లోక్ సభ పక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు నిన్న పేల్చింది హైవోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్. తీగ లాగుతుంటే డొంక కదిలినట్లు..దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ తీగ బయటకు లాగుతున్నారు. హర్యానాలో రెండు కోట్ల ఓట్లు ఉంటే.. 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఎనిమిది మందికి ఒక దొంగ ఓటు చేర్చారు. లక్షా 18 వేల ఓట్ల తేడాతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 25 లక్షల దొంగ ఓట్లు చేర్చారు కాబట్టే బీజేపీ అధికారంలోకి వచ్చింది.. అంటే దొంగ ఓట్లు లేకుంటే బీజేపీకి అధికారం రాలేదు. దీనిని బట్టి హర్యానాలో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారని తేలింది. సర్వేలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇచ్చాయి. అయినా కానీ బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధి బయట పెట్టారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్గా పని చేస్తోంది. బీజేపీ అన్ని వ్యవస్థలను ఇప్పటికే భ్రష్టు పట్టించింది. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా భ్రష్టు పట్టేలా చేసింది. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడటం కాంగ్రెస్ నినాదం. అనేక రాష్ట్రాల్లో దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దొంగ ఓట్లపై నిజాలు బయట పెడుతుంటే ECI నుంచి సమాధానం లేదు. ఓటర్ లిస్ట్ బయట పెట్టడం లేదు. CCTV ఫుటేజ్ ఇవ్వాలి అంటే వాటిని ధ్వంసం చేశారు. డిజిటల్ డేటా ఎందుకు ఇవ్వడం లేదు ? దొంగ ఓట్లకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ మొదలు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ నుంచి 17.65 లక్షల సంతకాలు సేకరణ చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ నుంచి 17.65లక్షల మందికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్రజల కోసం ఏ ఉద్యమానికైనా సిద్ధం
@INC_Andhra@INCIndia@RahulGandhi@manickamtagore
ప్రదాని నరేంద్ర మోదీ గారు ఓట్ల దొంగ. ఈ దేశ ప్రజల హక్కులను కాపాడే ECI.. మోదీ గారి చేతిలో కీలుబొమ్మ. అవసరం అయ్యే చోట దొంగ ఓట్లు.. లేని చోట ఓట్ల తొలగింపు ఇదే ఎన్నికల సంఘం పని . బీజేపీ కోసమే ఎన్నికల సంఘం పనిచేస్తోంది. ఓట్ చోర్- గద్దె చోడ్ నినాదంతో రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చిన సంతకాల సేకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా సాగింది. 26 జిలాల్లో 175 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు ఓట్ల చోరీపై అన్ని వివరాలను సవివరంగా వివరించారు. దొంగ ఓట్లతో మోదీ గారు గద్దెనెక్కింది నిజమే అని నమ్మి 17.65 లక్షల మంది ప్రజలు సంతకాలు చేశారు. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ వద్ద సంతకాలతో కూడిన ట్రక్కును జెండా ఊపి ప్రారంభించి, ప్రజల నుంచి సేకరించిన సంతకాలను ట్రక్కులో ఢిల్లీకి పంపించడం జరిగింది.
#votechorgaddichhod
@INC_Andhra@INCIndia@manickamtagore
నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. పెట్టకముందే YCP ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే..? ఇది భయమా ? బెదురా ? వాళ్ళకే తెలియాలి.
రాజారెడ్డి అని నా కొడుకుకి స్వయంగా YSR గారు నామకరణం చేశారు. నాకొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా కొడుకుని చంద్రబాబు చెప్పాడని తీసుకువస్తే..మరి ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో RSS వాదికి మద్దతు ఇచ్చారు? YCP అద్యక్షుడు జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా BJP అభ్యర్థికి జగన్ గారు మద్దతు ఇవ్వడం అవమానకరం.
