లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS స్పందన
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన గౌరవం, విజయం మరేది లేదని గుర్తు చేశారు. గతంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆర్ఎస్ పుంజుకున్న సందర్భాలెన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ సాధించటంతో పాటు ఒక ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీ 2014 లో 63 సీట్లు, 2018 లో 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రస్తుత శాసనసభలోనూ మూడో వంతు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కొనసాగుతుందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ స్వల్ప తేడాతోనే ఓటమి పాలైందని గుర్తు చేశారు.
ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నిరాశ కలిగించినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారు. వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమే. గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దని మా పార్టీ అధినేత కేసీఆర్ గారు ఎప్పుడు చెబుతుంటారు. బీఆర్ఎస్ అదే సిద్ధాంతాన్ని పాటిస్తుంది. ఇప్పుడు వచ్చిన ఫలితాలు కచ్చితంగా మమ్మల్ని నిరాశ పరిచాయి. ఐతే ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోయేది లేదు. ఎప్పటి లాగే ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వారి బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటామన్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామన్నారు. తెలంగాణ ప్రజల గొంతుక బీఆర్ఎస్ అని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై తెలంగాణ ప్రయోజనాల కోసం అటు కేంద్రంతోనూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. రానున్న రోజుల్లో మరింతగా కష్టపడి మళ్లీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని, ఫినిక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటామని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతుబంధు ఖతం
రైతుబంధు భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒకరికే ఇస్తాం.
రైతుబంధు అనేది భూమి యజమానికి ఇస్తే కౌలు రైతుకు రాదు.. కౌలు రైతుకు ఇస్తే భూమి యజమానికి రాదు - రేవంత్ రెడ్డి
#SayNoToScamgress
ఇరికింట్లో ఉండేటోళ్లని డబల్ బెడ్ రూమ్ 🏨 ఇల్లుకట్టించి ఇచ్చి మార్పు తీసుకొచ్చిండు మా కేసీఆర్
కేసీఆర్ పాలనలో మేము జబర్దస్త్ ఉన్నాం 😍
కారు గుర్తుకే మన ఓటు 🚘
#KCROnceAgain#VoteForCar
నవవధూవరులను ఆశీర్వదించిన ప్రభాకర్ రెడ్డి గారు
దుబ్బాక నియోజకవర్గం పలు వివాహ శుభకార్యాలకు హాజరైన శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.
#Brsparty#Dubbakamla
గజ్వేల్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం.
మెదక్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన @BRSHarish
ఈరోజు మెదక్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నాడు.
మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తం చేస్తున్నాడు.
ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రంలో అభివృద్ధి గజ్వేల్‌లో మెదక్ జిల్లాలో మాత్రమే జరిగిందని చెప్పి, ఇప్పుడు ఇంకా అభివృద్ధి కాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.
ఇందిరాగాంధీ మెదక్‌కి ఏం చేసింది? మెదక్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది, రైల్వే లైన్ తెచ్చింది కేసీఆర్.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. మూడు యూనివర్సిటీలు తెచ్చిండు.
మెదక్‌లో ఏం అభివృద్ధి జరిగిందో కళ్లు పెద్దవి చేసి చూడు రేవంత్. లేకపోతే నువ్వొస్తే నేను చూపిస్తా.
మెదక్, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్న నువ్వు ఈరోజు మా జిల్లా గురించి మాట్లాడుతావా?
సింగూరు జలాలు మెదక్ జిల్లాను తాకాయంటే అది కేసీఆర్ చలవే. ఉమ్మడి పాలనలో మెదక్ సింగూరు నీళ్లు తరలించుకుపోలేదా?
రాజకీయాల్లో విలువలు ఉండాలి. ముఖ్యమంత్రి పదవిపై గౌరవంతో నీ ఎత్తు గురించి మాట్లాడడం లేదు.
కానీ నీకు నీ భాషలోనే మాట్లాడితనే అర్థం అవుతుంది.
మాటిమాటికి దూలమోలే పెరిగావ్ అంటున్నావ్. భూమికి జానెడు ఉన్న నీకు ఆవగింజంత మెదడు కూడా దేవుడు ఇవ్వలేదు అని నేననాలా?
