గణతంత్రం లేని స్వాతంత్ర్యమా..!
🔹🔸🔹🔸🔹🔸
గణతంత్రం లేని స్వాతంత్ర్యమా..! భారత రాజ్యాంగం ఎప్పుడు సంపూర్ణంగా అమలు అవుతుందో..అప్పడు మాత్రమే భారత ప్రజలకు నిజమైన,అసలైన స్వాతంత్ర్యం లభిస్తుంది.భారత రాజ్యాంగమే కొలమానం మీటర్... దీన్ని తీసుకొని వీరి పాల (న) లో నీళ్ళు ఎన్ని కలిసాయో క్లియర్ గా చూడవచ్చు. ఈ మీటర్ తో దొంగల్ని క్షణం లో పట్టు కోవచ్చు.
#IndependenceDay
#Constitution
మార్చ్ 31 న జరిగే BC,SC,ST- JAC సభకు ఆహ్వానం
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
"మన హక్కుల కోసం - మన రాజ్యం కోసం" రాజీ లేకుండా పోరాడే వివిధ కుల సంఘాల నాయకులు, BC,SC,ST వేదికల లో పనిచేసే మిత్రులకు, పీడిత ప్రజల కోసం ప్రాణ సమానంగా పనిచేసే సోదరులందరికీ BC,SC,ST - JAC ఆవిర్భావ సభకు ఆహ్వానం పలుకుతున్నాం.
31. 3. 2025,2 pm న సుందరయ్య విజ్ఞాన కేంద్రం పెద్ద హాల్ , హైదరాబాద్ లో.. జరిగే సభకు తప్పక రండి. ఈ తెలంగాణలో ఒక నూతన మార్పులో భాగస్వాములమౌదాం.
"కొండ పైకి బండి ని లాగ గలిగే వారికే ఆహ్వానం."
#BCSCSTJAC
#Telangana
"HCU - కంచ గచ్చిబౌలి భూములను "... రాష్ట్ర ప్రభుత్వం తన వద్ద ఉంచుకున్నా లేదా వాటిని తెగనమ్ముకొన్నా అందులో BC,SC,ST లకు 90% వాటా ఇవ్వాలని BC,SC,ST - JAC డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఆ భూములు ప్రభుత్వం వద్ద ఉంటే అందులో 350 ఎకరాలు BC,SC,ST లకు పంచండి.
ఒకవేళ ఆ భూముల్ని 40, 000 కోట్లకు అమ్ముకుంటే అందులోనూ BC,SC,ST లకు 30,600 కోట్ల పైసల్ని పంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కదా... రాహుల్ గాంధీ కుల గణన సిద్దాంతం. సంపదని అన్ని కులాలకు పంచండి. మేం ఇదే డిమాండ్ చేస్తున్నాం.
"పర్యావరణం - జీవ వైవిధ్యం" కోసం ఆ భూములను ఆ విధంగా నే ఉంచితే అది అభినందనీయం.
#HCUlands
#hcubiodiversity
చాకలి #ఐలమ్మ మనవడి సావు కే దిక్కులేదు గాని ఆడబిడ్డలందరికీ అండగ ఉంటడాట..ఈ సిఎం.
🔸🔹🔸🔹🔸🔹🔹🔹🔹
అందరికీ పోరాట స్ఫూర్తినిచ్చే వీరనారి మణి చాకలి ఐలమ్మ మనవడు,వారసుడు "సర్పంచ్ రామచంద్రం" అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్ లో నవిసి,నవిసి మొన్న సనిపోయిండు. హాస్పిటల్లో ఉన్నప్పుడు గానీ, చనిపోయినప్పుడు..ఎంత చెప్పినా.. ముఖ్యమంత్రి నుండి తన కార్యాలయం నుండి ఎలాంటి స్పందన లేదు. అంతే గాక తన కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఎమ్మెల్యే "యశస్విని రెడ్డి" నుండి కనీసం పలకరించే దిక్కు,మొక్కు కూడా లేకుండా పోయింది. అలాంటిది..ఈ ముఖ్యమంత్రి ఆడ బిడ్డలకు అండగా ఉంటనంటే నమ్మేదెవరు...?