టీడీపీ, జనసేన బహిరంగ పొత్తు. జగన్ గారిది తెరవెనుక పొత్తు. జగన్ గారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో BRS పార్టీ ఎవరికి ఓటు వేయకుండా మౌనంగా ఉన్నారు. YCPకి @YSRCParty ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు. YSR వారసుడు అయి ఉండి బీజేపీకి ఓటు వేయడం సిగ్గుచేటు. YSR తన జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారు. YSR బతికి ఉంటే జగన్ గారు చేసిన పనికి అవమానంతో, సిగ్గుతో తలదించుకునే వారు. చరిత్రలో YSR ఛాతీలో కత్తితో పొడిచిన వాడుగా జగన్ గారు మిగిలిపోతారు. మీకు దమ్ముంటే బీజేపీ తోక పార్టీ అని ఒప్పుకోండి. చెయ్యెత్తితే కనిపించేలా బీజేపీ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోండి.
YCP @YSRCParty ముసుగు మళ్ళీ తొలగింది. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడింది. బీజేపీకి @BJP4India బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగింది. మోడీ @narendramodi గారికి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ గారి పక్షమేనని తేటతెల్లమైంది. బీజేపీ కోసమే పనిచేసే పక్షమేనని రుజువైంది. అందుకే BJP అంటే "బాబు @ncbn - జగన్ @ysjagan - పవన్ @PawanKalyan ". ముగ్గురు మోడీ గారి తొత్తులే. బీజేపీకి ఊడిగం చేసే బానిసలే. టీడీపీ, జనసేన పార్టీలది తెరమీద పొత్తు.YCPది తెరవెనుక అక్రమ పొత్తు. YCP తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ. ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి YCPకి సిగ్గుండాలి. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అన్నారు. 5 ఏళ్లు దోచుకుతిన్నది దాచుకోడానికి బీజేపీకి జై కొట్టారు. ఈ దేశంలో ఓట్ చోరితో రాజ్యాంగం ఖూనీ అయ్యేది YCPకి కనిపించదు. మోడీ గారు ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి YCP నోరు పెకలదు. మణిపూర్, గోద్రా అల్లర్లలో RSS చేస్తున్న రక్తపాతం మీద మౌనం వహిస్తారు. మోడీ గారి అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ @RahulGandhi గారి గురించి మాత్రం ఉవ్వెత్తున లేస్తారు. మోడీ గారికి ఆపద వచ్చిందని అండగా నిలబడతారు. ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన RSS వాదికి మద్దతు ఇస్తారా ? ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటి ? దీనిపై రాష్ట్ర ప్రజలకు YCP సమాధానం చెప్పాలి.
@INCIndia@INC_Andhra@manickamtagore
INDIA కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గారి పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణం. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టీ న్యాయ నిపుణుడికి INDIA కూటమి అవకాశం ఇవ్వడం హర్షణీయం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్న ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి గారి లాంటి న్యాయరంగ నిపుణులు ఉప రాష్ట్రపతి పదవిలో ఉంటేనే రాజ్యాంగం పరిరక్షించ బడుతుందని INDIA కూటమి బలంగా నమ్ముతుంది.
INDIA కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన తెలుగు వారికి దక్కిన గౌరవం. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ఏకం కావాల్సిన సందర్భం ఇది. తెలుగు బిడ్డకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే సమయం ఇది. సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్. సుదర్శన్ రెడ్డి గారిని తెలుగు బిడ్డగా పరిగనణలోకి తీసుకుని,న్యాయరంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తు చేసుకుంటూ, రాజకీయాలు ఆపాదించకుండా @JaiTDP TDP, జనసేన @JanaSenaParty ,YCP @YSRCParty , BRS @BRSparty పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. ఇందుకు చంద్రబాబు నాయుడు గారు@ncbn , జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan , పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan ,KCR గారు @KCRBRSPresident సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
@INC_Andhra@INCIndia@RahulGandhi@kharge@priyankagandhi@kcvenugopalmp
ప్రధాని హోదాలో ఈ 11ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేని అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు...,
ప్రెస్ కాన్ఫరెన్స్ లో 200మంది మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ధీటుగా సమధానం ఇచ్చిన రాహుల్ గాంధీ ఒకవైపు
#ChooseYourLeader