పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో తీరుతున్న పులివెందుల నియోజక వర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి
•గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక దృష్టి
•జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ. 280 కోట్ల కేటాయింపులు
•96 శాతం ఓవరాల్ ప్రాజెక్టు పనులు.. 99 శాతం పైప్‌లైన్ నిర్మాణం పూర్తి
•తుది అంకానికి నీటి శుద్ధి ప్లాంట్ పనులు
•పులివెందుల పట్టణం, గ్రామీణం, సింహాద్రిపురం మండలాల్లో 100 శాతం పూర్తయిన పనులు
•లింగాల మండల పరిధిలో 24 ఆవాసాలకు తాగునీటి సరఫరా
జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించి నిర్లక్ష్యం చేసిన పథకాలకు సైతం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి గాడిలో పెట్టి వేగవంతంగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాదాపు రూ. 426 కోట్ల విలువైన 96 శాతం పనులు పూర్తి చేసి నిబద్ధత చాటుకున్నారు.
*గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం*
ఏడు మండలాల పరిధిలో ఐదున్నర లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభమైన పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమృద్ధిగా ఉన్నప్పటికీ పనులను ముందుకు తీసుకువెళ్లే అంశంలో శ్రద్ధ చూపలేదు. చేపట్టిన పనుల్లో కూడా నాణ్యత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జల్ జీవన్ మిషన్ పనుల మీద జరిగిన తొలి సమీక్షలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పథకాలను సైతం ప్రాధాన్య క్రమంలో ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి జల్ జీవన్ మిషన్ గడువు కూడా పూర్తి కావడంతో, కేంద్రం వద్ద ఉన్న మిగులు నిధులు ఖర్చు చేసేందుకు వీలు లేకుండా పోయింది. ఉప ముఖ్యమంత్రివర్యులు, కూటమి నాయకులు చేసిన ప్రయత్నాల ఫలంగా జల్ జీవన్ మిషన్‌ను మరో 4 ఏళ్ల పాటు పొడిగించేందుకు కేంద్రం అంగీకారం తెలపడంతో పులివెందుల మెగా తాగునీటి సరఫరా పథకం తిరిగి ఊపిరి పోసుకుంది.
అప్పటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో దాదాపు రూ. 280 కోట్లు ఒక్క పులివెందుల పథకానికే కేటాయించి వేగంగా పనులు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర పైప్లైన్లు వేయడం మినహా పెద్దగా పనులేమీ పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 96 శాతం పనులు పూర్తి చేశారు. అందులో పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు ఇప్పటికే ఈ పథకం ద్వారా తాగునీరు అందుతోంది. పులివెందుల పట్టణానికి సంబంధించిన పనులు కూడా 100 శాతం పూర్తయ్యాయి. లింగాల మండలం పరిధిలో 27 ఆవాసాలకు గాను 24 ఆవాసాలకు త్వరలో తాగునీరు అందుతోంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలకమైన ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా, 65 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 1,111 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు గాను 1,106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వం తాగు నీరు వంటి ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన నిర్దేశం మేరకు పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పనులను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.
ఒకానొక సమయంలో చిరంజీవి కొత్త సినిమా వస్తే ఆ రోజు మార్కెట్ చాలా సందడి గా ఉండేది..🔥
చిరంజీవి సినిమా కి ఉన్నట్టు ఉన్నారు జనం,
చిరంజీవి లాగా డాన్స్ చేస్తున్నాడు.
చిరంజీవి లాగా ఫైట్ చేస్తున్నాడు.
నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా తరచుగా వినిపించే పదాలు!👍
#HBDMegastarChiranjeevi
యవ్వనం లో చిరంజీవి లా నటించాలి అని కోరిక.
ఒక వయస్సు వచ్చాక చిరంజీవి లాంటి పేరు ప్రతిష్ఠ సంపాదించాలి అని కోరిక.
ఆయన పరిచయం అయ్యాక అన్నయ్య లా ఉండాలి , అందరిని మనవారిగా చుడాలని కోరిక.
