బాహ్య ప్రపంచానికి ఆమె ఒక 'అదృష్టవంతురాలు'. మంచి అత్తామామలు, మాట వినే భర్త, నాలుగేళ్ల పసికొడుకు. రేపు పొద్దునే కొడుకు అక్షరాభ్యాసం కోసం బాసర వెళ్ళడానికి ఇల్లంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైకి అంతా ప్రశాంతంగా, అందంగా కనిపిస్తోంది. కానీ, ఆ నిశ్శబ్దం వెనుక ఒక సుడిగుండం తిరుగుతోందని ఎవరూ గమనించలేదు.
ఆమె లోపల ఒక తీవ్రమైన ఘర్షణ నడుస్తోంది. ఉమ్మడి కుటుంబ పరిస్థితుల నుంచి విడిపోయి, 'వేరు పడాలి' అన్న ఆమె ఆరాటానికి.. చుట్టూ ఉన్న వాస్తవాలకూ మధ్య ఒక అదృశ్య యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఆమె ఒంటరైపోయింది. భర్త "వచ్చే ఏడాది వేరు పడదాం" అని ఓదార్చినా, ఆ 'వచ్చే ఏడాది' అనే కాలయాపన ఆమె మనసులోని ఒత్తిడిని తగ్గించలేకపోయింది. ఆమె ఆవేదనను ఎవరూ సరిగ్గా వినలేదు, విన్నా దాని తీవ్రతను అర్థం చేసుకోలేదు.
చివరకు, ఆ అంతర్మథనం భరించలేక ఆ చిన్నారి తల్లి తనువు ��ాలించింది.
ఇప్పుడు యాభైలలో ఉన్న అత్తామామలు "ముందే వేరు పంపించి ఉంటే పిల్ల బతికేదేమో" అని కన్నీరు మున్నీరవుతున్నారు. కానీ, జరిగిపోయిన కాలం తిరిగి రాదు. ఆ పసివాడికి తల్లి ప్రేమ దొరకదు.
మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం:
ఇది కేవలం ఒక గ్రామానికి చెందిన, లేదా ఒక పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన కథ కాదు. మన సమాజంలో ప్రతి ఇంటా అదృశ్యంగా సాగుతున్న ఒక విషాద రూపం. ఈ ఘటన నుండి సమాజం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే:
• నిశ్శబ్దాన్ని వినడం నేర్చుకోవాలి: "అంతా బాగుంది కదా" అనుకోవడం భ్రమ. మనుషుల మాటల వెనుక ఉన్న నిస్సహాయతను, కళ్లల్లోని నిరాశను గుర్తించడం ముఖ్యం.
• 'సర్దుకుపోవడం' అన్నిటికీ పరిష్కారం కాదు: "సమయమే అన్నిటినీ తేలుస్తుంది", "అంతా సర్దుకుంటుందిలే" అని సమస్యలను వాయిదా వేయడం వల్ల మానసిక ఒత్తిడి నా��ాటికీ పెరిగిపోతుంది.
• బహిరంగ చర్చ - నిర్దిష్ట చర్య: కుటుంబాలలో ఎంత చేదు విషయమైనా సరే, మొహమాటాలు లేకుండా మాట్లాడుకునే వాతావరణం ఉండాలి. సమస్య చిన్నదో పెద్దదో కాదు, దానికి తక్షణ పరిష్కారం వెతకడం ముఖ్యం.
One of the most common signs of arrogance is when you spend most of your time mindlessly consuming entertainment that won’t improve your life whilst simultaneously expecting life to get better. Life gets better once you start treating your time with enough respect, never before.
ఓ గుంపులో మేధావిని కనిపెట్టడం కష్టమేమోగానీ మూర్ఖుడిని గుర్తించడం అత్యంత సులువు.
నిజానికి ఆ అవసరం ఉండదుకూడా, అతను తనంతట తనే బహిర్గతమౌతాడు. అదే అతని ప్రత్యేకత కూడా!!
