శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సీఎం వైయస్ జగన్ గారు ఈరోజు పర్యటిస్తున్నారు. వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైయస్ఆర్ రైతు భరోసా కింద 53.53 లక్షల మంది రైతన్నలకి రూ.4,000 చొప్పున రూ.2,204.77 కోట్లని బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జగనన్న జమ చేయబోతున్నారు.
#YSRRythuBharosa
#CMYSJagan
#AndhraPradesh
‘వేదికపై సుద్దులు... తీరంలో ఘోరాలు’ అంటూ 02–11–2023న ఈనాడు దినపత్రికలో ప్రచురించిన కథనంలో రుషికొండ వద్ద టూరిజం శాఖ నిర్మించిన భవనాలు అక్రమమని, నిబంధనలకు విరుద్ధమని ఈనాడు దినపత్రిక తనకు తానుగానే తీర్పు ఇచ్చేసింది. తానే చట్టం, తానే కోర్టు, తానే న్యాయం.. అన్న రీతిలో ఈనాడు దినపత్రిక వ్యవహారశైలి ఉంది.
చట్ట ప్రకారం, నిబంధనలను అనుసరించి ఇన్ని రకాల అనుమతులు తీసుకుని టూరిజం శాఖ భవనాలను నిర్మిస్తే.. అవి అక్రమమంటూ ఈనాడు దినపత్రిక అవాస్తవాలతో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది.
ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం...
– రుషికొండ టూరిజం భవనాల నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి.
– కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ నుంచి సీఆర్‌జెడ్ అనుమతులు ఉన్నాయి.
– ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సులు కూడా ఉన్నాయి.
– నిర్మాణంలో భాగంగా, అనుమతి ఉన్న ప్రాంతంలో చెట్లు తీసివేసేందుకు, అంతకుమించి పెద్దసంఖ్యలో కొత్తగా చెట్లు నాటేందుకు అటవీశాఖ అనుమతి కూడా ఇచ్చింది.
– గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) నుంచి ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ కూడా లభించింది.
– భవనాల డిజైన్లకు జీవీఎంసీ ఆమోదం కూడా తెలిపింది.
– రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీఎఫ్ఈ (కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్) అనుమతి కూడా ఇచ్చింది.
చట్ట ప్రకారం, నిబంధనలను అనుసరించి ఇన్ని రకాల అనుమతులు తీసుకుని టూరిజం శాఖ భవనాలను నిర్మిస్తే.. అవి అక్రమమంటూ ఈనాడు దినపత్రిక అవాస్తవాలతో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది.
– రుషికొండ వద్ద ప్రభుత్వ భూమిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుకోసం ప్రతిపాదించింది కేవలం 3 శాతం మాత్రమే. 61 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతులు ఉంటే, కేవలం 9.88 ఎకరాల్లోనే ఇప్పుడున్న ప్రాజెక్టుకోసం ప్రతిపాదించారు. ఇందులోకూడా భవనాలు కట్టింది కేవలం 1.84 ఎకరాల్లోనే. కానీ ఈనాడు మాత్రం ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పి, దాన్ని నిజం చేయడానికి గోబెల్స్ ప్రచారానికి దిగింది.
– రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖ నగరాభివృద్ధి...
ఈ మూడు మాటలు విన్నా, ఆ లక్ష్యాల దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేసినా వెంటనే ఈనాడు దినపత్రిక... ఈ కార్యక్రమాలను అడ్డుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వెంటనే తనపత్రికలో తప్పుడు కథనాన్ని ప్రచురిస్తోంది. ఇష్టంవచ్చిన రాతలతో ప్రభుత్వంమీద బురదజల్లుతోంది.
– ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు, పర్యవేక్షణ జరిపేందుకు గౌరవ ముఖ్యమంత్రిగారికి, అధికారులకు క్యాంపు కార్యాలయాలు సహా వసతి ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రభుత్వానికి తమ సిఫార్సులను నివేదించింది. విశాఖ నగరంలోని అనేక ప్రభుత్వ కార్యాలయాలను, ప్రైవేటు కార్యాలయాలను, ఇతరత్రా భవనాలను పరిశీలించి సిఫార్సులు చేసింది. ముఖ్యమంత్రికి భద్రత, పరిపాలనా అవసరాలు, క్యాంపు కార్యాలయం, వసతి ఒకే ప్రాంగణంలో ఉండడం, సరిపడా పార్కింగు, సమీపంలోనే హెలిపాడ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రుషికొండ వద్ద నిర్మించిన టూరిజం రిసార్టులు సానుకూలంగా ఉన్నాయని కమిటీ తేల్చింది. ముఖ్యమంత్రి రాకపోకల కారణంగా నగరంలో ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయానికి వచ్చామనికూడా తెలిపింది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో కార్యాలయం, నివాసం ఒకే చోట ఉండేందుకు అందుబాటులో తగిన భవనాలు కూడా లేవని తేల్చింది. ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చిందో లేదో... వెంటనే ఈనాడు దినపత్రిక అడ్డగోలు రాతలు తన పత్రికలో ప్రచురించింది. తనకు తానే తీర్పులిచ్చేసింది.
