జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..!
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
@VangaveetiOffl
జనసేనలోకి వైసీపీ నాయకులు
• కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు సోమవారం జనసేన పార్టీలో చేరారు. కాకినాడలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దాపురం నియోజకవర్గం, నవర గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు శ్రీ దమ్మాల లక్ష్మణరావు, శ్రీ చిక్కాల నూకరాజు, చంద్రమాంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీ కురుమెళ్ల లోవరాజు, వైసీపీ నాయకులు శ్రీ కురుమెళ్ల లక్ష్మణదొర, శ్రీ పంపన రామకృష్ణ, శ్రీ బలగం ప్రసన్న కుమార్, శ్రీ యల్ల వీర వెంకట సుబ్బారావు, శ్రీమతి పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, శ్రీ పెంకే సత్తిబాబు, శ్రీ వెలుగుబంట్ల నారయ్య, శ్రీ బి. హనీష్ కుమార్, శ్రీ పంపన వెంకట రమణ, శ్రీ వై. శ్రీనివాస్ తదితరులు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో వీరంతా జనసేన పార్టీలో చేరారు.
I remain deeply grateful to Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan Garu for placing his trust in me and giving me the responsibility to serve as a Member of the APPCB. I have always believed that a position becomes meaningful only when we justify the responsibility that comes with it. Whatever I have been able to contribute in this role has been guided by that belief, to give my best, remain accessible, and serve with sincerity.
I sincerely appreciate Ashish @Ashwatthama2898 for the effort he has put into building this platform. It takes genuine commitment to the party to consistently recognise and bring forward the work happening at every level of the organisation. JanaSena is fortunate to have committed people like you. My best wishes to you and your team.
https://t.co/Ht1daCrY1N
ఈ రోజు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
విద్యార్థులకు సరైన మార్గాన్ని చూపే వారధి గురువులు.
విద్యతో పాటు విలువలు నేర్పుతూ, బాధ్యతగల భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులందరికీ హృదయపూర్వక వందనాలు.
భారతరత్న, మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
#TeachersDay
#DrRadhakrishnan
గత ప్రభుత్వానికి నరకడం తప్ప... నాటే ఆలోచనే రాలేదు
•కూటమిది నరికే సంస్కృతి కాదు... నాటే సంస్కృతి
•భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత
•ప్రకృతి, ఆధ్యాత్మికతల అద్భుత సమ్మేళనం “అశ్వత్థ నారాయణ వివాహం”
•అరణ్యారామంలో రావి–వేప మొక్కలు నాటిన శ్రీ నాగబాబు దంపతులు
•ప్రకృతి సంరక్షణలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలి
•రావి, వేప మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ @NagaBabuOffl గారు
హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపునకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ కొణిదెల నాగబాబు గారు పిలుపునిచ్చారు. శనివారం మంగళగిరిలోని అరణ్యారామం నందవనంలో సాంప్రదాయ రావి–వేప మొక్కల నాటే కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు, సతీమణి శ్రీమతి పద్మజ గారు కలిసి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ నాగబాబు దంపతులు రావి–వేప మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “భూమాత మనకు పరోక్షంగా జన్మనిచ్చిన తల్లి. మనం పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు అవసరమైన ఆహారం, నీరు, గాలి, నివాసం వంటి ఎన్నో వనరులను భూమాత నుంచే పొందుతున్నాం. మన తల్లిదండ్రులు మనకు పెట్టే ప్రతి ఆహారపు ముద్ద కూడా భూమాత ప్రసాదించినదే. అలాంటి భూమాతకు తిరిగి మనం ఏమి చేస్తున్నాం అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అడవులను నరికి వేయడం, విచక్షణారహితంగా మైనింగ్ చేయడం, ప్రకృతిని కాలుష్యం చేయడం ద్వారా మనమే భూమాతను గాయపరుస్తున్నాం. భూమాతను కాపాడటం మన బాధ్యత మాత్రమే కాదు, మన కర్తవ్యం.
