ఈ రోజు ఉదయం వామ పక్షాల నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది - విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటే బలపరుస్తామని.
నాకు అభ్యంతరం లేదని చెప్పాను.
వారి వారి పార్టీల్లో అంతర్గతంగా చర్చించుకుని, సాయంత్రం 8 గంటలకి CPM, CPI, కాంగ్రెస్ పార్టీలనుంచి అంగీకారం వచ్చింది.
రేపు, అంటే 18-10-2026 న మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ వేస్తాను.
12.30 కల్లా వినాయకుని గుడి దగ్గరకు సమర్థకులు అందరినీ చేరుకోమని విజ్ఞప్తి.
నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి, విజయవాడ మేయర్ గా ఎన్నుకొమ్మని విజయవాడ పట్టణ ఓటర్లందరికీ విన్నపం.
ఈ నామినేషన్ పనయ్యాక మరింత వివరంగా…
విజయనగరంలో జనసైనికుల కోసం గురాన అయ్యలు ఒంటరి పోరాటం!
జనసేనకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన గురాన అయ్యలు.
ఎన్ని ప్రలోభాలు ఎదురైనా జనసైనికుల తరఫున నిలబడుతూ, వారి హక్కుల కోసం పోరాడుతున్న అయ్యలు వంటి నాయకులకు పవన్ కళ్యాణ్ గారు తగిన గుర్తింపు ఇవ్వాలనే అభిప్రాయం జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
#JanaSenaParty #GuranaAyyalu #Vizianagaram
🚨 టీవీకే నేత ఇంట్లో రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్!
ఈనాడు కథనం ప్రకారం.. తమిళనాడులోని నాగపట్టినం జిల్లా చింతామణిలో టీవీకే జిల్లా కార్యవర్గ సభ్యుడు భూపాలన్, ఆయన స్నేహితుల ఇళ్లలో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో 135 కిలోల మెథాంఫెటమైన్ (మత్తుపదార్థాలు) స్వాధీనం చేసుకున్నట్లు, భూపాలన్తో పాటు ఆయన స్నేహితుడు సుగన్ను అరెస్టు చేసినట్లు కథనం పేర్కొంది.
#TamilNadu #TVK #TVKVijay
కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో దోషులకు పెరోల్.. తమిళనాడు రాజకీయాల్లో చర్చ!
1998 కోయంబత్తూరు వరుస బాంబు పేలుళ్ల కేసులో 58 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు దోషులకు పెరోల్ మంజూరైనట్లు నివేదికలు వెల్లడించాయి.
మరోవైపు, దోషుల విడుదలపై విజయ్కు ధన్యవాదాలు తెలుపుతున్నారని టీవీకే ఎమ్మెల్యేలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ నిర్ణయంపై పారదర్శకత, లౌకిక పాలన విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
#CoimbatoreBlast #TVK #TamilNadu
🚨 భీమిలిలో జనసేన శ్రేణుల అల్టిమేటం.. 8 వార్డుల్లో నామినేషన్లు!
GVMC పరిధిలోని భీమిలి నియోజకవర్గంలో 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీరమహిళలు నామినేషన్లు దాఖలు చేశారు.
28 వేల క్రియాశీల సభ్యత్వాలతో బలంగా ఉన్న జనసేనకు కూటమిలో కేవలం 1–2 సీట్లే కేటాయిస్తే, గ్లాస్ గుర్తుపై లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి సిద్ధమని పంచకర్ల సందీప్ స్పష్టం చేశారు.
“సేనాని పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం” అని పేర్కొన్నారు.
#JanaSena #Bhimili #GVMCElections #APLocalBodyElections
“నా భార్యతో నీకేం పని?” అంటూ భర్త ఆగ్రహం!
భార్యతో కలిసి ఉన్న వ్యక్తిని గదిలో బంధించిన భర్త.. తమిళనాడులో టీవీకే నేత వ్యవహారం కలకలం రేపింది!
#TVK#TamilNadu
భారత్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు జార్జ్ సోరోస్ భారీ కుట్రకు తెరతీశారంటూ ఆరోపణలు!
అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ భారత్లో ప్రభుత్వ మార్పు కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి.
సామ్ పిట్రోడా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించేందుకు సోరోస్ 10 బిలియన్ డాలర్లు అందిస్తున్నారనే వాదనలు చర్చకు వచ్చాయి.
అయితే, ఈ భారీ నిధుల ఆరోపణకు సంబంధించి విశ్వసనీయ ఆధారాలతో స్వతంత్ర ధృవీకరణ అవసరం.
#GeorgeSoros #Modi
ఒకపక్క రాయలసీమలో జనసేనకు ఒక్క స్థానిక సంస్థ కూడా దక్కలేదని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. అసలు సంబంధం లేని అంశాలపై ప్రెస్మీట్లు పెట్టడం ఎంతవరకు సమంజసం?
గ్రేటర్ రాయలసీమలో ఒక్క కార్పొరేషన్ కూడా సాధించలేకపోయారు. స్థానిక ఎన్నికల్లో కనీసం 10 సీట్లు కూడా సాధించలేని పరిస్థితి. అయినా సరే, ఇతరులు కొట్టుకుంటుంటే మధ్యలోకి వచ్చి ప్రెస్మీట్లు పెట్టడానికి మాత్రం ముందుంటారు!
