నిండుగా బట్టలు వేసుకోమని యే రాజ్యాంగం లో లేదు, అట్లాని కురచ/ ఎబ్బెట్టుగా డ్రెస్ వేసుకొని పక్కనోళ్ల కి embarassing కలిగించటం కూడా తప్పే.
ఇక్కడ issue అబ్బాయి డ్రెస్సింగ్ మీద 😁😁
@HiHyderabad@ApnaSecbad
VC SM
స్వార్థం, దురాశ తో మనసులు నిండిపోయిన మనుషులు, ఒక అబద్దపు విషవలయం లో నా కొడుకుని పెంచుతున్నారు. నాన్న ని బూచి గా చూపించుకుంటూ, నాన్న పై ఓ రెండు చాడీలు చెప్పి వాడికి ఇష్టమైనవి కొనిపించుకునే స్థాయి కి నా కొడుకుకి దిగజారుస్తున్నారు.
అంతా ఆ భగవంతుడు, కాలం, కాలభైరవుడే చూడాలి. 🙏
అహంకారంతో తల్లీ, చెల్లిని దూరం పెట్టి, చెప్పుడు మాటలు, అబద్ధాలు విని, అన్యాయం గా అధర్మం గా వెళ్లి, కుటుంబ వ్యవస్థని సంబంధాల్ని ధ్వంసం చేసుకుని, స్వతంత్రం గా ఏ నిర్ణయాలు తీసుకోలేక ఇలా కట్టు బానిస లా మిగిలిపోయిన ఆ వ్యక్తి అన్ని అధికారాల్ని ఎప్పుడో కోల్పోయారు 🙏
ఏపీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో "గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్" శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ, ఈలలు, కేకలు వేస్తూ, స్థానికులకే ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరసన తెలిపిన తమ్ముళ్లు
దీంతో నిరసన తెలిపి తమ్ముళ్ళ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు
Pawan Kalyan speech entry in Madanapalle Pawan Kalyan JanaSena Party #janasenaforbettersociety@apdeputycmo#PawanKalyan
🔥 డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి ఆశ్చర్యపోయిన అనంత్ అంబానీ🔥
దేశం మొత్తం గుర్తించే స్థాయి…
అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం ❤️🔥
పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అంటే ఇదే! 🔥🦁
#PawanKalyan #DeputyCM #PowerStar #JanaSena #PawanKalyanCraze
Chandrababu Naidu garu understands that technology must improve farmers income. That mission is at the heart of Indian School of Agriculture- #AnanthAmbani
చాలామంది ఆల్కహాల్ తో లివర్ కి సమస్య, అదెప్పుడో కదా జరుగుతుంది, ఇప్పటినుంచే ఎందుకు కంగారు అనుకుంటారు, కానీ ఆల్కహాల్ వలన ఎక్కువగా జరిగే నష్టం అది కాదు, ఆల్కహాల్ మత్తులో తీసుకునే దుందుడుకు (ఇంపల్సివ్) నిర్ణయాల వలన.
1. మన దేశంలో మగవాళ్లలో ఎక్కువమంది ఆత్మహత్యలు తాగిన మైకంలో చేసినవి.
2. ఎక్కువ రవాణా ప్రమాదాలు తాగిన మైకంలో జరిగినవి.
3. ఎక్కువ గృహహింస, గృహిణుల హత్యలు తాగిన మైకంలో జరిగినవి.
ఇంతేకాక తాగిన మైకంలో వాగిన వాగుడు వలన రిలేషన్ షిప్స్ దెబ్బతినడం, బ్రేకప్స్ జరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, పోలీసు కేసులకు గురవడం ఇవన్నీ చాలా ఎక్కువ.
వీటిలో ఏదో ఒక్క తప్పిదమైనా చాలు జీవితాన్ని దుర్భరం చేయడానికి.
ఇక మీ ఇష్టం.
