AIPC చైర్మన్ గా నియమితులైనందున.. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ గారు, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరివెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కందుల ఉపేందర్ గారు ఈ రోజు మా నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
Your fight will not be in vain!
The people of this country are looking to you with hope. Your fight for the voice of the oppressed and the protection of democracy will be remembered in history. This fight will not stop until CEC Gyanesh Kumar resigns and SIR is scrapped
CM Revanth Reddy meets US Ambassador Sergio Gor
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ మర్యాదపూర్వక భేటీ 30 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలు చర్చించారు. తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాలను పెంచాలని, వీసా అపాయింట్మెంట్లు సకాలంలో లభించేలా సహకరించాలని కోరారు. వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచాలని, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కోరారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ కు చెందిన వివిధ రంగాల నిపుణుల సమస్యలను కూడా రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. H-1B వీసా ప్రాసెసింగ్, రెన్యువల్, వీసా స్టాంపింగ్ ఆలస్యం కాకుండా సరళతరం చేయాలని కోరారు. వీసా నిబంధనల్లో వచ్చే మార్పులపై ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై కూడా చర్చించారు. తెలంగాణలో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, స్టార్టప్‌లు, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి పనిచేసేలా సహకరించాలని కోరారు. విద్యార్థుల మార్పిడి, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు. అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిపై రాయబారి సెర్జియో గోర్‌కు ఉన్న అవగాహన తనను ఆకట్టుకుందన్నారు. ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, రాష్ట్ర బలాలపై రాయబారి చూపిన ఆసక్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ–అమెరికా మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చారు.
#CMRevanthReddy #RevanthReddy #Telangana
Minister Komatireddy assures Support to Contractor Srinivas Reddy's Family, Promises Action on Pending Bills and Mining Issues
కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి నేనున్నా... ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది
* చిన్న కాంట్రాక్టర్లు ఎవరు అధైర్య పడొద్దు..మీ సమస్య మా దృష్టికి తీసుకురండి
* చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు, క్రషర్లు–మైనింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం
* ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా
* మైనింగ్ అధికారి అనాలోచిత చర్య వల్ల శ్రీనివాస్ రెడ్డి చనిపోయారు..
* వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాను.. గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లు 5.3 కోట్ల కూడా క్లియర్ చేయించాను
* మైనింగ్ శాఖ మంత్రి వివేక్ గారితో మాట్లాడాను...వారితో రేపు సమీక్ష నిర్వహిస్తాం
---- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లాకు నచెందిన కాంట్రాక్టర్, వైస్ ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్‌గా ప్రజలకు సేవలందించిన బండారి శ్రీనివాస్ రెడ్డి మృతి తనను తీవ్రంగా బాధించిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
గురువారం నాడు హైదరాబాద్ వనస్థలిపురంలోని నివాసంలో వారి కుటుంబాన్ని పరామర్శించి, శ్రీనివాస్ రెడ్డి భార్య, కుమారుడికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటానికి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ...
శ్రీనివాస్ రెడ్డి కేవలం కాంట్రాక్టర్ మాత్రమే కాదని, ప్రజా జీవితంలో చురుకుగా ఉంటూ మంచి పేరు సంపాదించుకున్న నాయకుడని తెలిపారు. చిన్నచిన్న పనులు, క్రషర్ నిర్వహణ ద్వారా సుమారు 200 మందికి ఉపాధి కల్పించారని, నాణ్యమైన పనులు చేసే కాంట్రాక్టర్‌గా ఆయనకు మంచి గుర్తింపు ఉందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన CRF పనులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సుమారు *రూ.685 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, శ్రీనివాస్ రెడ్డికి కూడా దాదాపు రూ.5 కోట్ల బకాయిలు ఉన్నాయని* మంత్రి తెలిపారు. ఈ బకాయిలను విడుదల చేయించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా మాట్లాడి, ఇటీవలే సంబంధిత పెండింగ్ చెక్ విడుదల చేయించినట్లు వెల్లడించారు.
శ్రీనివాస్ రెడ్డి కుటుంబం కొంత కుదుటపడిన తర్వాత వారిని పరామర్శించి అండగా నిలవాలని భావించానని, అందులో భాగంగానే ఈ రోజు కుటుంబ సభ్యులను కలిసినట్లు మంత్రి తెలిపారు.