సీఎం పదవిలో ఉండి సిగ్గులేని మాటలు
పాత రాతియుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూడు రేవంత్ కేసీఆర్ మెదక్‌కు చేసిన అభివృద్ధి కనపడుతుంది.
మెదక్‌ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రైలు సౌకర్యం కల్పించాలంటే పెడచెవిన పెట్టారు. సింగూరు జలాలు మెదక్ రైతులకే ఇవ్వాలనే డిమాండ్‌పై ధ్యాస పెట్టలేదు.
ఇవన్నీ చేసింది కేసీఆర్ కాకపోతే మీ అయ్య వచ్చి చేశాడా రేవంత్ రెడ్డి?
ఆరోగ్యం బాగాలేని కేసీఆర్ రైతులను పరామర్శిస్తుంటే రేవంత్ తాపీగా క్రికెట్ చూస్తున్నాడు.
పాలన చేతగాక, నా ప్రశ్నలకు జవాబు చెప్పడం చేతగాక నాపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేస్తున్నాడు.
తెలంగాణ తెచ్చిన ఆ మహానేతపై ఇష్టమొచ్చినట్టు మొరగడాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
మోదీతో రేవంత్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలంతా నమ్ముతున్నారు.
అందుకే మోదీ, కేసీఆర్ ఒక్కటయ్యారని అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాడు.
బెయిల్ మీద ఉన్న ఓటుకు నోటు దొంగ రేవంత్ నీతులు చెబితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ పిట్టలదొరలా మాట్లాడినట్టే ఇపుడూ మాట్లాడి ప్రజలను మభ్యపెట్టొచ్చని అనుకుంటున్నడు.
రేవంత్ మోసాలు ఈ నాలుగున్నర నెలల్లో ప్రజలకు అర్థమయ్యాయి. రేవంత్ ఎన్ని కట్టుకథలు, పిట్టకథలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
బీజేపీకి జోడీ అయినా కేడీ అయినా అది రేవంతే.
అబద్ధాలకు ఆస్కార్ అవార్డు లంటిది ఎవరైనా ఇస్తే అది కచ్చితంగా రేవంత్‌కే వస్తుంది.
కారును ఇనుప సామాను కింద అమ్మడం కాదు, నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడటం ఖాయం.
రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో.. పార్టీ మారడం తప్పు అని అన్నాడు. రేవంత్ మా ఎమ్మెల్యేలకు కండువాలు కప్పితే ఫిరాయింపులపై కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన కఠిన చట్టం హామీని ఉల్లంఘించినట్టే.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన మిగతా హామీలపై కూడా చిత్తశుద్ధి లేదు.
రైతు రుణమాఫీపై ఇప్పటికే అనేక తేదీలు చెప్పిన రేవంత్.. దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నయా నాటకాలు ఆడుతున్నాడు. ఆగస్టు 15 న రుణాల మాఫీ జరుగుతుందని రైతులు విశ్వసించడం లేదు.
కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి మాట తప్పిన రేవంత్‌కి మోసం కొత్త కాదు. మోసం అతని నైజం.
బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంటు ఎన్నికల్లోగానీ ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్సే.
బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్‌కు లేదు.
రాష్ట్రంలో మాదిగలకు తీరని ద్రోహం చేసావ్ అని మీ పార్టీ నాయకుడు మోతుకుపల్లి నిరాహార దీక్ష చేస్తున్నడు.
రేవంత్ చేసే సామాజిక న్యాయం ఏమిటో ప్రజలకు తెలిసిపోయింది. బీసీల, మాదిగల ద్రోహి రేవంత్‌కు ఈ పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెబుతారు.
మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ.
మా ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గురించి రేవంత్ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడు. మెదక్‌లో లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చింది మా వెంకట్రామిరెడ్డి.
నువ్వు ఈరోజు హైదరాబాద్‌కు ఆగమేఘాల మీద నీళ్లు తీసుకొనిపోయావంటే అది మా వెంకట్రామిరెడ్డి చేసిన కృషి వల్లే.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల భూములకు పరిహారం ఇచ్చింది వెంకట్రామిరెడ్డి.