భర్త లేని ఒక స్త్రీ ఎవరితో అయినా కొంచెం ఫ్రీగా మాట్లాడితే…
కాస్త ఓపెన్‌గా ఉంటే…
కొంతమంది మగవాళ్లకు వచ్చే మొదటి ఆలోచన—“నీ ఫీలింగ్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు?”
కానీ అదే వ్యక్తి ఎప్పుడూ అడగడు…
“నువ్వు ఒక్కదానివి కుటుంబాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు?”
“నీ బాధను ఎవరితో చెప్పుకుంటున్నావు?”
“రాత్రిళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును ఎలా సముదాయించుకుంటున్నావు?”
“నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ఎంతటి బాధను మింగుకుంటున్నావు?” అవి అడగడానికి మనసు కావాలి…
ఆమె ఒంటరితనం కనిపిస్తుంది…కానీ ఆమె వెనుక ఉన్న బాధ్యతలు కనిపించవు.
ఆమె నవ్వుతూ మాట్లాడటం కనిపిస్తుంది…కానీ ఆ నవ్వు వెనుక దాచుకున్న కన్నీళ్లు కనిపించవు.
ఆమె స్వేచ్ఛగా మాట్లాడటం కనిపిస్తుంది…కానీ ఆమె తన జీవితాన్ని ఎంత కష్టపడి నిలబెట్టుకుందో కనిపించదు.
కొంతమందికి ఆమె మనసు కాదు… అవకాశం మాత్రమే కనిపిస్తుంది.
“భర్త లేడు కదా… ఎప్పుడో ఒకప్పుడు మన మాట వింటుంది”
అనే ఆలోచనతో దగ్గరవ్వడం స్నేహం కాదు, అది ఆమె పరిస్థితిని వాడుకోవాలనే ప్రయత్నం.
ఒక స్త్రీ భర్త లేకుండా జీవిస్తుంటే ఆమెకు ఫీలింగ్స్ ఉండవా?
ఉంటాయి, కానీ ప్రతి ఫీలింగ్‌కు ఒక మనిషి అవసరం లేదు.
ప్రతి ఒంటరితనానికి ఒక సంబంధం అవసరం లేదు.
ప్రతి ఆప్యాయతను ప్రేమగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు...
ఆమెకు కావాల్సింది ఒక అవకాశం కాదు…ఒక అర్థం చేసుకునే మనసు.ఆమెను స్త్రీగా చూసే ముందు ఒక మనిషిగా చూడండి.
ఎందుకంటే…
ఒంటరిగా ఉన్న స్త్రీ మీకు అందుబాటులో ఉన్న స్త్రీ కాదు, ఆమె తన జీవితాన్ని తన బలంతో మోస్తున్న స్త్రీ.
ఆమె బలాన్ని గౌరవించండి…ఆమె ఒంటరితనాన్ని అవకాశంగా చూడకండి.
#GoodMorningEveryone
#womensafetywing
హౌస్ సర్జన్ చేసేటప్పుడు మేము ఏదో ఒక ఏరియా కి వెళ్లి జనాభా సర్వే చేయాలి. ఒక నెలరోజుల సర్వే తర్వాత ఆ ఏరియా జనాభా గణాంకాలను వయసు, లింగం, ఆదాయం మొదలైన వాటిగా విభజించి మూడు నెలల సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ పోస్టింగ్ అనంతరం ప్రొఫెసరు ముందు ప్రెసెంట్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు నా స్నేహితుడు డా గంగిరెడ్డి తన సర్వే వివరాలు చెప్పారు. అవి చూసిన ప్రొఫెసర్ నీ డేటా ఏంటి జాతీయ సగటుకి (నేషనల్ ఏవరేజ్) చాలా దూరంగా ఉంది. నువ్వు నిజంగా ఇంటింటికీ వెళ్లావా లేక కాకిలెక్కలు వేశావా అని ఎగతాళిగా అడిగారు. డా గంగిరెడ్డి అర్జున్ రెడ్డి స్టైల్లో “ చూడండి, మీరు నేషనల్ సర్వే చేయలేదు, అది కూడా ఎవడో ఇచ్చిన శాంపిల్ సర్వే అంటే అది రిప్రెసంటేటివ్ శాంపిల్ కానీ నిజంగా దేశమంతా తిరిగి సంపాదించింది కాదు, నేను నెలరోజులు గోపాలపట్నం లో ఇంటింటికీ తిరిగి సంపాదించిన డేటా ఇది, నా ఇంగితజ్ఞానం ప్రకారం ఎవరైనా నా డేటా నమ్మాలి, మీ గురించి నాకు తెలీదు.” అన్నాడు. అంతే ప్రొఫెసరుకి నోట మాట రాలేదు. ఇప్పుడు డా గంగిరెడ్డి రావులపాలెంలో ఎమర్జెన్సీ ఫిజిషియన్ గా ఆసుపత్రి నెలకొల్పారు.
ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వాలంటే ప్రభుత్వానికి టార్గెట్లు ఇస్తుంది. వీటిలో శిశు మరణాలు తగ్గించాలి, ఇంటివద్ద కాకుండా ఆసుపత్రుల్లో జరిగే కాన్పులు పెరగాలి, పుట్టిన పిల్లల బరువు పెరగాలి, ఎత్తు పెరగాలి ఇలాంటివన్నీ. ప్రభుత్వం మంత్రిత్వ శాఖ మీద ఒత్తిడి తెస్తుంది. మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మీద, రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్టర్ల మీద, కలెక్టర్లు డీఎంహెచ్‌వో మీద, డీఎంహెచ్‌వో మెడికల్ ఆఫీసరు మీద, మెడికల్ ఆఫీసరు ఆశా వర్కర్ మీద. ఇక్కడంతా పైనున్న వాడు చెప్పేది కిందవాడు వినాలి. కిందవాడు చెప్పేది పైవాడు వినడు.
భారతదేశం పైన చెప్పినట్లుగానే అన్ని టార్గెట్లు బాగా అందుకుంది అంటే దానికి ఒకే ఒక్క కారణం ఆశా వర్కర్ల అంకితభావం. పైనున్న వాళ్ళు సంతకాలు చేసి డబ్బులు ఇస్తారు అంతే. పైవాళ్లకి క్షేత్ర స్థాయి పరిశీలన తక్కువ, కానీ అది అది ఆశా వర్కర్లకి తెలుసు.
జాతీయ ఫెర్టిలిటీ రేటు ( సంతాన సాఫల్యత) బాగా పడిపోయింది. నిరుద్యోగం, పిల్లల పెంపకం ఖర్చుతో కూడుకున్నది కావడం, పెళ్లిళ్లు చేసుకోకపోవడం, పిల్లలు ప్రయత్నించినా పుట్టకపోవడం, అలాగే గర్భిణీలు ప్రైవేటు వైద్యుల వద్దకు పోవడం, ఇలాంటివన్నీ యాంటినేటల్ కేసులు ( గర్భిణీలు) ఆశా వర్కర్ల వద్దకి రాకపోవడానికి కారణాలు.
ఇప్పుడున్న ఆశా వర్కర్లకి మిగతా శిక్షణనిచ్చి వేరే ప్రభుత్వ కార్యక్రమాలకి వాడుకోవాలి. ఉదా, గ్రామాల్లో తాగుడు, జూదం (బెట్టింగ్) తగ్గించడం, మానసిక రుగ్మతలను గుర్తుపట్టడం లాంటివి.
మారుతున్న కాలానికి విధానాలు మారాలి. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.
