ్ పోలీసులకు అందించి వారి సహాయంతో లారీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ లారీలో గోవా నుంచి చట్ట విరుద్ధంగా తీసుకువచ్చిన 435 మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఇదే లారీ క్యాబిన్ లో KA01 AM 6363 అనే నెంబర్ ప్లేట్ కూడా దొరికింది. పోలీసులను, ఎక్సయిజ్ పోలీసులను చూసి లారీ నుంచి పారిపోయిన వ్యక్తి పుట్లూరు రామాంజినేయ రెడ్డి (తాడిపత్రి టౌన్) అని పోలీసుల విచారణలో వెల్లడి కాగా సదరు విషయాలన్నీ పెద్దమనుషుల సమక్షంలో మహాజరునామాను తయారుచేశారు. మద్యం బాటిళ్ల శాంపిళ్లను కెమికల్ ఎనాలసిస్ నిమిత్తం పంపారు. పరారీలో ఉన్న పుట్లూరు రామాంజినేయ రెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వాస్తవాలు ఈ విధంగా ఉండగా సదరు గోవా మద్యం బాటిళ్లు పట్టుబడ్డ లారీ తెలుగుదేశం పార్టీ నాయకులదని కొందరు తప్పుడు ప్రచారం ప్రారంభించారు.
ప్రధాన నిందితుడైన పుట్లూరు రామాంజినేయ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా పుట్లూరు రామాంజినేయ రెడ్డి పై 7 మద్యం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. అక్రమ మద్యం సరఫరా కేసులే కాకుండా ఎన్నో నేరాలతో సంబంధం ఉన్న ముఠా నాయకులు తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు వీటిని నమ్మరు.
#YCPFakeBrathuku
#AndhraPradesh
విశాఖ నీటి భద్రత.. మా బాధ్యత
పోలవరం నుంచి విశాఖ నగర ప్రజలకు తాగునీరు, పరిసర ప్రాంతాలకు సాగునీరు అందిస్తాం. పరిశ్రమల అవసరాలకు కేటాయించిన నీటి నుంచే డేటా సెంటర్లకు నీరిస్తాం. నీటి భద్రతలో రాజీ పడం. గోదావరి నది నుంచి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. మొత్తం 6.5 గిగా వాట్ల డేటా సెంటర్ ఆరంభమైతే.. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం మూడు టీఎంసీల నీరు అవసరం అవుతుంది.
#NaraLokesh
#APAssembly
#AndhraPradesh
ఐదేళ్ళలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వడం చేతకాని జగన్, మెగా డీఎస్సీ -2025 గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. మెగా డీఎస్సీ ఎంత పారదర్శకంగా జరిగిందో చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త టీచర్లు చేస్తున్న ఆందోళనలే నిదర్శనం. ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడి వింత సైకో చేష్టలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఏళ్ళ తరబడి తాము చేసిన సాధనను, పడిన కష్టాలను జగన్ అవమానించడమే వీళ్ళ ఆగ్రహానికి కారణం. ఎన్నో పేద కుటుంబాలలో తమ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఉండింది. కానీ ఇప్పుడు ఆ సంతోషాన్ని దూరం చేయడానికి దుష్టగ్రహంలా కుట్రలు చేస్తున్నాడు జగన్. ప్రజల జోలికి వస్తే చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. ఆయన వెనుక మీరున్నారు. న్యాయం ఉంది. యువశక్తి తోడుంది.
#MegaDSC
సభకు రాని గొడ్డలి పార్టీ అధినేత @ysjagan డీఎస్సీ 2025 విషయంలో ప్రశ్నించింది నన్ను, సీఎం గారిని, కూటమి ప్రభుత్వాన్ని కాదు. రాజ్యాంగాన్ని రాసి, అందులో రిజర్వేషన్లు పొందుపరిచిన అంబేద్కర్ గారిని జగన్ ప్రశ్నించాడు.
#MegaDSC#DSCFakesByYCP#NaraLokesh#APAssembly#AndhraPradesh