– రుషికొండలో కడుతున్నవి పూర్తిగా ప్రభుత్వం భవనాలు. కానీ, వీటిని ప్రయివేటు భవనాలుగానో, ప్రయివేటు వ్యక్తులకోసం ఉచితంగా నిర్మిస్తున్నారనో తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఈనాడు కథనాలు రాస్తోంది. ఆ ఆస్తులన్నీ ప్రభుత్వానివేనన్న నిజాన్ని దాచేందుకు ఈనాడు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం భవనాలు నిర్మిస్తుంటే ఈనాడు దినపత్రిక తీవ్రస్థాయిలో గగ్గోలు పెడుతోంది. విశాఖ ప్రగతిని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధినీ అడ్డుకునేందుకు తప్పుడు వార్తలు రాస్తోంది.
– ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రాజ్యాంగబద్ధంగా ఆయనకు అన్ని అధికారాలూ ఉన్నాయి. రుషికొండ భవనాల్లో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తే అది తప్పు అన్నట్టుగా, చట్ట విరుద్ధం, అన్యాయం అన్నట్టుగా ఈనాడు దినపత్రిక తప్పుడు రాతలు రాస్తోంది.
– మరోవైపు విశాఖలో భూములను, ఆస్తులను అస్మదీయులకు దోచిపెట్టారంటూ ఈనాడు దినపత్రిక పలుమార్లు నిరాధార ఆరోపణలతో తప్పుడు రాతలు రాసింది.
– టీడీపీకి చెందిన మాజీ లోక్ సభ్యుడు ఎంవీవీఎస్ మూర్తి, బాలకృష్ణ వియ్యంకుడు, తద్వారా చంద్రబాబుకు బంధువు... ఆయన భూ కబ్జాల గురించి ఈనాడు ఏరోజూ ప్రశ్నించలేదు.
– ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో ఉన్న నగరంలోనే విలువైన ప్రాంతంలో ఏకంగా 38.6 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంవీవీఎస్ మూర్తి కబ్జా చేశారు. దానికి సంబంధించి ఫొటో కూడా చూడొచ్చు. వందలకోట్ల విలువైన ఈ భూమి టీడీపీ నాయకులు కబ్జాలో ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపలేదు. ఈనాడు దినపత్రిక ఎప్పుడూ దాని గురించి రాయలేదు.
– ఈ ప్రభుత్వం వచ్చాక కబ్జాలపై గట్టి చర్యలకు దిగింది. మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. కోర్టు స్టే వల్ల మిగిలిన భూముల స్వాధీన ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. కోర్టు ప్రక్రియను త్వరగా ముగించి ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకుంటుంది.
– ఈనాడు దినపత్రిక కథనాలు రాస్తున్న ప్రాంతానికి సరిగ్గా ఎదురుగానే టీడీపీ నాయకులు కబ్జాచేసిన భూములు ఉన్నాయి. ఈనాడుకు మాత్రం ఎప్పుడూ ఇవి కనిపించవు. పైగా ఆక్రమణలు తొలగిస్తే... దాన్ని అభివృద్ధి విధ్వంసంగా ప్రభుత్వంపై ముద్రవేసే ప్రయత్నం చేసింది ఈనాడు దినపత్రిక.
– ఈనాడు పత్రిక పురుడు పోసుకున్నది విశాఖపట్నంలోనే కానీ ఇప్పుడు అదే విశాఖపట్నం మీద కక్షగట్టి మరీ, అక్కడ అభివృద్ధి జరగకుండా ఈనాడు దినపత్రిక అడ్డుకుంటోంది.
రుషికొండమీద 1984లోనే భవనాలు
– రుషికొండను బోడికొండ చేసేశారు, కొండను ఆక్రమించి కట్టేశారంటూ ఈనాడు దినపత్రిక పదేపదే రాతలు రాస్తోంది. రుషికొండవద్ద తొలిసారిగా భవనాలు అనేవి ఈ ప్రభుత్వం హయాంలోనే వచ్చాయి అన్నట్టుగా ఈనాడు దినపత్రిక రాతలు రాస్తూ గత చరిత్రను తుడిచివేసే ప్రయత్నం చేస్తోంది.