రూ.5 కోట్ల బకాయిలకు రూ.54 కోట్ల నోటీసు ఎలా ఇస్తారు? మైనింగ్ అధికారి అనాలోచిత చర్య అని మండిపడ్డ మంత్రి
శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి వచ్చిన మైనింగ్ సంబంధిత నోటీసుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు రూ.5 కోట్ల బకాయిలు ఉన్న వ్యక్తికి ఏకంగా **రూ.54 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం సరికాదని** అన్నారు. అధికారి అనాలోచిత చర్య అని మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఇలాంటి నోటీసులు, క్రషర్కు సంబంధించిన సమస్యలు, విద్యుత్ కనెక్షన్ వంటి అంశాలపై కూడా తక్షణమే అధికారులతో చర్చిస్తామని చెప్పారు.
కాంట్రాక్టర్ల మైనింగ్ సంబంధిత సమస్యల పట్ల శుక్రవారం నాడు మంత్రి వివేక్ వెంకట స్వామితో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి తెలిపారు.
చిన్న కాంట్రాక్టర్లు ఎవరూ అధైర్యపడొద్దు
రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లందరికీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
“మీకు ఏ బిల్లులు పెండింగ్‌లో ఉన్నా నా దృష్టికి తీసుకురండి. మీ అసోసియేషన్ ద్వారా అయినా, నేరుగా నా సెక్రటేరియట్‌కు లేదా నా వద్దకు అయినా వచ్చి సమస్యలను చెప్పండి. ఎవరూ అధైర్యపడవద్దు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారితో చర్చించి మీ సమస్యలను పరిష్కరిస్తాం” అని మంత్రి అన్నారు.
గ్రావెల్, క్రషర్లు, మైనింగ్‌కు సంబంధించిన సమస్యలను సంబంధిత మంత్రితో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనింగ్ రంగంలో అసాధారణమైన నోటీసులు, ఇబ్బందులు లేకుండా తగిన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం
శ్రీనివాస్ రెడ్డి మృతి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి, ముఖ్యంగా కుమారుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
“శ్రీనివాస్ రెడ్డి లేని లోటును ఎవరూ తీర్చలేరు. కానీ ఆయన కుటుంబానికి నేను అండగా ఉంటాను. ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి నాయకత్వంలో వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తాం” అని మంత్రి తెలిపారు.
శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు, బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు డి.వి. ఎన్ రెడ్డి,ఎస్.ఎన్.రెడ్డి ఆర్ అండ్ బి సీ.ఈ వసంత్ నాయక్,ఆల్ ఇండియా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి,ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి,గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ చిలుకా మధు సూదన్ రెడ్డి,పలువురు స్థానిక నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
• @KomatireddyKVR
TPCC Intellectuals Department Holds State Executive Meeting to Strengthen Organisation and Plan Future Outreach
గాంధీ భవన్లో టీపీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం
హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో టీపీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మేధావుల విభాగం రాష్ట్ర చైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సెల్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ దావల్, వైస్ చైర్మన్ పుష్ప లక్ష్మణ్, పలువురు రాష్ట్ర నాయకులు, మేధావుల విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, మేధావుల విభాగం విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి, ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మేధావుల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు.
CM Revanth Reddy Pays Tribute to People’s Poet Gaddar on His Death Anniversary
ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ ఆటా-పాటా తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపారని కొనియాడారు.అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం తన గళాన్ని వినిపించిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని అన్నారు.పాటను ప్రజా ఉద్యమానికి ఆయుధంగా మార్చిన అరుదైన వ్యక్తిత్వం గద్దర్ ది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
CM Revanth Reddy Pays Floral Tribute to Prof. Jayashankar on His Birth Anniversary
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడని ఆయన కొనియాడారు.ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు సింగరేణి ఉన్నతాధికారులతో కలిసి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మైనింగ్ యంత్రాల తయారీ సంస్థలైన అరిజోనా రాష్ట్రంలోని ‘కేటర్పిల్లర్ డెమాన్‌స్ట్రేషన్ అండ్ లెర్నింగ్ సెంటర్’, టెక్సాస్ రాష్ట్రంలోని ‘కొమాట్సు మైనింగ్ కార్పొరేషన్’ కేంద్రాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రపంచ స్థాయి భారీ మైనింగ్ యంత్రాల తయారీ, అసెంబ్లీ ప్రక్రియలను, స్వయంచాలిత (Autonomous), టెలి-రిమోట్ ఆపరేషన్ టెక్నాలజీలను, అత్యాధునిక భద్రతా వ్యవస్థలను డిప్యూటీ సీఎం గారు క్షుణ్ణంగా పరిశీలించారు. గనుల్లో ప్రమాదాలను తగ్గించి కార్మికుల భద్రతను మరింత పటిష్ఠం చేసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై సంస్థల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు.
