మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మీకు ఎందుకు రాలేదు జగనన్న?? ఏదైనా ఒక లావాదేవీ కోసం, లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు ఆయన. అలాంటి వ్యక్తి బిడ్డని నేను. ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ హృదయంలో హృదయంలా పెరిగాను. ఆయన ఆశయాల కోసం ఆ రకంగానే మీకు సహాయపడాలని నేను నిస్వార్థంగా త్యాగం చేశాను. మీ గెలుపు కోసం పని చేశాను.
కడప పార్లమెంట్ పరిధి ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లకు తరలివచ్చిన నా అక్కాచెల్లెమ్మలు, నా అన్నాతమ్ముళ్లకు, అవ్వాతాతలకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు.
కడప పార్లమెంట్ పరిధి ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షో, బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుస్తారు అని జగన్‌కి ఓటు వేస్తే...నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు. చేతిలో చిప్ప పెట్టారు. కడప రాజకీయాలు దేశం అంతా చూస్తుంది. హంతకులకే మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు. అందుకే న్యాయం కోసం ప్రజా కోర్టులో తేల్చుకోవాలని నేను పోటీ చేస్తున్నాను. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలని కోరుతున్నాను. వైఎస్సార్ బిడ్డగా మాట ఇస్తున్నాను. వైఎస్సార్, వివేకం చిన్నాన్నలా పుట్టిన గడ్డకు సేవ చేస్తా. నేను ఇక్కడే ఉంటా.. మీ ఇంట్లో బిడ్డను అవుతా. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మే 13న జరగబోయే పోలింగ్‌లో ఎంపీ బ్యాలెట్ నమూనాలోని "వరుస సంఖ్య 4" మీద "హస్తం" గుర్తు బటన్ నొక్కి నన్ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను.