I am Indian,Director in Telugu Film Industry,Cinema Pichodu, Founder of BR Movie Zone, Pawanism follower, Janasainik. cinema, Rajakiyam not both are same.
హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
•హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
•ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ @PawanKalyan గారు
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరుసటి రోజే ఆచరణలో పెట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రారంభం అయ్యాయి. బుధవారం నరసాపురం లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళ్ల జోళ్లు వేయించే ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
•శ్రీమతి మహాలక్ష్మికి శంకర నేత్రాలయలో పరీక్షలు
హస్తకళా మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం, పసలదీవికి చెందిన లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తమకు నేత్ర సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయన్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం శ్రీమతి మహాలక్ష్మితోపాటు శ్రీమతి అందే లక్ష్మి అనే మరో లేస్ కళాకారిణిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పిలిపించి పరీక్షలు చేయించారు. ఇరువురికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్, మందులు ఇప్పించి పంపారు.
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was fulfilling his wish. But it was Niranjan who left me inspired. His courage, resilience, and unwavering spirit in the face of adversity are truly remarkable.
I extend my sincere gratitude to the Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu, the Government of Telangana, and the Telangana Police Department, from senior officers to every constable, for their support and coordination.
To everyone in Warangal including Janasainiks and Parents leaders@@JanaSenaParty , I thank you for the immense affection and warmth you have always showered upon me. Your love and blessings are a constant source of strength, and I shall cherish them forever.
@TelanganaCMO
తప్పులు జరిగిన అన్ని సందర్భాల్లో #JustAsking అని అడిగి ఉంటే మీ పైన అనుమానాలు ఉండవు.
కానీ సెలెక్టివ్ గా కొన్ని మాత్రమే అది కూడా అర్థం లేని సందర్భాలు, వ్యాకరణాలతో సమాజంలో చీలికలు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది.
2019 నుండి 2024 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకు తాళం వేసింది? అప్పుడు గుర్తు రాని జస్ట్ ఆస్కింగ్ ఇప్పుడే, ప్రశ్నించాల్సిన సందర్భాలు లేనప్పుడే ఎందుకు గుర్తుకు వస్తాయి ?
ఆనాడు తనని దూషించిన వైసీపీ వారికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇచ్చారు.
అది కూడా సహించి సహించి తిరగబడ్డారు.. - మంత్రి శ్రీ @kandulaDurgesh
🙏🫡
LEADER @PawanKalyan Garu is the inspiration for this Smart Kitchen Project in Kadapa.
He also donated ₹10 lakh from his own pocket.
Currently it is serving 12,000 meals/day.
- Kadapa District Collector
ఆస్కార్ లెవెల్ యాక్టింగ్! 👏🏻
• మాట్లాడితే "పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకుని కొడతా నా***" అని చెప్పారంటూ మాట్లాడే ఈ సూడో సెక్యులర్ జర్నలిస్టులకు...
పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఎందుకు అన్నారు?
ఎలాంటి ఆధారం లేకుండా "ప్యాకేజీ తీసుకున్నాడు" అంటూ వైసీపీ నాయకులు వాగుతుంటే, అకారణంగా లకారాలతో ఒక రౌడీ MLA దూషిస్తుంటే, పార్టీ కార్యకర్తను మరో MLA చంపిస్తే, పార్టీ మహిళా నాయకులను నడిరోడ్డుపై కొట్టి తరిమేస్తే, అకారణంగా జనవాణి కార్యక్రమం కోసం విశాఖ వెళ్లిన ఆయనను, నాయకులను నిర్బంధిస్తే, మా నాయకులను అరెస్ట్ చేసి 8 రోజుల పాటు జైల్లో పెడితే, పెయిడ్ ఆర్టిస్ట్ పోసాని లాంటి నీచుల చేత మీడియాలో ఆయన తల్లిని, భార్యను, పిల్లలను చెప్పలేని విధంగా దూషింపజేసి వారికి పదవులు కట్టబెడితే, పదేపదే వైసీపీ నాయకులు నీచాతి నీచంగా మాట్లాడితే... 10 ఏళ్ల మౌనం తర్వాత ఆవేదనతో మాట్లాడారు.
చాలా కన్వీనియెంట్గా, ఏమీ జరగకుండానే పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారన్నట్లు, ఆయనే ఈ వెధవ రావణ్‌ను ఇలా తయారు చేశాడన్నట్లు బాగా యాక్టింగ్ చేశారు. ఆస్కార్ కూడా మీ రేంజ్‌కు చిన్నదే.