– రుషికొండమీద కట్టడాలు అన్నవి 1984లోనే ప్రారంభం అయ్యాయి. 1989 నాటికి క్రమంగా 12 బ్లాకులు నిర్మించారు. తర్వాత కాలంలో అదనపు సదుపాయాలు ఏర్పాటు చేశారు. అవే భనవాలకు మెరుగులుదిద్దారు. అంటే రుషికొండను తొలిచింది, నిర్మాణాలకోసం అక్కడ చెట్లను నరికివేసింది టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వమే. సముద్రతీరంలో వాతావరణ పరిస్థితుల వల్ల సుమారు 4 దశాబ్దాల క్రితం కట్టిన ఈ భవనాలన్నీ దెబ్బతిన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం వాటిని తీసివేసి కొత్తగా రిసార్టులను నిర్మించింది. అప్పుడు రుషికొండను తవ్వి. అక్కడున్న చెట్లను నరికి ఈ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్న ఈనాడు అప్పుడు మాత్రం ప్రశ్నించలేదు. ఒకవేళ అప్పుడు నిబంధనలను పాటించారని అనుకుంటే... అదే ప్రాంతంలో ఇప్పుడు చేస్తున్న నిర్మాణాల్లోనూ ఈ ప్రభుత్వం నిబంధనలన్నీ పాటిస్తోంది.
– రుషికొండమీద 1982–89 మధ్య చేసిన నిర్మాణాలు... కింద ఫొటోలో చూడొచ్చు. విశాఖ నగరంలో దాదాపు కొండలే ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించాయి. నగరంలోని చాలా నిర్మాణాలన్నీ కొండలమీదే ఉన్నాయి.
1. డాల్ఫిన్ హిల్ మీద పెద్ద సంఖ్యలో నేవీ సిబ్బంది క్వార్టర్లు కూడా నిర్మించారు. ఇవి పూర్తిగా కొండమీదే ఉన్నాయి.
2. సర్క్యూట్ హౌస్ అని పిలిచే గవర్నర్ బంగ్లా కూడా కొండమీదే ఉంది.
3. ఐటీ హిల్స్ ప్రాంతాన్ని చూస్తే దాదాపు అన్ని భవనాలు కూడా కొండలమీదే ఉన్నాయి. మిలీనియం టవర్స్ కూడా ఉండేది కొండమీదే.
4. ఇక రుషికొండకు సమీపంలో ఉన్న పెమా వెల్నెస్ సెంటర్ కూడా పూర్తిగా కొండమీదే నిర్మించారు. వీళ్లంతా అనుమతులతోనే వీటిని నిర్మించారు. మరి అవే అనుమతులు, క్లియరెన్సులతో ఈ ప్రభుత్వం రుషికొండవద్ద నిర్మాణాలు చేస్తోంది. ఇందులో నిబంధనల ఉల్లంఘన ప్రస్తావనే లేదు.
5. రామానాయుడు స్టూడియో మొత్తం కొండలమీదే ఉంది.
ఇలా చెప్పుకుంటూ పోతే.. కొండల మీద చాలా ఉన్నాయి. ఈనాడు రాతల ప్రకారమైతే ఇవన్నీ పర్యావరణ ఉల్లంఘనలే. ఒకవేళ కాదనుకుంటే.. అవి ఎలాంటి అనుమతులు తీసుకున్నాయో ఇవాళ ప్రభుత్వం కూడా రుషికొండవద్ద అవే అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతోంది.
– విశాఖనగరంలో కొండల మీదున్న వివిధ నిర్మాణాలకు సంబంధించిన చిత్రాలు కూడా చూడొచ్చు.
– రుషికొండమీద ఇన్ని తప్పుడు కథనాలు రాస్తున్న ఈనాడు దినపత్రిక యజమాని రామోజీరావు నివాసం పూర్తిగా కొండమీదే ఉంది. ఆయన కట్టిన ఫిల్మ్ సిటీ కొండ ప్రాంతంలోనే ఉంది. కొండలపై నిర్మాణాలు, కొండల సమీపంలో నిర్మాణాలు తప్పంటే రామోజీరావు ఇల్లుకూడా తప్పుడు పద్ధతిలో కట్టినట్టే. రామోజీరావు నిర్మాణాలు కూడా పర్యావరణ ఉల్లంఘనలే.
ఈనాడు దినపత్రిక కేవలం విశాఖపట్నం మీదున్న విద్వేషంతో ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది.
