I wish all Indians, whether at home or around the world, a Happy Republic Day, as we recommit ourselves to safeguarding and cherishing the principles enshrined in our Constitution today. #RepublicDay2024
Hearty congratulations to former Vice President of India Sri Venkaiah Naidu Garu and Mega Star Sri Chiranjeevi Garu for being awarded the prestigious Padma Vibhushan for their unparalleled contributions in their respective fields. Both of them have paved the path towards success with hard work, determination and unwavering discipline - becoming an inspiration for many.
@MVenkaiahNaidu@KChiruTweets
దేశ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాల నుంచి, ఆకాంక్షల నుంచి ఊపిరి పోసుకున్న రాజ్యాంగం అమలు ద్వారా మనం సాధించిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పురోగతిని దేశ ప్రజలు ఈ వేళ సగర్వంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇటువంటి శుభవేళ... స్వాతంత్ర్య పోరాట స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదాం.
#RepublicDay2024
మీ భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం మీకు కల్పించిన అవకాశం ఓటు హక్కు. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు మిమ్మల్ని నడిపించేది...మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు. మీ ఓటు తీసేస్తారు..లేదా మార్చేస్తారు. నకిలీ ఓట్లు చేర్చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు మీ ఓటు ఉన్నదీ, లేనిదీ చెక్ చేసుకోండి. ఓటు లేని వారు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోండి. ప్రజాస్వామ్యానికి మీ ఓటే పునాది. కాబట్టి ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకండి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లందరికీ శుభాకాంక్షలు.
#NationalVotersDay
#CheckYourVote
#GetYourVote
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! మకర సంక్రమణం అనేది కేవలం ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదు. మన జీవితంలో కూడా ప్రగతితో కూడిన మార్పు రావాలనే సందేశాన్ని ఈ సంక్రాంతి పండుగ మనకు ఇస్తుంది. మీ యొక్క, మీ బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇది సరైన సమయం.అందుకే 5 ఏళ్ల రాతి యుగానికి ముగింపు పలుకుతూ... స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీకు, మీ కుటుంబ సభ్యులకు మరోసారి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు
#భోగిసంకల్పం
#KeeduTholagaliAPVelagali