ఈయన రెడ్డి దొరసానులకు మాత్రమే అండగా ఉంటడు. అయినా ఈ ఖర్మ కి మా చెప్పులతో మేమే కొట్టుకోవాల్నేమో..! ఎందుకంటే బీసీ వాదం పేరుతో "తీన్మార్ నయీం" అనే ఒకడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి కి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న యశస్విని రెడ్డి ని (వేల ఎకరాలు, వేల కోట్లు ఉన్న రెడ్డి భూస్వామి బిడ్డ) ఈమె...వీరనారి చాకలి ఐలమ్మ వారసురాలని ప్రచారం చేసి,బ్రోకర్ మాటలు చెప్పి ఆ దొరసాని ని గెలిపించి...మన మీదకు రుద్ది...బీసీ లను బజారుకీడ్చిన్డు. వాని మాటలతో గెలిచిన యశస్విని రెడ్డి..సచ్చిన ఆ చాకలి ఐలమ్మ కుటుంబాన్ని కనీసం ఫోన్లో కూడా పలకరించకుండా అమెరికాలో సల్లగ దాక్కుంది. ఇది మన వర్గాలలో ఉన్న దళారులు చేస్తున్న దళారి పని వల్ల, మన ప్రజలకు ఈ గతి పట్టింది. శత్రువు కన్నా దళారు లే పెను ప్రమాదం.
#ChakaliIlamma
#BCSCST
గజ దొంగ ల #కాంగ్రెస్ కంపెనీ కి
నీతి మంతురాలు వాచ్ మెన్.
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
అదే నండీ..! తెలంగాణ దోపిడీ కాంగ్రెస్ పార్టీ కి నీతి మంతురాలూ ఐన మీనాక్షి నటరాజన్ ఇంచార్చ్. Ex: ఒక పెద్ద గజ దొంగ ఐన భూస్వామి కి వెయ్యి ఎకరాల మామిడి తోట వుంది,దానికి తోట మాలి ఒకళ్ళు వుండే ..ఆ తోట మాలి ఒక్క మామిడి పండు కూడా ముట్టకుండా,కనీసం క్రింద పడిన పండు కూడా తినకుండా ఆ తోట నీ ఒళ్ళంతా.. కళ్ళు చేసుకొని ఆ తోట ని మొత్తం కాపాడేది, కాపు వచ్చి విరగ కాసిన ఆ తోట పండ్లన్నీ ఆ తోట యజమానులు ఐన రాహుల్ పండిట్ కి,రేవంత్ రెడ్డి లకు అందించేది, అదిగో..ఆ బానిసే కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్.ఆమె 100% హనెస్ట్ ఏ మరి కానీ..!
#Congress
#Telangana
కేజ్రీవాల్ లో దాగి ఉన్న ఆధునిక అగ్రవర్ణ వాదానికి వ్యతిరేకులమే కానీ అంబేడ్కర్ ఫోటోని తీసివేయడంలోనే బీజేపీ వాదులకు అణగారిన వర్గాల పట్ల, అంబేడ్కర్, భారత రాజ్యాంగం పట్ల ఉండే దుర్బుద్ధి ఏంటో నిరూపితమైనది..!
#ambedkarvirodhibjp#ambedkar#ConstitutionofIndia#boycottbjp#banBJP
రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ కాదు,పాలమూరు పటేళ్ల రెడ్ల బిడ్డ.
ఆయనేదో పాలమూరు బీసీ,ఎస్సీ,ఎస్టీ ల బిడ్డ లాగ ఎక్స్ పోస్ చేసుకుంటడు. అసలు... పటేళ్ల రెడ్ల దాడి కి తట్టుకోలేక,పాలమూరు పీడితులు..అంతా..తిండి లేక,బట్ట లేక, చేసుకోడానికి భూమి లేక పొట్ట చేత పట్టుకొని దేశ దిమ్మర్లు లా పాలమూరు పేదలు దేశం మొత్తం కట్టడాలు కట్టనీకి పోయి సమిధ లైనారు ..రేవంత్ రెడ్డి అలాంటి పేదల బిడ్డ కాదు, పాలమూరు పటేళ్ల బిడ్డ...రేవంత్ రెడ్డి బంధువులు, ఆయన కులం వాళ్ళు దేశం లో ఏ కట్టడాలు కట్టనీకి పోయి..రక్తమాంసాలు ఒలిచారో చెప్పాలి.. రేవంత్ గారు.. మీరే.. "నేను వందల ఎకరాల పట్టెల్ల బిడ్డని ..మా తాత పటేల్, మా ముత్తాత పటేల్ మా నాన్న పటేల్ " అని బట్టి పట్టి పద్యం పాడితివి కదా..మల్ల పాలమూరు పేదల బిడ్డ ని అంటావెంటీ..! ఎవరు ఏ వర్గమో..ఎప్పుడు ఏ వర్గమో,అయోమయమయం అదే తెలంగాణ రెడ్డి,వెల్మ మాయ.