వరుస అపజయాలతో ఇక సినిమానే వదిలేద్దాం అనుకున్న నాతో ఆ రోజు ఆయన మాట్లాడిన మాటల తరువాత అర్ధమైంది ...చిరంజీవి ఒకడే , ఇవన్నీ సాధ్యపడేది ఆ చిరంజీవుడికొకటే . ఆ చిరంజీవి లా ఇంకొకరు లేరు..మరొకరు రాబోరు .. భూమి ఒకటే, సూర్యుడొక్కడే, అలానే ఆ చిరంజీవి ఒకడే
నాతో పాటు కొన్ని కోట్ల మందికి పునర్జన్మ ఇచ్చిన నట శిఖరం @KChiruTweets అన్నయ్య ki Happy Birthday ❤️
#hbdmegastarchiranjeevi
2026… తెలుగు సినిమాకు నిజంగానే బ్లాక్‌బస్టర్ సెకండాఫ్!
'పెద్ది'తో మొదలైన జోరు…
'మా ఇంటి బంగారం',
'లెనిన్',
'చెన్నై లవ్ స్టోరీ',
కొరియన్ కనకరాజు
'విశ్వనాథ్ అండ్ సన్స్'…
ఇప్పుడు 'ఇరుముడి'కి వస్తున్న సూపర్ హిట్ టాక్ వరకు దాదాపు ప్రతి వారం థియేటర్లలో సందడి కనిపిస్తోంది.
సినిమా బాగుంటే ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం లేదనేవారికి… ఈ మధ్య ప్రతి వీకెండ్ BookMyShowనే సమాధానం చెబుతోంది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు వస్తాడు… మళ్లీ మళ్లీ వస్తాడు కూడా!
హిట్ల సంఖ్య కంటే పెద్ద విషయం ఏంటంటే… మంచి సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్, హౌస్‌ఫుల్ షోలు, చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకుల ఆదరణ. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు చాలా పాజిటివ్ సిగ్నల్.
మధ్యలో The Odyssey, Spider-Man: Brand New Day లాంటి హాలీవుడ్ సినిమాలు కూడా మూవీ లవర్స్‌కు అదనపు వినోదాన్ని అందించాయి.
ఇక 'Toxic'తో పాటు వరుసగా భారీ, మధ్యతరహా, చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో… ఈ జోరు ఇలాగే కొనసాగితే 2026 తెలుగు సినిమాకు నిజంగానే గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ సంవత్సరంగా నిలిచిపోతుంది.
ఏంటి ఈయన అందర్నీ తొక్కేసాడా?
అంతమందిని ఈయన తొక్కుతుంటే... అందరూ కలిసి ఈయన్ని తొక్కేయలేకపోయారా?
పెద్ద, పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలు నుండి వచ్చారు కదరా.
ఈయన్ని "తొక్కడం" చేతకాలేదు అంటే మీరు చేతకాని "చెక్క"లా?
మీ ఏడుపులే ఆయనకు శ్రీరామ రక్ష.
అదృష్టాన్ని కాకుండా అహర్నిశలు కష్టాన్ని నమ్ముకుని స్వశక్తితో ఎదిగిన మేరుపర్వతం అన్నయ్య చిరంజీవి గారు.
#MegaStarChiranjeevi
డాక్టర్ కావాల్సిన యువతి ప్రియాంకని కారుతో గుద్ది చంపిన ఉన్మాదులని ఎన్ కౌంటర్ చేయొచ్చు కదా .. సమాజం నుంచి సపోర్ట్ కూడా సపోర్ట్ ఉంది .. భూమికి భారం తగ్గుతుంది @naralokesh@ncbn@PawanKalyan
గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచండి
•2026–27 లక్ష్యాలు రెండు నెలల్లో పూర్తి కావాలి
•గత రెండేళ్లలో మడ అడవుల విస్తరణలో దేశంలో ద్వితీయ స్థానం సాధించాం
•ఈ ఏడాది మరింత బాధ్యతగా మడ అడవుల పెంపకం చేపట్టాలి
•తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటులో ప్రజా భాగస్వామ్యం పెరగాలి
•రాష్ట్రవ్యాప్తంగా 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక
•వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు మరో 70 లక్షల మొక్కలు
•గ్రేట్ గ్రీన్ వాల్ పనుల్లో పురోగతిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, కోతల నివారణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం మరింత పెరగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను వాతావరణ అనుకూలతల అనుగుణంగా వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనలో భాగంగా గడచిన రెండేళ్ల కాలంలో సాధించిన పురోగతికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిన అంశాన్ని గుర్తు చేశారు. మడ అడవుల విస్తరణలో దేశంలో రెండో స్థానం సాధించేందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.
