Pride of #Dharmavaram …
సాధారణ కుటుంబానికి చెందిన కుమారి దీక్షిత ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
దీక్షిత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, సంస్కృతి సేవా సమితి తరఫున ఆమెకు డిగ్రీ విద్యతో పాటు సివిల్స్ కోచింగ్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను.
ఈ నెల 21న విజయవాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించాను.
సభా ప్రాంగణాన్ని సందర్శించి, స్టేడియం లేఅవుట్, యోగా ప్రదర్శన ప్రాంతాలు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నాను.
కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించాను.
యోగాంధ్ర 2026 కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరాను.
#Yogandhra2026
#InternationalYogaDay
#Vijayawada
#AndhraPradesh
#yoga
విజయవాడలో నూతనంగా నిర్మించిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయం, రాష్ట్ర ఔషధ పరీక్షల ప్రయోగశాల భవనాన్ని శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారితో కలిసి ప్రారంభించాను.
రాష్ట్ర విభజన అనంతరం దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న శాశ్వత డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయం, రాష్ట్ర ఔషధ పరీక్షల ప్రయోగశాల భవనాన్ని ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉంది. డ్రగ్స్ కంట్రోల్ కు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ₹4.37 కోట్లు మాత్రమే వ్యయం చేయగా, మా కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే ₹14.03 కోట్లు మంజూరు చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది.
ఔషధాల నాణ్యత, నియంత్రణలో భాగంగా వార్షిక శాంపిల్ సేకరణను 4,400 నుంచి 4,985కు పెంచాము. నాణ్యత లేని మందుల (NSQ) శాతాన్ని 2.13% నుంచి 1.42%కు తగ్గించగలిగాము. అలాగే తనిఖీలు, నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు 56 మంది సాంకేతిక సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టాము.
ఆహార భద్రత రంగంపై కూడా మా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విశాఖపట్నంలో అత్యాధునిక స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, గుంటూరు, తిరుపతి ఫుడ్ ల్యాబ్‌లను పూర్తి చేసి, కర్నూలు ఫుడ్ ల్యాబ్‌ను నోటిఫై చేశాము. ప్రజారోగ్య పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదు.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి వికసిత భారత్.. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి మరియు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ గారి స్వర్ణాంధ్ర @2047 లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన ఔషధాలు, సురక్షిత ఆహారం ప్రజలకు అందేలా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.
#DrugsControlAdministration
#DrugTestingLaboratory
#HealthyAndhraPradesh
#Swarnandhra2047
#APDevelopment
#DCAAndhraPragati
#GaddeRammohanRao
India in 2004: 760 million people practised open defecation.
India in 2014: After decades of Congress rule, the number was still 706.5 million.
India now: Down to just 6.5 million.
Under the visionary leadership of PM Shri @narendramodi Ji, Swachh Bharat transformed millions of lives, restored dignity and changed India's global image.
What Congress failed to achieve for decades, PM Modi Ji delivered through determination and execution.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ @JPNadda గారి అధ్యక్షతన నిర్వహించిన “TB ముక్త్ భారత్ అభియాన్”, “ప్రజనన, శిశు ఆరోగ్యం (RCH)” కార్యక్రమాల ప్రగతి సమీక్ష సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నాను.
ఈ సందర్భంగా Ni-kshay Bharat App, Kushi Chatbot వినియోగాన్ని 100 శాతం పెంపొందించడం, అర్హులైన వారికి 100 శాతం TB Preventive Treatment (TPT) కవరేజ్ అందించడం, హైరిస్క్ గ్రామాలు, వార్డులు, సున్నిత ప్రాంతాల్లో ఎక్స్-రే స్క్రీనింగ్‌ను విస్తరించడం, ముందస్తు NAAT పరీక్షలను మరింత బలోపేతం చేయడం, Ni-kshay Poshan Yojana ప్రయోజనాలను సకాలంలో అందించడం, Ni-kshay Mitra కార్యక్రమాన్ని విస్తృతం చేయడం వంటి అంశాలపై చర్చించాము.
క్షయవ్యాధి కేసులను వేగంగా గుర్తించడం, మరణాలను తగ్గించడం, కొత్త టిబి కేసులను నివారించడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నాం. అలాగే రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 80,000 మంది క్షయ రోగులను గుర్తిస్తూ, 92-93% చికిత్స విజయ శాతంతో జాతీయ సగటు కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం.
మాతా-శిశు ఆరోగ్య రంగంలో జీరో ప్రివెంటబుల్ మాతృ మరణాలు – జీరో శిశు మరణాలు లక్ష్యంగా చేపడుతున్న చర్యలు, హైరిస్క్ గర్భిణుల పర్యవేక్షణ, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థల అమలుపై కూడా సమీక్ష చేశాము.