అదేవిధంగా భారీ మైనింగ్ యంత్రాల నిర్వహణ, స్పేర్ పార్ట్స్ లభ్యత, మెయింటెనెన్స్ ఖర్చుల తగ్గింపు, సాంకేతిక సహకారం, భవిష్యత్‌లో సింగరేణి అవసరాలకు అనుగుణంగా ఆధునిక యంత్రాల కొనుగోలు, ఫ్లీట్ విస్తరణ, స్థానిక సర్వీస్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఇటీవల సింగరేణి దక్కించుకున్న తాడిచెర్ల ఓపెన్ కాస్ట్-2, మణుగూరు PKOC-2 డిప్‌సైడ్ బొగ్గు బ్లాకుల అభివృద్ధికి అవసరమైన అత్యాధునిక మైనింగ్ టెక్నాలజీ, భారీ యంత్రాల ఎంపిక, ఆటోమేషన్ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయడంలో ఈ పర్యటన కీలకంగా నిలవనుంది.
సింగరేణి గనుల్లో ప్రపంచస్థాయి సాంకేతికతను ప్రవేశపెట్టి కార్మికుల భద్రతను మరింత మెరుగుపరచడం, ఉత్పాదకతను పెంచడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక మైనింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు.
ఒక సందర్భంలో.....
నేను, కేసీఆర్, ఫ్రొఫెసర్ జయశంకర్ ముగ్గురమే ఉన్నాం
అప్పుడు జయశంకర్‌ను కేసీఆర్ అవమానపరిచేట్లు నోటికొచ్చినట్లు మాట్లాడారు
నేను కేసీఆర్ మాటలు విని చాలా బాధ పడ్డాను....
ఆ తరువాత జయశంకర్‌ను అడిగాను...
ఇవాళ మాట్లాడిన మాటలు చాలా తక్కువ
ఇలాంటి మాటలు తరచూ అంటూ ఉంటాడు....కాని నేను ఏమి చేయలేను హనుమంతున్న అన్నాడు
నాకు ఆలోచన ఉంది...
దానిని అమలు చేసే శక్తి నాకు లేదు...
మంచి అయినా చెడు అయినా....
కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడినా....
తెలంగాణ రాష్ట్రం కోసం భరిస్తున్నా అన్నాడు
బతికి ఉన్నప్పుడు అవమాన పరిచిన బీఆరఎస్ నాయకులు...ఇప్పుడు ఆయనను దేవుడు మాదిరి కొలుస్తున్నారు
--- వి. హనుమంతరావు (మాజీ ఎంపీ)
Minister Sridhar Babu Leads Key Congress Meeting on Graduate MLC Election
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమావేశం..
రాజేంద్ర నగర్ మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని దుర్గా కన్వెన్షన్ హాల్లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కీలక సమావేశం
* సమావేశానికి హాజరైన రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్లమెంట్ ఇన్చార్జులు, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు...
* హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై క్యాడర్ కు మంత్రి శ్రీధర్ బాబు దిశా నిర్దేశం
* హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
* అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి: మంత్రి శ్రీధర్ బాబు.
* పట్టభద్రుల్లో ఓటరు నమోదు ప్రాముఖ్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: మంత్రి శ్రీధర్ బాబు దిశా నిర్దేశం.
* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో ఎక్కడా... ఎలాంటి జాప్యం జరగొద్దు.
* పార్టీ నాయకులందరూ పరస్పర సమన్వయంతో వ్యవహరించి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలి.
* ప్రతి నియోజకవర్గంలో పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి.
* కార్పొరేషన్ల చైర్మన్లు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకొని ప్రతి గ్రాడ్యుయేట్‌ను కలవాలి.
* సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల హామీల అమలు... అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించి కాంగ్రెస్ పార్టీ వైపు వారిని ఆకర్షించాలి.
* అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థి ఎంపిక... తుది నిర్ణయం హై కమాండ్ దే.
* అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తా.
Major General G. Srinivas, GOC of Telangana & Andhra Pradesh Sub Area (TASA), Meets Chief Minister Revanth Reddy at MCRHRD Bodhi Pavilion
ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా (TASA) జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) మేజర్ జనరల్ జి. శ్రీనివాస్
#RevanthReddy #Telangana
ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం
ఓట్ల తొలగింపు కుట్రలను అడ్డుకోవాలి
ప్రతి అర్హుడికి ఓటు హక్కు దక్కేలా చూడాలి
'SIR'పై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి
బీఎల్ఏలు పూర్తి నిబద్దతతో పనిచేయాలి
పీసీసీ సమన్వయ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం
#RevanthReddy#BhattiVikramarka#MaheshKumarGoud#TPCC