*ప్రకృతి పరిరక్షణకు... అశ్వత్థ నారాయణ వివాహం*
భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన అశ్వత్థ నారాయణ వివాహం సంప్రదాయం ప్రకృతి, ఆధ్యాత్మికత, సామరస్యానికి ప్రతీక. రావి, వేప చెట్లను ఒకే గుంతలో నాటే ఈ సంప్రదాయంలో రావి చెట్టును విష్ణుమూర్తికి, వేప చెట్టును లక్ష్మీదేవికి ప్రతీకలుగా భావించడం మన సంస్కృతిలో ప్రకృతికి ఇచ్చిన విశిష్ట స్థానం. రావి, వేప చెట్లు కలిసి పెరగడం ద్వారా పచ్చని పరిసరాల ఏర్పాటుకు, స్వచ్ఛమైన వాతావరణానికి, జీవ వైవిధ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుంది. ఈ చెట్లు దాదాపు 250 జీవరాశులకు ఆవాసంగా మారి, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
*ఆ ఆలోచనే మమ్మల్ని కలిపింది*
ఏదైనా మంచి పని మొదలుపెట్టే ముందు మొక్క నాటడం నా అలవాటు. ప్రకృతిని ప్రేమించడంలో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి, నాకూ ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు పర్యావరణంపై ఆయనకున్న నిబద్ధత నాకు స్పష్టంగా తెలిసింది. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉమ్మడి సంకల్పమే మమ్మల్ని ఇలా ఒకే వేదికపైకి తెచ్చింది. గత ప్రభుత్వంలోని వారికి చెట్లను నరకడమే తప్ప, నాటాలనే ఆలోచనే వాళ్లకు రాలేదు. ఏ కార్యక్రమం చేసినా అడ్డువచ్చిన చెట్లను నరుక్కుంటూ పోయారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం కెన్యా వంటి దేశాలే అడవులకు, వన్యప్రాణులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. మరి జ్ఞానానికి పురిటిగడ్డ అయిన మన భారతదేశం, పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అరణ్యారామం డిజైన్లు పరిశీలించిన శ్రీ నాగబాబు గారు
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ₹24 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 'అరణ్యారామం' భవన డిజైన్లను శ్రీ నాగబాబు గారు పరిశీలించారు. ఈ భవన నిర్మాణాన్ని 10 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని పీసీసీఎఫ్ చీఫ్ శ్రీ పి.వి. చలపతిరావు గారు శ్రీ నాగబాబు గారికి వివరించారు. అలాగే తాడేపల్లి పరిధిలోని అటవీ ప్రాంత వివరాలను తెలియజేశారు. ఈ భవన నిర్మాణ ప్రక్రియలో భాగంగా తొలగించాల్సి వచ్చిన 73 చెట్లను వృథాగా నరికేయకుండా, వేరే చోట విజయవంతంగా పునఃప్రతిష్ఠాపన చేశారు. ఈ విధంగా వేరే చోట నాటిన చెట్లను శ్రీ నాగబాబు గారు స్వయంగా పరిశీలించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ శ్రీ ఎన్. నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు శ్రీ వై. శ్రీనివాసరెడ్డి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్ శ్రీ బి.ఎన్.ఎన్. మూర్తి, డిఎఫ్ఓ గుంటూరు శ్రీమతి హిమశైలజ పాల్గొన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలు, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన/గెలిచిన 1000 మందికి పైగా అభ్యర్థులకు 3 గంటల పాటు ప్రతి ఒక్కరినీ స్వయంగా సత్కరించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ @mnadendla గారు.
#JanaSenaParty#AndhraPradesh
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జనసేన పార్టీ విధి విధానాలు నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీని సమావేశం కొద్ది సేపటి క్రితమే మొదలైంది
- జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సందేశాన్ని కమిటీ సభ్యులకి వివరించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు
#PawanKalyanAneNenu
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం!
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో మెగా వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు రూ.280 కోట్ల కేటాయింపులతో 96% పనులు, 99% పైప్లైన్ నిర్మాణం పూర్తి.
త్వరలో లక్షలాది మందికి స్వచ్ఛమైన తాగునీరు!