ఉచిత ఇసుక విధానం పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి పాల్పడ్డారు. రాష్ట్రంలో ఇసుక రీచ్‌లు అన్నింటినీ చంద్రబాబు తనతోపాటు మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు. తద్వారా వారి దోపిడీకి అంతేలేకుండా పోయింది. తక్కువలో తక్కువ @ncbn & కో కలిసి రూ. 10 వేల కోట్లు కొల్లగొట్టింది.
#CorruptBabuNaidu
#EndOfTDP
విజయనగరం జిల్లాలో కంటకాపల్లి వద్ద రైలు ప్రమాద ఘటనాస్థలానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి.
పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.
వస్తున్నాయ్ వస్తున్నాయ్ వస్తున్నాయ్ అవిగో.. జగన్నాధ రధచక్రాలు వస్తున్నాయ్ అవిగో! 🚎
పేదవాడి పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర నేడు రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యింది. జగనన్న పాలనలో మైనారిటీ, వెనుకబడిన, బడుగు బలహీన వర్గాలకు జరిగిన మంచిని ప్రతి ఒక్కరికి గొంతెత్తి చాటేందుకు ఈ సామాజిక సాధికార యాత్ర సిద్ధమైంది.
🛞🔵⚪️🟢🛞
#SamajikaSadhikaraYatra
#SocialEmpowerment
#CMYSJagan
#YSRCPBusYatra
#YSRCongressParty
#AndhraPradesh
రాజమండ్రి సమీపంలోని దివాన్‌చెరువులో జరిగిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్ సోదరుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్. వరుడు విజయ్ గణేష్ మోహన్, వధువు సుకీర్తిలను ఆశీర్వదించిన సీఎం.
రాష్ట్రంలో సీఎం @ysjagan గారిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఏ రాజకీయ పార్టీ నాయకుడికి లేదు. అందుకే రాబోయే ఎన్నికల కోసం అందరూ ఏకమై వస్తున్నారు. కానీ ప్రజలనే నమ్ముకున్న జగనన్న మాత్రం మళ్లీ ఒంటరిగానే రాబోతున్నారు.
- డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
#SamajikaSadhikaraYatra
#SocialEmpowerment
#CMYSJagan
#YSRCPBusYatra
#YSRCongressParty
#AndhraPradesh
చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ
నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి
ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారన్న న్యాయమూర్తి
కర్ణాటకలోని చిక్‌బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసింది. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నాం.
మన ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోకూడా మునుపెన్నడూ చూడనిది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది. 53నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనం. చట్టంచేసి నామినేటెడ్ పదవుల్లో 50శాతం ఈ వర్గాలకు ఇస్తూ పట్టంకట్టిన ప్రభుత్వంకూడా మనదే. పెత్తందారీ పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనకడుగు వేయలేదు. రాబోయే రోజుల్లోకూడా పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోంది. ఈరోజు నుంచి @YSRCParty చేపట్టిన “సామాజిక సాధికార యాత్ర’’ ద్వారా వీరంతా ఏకమై మన ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలి. పేదవాడి విజయానికి బాటలు వేయాలి.
#SamajikaSadhikaraYatra
అయ్య బాబోయ్...మరీ ఇంత ముందు చూపా ?
చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ అయితే.. బాబు జైలుకు వెళ్లక ముందు సెప్టెంబర్ 4న చెక్‌ల పై సంతకం చేసి ఉంచారా ?
#EndOfTDP
ఢిల్లీలో ఉండి నువ్వేంది మోత మోగించేది @naralokesh..? మీ నాన్న అరెస్ట్ అవగానే భయంతో పిరికివాడిలా పారిపోయిన నువ్వు అక్కడ దాగుడుమూతలు ఆడుతున్నావు. @ncbn అరెస్ట్‌పై మూడు వారాల నుంచి ప్రజల్లో స్పందన లేదు.. @JaiTDP నాయకుల్లో బాధ లేదు.. కార్యకర్తల్లో ఇంట్రస్ట్ లేదు. ఇప్పుడు ఎవర్ని మేల్కొలపలడానికి చీకట్లో ఈ మోత కార్యక్రమం..? ఇలాంటి చిల్లర కార్యక్రమాలు చేయబట్టే.. 2019లోనే మీ పార్టీని జనాలు ఈడ్చితన్నారు. కానీ.. ఇంకా మీకు బుద్ధి రాలేదు.
#CorruptBabuNaidu
#TDPScams
#LooterLokesh
#SkilledCriminalCBNInJail