పార్టీ కేడర్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే వ్యవస్థ లేదా? క్షేత్రస్థాయిలో జనసైనికులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలంటూ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
ముందు పిఠాపురంలో మిత్రపక్షం వ్యవహారశైలిపై స్పందించండి. విశాఖ, విజయనగరంలో జనసేన నాయకుల పట్ల టీడీపీ నేతల తీరుపై మాట్లాడండి. పార్టీ కేడర్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమాధానం చెప్పండి.
రాయలసీమ నుంచి ఖండించడానికి టీడీపీలో నాయకులు లేరా? వరుసగా ప్రెస్మీట్లు పెట్టే ముందు.. మన పార్టీ కార్యకర్తల ఆవేదనకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి.
- జనసైనికులు
🚨 భీమిలిలో జనసేన శ్రేణుల అల్టిమేటం.. 8 వార్డుల్లో నామినేషన్లు!
GVMC పరిధిలోని భీమిలి నియోజకవర్గంలో 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీరమహిళలు నామినేషన్లు దాఖలు చేశారు.
28 వేల క్రియాశీల సభ్యత్వాలతో బలంగా ఉన్న జనసేనకు కూటమిలో కేవలం 1–2 సీట్లే కేటాయిస్తే, గ్లాస్ గుర్తుపై లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి సిద్ధమని పంచకర్ల సందీప్ స్పష్టం చేశారు.
“సేనాని పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం” అని పేర్కొన్నారు.
#JanaSena #Bhimili #GVMCElections #APLocalBodyElections
🚨 నర్సీపట్నంలో జనసేన రెబల్స్ నుంచి కూటమికి షాక్!
జనసేనకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఆ పార్టీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా అద్దేపల్లి సౌజన్య నామినేషన్ దాఖలు చేయగా, మరో 15 మంది జనసేన రెబల్స్ కూడా బరిలోకి దిగారు.
చింతకాయల పద్మావతి నామినేషన్ వేసిన రోజే సౌజన్య కూడా నామినేషన్ వేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
#APLocalPolls #JanaSena #TDP
వార్డుల కేటాయింపుపై జనసేన శ్రేణుల్లో అసంతృప్తి!
జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట 50% వార్డులు.. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 30% వార్డులే జనసేనకు కేటాయించడంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
#JanaSena#TDP#APLocalPolls
🚨 కర్నూలు 42వ వార్డులో జనసేన అభ్యర్థిగా మండ్ల రేణుకా దేవి!
కర్నూలు నగరపాలక సంస్థ 42వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా మండ్ల రేణుకా దేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు నామినేషన్ కార్యక్రమం జరగనున్నట్లు వార్డు పార్టీ ఇన్చార్జి బి. సుధాకర్ వెల్లడించారు.
#JanaSena #Kurnool #APLocalPolls
🚨 విశాఖలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థిగా వసంత!
జీవీఎంసీలో జనసేన తరఫున గళం వినిపించే వసంత.. 40వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా రేపు ఉదయం 9:30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గతంలో విశాఖలో విజయం సాధించిన ఈ జంట.. ఈసారి కూడా బరిలోకి దిగుతున్నారు.
#JanaSena#Vizag#GVMC
🚨 జనసేనలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి.. రెబల్గా బరిలోకి నాని!
పార్టీ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, టీడీపీకి చెందిన వారికే అభ్యర్థిత్వాలు కేటాయించారని నాని ఆరోపించారు. దీంతో జనసేన రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు.
#JanaSena#PawanKalyan #Kavali
🚨 కడపలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత!
గాంధీ నగర్ నామినేషన్ సెంటర్ వద్ద వైసీపీ అభ్యర్థి గుంటి నాగేంద్రపై దాడి చేసి, నామినేషన్ పత్రాలు చించివేసినట్లు టీడీపీ శ్రేణులపై ఆరోపణలు.
#Kadapa#APLocalPolls#YSRCP#TDP
🚨 నెల్లూరులో జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల నామినేషన్!
నెల్లూరు 21వ డివిజన్లో జనసేన కూటమి అభ్యర్థిగా విజయలక్ష్మి గునుకుల శనివారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, మద్దతుదారుల సమక్షంలో ర్యాలీగా వెళ్లి ఎనమలవారిదిన్నెలోని RO కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు.
డివిజన్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని విజయలక్ష్మి తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని పేర్కొన్నారు.
#JanaSena #VijayalakshmiGunukula #Nellore
🚨 సాలూరులో కూటమిలో అసంతృప్తి సెగ.. రాజీనామాలకు సిద్ధమైన 50 మంది జనసేన నేతలు, కార్యకర్తలు!
వైసీపీ నుంచి వచ్చిన వారికి చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ జనసేన శ్రేణుల ఆగ్రహం. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వరా అంటూ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిన్న మంత్రి సంధ్యారాణి ఆవేదన.. నేడు జనసేనలో అసంతృప్తి.. సాలూరులో వరుస పరిణామాలతో కూటమిలో కలకలం!
#Janasena #TDP #Salur #AndhraPradesh
🚨 నర్సీపట్నంలో జనసేన రెబల్స్ నుంచి కూటమికి షాక్!
జనసేనకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఆ పార్టీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా అద్దేపల్లి సౌజన్య నామినేషన్ దాఖలు చేయగా, మరో 15 మంది జనసేన రెబల్స్ కూడా బరిలోకి దిగారు.
చింతకాయల పద్మావతి నామినేషన్ వేసిన రోజే సౌజన్య కూడా నామినేషన్ వేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
#APLocalPolls #JanaSena #TDP