మీ మీద ఎవరో కామెంట్లు చేశారని వెంటనే ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా చేసిన మీరు, ఈరోజు ఇన్ని తప్పులు చేసిన ఒక వెధవకు మద్దతు ఇస్తూ భలే ప్లేట్ తిప్పేశారు, మేడం.
Freedom of Speech మీకు ఒకలా, పవన్ కళ్యాణ్ గారికి ఒకలా ఉండదు. మీకు జరిగితే అన్యాయం... పక్కన వాళ్లకు జరిగితే మాత్రం అది బాధితుల తప్పు. 👏🏻👏🏻👏🏻
జర్నలిజం ముసుగులో ఇలాంటి ఎర్నలిజం మాటలు తగవు. @thulasichandu
#SayNoToSocialMediaAbuse
Just asking telugu tammudu, if there is immediate election in AP right now, what are major things which you give to whole voters of AP to vote for alliance.
Kalyan garu has started a very dangerous game. I’m not sure whether it will strengthen the alliance or bring it down. His ego is the biggest concern for us…
సోషల్ మీడియా వేదికగా వాక్ స్వాతంత్ర హక్కు ముసుగులో కొందరు అత్యంత అసభ్య పదజాలాన్ని వాడి రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, కుటుంబ సభ్యులు, పిల్లలను సైతం లక్ష్యంగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టాలు ఎలా పని చేస్తాయి అనే అంశంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా కొద్దిసేపట్లో మాట్లాడుతారు.
ప్రజల కష్టాలు తీర్చే పవర్ హౌస్లా పంచాయతీరాజ్ వ్యవస్థ మారాలి
•గత ప్రభుత్వ విజన్ లేని పాలన వల్లే పంచాయతీలు దెబ్బ తిన్నాయి
•గత రెండేళ్లలో గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా రూ.4,200 కోట్లు బదిలీ
•వ్యవస్థలు బలంగా నడవాలంటే ఉద్యోగుల పాత్రే కీలకం
•ప్రజల కోసం మీరు ఒక అడుగు వేస్తే... మీ కోసం నేను వంద అడుగులు వేస్తా
•మనం చేసే ప్రతి పనిలో పారదర్శకత ఉండాలి
• శ్రీ వెంకట కృష్ణ గారి లాంటి అధికారుల వల్లే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది
•పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు
•ప్రభుత్వ అదనపు కార్యదర్శి శ్రీ కె. వెంకటకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
ప్రశ్నించండి... మేము కూడా ప్రశ్నలను స్వాగతిస్తాం. కానీ ప్రశ్నించడం పేరుతో దూషించడం, వ్యక్తిగతంగా కించపరచడం, మనోభావాలను దెబ్బతీయడం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, వ్యక్తిగత విద్వేషాలను జర్నలిజం ముసుగులో ప్రదర్శించడం, ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చట్టం సహించదు. చట్టం తన పని తాను చేస్తుంది.
• ఇష్టం వచ్చినట్లు @JanaSenaParty అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై, వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని జుగుప్సాకరమైన, భయభ్రాంతులకు గురిచేసే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోకూడదా?
• యావత్ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుల వారిపై మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తే సమాజం మౌనంగా ఉండాలా?
• నాస్తికత్వం పేరుతో కుల, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని ప్రశ్నించకూడదా?
• పసిపిల్లల మనసుల్లోనే కుల, మత విద్వేషాలను నింపేలా వ్యవహరించే వారిపై చట్టం చర్యలు తీసుకోకూడదా?
• తప్పుడు పనులన్నీ చేసి, తర్వాత కులం, మతం, ప్రాంతీయత పేరుతో రక్షణ పొందాలని ప్రయత్నిస్తే ప్రజలు గానీ, చట్టం గానీ చూస్తూ ఊరుకోవు.
తప్పు చేసిన వ్యక్తి ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదు.
జర్నలిస్టులకు, సోషల్ మీడియా యువతకు, అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి...
తప్పును తప్పుగానే చూడండి. నేరాన్ని నేరంగానే చూడండి. దయచేసి తప్పుడు వ్యక్తులకు మద్దతుగా నిలిచి సమాజానికి తప్పు సంకేతాలు ఇవ్వవద్దు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, బాధ్యత కూడా ముఖ్యం అనే సందేశం ఇవ్వండి.