ఒక నేరాన్ని నేరంలా చూడటం ఎప్పుడు నేర్చుకుంటావ్ @ysjagan?
• ఒక మైనర్‌కు వాహనం ఇవ్వడం తప్పు. లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇచ్చి, దాని ద్వారా ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయేలా ప్రమాదం జరగడం తప్పు.
• ఒక మైనర్ యాక్సిడెంట్ చేస్తే, అతనికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులదే తప్పు అవుతుందనే కనీస జ్ఞానం లేదా?
• ఒక మాజీ ముఖ్యమంత్రిగా, కనీసం చట్టాన్ని గౌరవించాలనే నైతికత నీకు కానీ, నీ మాజీ మంత్రికి కానీ తెలియదా?
• ప్రమాదం అనుకోకుండా జరిగినా, చట్టపరంగా కొడుకుని పోలీసులకు అప్పగించాల్సిన తండ్రి, కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం నేరం కాదా?
• యాక్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉండకుండా, కొడుకుని దాచిపెట్టి, వేరే వ్యక్తిని కేసులో ఇరికించాలని చూసి, న్యాయవ్యవస్థను మోసం చేయాలని చూసిన వ్యక్తి మీ అమాయక నాయకుడా?
• కొడుకు చేసిన తప్పుకు ఇంకొక వ్యక్తికి శిక్ష వేయించాలని చూసిన అప్పలరాజు చేసింది తప్పు కాదా జగన్?
• ఒక తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే బీసీ కుల కార్డు, ఉత్తరాంధ్ర ప్రాంతీయవాదం తీసుకొస్తున్న నువ్వు... చనిపోయిన వ్యక్తి కూడా బీసీ వర్గానికి చెందినవాడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు అని తెలియదా? ఓ... కులం కేవలం మీ నాయకులను కాపాడుకోవడానికి వాడే ఆయుధం కదా?
• ఒక క్రిమినల్‌కు... క్రిమినల్స్ అందరూ అమాయకులు, చిన్నపిల్లలు, తెలిసీ తెలియక తప్పులు చేసిన వారిలాగే కనిపిస్తారు. అందుకే నీకు అవినాష్ రెడ్డి అయినా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా, బోరుగడ్డ అనిల్ అయినా, ప్రశాంత్ రావణ్ అయినా, తమ్మినేని సీతారాం అయినా, ఎమ్మెల్సీ అనంతబాబు అయినా, వల్లభనేని వంశీ అయినా, పిల్లా సాయి అయినా, ఇప్పుడు సీదిరి అప్పలరాజు అయినా అమాయకులే. ఎందుకంటే వీరందరినీ వెనకుండి నడిపించే పెద్ద క్రిమినల్ నువ్వే జగన్....
కక్షసాధింపు కాదు ఇది... మీ నాయకుడు తన కుమారుడు చేసిన తప్పును కప్పిపుచ్చే క్రమంలో చేసిన తప్పులకే అరెస్ట్ చేశారు.
సొంత చిన్నాన్న హత్య కేసులోనే న్యాయం చేయకుండా, క్రిమినల్స్‌కు అండగా నిలిచిన నీకు మాట్లాడే కనీస అర్హత లేదు జగన్.
#YSRCriminalParty
భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని విప్లవకారుడు, బ్రిటీషర్లకు సింహ్వప్నంగా నిలిచి 24 ఏళ్లకే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన యువ విప్లవ వీరుడు చంద్రశేఖర్ అజాద్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు.
#ChandraShekharAzad
భారత స్వాతంత్ర్యోద్యమ మూలకర్తల్లో ఒకరు, దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని జాతీయోద్యమంలో పాల్గొనేలా చేసిన భారతజాతీయోద్యమ పిత శ్రీ బాలగంగాధర తిలక్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు.
#BalaGangadharThilak
తను కష్టపడి సంపాదించినదాని నుండి ప్రజలకు పెడతాడే తప్ప ప్రజల సొమ్ము తినే అవసరం అలవాటు @PawanKalyan గారికి లేదని అందరికీ తెలుసు.
అలాంటి వారిపై వ్యూస్ కోసం జర్నలిస్టులు అని చెప్పుకునేవారు, మనుగడ కోసం పాకులాడే @RaoKavitha లాంటోళ్ళు నిందలు బాధాకరం.
కోడి చెరువు అంశంపై స్పష్టత ఇచ్చినందుకు హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారికి ధన్యవాదాలు.