#Telangana
#BCSCST
#Palamuru
తెలంగాణ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే.. ఖచ్చితంగా అభినందిస్తాం. అదే ప్రభుత్వం ఏదైనా చెడు చేస్తే... గల్లా పట్టి నడి బజార్లో దోషీ గా నిలబెడతాం.
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
జటిలమైన ఎస్సీ వర్గీకరణ సమస్యను... పరిష్కరించే విషయంలో.. ప్రధాన పాత్ర పోషించిన "మంత్రి దామోదర రాజనరసింహ ను" అభినందిస్తున్నాం.
అదే సమయంలో "సమగ్ర కుటుంబ- కుల గణన సర్వే " లో అగ్రకులాల జనాభా ను పెంచుకుని,అణగారిన కులాల జనాభాని తగ్గించి..తప్పుల తడక తో లెక్కలు చూపించిన...తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని నడి బజార్లో దోషీ గా నిలబెడతాం,నిలదీస్తాం.
#CasteCensusinTelangana
#SCClassification
ప్రభుత్వం ప్రకటించిన కుల గణన రిపోర్టు ను కాల్చి బూడిద చేయాలని DSP పిలుపునిస్తుంది.
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
ప్రభుత్వం ప్రకటించిన కుల గణన రిపోర్టు ని కాల్చి బూడిద చేయండి. అగ్రకులాల జనాభా..10% వుంటే దానిని 16% చేయడమేంటి..? 50% పైగా ( BC ముస్లింలు లేకుండనే) వున్న బీసీ జనాభాని 46% గా చూపించడమేంటి..? 21% వుండాల్సిన ఎస్సీ జనాభా..నీ.. కేవలం 17% గా చూపించడమేంటి ..? 12% ఉండాల్సిన ఎస్టీ జనాభా నీ 10% చూపించడం ఏమిటి..? అసలు ఈ జనాభా లెక్కల్లో ఇంత కుట్ర ఏమిటి..? అంటే..దేశం లోనే అగ్రకులాల జనాభా అత్యంత తక్కువ వుంది తెలంగాణా రాష్ట్రం లో.. ఇది తట్టుకోలేని అగ్రకులాలు సతమత మై ఆడుతున్న మహా నాటకమే ఈ కుట్ర, ఈ భయంకరమైన కుట్ర ద్వారా తమ జనాభా ని పెంచుకొని రాజకీయ లాభాన్ని పెంచుకోవడానికి,పరువు నిలబెట్టు కోవడానికి మరియు EWS రిజర్వేషన్లను..పదిలం గా కాపాడుకోవడానికి జరిగే కుట్ర..అందుకే ఈ సర్వే రిపోర్ట్ నీ రద్దు చేసి నూతన సర్వే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాహుల్ గాంధీ నీ "ధర్మ సమాజ్ పార్టీ" డిమాండ్ చేస్తుంది.
త్వరలో.. దీని పై కార్యాచరణ ప్రకటిస్తాం.
#CasteCensusReport
#Telangana
#RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నదీ నిజమే..!
#కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నదీ నిజమే..!
🔹🔸🔹🔸🔹🔸🔹🔹🔸🔹
దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చింది అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టించిన రోజే అన్న మోహన్ భగవత్ మాట 100% నిజం. ఎందుకంటే ఈ "సాంస్కృతిక - రాజకీయ స్వాతంత్ర్యం" లభించింది "అగ్రవర్ణాలకు" కాబట్టి. మరియు ఈ దేశానికి అసలైన స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15,అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నది కూడా 100% నిజమే..! ఎందుకంటే ఈ "రాజకీయ - ఆర్ధిక స్వాతంత్ర్యం" వచ్చిందీ కూడా ఈ అగ్రవర్ణాల కే కాబట్టి.