#JPNadda
#TBMuktBharat
#RCH
#MaternalHealth
#ChildHealth
#AndhraPradesh
పునాదులు తవ్వితే ఇళ్లు కట్టినట్టు కాదనే విషయం ఊరికో ప్యాలెస్ కట్టిన జగన్ గారికి తెలియదా? ఆ అసమర్థ పాలన కారణంగానే @YSRCParty ని జనం 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా ఇంకా నిస్సిగ్గుగా అబద్ధాలు.. అర్థ సత్యాలు చెబుతున్నారు.
17 మెడికల్ కాలేజీలు తామే కట్టేశామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు.. ఐదేళ్లలో ఏమీ చేసారో ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి?
17 మెడికల్ కాలేజీలు కట్టేశామని చెబుతున్న @ysjagan .. ఐదేళ్ల పాలనలో ఎంత ఖర్చు చేశారు? అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎన్ని? రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత?
మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం చేయాల్సిన ఖర్చు మొత్తం రూ.8480 కోట్లలో జగన్ సర్కారు ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.1,282.31 కోట్లు మాత్రమే.
అదే ఈ ఏడాది కాలంలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన వ్యయం రూ.689.96 కోట్లు. దీనిని బట్టి ఎవరికి చిత్తశుద్ధి ఉందో.. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో ప్రజలు అర్థం చేసుకోగలరు!
జగన్ హయాంలో చేసిన ఖర్చులో కూడా మెజారిటీ వాటా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, నాబార్డు నిధులే. జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు నామమాత్రం. అంతే కాదు చేసిన పనులకు బిల్లులను పెండింగ్ లో పెట్టిన ఘనత కూడా ఆయనదే. కానీ, ఇప్పుడు అవన్నీ ఎవరికీ తెలియవు అన్నట్టుగా మొసలి కన్నీరు కారుస్తున్నారు! గొడ్డలిపోటు, కోడికత్తి తరహాలో కథ అల్లేస్తున్నారు!!
మౌలిక సదుపాయాలు, తీవ్రమైన బోధనా సిబ్బంది కొరత కారణంగా నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులతో సహా ఇతర కాలేజీలకు అనుమతి నిరాకరించిన మాట వాస్తవం కాదా? ఆది మీ చేతకాని తనానికి తార్కాణం కాదా?
పునాదులు.. మొండిగోడలు తప్ప మీరు మిగిల్చింది ఏముంది? ఇప్పుడు మేము నిబద్ధతతో కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు.
చిత్తశుద్ధి ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. లేదా విద్యార్థిలోకానికి మీరు చేసిన అన్యాయానికి బహిరంగ క్షమాపణ చెప్పండి.
ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేని అసమర్థ సీఎం శ్రీ @revanth_anumula,
విశ్వనాయకుడు, ప్రధాని నరేంద్ర మోదీ గారిని గాడ్సే తో పోల్చడం, తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడం కోసమే. తుమ్మితే ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసం పడే తాపత్రయం.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తలలో నిలిచి, ప్రజల దృష్టిని తన వైఫల్యాల నుండి మరల్చడం తెలంగాణ సీఎం కు అలవాటు. పదవీకాలాన్ని పెంచుకోవడం కోసం స్థాయికి మించి విమర్శలు చేయడం పొరపాటు.
బీజేపీ ని అడ్డుకోవడం, నెహ్రూ-ఇందిరా-సోనియా-రాహుల్ కుటుంబం వల్లే కాలేదు.
ఆ కుటుంబం మోచేతి నీళ్లు తాగే రేవంత్ లాంటి పిపీలికం వల్ల ఏమవుతుంది?
@BJP4Telangana
అబద్ధాలను ఆలంబనగా చేసుకుని అధికారంలోకి వచ్చి “హీరో” అనిపించుకున్నారు.
ఐదేళ్ళ పాలనలో కేవలం అరాచకాలకు, అసత్య ప్రచారాలకు పాల్పడి “నీరో” లా వ్యవరించారు.
మీ వ్యవహారం నచ్చక ప్రజలు మిమ్మల్ని దారుణంగా తిరస్కరించి “జీరో” చేశారు.
అయినా ఆత్మవిమర్శ చేసుకోకుండా ‘అప్పుడప్పుడు’ ఏపీ కి వచ్చి మళ్లీ అవే అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మంచి కూటమి ప్రభుత్వానికి ఫేక్ న్యూస్ తో అప్రతిష్ట తేబోయి మీరే అభాసుపాలు అవుతున్నారు.
మీ నైజం తెలిసాక ఒకసారి నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ మళ్లీ నమ్ముతారనుకోవడం మీ భ్రమ. ఈ సారి వారిచ్చే తీర్పు మీ దివాళాకోరు రాజకీయాలకు శాశ్వత సమాధి కడుతుంది. తధ్యం।
#108 #fakenews @ysjagan@YSRCParty
వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్రకు వెళ్ళిందట.