సోమవారం మధ్యాహ్నం గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. డివిజన్లవారీగా నిర్దేశించిన లక్ష్యాలు ఎంత వరకు పూర్తి చేశారు? ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? ఈ ఏడాది మడ అడవులు ఎంత విస్తీర్ణంలో నాటనున్నారు? తదితర వివరాలను అంశాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు అదనంగా మరో 70 లక్షల మొక్కలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇవి గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనకు అదనపు బలం కానున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “వాతావరణ మార్పుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న తీర ప్రాంత జిల్లాలకు విపత్తుల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల నుంచి మన తీరాన్ని రక్షించుకోవడంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించనుంది. అందుకే కూటమి ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్‌ను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకువెళ్తోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న 1,053 కి.మీ. తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పున పచ్చదనంతో కూడిన గోడను ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. మొదటి అర్ధభాగంలో వాతావరణ అనుకూలతల ఆధారంగా కొంత మేర మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయ్యింది. ద్వితీయార్థంలో తాటి విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వీటి సేకరణ, నాటే ప్రక్రియను పూర్తి చేయాలి. దాదాపు 5,000 హెక్టార్లలో తాటి వనాల ఏర్పాటును ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నాం. కాలువ గట్లు, చెరువులు, తీర ప్రాంతాల్లో తాటి చెట్లు గాలి నిరోధక వ్యవస్థగా నిలుస్తాయి. తాటివనాలు, సామాజికవనాల ఏర్పాటు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.
*మడ అడవుల విస్తరణలో పురోగతి*
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గడచిన రెండేళ్లలో మడ అడవుల పెంపకంలో చక్కటి పురోగతి సాధించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 740 హెక్టార్లు, 2025-26లో 1,930 హెక్టార్ల మేర మడ అడవుల విస్తరణ చేపట్టాం. తద్వారా మడ ఫారెస్టింగ్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాం.ఈ అద్భుత ఘనత సాధనకు కృషి చేసిన సిబ్బందికి, సహాయ సహకారాలు అందించిన పర్యావరణ నిపుణులకు హృదయపూర్వక అభినందనలు. సాధారణంగా మడ అడవుల స్థాపనకు అక్టోబర్ నుంచి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఏడాది మరింత బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. నవంబర్, డిసెంబర్ మాసాల్లో మిష్టి–II (MISHTI-II) కింద 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. తీర ప్రాంత రక్షణ కవచం అయిన మడ అడవుల ప్రాధాన్యతను గ్రహించి, నిర్ణీత సమయంలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేయాలి.
(1/2)
కొత్త రోడ్లతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజకవర్గం
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ రోడ్లకు మహర్దశ
•రూ. 207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ ప్రణాళిక
•రెండేళ్లలో రూ. 100 కోట్లతో 611 రోడ్ల నిర్మాణం పూర్తి
•పురోగతిలో మరో 70 రోడ్లు.. బ్రిడ్జిల నిర్మాణం..
•బడి, గుడి, ఆసుపత్రులను అనుసంధానిస్తూ రహదారులు
•తీర ప్రాంత మత్స్యకార కాలనీల్లో సీసీ రోడ్ల వెలుగులు
•వరుస తుపాన్లకు కొట్టుకుపోయిన అమరవిల్లి రోడ్డు పునరుద్ధరణ
•8 వేల మంది ప్రయాణ కష్టాలు తీర్చిన కొండెవరం రోడ్డు నిర్మాణం
•పల్లెపండుగ 2.0 ద్వారా పంట చేల మధ్య డొంక రోడ్ల నిర్మాణం
•పలు గ్రామాలకు దశాబ్దాల రహదారి సమస్యలు తీర్చిన ఉపముఖ్యమంత్రివర్యులు
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాటను నిలుపుకొంటూ.. పల్లె నుంచి పట్టణం వరకు రహదారుల నిర్మాణ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తున్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
నియోజకవర్గవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా నిధులు కేవలం రోడ్ల నిర్మాణానికే వెచ్చించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. అందులో ఇప్పటికే రూ. 100 కోట్ల విలువైన 611 రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటి పొడుగు సుమారు 152 కిలోమీటర్లు. మరో 70కి పైగా రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. నిర్ణీత లక్ష్యాల్లో 80 శాతం కొత్త రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి. స్థానిక శాసన సభ్యుని హోదాలో- ప్రజలు అడిగిన ప్రతి రోడ్డునీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారు. పలు రోడ్లు ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తే.. మరికొన్ని రోడ్లు అన్నదాత సౌలభ్యం కోసం, ఇంకొన్ని రోడ్లు మత్స్యకారులకి సౌకర్యం కల్పించేందుకు నిర్మించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో జెట్టీకి వెళ్లే రహదారి బురదమయంగా ఉంటూ మత్స్యకారులు వేటాడిన సరుకు రవాణా చేసేందుకు పడుతున్న ఇబ్బందులు చూసి, అక్కడ గ్రావెల్ రోడ్డు నిర్మించారు.