♥️♥️♥️ తల్లితండ్రులను చూసుకునే విధానం ఇది @naralokesh 👏👏👏
మా ఆంధ్రలో ఇంకొకడు ఉన్నాడు
నాన్న ఎంగిలి ప్లేట్ తో కొట్టి
అమ్మని చెల్లి దగ్గరికి తరిమేసాడు🤮🤮😱😱
ఎవడు వాడు చెప్పుకోండి?😉😉
సైకోజెనిసిటీ
రాత్రి 9:30 కి క్లినిక్ అయిపోయాక, ఏదో ఒక స్నేహితుడికి ఫోన్ చేసి ఇంటికి డ్రైవ్ చేస్తూ వెళ్ళటం అలవాటు. అలా పెద్ద ఆసుపత్రిలో పనిచేసే పెద్ద క్యాన్సర్ డాక్టరుకి ఫోన్ చేసా. వాళ్ళ శ్రీమతీ డాక్టరే. ఇద్దరు పిల్లలు వాడికి.
మాటల్లో ఏడో తరగతి చదివే వాళ్ల అబ్బాయి గురించి చెప్పాడు, ఈ మధ్యన సరిగా చదవడం లేదని, నోట్సులు కూడా సగం సగం రాస్తున్నాడని, పరీక్షలు అంటే భయపడుతున్నాడని, అలాగే పరీక్ష రాస్తోంటే తలనొప్పి అని కూడా చెప్తున్నాడని చెప్తున్నాడు. నేను వింటూ ఉన్నాను.
ఈ మధ్యన వాడికి ఆటలు ఎక్కువవుతున్నాయి అని కొందరు ఫ్రెండ్స్ ని కట్ చేశాం. ఇప్పుడు వాడికేమైనా యాంక్సైటీ నా, బద్ధకమా, ఏమైనా కౌన్సెలింగ్ ఇప్పించాలా అని అడిగాడు.
మొత్తం హిస్టరీ అడిగాను. తెలివైన, చురుకైన అబ్బాయి. తల్లిదండ్రులు పెంపకం తెలిసినవాళ్ళు. తమ్ముడి పట్ల ప్రేమ ఉంది. నిద్ర, ఆకలి, పెరుగుదల అంతా బాగుంది. స్నేహాలు బాగున్నాయి. ఈ మధ్య వీడియో గేమ్స్ ఆడేవాడు, అది వాళ్ళు కట్ చేశారు, దానికేం పెద్ద ఏడుపులు, పెడ బొబ్బలు లేవు. అయితే మరి అన్నీ బాగున్న అబ్బాయికి ఒకేసారి ఎందుకు మార్కులు తగ్గుతున్నాయ్ అన్న ప్రశ్న నాకు కలిగింది. నేను అదే చెప్పాను నా నేస్తానికి.
వాడేమో అయితే ఇది సైకియాట్రీ కాదంటావా! అని అడిగాడు. పిల్లాడ్ని చూడకుండా రూలౌట్ చెయ్యలేం అన్నాను. అయితే మరేం చేయమంటావు, ఇంటికెళ్లి వీడియో కాల్ చెయ్యనా అన్నాడు. నా క్లినిక్ ఇప్పుడే అయిపోయింది. నా బుర్ర పనిచెయ్యదు ఇప్పుడు,ఈ ఆదివారం ఖాళీగా ఉంటాను, మీ అబ్బాయి, శ్రీమతి ఇద్దరితో మాట్లాడతాను అని చెప్పాను.
అయితే ఈలోపు ఏం చేయమంటావు? వాడికి రేపట్నుంచి పరీక్షలు, తలనొప్పి రాయను అంటాడు అని అడిగాడు. అలా అయితే ముందుగా మనం ఫిజికల్ కారణాలు రూలౌట్ చెయ్యాలి, ఈ వయసులో పిల్లలకి తలనొప్పికి కారణం రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటాయి, ఒకసారి కంటి డాక్టర్ కి చూపించు ఈలోపు అని చెప్తూ, కొన్ని పేరెంట్ మానేజ్మెంట్ టెక్నిక్స్ చెప్పా. ఓకే అలాగే అని చెప్పాడు. ఈలోపు మా ఇల్లొచ్చింది, ఫోన్ పెట్టేసా నేను.
ఆదివారం ఫోన్ రాలేదు.
