కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు
• నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు
నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణమ్మ కరవు పీడిత ప్రాంతాలకు చేరనున్న చారిత్రాత్మక ఘట్టమైన వెలిగొండ తొలి దశ ప్రారంభోత్సవాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కావడం మార్కాపురం, ప్రకాశం, కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ప్రజలకు ఎనలేని సంతోషాన్నిస్తుంది. ఈ తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు, 4 లక్షల మందికి తాగు నీరు అందుతాయి. ఈ ఘట్టం సాకారం కావడానికి గత మూడు దశాబ్దాలుగా కృషి చేసిన ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంస్థలు, అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. లక్షలాది మంది తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టు కోసం 7,300 మందికి పైగా తమ ఇళ్లు, భూములు కోల్పోయి నిర్వాసితులుగా మిగిలారు. వీరికి పరిహారం చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం రూ. 905 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే నిర్వాసితులకి రూ. 768 కోట్లు చెల్లింపులు జరిపింది. వెలిగొండ ప్రారంభోత్సవం వేళ ఈ ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నేడు ఆయన నాయకత్వంలోనే తొలి దశ ప్రారంభం అవుతోంది. ఆయన దూరదృష్టి, సంకల్పం నేడు కరవు ప్రాంతంలో జల సిరులు పారిస్తుంది. మార్కాపురం, ప్రకాశం జిల్లాల పరిధిలో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద అమలు చేస్తున్న మెగా వాటర్ గ్రిడ్ పథకానికి కూడా వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరుగా నిలవనుంది. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సంకల్ప సాధనలో వెలిగొండ కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి శ్రమించిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
"నాగబాబు గారు నాకు దేవుడు లాంటి వారు.. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు రావడానికి ఆయనే కారణం!"
Producer #PhaniAdapaka garu heartfelt speech at #Veta Movie Title Announcement! 💥👇
#Nagababu#VetaMovie#NMedia
#Panja4K Enni types of edits chusina, nostalgic one matram Old 13 years back Panja × Jack Reacher ft. is perfectly apt. Dialogues kuda super ga set ayyayi.
Dinni kottedi inkem ledu anipistundi… especially the last shot. 🔥
పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలి
•రేపటి తరాలకు పచ్చని భవిష్యత్తును అందించేందుకు సహకరించాలి
•పారిశ్రామిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి పిలుపు
రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమైనదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని అభివృద్ధి చేసి, సంరక్షించే బాధ్యతను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పారిశ్రామికవేత్త దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. భావితరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, పచ్చని భవిష్యత్తును అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ముందుకు రావాలని సూచించారు.
అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణలను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లినప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రివర్యులు అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా సమాజానికి, ప్రకృతికి, రాబోయే తరాలకు విలువైన భవిష్యత్తును అందించగలమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పరిశ్రమలు 33 శాతం పచ్చదనం నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ-గ్రీన్ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
2026 గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పోర్టులు, సిమెంట్, మైనింగ్, ఎనర్జీ, ఆహార శుద్ధి, ప్లాస్టిక్, పేపర్, వస్త్రాలు తదితర రంగాలకు చెందిన సుమారు 3,400 పరిశ్రమలు, కంపెనీలు వేలాది ఎకరాల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 14 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తొలి విడతగా పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 26 పరిశ్రమల్లో 129 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పరిశ్రమల యాజమాన్యాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలు 33 శాతం పచ్చదనం లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా విశాఖపట్నం వంటి నగరాలకు సమీపంలో ఉన్న పరిశ్రమలు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేసి, పట్టణ ప్రజలు కాలుష్య ప్రభావానికి గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీ సిటీ, పరవాడ తదితర ప్రాంతాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZలు) కూడా 33 శాతం పచ్చదనాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న మహత్తర సంకల్పంలో పారిశ్రామిక వర్గాలు చురుకుగా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు పిలుపునిచ్చారు.
– ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయం
నిన్న కారు, నేడు హస్తం-పార్టీ ఏదైనా MIM ముందు ఇద్దరిదీ ఒకటే తీరు! మజ్లిస్ అరాచకాలను ఆపే వెన్నెముకే లేదు!
అధికారం చేతిలో ఉన్నా పెత్తనమంతా పాతబస్తీదే. బయటకు తిట్టుకున్నట్టు నటిస్తూ లోపల చేసే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ బాగోతం ఇంకెన్నాళ్లు సాగుతుంది?
తెలంగాణ ప్రజలకు కావాల్సింది రాజీపడే రాజకీయం కాదు, నిలదీసే ధైర్యం!
#BRSCongressFailedTelangana #MIM #JanaSenaTelangana #JSPForTelangana