మరి మన భారత దేశం లో 100 కోట్ల మంది కి..పైగా ఉన్న మన BC,SC,ST ప్రజల కు,పేద,మధ్యతరగతి వారికి స్వాతంత్ర్యం వచ్చింది ఎప్పుడు..? అంటే అది మాత్రం "జనవరి 26 భారత రాజ్యాంగం అమలైన గణతంత్ర దినోత్సవం" రోజునే,అదే మాకు నిజమైన,ఘనమైన స్వాతంత్ర్య దినోత్సవం.అదే మాకు పెద్ద పండుగ.భిన్న జాతుల దేశం కాబట్టి ఎవరి స్వాతంత్ర్యం రోజు వారిదే.
#RepublicDay
#Freedom
లక్ష ఉత్తరాల తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు ముట్టడి.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
జనవరి 26 రిపబ్లిక్ డే రోజు జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంధాన్ని, అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో...
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖలు..!
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
‘ధర్మ సమాజ్ పార్టీ' మరియు 'తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార సాధన -JAC' లు సంయుక్తం గా నమస్కరించి వ్రాయు విజ్ఞప్తి లేఖ
భారతదేశ సమస్తాన్ని... అధిశాసన రూపంలో నడిపించే సుప్రీం పవర్
'భారత రాజ్యాంగం'. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకని భారత గణతంత్ర
దినోత్సవం - భారత రాజ్యాంగ అమలు దినం ఐన.. రిపబ్లిక్ డే రోజు జనవరి 26 న..
1. జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంథాన్ని,
2.దాని రూపశిల్పి డా. అంబేడ్కర్
చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి.
3. ప్రతిరోజూ విద్యా సంస్థలలో విద్యార్థులు చదివే ప్రార్ధనా స్థానంలో... భారత రాజ్యాంగ పీఠిక ను ప్రతిజ్ఞ గా చదివించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా పైన కోరిన విధంగా తగు ఏర్పాట్లు చేయడానికి, ప్రభుత్వ సంస్థలను & ప్రభుత్వేతర సంస్థలను కూడా ఆదేశించాలని తమరికి “డిమాండ్ లేఖ” ని తెలంగాణ లోని లక్ష మంది పౌరులం రాస్తున్నాం. త్వరగా అమలు నిర్ణయయాన్ని.. రేపటిలోగా.. GO ద్వారా తీసుకుంటారనీ...
ఆ అద్భుత దృశ్యాన్ని మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికి చూపిస్తారని ఆశిస్తున్నాం.
అందుకోసమే మూడు రోజులనుండి తెలంగాణ అంతటా.... ఈ లక్ష ఉత్తరాల ఉద్యమం తమరికి రాయడం మొదలు పెట్టాము.
మీ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని దేశమంతటి కీ ఎత్తి చూపిన దృశ్యం నిజమే అయితే.. అదే రాజ్యాంగ అమలు దినం ఐన జనవరి 26 న జండా వద్ద మన తెలంగాణ రాష్ట్ర మంతటా పైన పేర్కొన్న ఆ మూడు డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మీరు దీన్ని అమలు చేయక పోతే.. మీరు భారత రాజ్యాంగ నాటకం,కుల గణన నాటకం మొదలు పెట్టారని..భావించాల్సి వస్తుంది.
#IndianConstituion
#RepublicDay
Through the profound vision enshrined in the Indian Constitution, Babasaheb Ambedkar gave birth to, nurtured, and empowered us all.
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
With the sword of his wisdom, he waged a battle, redistributing wealth held by a few to uplift many, granting us all fundamental human rights, and standing as a motherly figure of compassion and justice.
The "Preamble to the Indian Constitution" authored by him is transformative—capable of changing the world and laying the foundation for a new one.
Thus, the liberation of all oppressed communities lies in following his path, which is the path of the Indian Constitution.
Wishing everyone a Happy Republic Day!
#RepublicDay2025
#IndianConstitution
#BabasahebAmbedkar
#Preamble