ఒక వారం తర్వాత ఫోన్ చేశాడు. ఏంట్రా మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగాను. మా వాడు పిచ్చెక్కిస్తున్నాడు అన్నాడు. మా ఎంబీబీఎస్ చదివే రోజుల్నుంచి ఎవరైనా లెక్చర్ బాగా చెప్పినా, వార్డులో కేసు బాగా ప్రెసెంట్ చేసినా వీడికి “పిచ్చెక్కించాడ్రా” అనడం వాడి ఆనవాయితీ. అలాగే వాడు ఇప్పుడు వాళ్ల అబ్బాయి పరీక్షలు బాగా రాస్తున్నాడని అంటున్నాడా, లేక నిజంగానే తల్లిదండ్రులకి పిచ్చెక్కిస్తున్నాడా అన్న అనుమానం కలిగింది నాకు, ఎందుకో మొదటిదే అనిపించింది.
ఏమైంది అని అడిగాను. కళ్ళ డాక్టరుకి చూపించాను, ఆస్టిగ్మాటిజం (కంటి లోని నల్ల గుడ్డు వంపు తిరిగి కాంతి కిరణాలు రెటీనా మీద అలికినట్లు పడతాయి, దానివలన అక్షరాలు తేలుతున్నట్లు కనిపిస్తాయి) ఉంది రెండు కళ్ళకినీ. అందుకే సరిగా కనపడక స్ట్రైన్ అయ్యి తలనొప్పి వస్తోంది వాడికి అన్నాడు. ఇప్పుడు కళ్లద్దాలు వేయించాం తలనొప్పి లేదు ఏం లేదు పరీక్షలు పిచ్చెక్కించాడు అన్నాడు మళ్లీ.
ఓహ్ అయితే మొత్తానికి సమస్య సాల్వ్ అయిందన్నమాట. అయినా ఉంటే గింటే మయోపియా (హ్రస్వదృష్టి) రావాలి కదా, ఇది ఎలా వచ్చింది అని అడిగాను. వాడు “నేను కూడా అదే ప్రశ్న కంటి డాక్టర్ ని అడిగాను, అతను మీ అబ్బాయికి ఎలర్జీ ఉందా అని అడిగాడు, అవును ఉంది అన్నాను. అందుకే కళ్లు బాగా నిలుపుకోవడం వలన కార్నియా షేప్ మారిపోయింది, అందువలన ఆస్టిగ్మాటిజం వచ్చింది అన్నాడు, దానికి నేను ఇలా కూడా వస్తుందా అని అడిగాను, అప్పుడు అవును ఏం మీరు చదివేటప్పుడు చదువుకోలేదా! అని మళ్లీ నన్నే అడిగాడు. మనకంటే క్యాటరాక్టుల గురించి చెప్తారు కానీ కళ్ళు నులుముకుంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్ వస్తుందని ఎవడు చెప్పడు!?” అన్నాడు నవ్వుతూ.
ఓహ్ అదా విషయం అన్నాను. వాడు మొత్తానికి భలేగా కనిపెట్టావురా కళ్ళని చెక్ చెయ్యాలని, అసలు నీకు ఆ ఆలోచన ఎలా కలిగింది అని అడిగాడు. దానికి నేను ఇలా బదులిచ్చాను, మానసిక లక్షణాలకి ఎక్కడో ఒకచోట ఏదో ఒక కారణం ఉంటుంది అది పేషెంటుకి తెలిసినా తెలియకపోయినా, దీనినే సైకోజెనిసిటీ అంటారు. మీ వాడి విషయంలో నాకు అది కొట్టొచ్చినట్లు ఏమీ కనిపించలేదు, అలాగే చాలామంది పిల్లలు నాకు సరిగ్గా కనిపించటం లేదు అని చెప్పరు, భయం, సిగ్గువలన కావచ్చు. ఎక్కువమంది పిల్లల్లో రొటీన్ గా చెక్ చేస్తే ఇలాంటివి బయటపడతాయి. ఆ విధంగా చెప్పాను అన్నాను.
మొత్తానికి బుర్ర వాడావు అయితే అని కితాబిచ్చాడు.