నాన్ జీఎంఓ మొక్కజొన్న వంగడాల సృష్టి – వ్యవసాయ రంగ విప్లవంలో కీలక మైలురాయి
•కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన గోర్మె పాప్ కార్నికా సంస్థకు శ్రీ @PawanKalyan గారి అభినందనలు
మొక్కజొన్న సాగులో రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడులు అందించే వంగడాలను అభివృద్ధి చేసిన ఏలూరు జిల్లా, ముసునూరు గోర్మె పాప్ కార్నికా సంస్థకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. వ్యవసాయ రంగ విప్లవంలో ఈ వంగడం కీలక మైలురాయిగా పేర్కొన్నారు. గోర్మె పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జన్యుపరంగా మార్పులు చెందని (Non-GMO) పాప్ కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గౌరవ భారత ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారు, గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణమన్నారు. ఈ పరిశోధనలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జన్యుపరంగా మార్పులు చెందని వంగడాల అభివృద్ధి రైతులతోపాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వినూత్న ఆవిష్కరణను విజయవంతంగా రూపొందించిన గోర్మె పాప్ కార్నికా సంస్థ యాజమాన్యానికి, శాస్త్రవేత్తలకు, పరిశోధక బృందానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో తీరుతున్న పులివెందుల నియోజక వర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి
•గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక దృష్టి
•జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ. 280 కోట్ల కేటాయింపులు
•96 శాతం ఓవరాల్ ప్రాజెక్టు పనులు.. 99 శాతం పైప్లైన్ నిర్మాణం పూర్తి
•తుది అంకానికి నీటి శుద్ధి ప్లాంట్ పనులు
•పులివెందుల పట్టణం, గ్రామీణం, సింహాద్రిపురం మండలాల్లో 100 శాతం పూర్తయిన పనులు
•లింగాల మండల పరిధిలో 24 ఆవాసాలకు తాగునీటి సరఫరా
జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించి నిర్లక్ష్యం చేసిన పథకాలకు సైతం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి గాడిలో పెట్టి వేగవంతంగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాదాపు రూ. 426 కోట్ల విలువైన 96 శాతం పనులు పూర్తి చేసి నిబద్ధత చాటుకున్నారు.
*గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం*
ఏడు మండలాల పరిధిలో ఐదున్నర లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభమైన పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమృద్ధిగా ఉన్నప్పటికీ పనులను ముందుకు తీసుకువెళ్లే అంశంలో శ్రద్ధ చూపలేదు. చేపట్టిన పనుల్లో కూడా నాణ్యత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జల్ జీవన్ మిషన్ పనుల మీద జరిగిన తొలి సమీక్షలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పథకాలను సైతం ప్రాధాన్య క్రమంలో ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి జల్ జీవన్ మిషన్ గడువు కూడా పూర్తి కావడంతో, కేంద్రం వద్ద ఉన్న మిగులు నిధులు ఖర్చు చేసేందుకు వీలు లేకుండా పోయింది. ఉప ముఖ్యమంత్రివర్యులు, కూటమి నాయకులు చేసిన ప్రయత్నాల ఫలంగా జల్ జీవన్ మిషన్ను మరో 4 ఏళ్ల పాటు పొడిగించేందుకు కేంద్రం అంగీకారం తెలపడంతో పులివెందుల మెగా తాగునీటి సరఫరా పథకం తిరిగి ఊపిరి పోసుకుంది.
అప్పటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో దాదాపు రూ. 280 కోట్లు ఒక్క పులివెందుల పథకానికే కేటాయించి వేగంగా పనులు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర పైప్లైన్లు వేయడం మినహా పెద్దగా పనులేమీ పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 96 శాతం పనులు పూర్తి చేశారు. అందులో పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు ఇప్పటికే ఈ పథకం ద్వారా తాగునీరు అందుతోంది. పులివెందుల పట్టణానికి సంబంధించిన పనులు కూడా 100 శాతం పూర్తయ్యాయి. లింగాల మండలం పరిధిలో 27 ఆవాసాలకు గాను 24 ఆవాసాలకు త్వరలో తాగునీరు అందుతోంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలకమైన ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా, 65 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 1,111 కిలోమీటర్ల పైప్లైన్కు గాను 1,106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఓవర్హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వం తాగు నీరు వంటి ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన నిర్దేశం మేరకు పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పనులను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.
గిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి
• అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
• అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
• విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి
• పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రివర్యులు
• మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
• అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి
• వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి
• డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపు
#AdavithalliBata
తక్కువ ధరకే బియ్యం విక్రయాలకు శ్రీకారం
• విజయవాడలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
• రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ ₹52, రా రైస్ కేజీ ₹50కు అందుబాటులోకి తీసుకొచ్చారు.
• ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో వ్యక్తికి 10 కేజీల చొప్పున బియ్యం విక్రయించనున్నారు.
• భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ వంటి నిత్యావసర వస్తువులను కూడా తక్కువ ధరలకు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
• సామాన్య ప్రజలకు ఊరట కలిగించే ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కోరారు.