@ysjagan ప్రభుత్వం మందుల సరఫరాదారులకు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు పెట్టి వెళితే కూటమి ప్రభుత్వం చెల్లించింది.
బకాయిలు పెట్టి, మందుల సరఫరాను ఆపి, పేదల ఆరోగ్యంతో ఆడుకున్నది @@YSRCParty ప్రభుత్వం కాదా?
మీరు గతంలో కమిషన్లకు పరిమితమైతే, అప్పులు చెల్లించి, పరిస్థితులను చక్కదిద్ది ఇవాళ మందుల సరఫరా సక్రమంగా చేసి పేదలను ఆదుకుంటున్నది కూటమి ప్రభుత్వం.
ప్రజారోగ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేని కారణంగానే ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత కూడా మీకు బుద్ధి రాలేదు. అసత్య ప్రచారాలు మాని ప్రజలు అలాంటి తీర్పు ఎందుకిచ్చారో ఆత్మ విమర్శ చేసుకుని ఇప్పటికైనా భాద్యతాయుతంగా నడుచుకోండి.
@BJP4Andhra@JaiTDP@JanaSenaParty@PurandeswariBJP@ncbn@PawanKalyan
చిన్న పిల్లలతో ఆడించిన “అమ్మ ఒడి - నాన్న బుడ్డీ నాటకం” బట్టబయలు కావడంతో అభాసుపాలయ్యి పొట్ట ఉబ్బరంతో గ్యాస్ ఎక్కువైనట్లుంది మీ నాయకత్వానికి.
ప్రజాధనాన్ని మింగి అజీర్తి చేస్తే ప్రజలు తొమ్మిది నెలల క్రితం 11 గ్యాస్ మందులు ఇచ్చారు. మర్చిపోయారా?
పేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. ఇటువంటి అసత్య ప్రచారాలను కొనసాగిస్తే 1 కి పడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పదండి!
@BJP4Andhra@JaiTDP@JanaSenaParty
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ఈసారి ఏడుగురు తెలుగువారికి దక్కడం మనందరికీ గర్వకారణం.
తన సినీ ప్రయాణంలో ఇటీవలే 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వరించడం, ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ(పబ్లిక్ ఎఫైర్స్) గారికి పద్మ శ్రీ పురస్కారం లభించడం చాలా సంతోషం కలిగించింది.
వైద్య రంగంలో ఎనలేని సేవలందించిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధినేత డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి గారికి పద్మవిభూషణ్ దక్కడం, మాడుగుల నాగఫణి శర్మ(కళలు), కేఎల్ కృష్ణ(సాహిత్యం–విద్య), వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి(సాహిత్యం–విద్య), మిరియాల అప్పారావు(కళలు)(మరణానంతరం) గార్లకు రావడం తెలుగు వారందరికీ గర్వకారణం. అలాగే పద్మ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు.
#Balayya #NandamuriBalakrishana #PadmaAwardees #PadmaShri #AndhraPradesh #Telugu
ఇవాళ ధర్మవరం పట్టణంలో సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ‘ఉద్యోగ ఉత్సవం’ (Job Mela) లో ఉద్యోగాలు పొందిన నా #ధర్మవరం నియోజక వర్గ యువ మిత్రులు అందరికీ శుభాకాంక్షలు.
99 వివిధ ప్రముఖ కంపెనీలు పాల్గొన్న మేళా లో 5 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఒక్కరోజే 1668 మందికి ఉద్యోగాలు లభించడం ఆనందంగా ఉంది. మరో 1000 మంది రెండో రౌండ్ ఇంటర్వ్యూ కు అర్హత పొందడం సంతోషకరం. నిర్వాహకులకు ధన్యవాదాలు.
తొక్కిసలాట సంఘటన కారణంగా నేను తిరుపతి వెళ్లాల్సి రావడం వల్ల మేళాలో వ్యక్తిగతంగా పాల్గొని యువ మిత్రులను అభినందించలేకపోవడమే వెలితి.
నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగం ఇప్పించడం, అదేవిధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి అవసరమైన ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం. వారి భవిష్యత్తు భద్రత నా బాధ్యత.
నన్ను ఆశీర్వదించిన ధర్మవరం ఆత్మబంధువులకు నేను తీర్చుకునే రుణం.
@Sanskriti_Helps@sanreadsbooks
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి విశాఖ సభ, రోడ్‌షో ఏర్పాట్లను కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, సహచర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాను. సభకు హాజరయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించాము.
#AndhraPradesh #NDAGovt #Visakhapatnam @JaiTDP@BJP4India@BJP4Andhra@JanaSenaParty@PMOIndia@ArogyaAndhra@MoHFW_INDIA