#JanaSenaTelangana #JSPForTelangana
గ్రామీణ ఉపాధికి హార్టికల్చర్‌తో కొత్త ఊపు !!
శ్రీ @PawanKalyan గారి చొరవతో రెండేళ్లలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల సాగు విస్తరించి, లక్ష మందికి పైగా రైతులకు జీవనోపాధి కల్పిస్తోంది.
‘ఆపరేషన్ చైతన్యం’లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 46 వేల మందికిపైగా గిరిజన రైతులు గంజాయి సాగు నుంచి పండ్ల తోటల సాగుకు మారడం గొప్ప విజయగాథ.
రాయలసీమలోనూ హార్టికల్చర్‌కు భారీ ప్రోత్సాహం అందుతోంది.
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
పంచదార్ల రెవెన్యూ భూముల తవ్వకాల్లో పర్యావరణ ఉల్లంఘనలపై విచారణకు ఆదేశం
•జాతీయ జలవిజ్ఞాన సంస్థ (NIH) శాస్త్రవేత్తలచే పంచధారల పరిశీలన
•సహజ జలధారల సంరక్షణకు చర్యలు
• పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన సంస్థపై పర్యావరణ జరిమానా
•పురాతన ఆలయ పరిరక్షణ మనందరి బాధ్యత
•శ్రీ ఉమా ధర్మలింగేశ్వర ఆలయ సంరక్షణకు పురావస్తు, దేవాదాయ శాఖలు చర్యలు తీసుకోవాలి
•పంచదార్ల కొండ రెవెన్యూ భూముల్లో అక్రమ మైనింగ్ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
•నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచన
•మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్ మెంట్, ఆపరేషన్స్ అనుమతులు తక్షణం రద్దు చేయాలని ఆదేశం
అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండపై రెవెన్యూ భూముల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. పంచదార్ల కొండ తవ్వకాల్లో అక్రమాలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, పీసీబీ అధికారుల ప్రాథమిక నివేదికల్లో మైనింగ్ అనుమతులు పొందిన సంస్థ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్న క్రమంలో... పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్, మట్టి తవ్వకాలకు పాల్పడిన సదరు సంస్థపై నిబంధనల మేరకు జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మైనింగ్ కారణంగా పంచదార్ల కొండ దిగువన ఉన్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయం, సహజ జలధారల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని సంరక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జలధారల రంగు మార్పుపై జాతీయ జలవిజ్ఞాన సంస్థ (NIH) శాస్త్రవేత్తలను ఆహ్వానించి, ఆ జలధార మూలాలను పరిశీలించి, సహజ ప్రవాహ సంరక్షణకు సంబంధించిన శాస్త్రీయ నివేదికలు తీసుకోవాలన్నారు. సహజ జలధారల సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థపై జరిమానాతోపాటు పర్యావరణ పునరుద్ధరణ బాధ్యత కూడా వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే సమయంలో పురాతన ఆలయాలు, ప్రకృతి వనరుల సంరక్షణ బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. పంచదార్ల కొండ వద్ద ఉన్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకు పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ సంయుక్త కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించారు. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పంచదార్ల కొండ పరిసరాలను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచించారు. సదరు మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్ మెంట్, ఆపరేషన్స్ అనుమతులు తక్షణమే రద్దు చేయాలన్నారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
You've given audiences countless memorable moments over the years, @actorvijay sir, and I'm sure #Jananayagan will become another cherished milestone in your remarkable journey. 🤗
From Thalapathy to the Hon'ble Chief Minister of Tamil Nadu, you've truly lived up to the name #JanaNayakudu
Heartfelt best wishes to @TheKVNOfficial garu, #HVinoth brother, and the entire team. May this film become a historic blockbuster and receive all the love it deserves.
The Voice That Awakened a Nation
On this day, we remember and pay our humble tributes to Lokmanya Bal Gangadhar Tilak Ji, one of the foremost architects of India’s freedom movement, whose fearless vision transformed the call for self-rule into a national awakening.
At a time when the dream of freedom seemed distant, he ignited the spirit of courage, self-respect, and patriotism in millions. His immortal declaration, “Swaraj is my birthright, and I shall have it,” became more than a slogan. It became the heartbeat of a nation determined to reclaim its destiny.