•13 ఏళ్ల తర్వాత పునరావాస కాలనీలకు సిమెంటు రోడ్లు
అలల కోతకు సముద్ర గర్భంలో కలసిపోయిన ఉప్పాడ తీర ప్రాంతం మాయాపట్నం మత్స్యకారులకు 13 ఏళ్ల క్రితం సుబ్బంపేట సమీపంలో కొత్త మాయాపట్నం కాలనీ పేరిట పునరావాసం కల్పించారు. ఇళ్లు అయితే కట్టించి ఇచ్చారుగానీ, మౌలిక వసతుల కల్పన మరిచారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రూ. 1.52 కోట్లతో కాలనీ మధ్య 1.5 కి.మీ. సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రెయినేజీ నిర్మించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నేడు కాలనీ మొత్తం కొత్త రోడ్లతో వెలుగులీనుతోంది. ఈ కాలనీకి సమీపంలో ఉన్న మరో పునరావాస కాలనీ కొత్తసూరాడపేట. 330 మంది నివసించే ఈ కాలనీకి రూ. 93 లక్షలు వెచ్చించి 1.6 కి.మీ. సిమెంటు రోడ్లు నిర్మించారు. సుబ్బంపేట–కొత్తపల్లి ప్రధాన రహదారికి అనుసంధానించారు.
•తుపాను వచ్చి రోడ్డును తుడిచిపెడితే..
యు.కొత్తపల్లి మండల పరిధిలోని అమరవిల్లి గ్రామం, రామన్నపాలెం బీచ్ రోడ్డు తుపాన్లు, భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో రూ. 88 లక్షల వ్యయంతో ఈ రోడ్డు పునర్నిర్మాణం పూర్తి చేశారు. 2 వేల మందికి ప్రయాణ సౌకర్యం ఏర్పడిన ఈ రోడ్డుతో బషీర్ బీబీ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యం ఏర్పడింది.
అభివృద్ధికి దూరమైన ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి రూ. 79.70 లక్షలతో శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారు. ఎస్ఈజెడ్ పరిధి నుంచి విముక్తి కల్పించి మరీ అభివృద్ధి చేశారు. కొత్తపల్లి గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన శ్మశాన వాటికకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ, అంత్యక్రియలకు వెళ్లే ప్రజల ఇబ్బందులు తొలగిస్తూ, రూ. 26.30 లక్షల వ్యయంతో 411 మీటర్ల సీసీ రోడ్డును ఈ మార్గంలో నిర్మించారు. ఈ రోడ్డు ద్వారా 4 వేల మంది ప్రత్యక్ష ప్రయోజనం పొందుతున్నారు.
యు.కొత్తపల్లి మండల పరిధిలోని కొండెవరం గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న పిఠాపురం, ఉప్పాడ ఆర్ అండ్ బీ రోడ్డు ఏడు సంవత్సరాల క్రితం పూర్తిగా దెబ్బతింది. గత ప్రభుత్వం ఆ రోడ్డు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో సుమారు 8 వేల మంది పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రూ. 1.22 కోట్ల ఉపాధి నిధులతో 3.17 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఈ రోడ్డు విద్యార్థులు, రైతులతో పాటు రోజువారీ వ్యాపారాలు నిర్వహించుకునే వందలాది మంది ప్రయాణ కష్టాలు తీర్చింది.
