దేశం కోసం మీ వంతు బాధ్యతను మర్చిపోకండి. సాకులు చెప్పకుండా ఓటు వేయండ���. ప్రజాస్వామ్యంలో జరిగే అతిపెద్ద వేడుకలో భాగస్వామ్యులు కండి! ఓటుతో దేశభక్తిని చాటుకోండి.
Don't miss out on doing your bit for the country. Voting Day is a no-excuse day! Cast your vote and join the biggest celebration of democracy.
@ECISVEEP @CEO_Telangana #Elections2024 #ElectionCommissionOfIndia #Vote
గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన 'టి-9 టికెట్' సమయాల్లో #TSRTC మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించిం��ి. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
టి-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబీ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్ వర్తిస్తుంది. టి-9 టికెట్ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.
‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టి-9 టికెట్‌ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రవేశపెట్టిం��ి. ఈ టికెట్ ద్వారా రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. జూన్ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 11 వేల మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారు. టి-9 టికెట్ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకువచ్చారు. ఈ అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని సంస్�� పెంచింది. తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబీ టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్ సిటిజన్స్ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. సంస్థను ఆదరించాలి." అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్���న్, సంస్థ ��ండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోండగా.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టి-9 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తెచ్చిందని వారు తెలిపారు. ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.
@TSRTCHQ @PROTSRTC @SajjanarVC @Govardhan_MLA @puvvada_ajay @CTMOTSRTC @way2_news @eenadulivenews @abntelugutv @ntdailyonline @NTVJustIn @TV9Telugu
#T9Ticket #Sajjanar #SajjanarIPS
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’కు #TSRTC శ్రీకారం చుట్టింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప��రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.
నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ కు రూ.600గా, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 గా ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్ ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే ���ెసులుబాటును సంస్థ కల్పించింది. సెలువు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్ తో ప్రయాణించవచ్చు.
హైదరాబాద్ లో ప్రయాణికులకు జనరల్ బస్ టికెట్ అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్ పాస్ కు రూ.1150, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ కు రూ.1300గా ధర ఉంది. ఈ పాస్ దారులు సిటీ సబర్బన్ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్ లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది. తక్కువ దూరం ప్రయాణించే వారికి చేరువ కావడం కోసమే జనరల్ రూట్ పాస్ ను టీఎస్ఆర్టీసీ రూపొందించింది.
“గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు అనేక రాయ��తీలను టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు జనరల్ రూట్ పాస్ ను సంస్థ ప్రారంభించింది. రాష్ట్రంలో విద్యార్థులకు మాత్రమే రూట్ పాస్ లను ఇస్తున్నాం. తొలిసారిగా సాధారణ ప్రయాణికులకు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. సాధారణంగా ఆర్డీనరీ రూట్ పాస్ క��� రూ.800, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1200 గా ఉంటుంది. ప్రారంభ నేపథ్యంలో రూ.200 రాయితీని కల్పించి.. సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ ను రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ రూ.1000కే అందిస్తున్నాం.హైదరాబాద్ లో ప్రస్తుతం జనరల్ మెట్రో పాస్ లు 1.30 లక్షలు, ఆర్డీనరీ పాస్ లు 40 వేల వరకు ఉన్నాయి. వాటి మాదిరిగానే కొత్తగా తీసుకువచ్చిన రూట్ పాస్ ను ప్రయాణికులు ఆదరించాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డ��� గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.
ఈ పాస్ కు సంబంధించిన రూట్ల వివరాల కోసం https://t.co/nYdTW8fYKH, https://t.co/R5ITG2zTdC వెబ్ సైట్లను సంప్రదించాలని వారు సూచించారు.
@TSRTCHQ @Govardhan_MLA @puvvada_ajay @PROTSRTC
For the first time, the General Route Pass which was exclusive for students, will now be made available to the general public within the Greater #Hyderabad zone.
#TSRTC
https://t.co/C3a9kOn4iO
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్ తో పాటే 'స్నాక్ బాక్స్'ను ఇవ్వాలని #TSRTC సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్‌ను అం���ించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్ e-గరుడ బస్సుల్లో స్నాక్ బాక్స్ విధానాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తోంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది. ఈ స్నాక్ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్ ప్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్ బాక్స్ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
"ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో టీఎస్ఆర్టీసీ ముందుకు వెళుతోంది. అందులో ��ాగంగా స్నాక్ బాక్స్ ప్రయాణికులకు ఇవ్వాలని నిర్ణయించింది. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని బలపరిచే చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు ప్రయాణంలో ఉపయోగపడే మౌత్ ప్రెషనర్, టిష్యూ పేపర్‌తో కూడిన స్నాక్ బాక్స్‌ను ప్రయాణికులకు సంస్థ అంది���చనుంది. టీఎస్ఆర్టీసీ ఏ కార్యక్రమం తీసుకువచ్చినా ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారు. సంస్థను ప్రోత్సహిస్తున్నారు. ఈ స్నాక్ బాక్స్ విధానాన్ని అలాగే అదరించాలి." అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.
ప్రతి స్నాక్ బాక్స్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని ఫోన్లలో స్కాన్ చేసి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫీడ్ బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని స్నాక్ బాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్‌ను బట్టే మిగతా సర్వీసులకు స్నాక్ బాక్స్ విధానాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు.
@TSRTCHQ @PROTSRTC @Govardhan_MLA @puvvada_ajay @CTMOTSRTC @CTM_CDMT
ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు! రంగుల పండుగ హోళీ.. మీకు శుభాలను కలిగించాలని ఆకాంక్షిస్తున్నాను.
Wishing Everyone a Happy and Safe Holi. May this Festival of Colors bring all the Happiness.
#HappyHoli#Holi
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థినులు, మహిళలకు శుభవార్త. వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను #TSRTC యాజమాన్యం ఏర్పాటు చేసింది. రద్దీ సమయాల్లో లేడీస్ స్పెషల్ బస్సులను నడపుతోంది.
ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకొని క్షేమంగా, సురక్షితంగా విద్యాసంస్థలకు చేరుకోండి.
@TSRTCHQ
@TeamAdithyaAnna @tsrtcmdoffice @TSRTCHQ @AdithyaMarri sir this bus representation belongs to tandur depot . i will escalate to the representation to dm tandur pl