Under open skies and among forested hills, thousands find shelter in simple tents during Medaram Jathara. These temporary homes carry stories of devotion, sacrifice, and deep faith in Sammakka–Saralamma. Pic Credits: @galaxy_tripmaker
#medaramjathara#tribalfestival
బుద్ధుడిలా బతికేయడం సులభం
బుద్ధుడి భార్యలా బతకగలరా 🙏
జ్ఞానం సంపాదించిన బుద్ధుడు తన భార్య బిడ్డను చూడడానికి వచ్చాడు
భార్య ఇలా ప్రశ్నించింది
నన్ను వదిలి వెళ్లారు పరవాలేదు కానీ నాతో ఒక్క మాట చెప్పి వెళ్ళుండొచ్చు. నేను ��ీ ఆలోచనకు అడ్డు చెప్పి ఉండను కదా కానీ మీరు నన్ను నమ్మలేదు అన్నదే ఎక్కువ బా�� కలిగించింది. ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టారని అడిగింది
బుద్దుడు తన భార్య దగ్గర క్షమాపణ కోరి నేను చెప్పకుండా వెళ్ళింది నీకు భయపడి కాదు నాకు భయపడి.నిన్ను బిడ్డను చూస్తే ఎక్కడ నా మనసు మారిపోతుందో అని చెప్పాడు
భార్య మళ్ళీ ఒక ప్రశ్న అడిగింది ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లకుండా ఇక్కడే మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించ ఉండలేరా అని
నిజమే నేను కొండలు అడవులు ఆశ్రమాలు వెతుక్కుని వెళ్లాల్సిన పని లే���ు కానీ ఇక్కడ నుండి వెళ్లేప్పుడు నాకు అది అర్థం కాలేదు అన్నాడు
అందరూ బుద్ధుడి గురించే మాట్లాడుతారు కానీ ఆయన భార్య యశోధర గురించి ఆలోచించరు
బుద్ధుడు వెళ్ళినట్టే తన భార్య అర్దరాత్రి గడప దాటి ఉంటే ఈ లోకం ఆమెను మంచిది అని చెప్పేదా??
లేచిపోయింది అని చెప్పి ఉండేవాళ్ళు,ఇప్పుడు కూడా అక్కడ వారు అనని మాటలు లేవు
పెద్ద వయసేమి కాలేదు అందంగా ఉంది ఇంత రాజ్యము ఆవిడ సొంతమే తనకు నచ్చినట్ట�� ఉండొచ్చులే అని నిందలేసింది
పసి పిల్లాడు నాన్న కోసం అడుగుతుంటే అర్థం కానీ అతనికి ఏమని చెప్పి సముదాయించిందో ఎంత పోరాడిందో
ఇవన్నీ వదిలేసి ఎటువంటి సమస్య లేకుండా సన్యాసం పుచ్చుకున్నాడు బుద్ధుడు
అన్నీ ఉన్నా సన్యాసిలానే బతికింది యశోధర
ఏది కఠినం ఏది కష్టం
ఎవరు సన్యాసం పుచ్చుకున్నది చెప్పండి..🙏
సేకరణ:-Budda's Book
Many successful, talented, and humble people are being portrayed as arrogant because, in the eyes of insecure individuals, self-confidence and arrogance look identical.
True humility has little to do with how you speak or how the media depicts you, and everything to do with the "invisible" efforts you make in private, when no one is watching.
Peace of mind is simple once you realize that you are free to do your own thing because no one has time to think about you. Most of the “social pressure” and anxiety that people feel are an invention of their own mind.
గ్రామదేవతా నామ విశేషాలు
మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది
👉వూరిని వ��డిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి #పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.
👉'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
👉ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, #పోచమ్మ పోషణ కలిగిస్తుంది.
👉ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో #కట్టమైసమ్మ అయింది.
👉స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ��ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి #అచ్చమ్మగా అయ్యింది.
👉సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది #మావుళ్ళమ్మ' అయింది.
👉ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి #తలుపులమ్మ తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే ��ల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.
👉శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ, #అంకాళమ్మ గా మారిపోయింది.
👉పొలిమేరలో వుండే మరొక తల్లి #శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.
👉పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి #పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే '#నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి #పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=#సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది.
👉బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి #బతుకమ్మ
👉గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= #సత్తెమ్మ
👉అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ #పుల్లమ్మ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించ��� చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
👉ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా #అప్పలమ్మ అయినది.
#బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు.
👉అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+��మ్మ= #పెంటమ్మ
👉భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి విక���రుతి)+అమ్మ= #బోనాలమ్మ
అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను '#అయ్యమ్మ ' అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు.
👉లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= #గుర్రాలమ్మ అయినది.
👉ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. ఉదా:- సోమప్రోలు+అంబ='సోమపోలమాంబ' అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట అని ఇప్పుడు వాడుకలో పిలవబడుతుంది. అలా చాలా గ్రామాల పేర్లు గ్రామ దేవతల పేరుతోనే పిలుస్తున్నారు.
🌹🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
🌹🙏 శ్రీ లక్ష్మి దేవ్యై నమః 🙏🌹
🌹🙏 ఓం శ్రీ సరస్వత్యై నమః 🙏🌹
Copied