(1/2)
#Pithapuram #PallePanduga
సాక్షి లో పచ్చి అబద్ధాలు రాస్తున్నారు అని ఆనాడు జగనన్న అన్నారు
ఇప్పుడు జర్నలిస్ట్ సాయి గారు అన్నారు,👏🏻
Sakshi లో తప్పుడు కథనాలు రాశారు
కానీ
.@PawanKalyan గారి గ్రామీణాభివృద్ధి శాఖ super success అయ్యింది 👏🏻🔥
:- Journalist సాయి గారు 🔥
Can’t wait to take my ✈️ looks amazing 🫠♥️📈
The amount of positivity it gives and believability tat this Team of Futuristic People Is Shaping up the State to the Next Level ♥️ @PawanKalyan gaaru @naralokesh Anna @ncbn gaaru @narendramodi ji 🙌🏿✨♥️
More Energy and Positivity 🏆
#JaiHind 🇮🇳
జోగి మేఘన కన్నీటి గాథ! కన్నవారింట్లో రాకుమారిలా పెరిగిన ఒక ఆడబిడ్డ, నూరేళ్ల పంటగా భావించి అడుగుపెట్టిన అత్తవారిల్లు ఒక మానసిక, శారీరక నరకకూపంగా మారుతుందని ఊహించలేకపోయింది. అదనపు కట్నం రాబట్టుకోవడానికి ఒక వైపు వేధింపులు.. మరోవైపు కప్పిపుచ్చిన నిజాలు బయటపడతాయనే భయంతో ప్రాణాలు తీసేందుకు చేసిన కుట్రలు! మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన మేఘన (28) అనుభవించిన దారుణమైన మానసిక నరకం, ఆమె పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. క్యాన్సిల్ అయిన సంబంధాన్ని ఒప్పించి!
ఒక మ్యారేజ్ బ్యూరో ద్వారా 2025 ఏప్రిల్ 15న ఈ పెళ్లి ప్రతిపాదన వచ్చింది. జోగి రాజీవ్, అతని తల్లిదండ్రులు మేఘన ఇంటికి వచ్చి మాట్లాడారు. అయితే, పెళ్లికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఇస్తున్నామని, వెంటనే ముహూర్తం పెట్టాలని ఒత్తిడి చేయడంతో సమయం సరిపోదని భావించిన మేఘన కుటుంబం ఈ సంబంధాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకుంది. సరిగ్గా ఇక్కడే రాజీవ్ తన అసలు నాటకాన్ని ప్రారంభించాడు. ఏప్రిల్ 27న మేఘనకు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడాడు. "నేను నిన్ను ప్రాణంగా చూసుకుంటాను.. నీపై నాకు ఎంతో ఇష్టం ఉంది.సంబంధం ఎందుకు వద్దనుకుంటున్నావో చెప్పు, దయచేసి మరోసారి ఆలోచించు" అంటూ ఎంతో ప్రేమను నటిస్తూ ఆమె మనసును కరిగించాడు. అదే సమయంలో అతనతో పాటు అతని కుటుంబ సభ్యులు (మామ జోగి రమేష్, రాము, స్వామి) కూడా మేఘన తండ్రిపై ఒత్తిడి తెచ్చి మే నెలాఖరులో పెళ్లికి ఒప్పించారు. తాము రాజకీయాల్లో పెద్ద స్థాయి వ్యక్తులమని, మంత్రులు, ఎమ్మెల్యేలు దాదాపు 20 వేల మంది అతిథులు వస్తారని చెప్పి ఘనంగా ఏర్పాట్లు చేయించారు.అలా పెళ్లికి ముందు చూపించిన ఆ అమితమైన ప్రేమాభిమానాలే ఒక ఆడబిడ్డ జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తాయని ఆమె ఊహించలేకపోయింది. శోభనం రాత్రే ఎదురైన చేదు నిజం! గత ఏడాది మే 28న సూర్యాపేటలో అత్యంత వైభవంగా వివాహం జరిగింది. కన్నవారు తమ కూతురు భవిష్యత్తు కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు చేసి, 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండిని కానుకలుగా ఇచ్చారు. ఎన్నో కలలతో భర్త జోగి రాజీవ్ చెంతకు చేరిన మేఘనకు తొలిరాత్రే మానసికంగా కోలుకోలేని దిగ్బ్రాంతి ఎదురైంది.భర్త శారీరకంగా, లైంగికంగా అన్ ఫిట్ అనే పచ్చి నిజం ఆమెకు అర్థమైంది. పెళ్లికి ముందే ఈ శారీరక సమస్యను దాచిపెట్టి, ప్రేమ నటనతో తమను నిలువునా మోసం చేశారని మేఘన కుమిలిపోయింది. ఒక వైపు భర్త కనీస సాన్నిహిత్యానికి దూరంగా ఉంటూ, అర్ధరాత్రి 3 గంటల వరకు బాత్రూమ్లోనే గడుపుతూ ఫోన్లలో కాలక్షేపం చేస్తుంటే.. ప్రశ్నించినందుకు ఆమెపై భౌతిక దాడులకు పాల్పడేవాడు. "వైద్యం చేయించి అతని సమస్యను నయం చేస్తాం" అని అత్తమామలు అబద్ధపు హామీలు ఇస్తూ ఆమెను తాత్కాలికంగా నమ్మించేవారు. రాతి గుండెల రాక్షసత్వం!కొడుకులోని శారీరక లోపాన్ని సరిదిద్దాల్సింది పోయి, దానిని కప్పిపుచ్చేందుకు అత్తమామలు (జోగి రమేష్, శకుంతల) కట్న వేధింపుల దారి ఎంచుకున్నారు. "నీ భర్త మూడ్ మారి నీతో సరిగ్గా ఉండాలంటే మీ నాన్నగారి నుంచి అదనంగా మరో రూ. 5 కోట్ల నగదు, ఫోర్చ్యూనర్ కారు, అత్తా-ఆడపడుచులకు వజ్రాల హారాలు తీసుకురావాలి" అని నిత్యం వేధించడం మొదలుపెట్టారు. మానసికంగా నలిగిపోతున్న ఆమెను ఇంట్లో ఎవరికీ కనిపించకుండా మూడవ అంతస్తులో బంధించారు. కనీసం పూజ చేసుకుందామన్నా అనుమతించలేదు.పెళ్లికి ముందు హిందువులమని చెప్పి, ఆ తర్వాత ఇంట్లో ఉన్న దేవుళ్ల పటాలన్నీ తీసేసి, తాము క్రైస్తవ మతంలోకి మారిన విషయాన్ని బయటపెట్టారు. ఇంట్లో పూజల కోసం అగరబత్తి వెలిగిస్తే, "శవం దగ్గర ఉన్నట్టు ఉందంటూ" హేళన చేస్తూ ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. పగటిపూట నిఘా పెట్టేందుకు డ్రోన్లు వాడటం, ఇంట్లో ఆడ పనివాళ్లను తీసేసి మగ పనివాళ్లతో ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలతో ఆమెను భయాందోళనలకు గురిచేశారు. మూడంచెల మృత్యు భయం – టెర్రస్ పైనుంచి.. పడవలోంచి.. దిండుతో నొక్కి!అత్తవారింట్లో మేఘన గడిపిన ప్రతి క్షణం మృత్యువుతో పోరాటమే అయింది: టెర్రస్ సంఘటన: ఒకరోజు మేఘన టెర్రస్‌పై ఉండగా మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, స్వామి వచ్చి ఆమెను కిందకు తోసేసేందుకు యత్నించారు. "ఇది శాంపిల్ మాత్రమే.. కన్నవారికి ఏమైనా చెబితే నీ శవాన్నే చూస్తారు" అని బెదిరించారు. గోవా, ఘట్కేసర్ దాడులు: గోవా ట్రిప్‌లో చీకటి ప్రదేశంలో వదిలేయడమే కాకుండా, క్యాసినో పడవలోంచి ఈత రాని మేఘనను నీటిలోకి తోసేయాలని చూశారు. ఆ తర్వాత హైదరాబాద్ ఘట్కేసర్ ఫార్మ్‌హౌస్‌లో నిర్బంధించి దారుణంగా కొట్టారు.ఆఖరి దాడి (ఏప్రిల్ 13, 2026): "నీ భర్త లైంగిక సమస్య గురించి, మా మతం గురించి బయటపెడతావా?" అంటూ అత్త, ఆడపడుచు ఆమె చేతులు పట్టుకోగా, భర్త మెడకు చున్నీ బిగించాడు. మామ జోగి రమేష్ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేందుకు యత్నించారు. ఆ రాత్రి కాళ్లు పట్టుకుని, ప్రాణాలు కాపాడమని వేడుకోవడంతో చివరకు వదిలిపెట్టారు.