ఇంతకంటే ఉత్తమమైన పునరావాస కాలనీ దేశంలో ఎక్కుడుందో చెప్పాలి? జరిగిన మేలు రేవంత్ రెడ్డికి కనిపిస్తలేదు.
🔷 మన బీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
🔹సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
🔹నల్లమల ప్రాంతంలో పుట్టిన ప్రవీణ్ కుమార్ గారు తన 6 ఏళ్ల పదవి కాలాన్ని వదులుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బహుజనవాదాన్ని భుజాన ఎత్తుకొని ప్రజాసేవలోకి అడుగుపెట్టారు.
🔹తన పదవీ కాలంలో పోలీస్ వ్యవస్థలో ఎన్నో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రవీణ్ కుమార్, ఫ్రెండ్లీ పోలీసింగ్కి ఆద్యులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఐక్యరాజ్యసమితి కోసం ఒకప్పటి యుగోస్లావియాలో కూడా పని చేశారు.
🔹తన సేవలకు గాను రాష్ట్రపతి పురస్కారం, యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్, పోలీస్ గ్యాలంట్రి మెడల్ వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.
🔹తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన గురుకుల విద్యా విప్లవంలో ప్రవీణ్ కుమార్ నిర్వహించిన పాత్ర అమోఘమైనది.
🔹సాంఘిక సంక్షేమ గురుకులాల ద్వారా ఎందరో బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అందుకోవడానికి.. ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో సీట్లు సంపాదించడానికి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడలో రాణించడానికి తన తోడ్పాటును అందించారు.
🔹ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు. సమర్ధత గల నాయకులు పార్లమెంట్లో ఉంటే ఆ పదవికి వన్నె తేవడం ఖాయం.. మన సమస్యల పరిష్కారం తథ్యం.
డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్‌కర్నూల్‌కు బలం
🚗 కారు గుర్తుకే ఓటేద్దాం
✊ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిద్దాం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఎల్వీఎం3-ఎం4 చంద్రయాన్-3 ను @ISRO విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 ప్రయోగంలో మొదటి దశ విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం కీలక మైలురాయిని దాటిందని సీఎం అన్నారు.
#Chandrayaan3 🚀🛰️
Many congratulations to the team at #ISRO for the successful launch LVM3-M4 #Chandrayaan3.
This is a proud moment for Indians furthering the country's strength in space 🇮🇳🚀
LVM3 M4 vehicle successfully launched Chandrayaan-3 into orbit🛰️
Congratulations to the incredible team behind #Chandrayaan3 on this remarkable achievement! 🚀
A proud moment for India 🇮🇳
IT and Industries Minister @KTRBRS attended and spoke at the 2nd edition of the T-Innovation Summit, titled 'Gladiators of Mind,' held at HICC in Hyderabad.
The summit, organized by @THubHyd, is an annual event celebrating and commemorating the inauguration of T-Hub 2.0 and showcasing Hyderabad as the global innovation hub.
On the occasion, Minister KTR, along with Minister @chmallareddyMLA, launched T-Hub's initiative 'Innovate Telangana,' aimed at identifying and accelerating the most promising startups in the State.
The Ministers felicitated prominent speakers at the summit: Louise Leakey, a Kenyan Paleoanthropologist; Anil Seth, a Neuroscientist from the United Kingdom; and Sir Marcus du Sautoy, a Mathematician from the United Kingdom.
#InnovateWithTHub
Paid floral tributes along with Honble Chief Minister Sri KCR sir, to honour the invaluable contribution of Sri #SaiChand garu to the Telangana movement. May his soul find eternal peace.
#RememberingSaiChand💐🙏
హఠాన్మరణం చెందిన ఉద్యమ గాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. గుర్రంగూడలోని ఆయన నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. సాయిచంద్ భౌతికకాయాన్ని చూసి సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
అశ్రు నివాళి
తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని.. నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డ, ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం తీవ్ర బాధాకరం. మనందరికీ తీరని లోటు.
సాయిచంద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.