A scholar, reformer, journalist, and visionary leader, Lokmanya Tilak Ji believed that an awakened society was the greatest strength of a nation. Through education, public participation, and cultural renaissance, he united people with a common purpose and laid a strong foundation for India’s struggle for independence.
His life reminds us that true leadership inspires people to rise above fear, stand firmly for their convictions, and dedicate themselves to the service of the nation. His ideals continue to guide every generation in building a stronger, self-reliant, and united Bharat.
- @PawanKalyan
#JanaNayagan Review
Instead of judging every scene, why not just enjoy one last time on the big screen? ❤️
#ThalapathyVijay has already proven himself with unforgettable performances in action, emotions, dance, and entertainment. His legacy and records speak for themselves.
He chose this film because he genuinely believed in its story and wanted to present it to his fans in his own style. Whether you like the remake or not, it's a heartfelt farewell from one of Indian cinema's biggest stars.
Thank you for the memories, Thalapathy. ❤️🔥
The Hottest Diva @NargisFakhri is READY to SIZZLE for the First time on Telugu screen
#NenuReady First Single #KonchemKonchem Lyrical Video Tomorrow at 6:30 PM
కోడి చెరువు కబ్జాపై నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా ఆక్రమణలు చెయ్యలేదు, నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయలేదని తెలిపారు.
మీ వ్యూస్ కోసమో, న్యూస్ లో ఉండాలనో నిరాధరంగా పవన్ కళ్యాణ్ గారిపై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. నిజాయితీపరులపై ఇలాంటి ఆరోపణలు మానుకుని ఇకనైనా ఆలోచించి మాట్లాడాలి.
- జనసేన తెలంగాణ ఇన్చార్జ్ శ్రీ @JSPshankargoud గారు.
#JSPTelangana #JanaSenaTelangana
వేగం పుంజుకున్న పల్నాడు–ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’ మెగా తాగు నీటి పథకాల పనులు
•40 శాతానికి పైగా పూర్తయిన ఇన్ టేక్ వెల్స్ – 200 కి.మీ. పైప్‌లైన్ నిర్మాణం పూర్తి
•పనుల్లో మరింత వేగం పెంచాలి
* ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి… తాగు నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదేశం
•పనుల నాణ్యతను క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలిస్తానన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•నిర్ణీత గడువులోపు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో పని చేయాలని సూచన
•జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆర్.డబ్య్లూ.ఎస్. అధికారులతో సమీక్ష
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అధిక ప్రాంతాలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు–ప్రకాశం లాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా పల్నాడు–ప్రకాశం ప్రాంతాల్లో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు నిర్ణీత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు.
బుధవారం పల్నాడు–ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు వివరించారు. రెండు మెగా ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ. 2,500 కోట్లు కాగా, అందులో రూ. 1,290 కోట్ల అంచనా వ్యయంతో ప్రకాశం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో, 593 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఇంటేక్ వెల్ నిర్మాణం పనులు 40 శాతానికి పైగా పూర్తయ్యాయి. 119 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్ పనులు, సంపులు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రకాశం వాటర్ గ్రిడ్ పథకం కింద ఇప్పటి వరకు 53 కిలోమీటర్ల మేర పైపు లైన్ల నిర్మాణం పూర్తి చేసినట్టు వివరించారు.రూ. 1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని 235 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించగా, ఇప్పటికే 152 కిలోమీటర్ల మేర పైపు లైన్ నెట్వర్క్ పూర్తయ్యింది. ఇన్ టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పనులు కూడా పురోగతిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ. 95 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్టు తాగునీటి సరఫరా విభాగం అధికారులు వివరించారు.
అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తాగు నీటి సమస్యతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులుపడుతున్న పల్నాడు, ప్రకాశం ప్రాంతాల ప్రజలకు ఈ ప్రాజెక్టులు జీవనాధారంగా మారనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు చాలా కీలకమైనవి. వీటి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్ణీత గడువులోపు ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి, లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగు నీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలి. గ్రామాల మధ్య పైపు లైన్ల నిర్మాణం, అటవీ అనుమతులు లాంటి సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణ కార్యకలాపాలను సాధ్యమైనంత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలి. భుజం శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతాను. స్వయంగా పనుల నాణ్యతను పరిశీలిస్తా. జల్ జీవన్ మిషన్ పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దు. పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పూర్తయితే ఈ రెండు ప్రాంతాల పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల పరిధిలో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత ఏర్పడుతుంద”న్నారు.