ఇప్పుడు మన చదువు యాప్‌లో కొణతం దిలీప్ గారు అనువదించిన "ఒక దళారి పశ్చాత్తాపం" పుస్తకాన్ని ఆడియో రూపంలో వినండి.
https://t.co/QVnsjxNNxt ఈ లింక్ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి.199రూలకే మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి.
మన చదువు యాప్‌లో ‘మార్క్‌ట్వేన్ - కింగ్ లియోపాల్డ్స్ సాలిలోక్వీ,
చార్ల్స్ కింగ్ల్సీ - వెస్ట్ వర్డ్ హా!’ల కథలను చదవండి.
https://t.co/QVnsjxNfHV ఈ లింక్ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి.199రూలకే మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి.
మన చదువు యాప్‌లో కె. సదాశివరావు గారు పరిచయం చేసిన సైన్స్ ఫిక్షన్ రచయిత అంతర్లోకాల ప్రయాణికుడు హారుకీ మూరకామీ గురించి చదవండి.
https://t.co/QVnsjxNNxt ఈ లింక్ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి.199రూలకే మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి.
'ఎలిజీలు' అనేది గొల్లపూడి మారుతీరావు రాసిన జ్ఞాపకాల సేకరణ. ఇది ఆయన జీవితంలో ఎదురైన వ్యక్తులు, అనుభవాలు మరియు సమకాలీన సామాజిక విషయాలపై ఆయన ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. https://t.co/QVnsjxNNxt ఈ లింక్ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి.199రూలకే మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి.
రోమన్ పాలకుల నిరంకుశత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన నవలను మన చదువు యాప్‌లో చదవండి.
https://t.co/QVnsjxNNxt ఈ లింక్ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి.199రూలకే మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి.
మన చదువు యాప్‌లో ‘గోంచారోవ్, రిచర్డ్ బాక్’లు రాసిన కథలను చదవండి.
https://t.co/QVnsjxNNxt ఈ లింక్ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి.199రూలకే మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి. #Muktavaramparthasaradhi
మన చదువు యాప్‌లో ఆన్వీక్షికి చదువు యాప్ సంయుక్తంగా నిర్వహించిన ఉగాది నవలల పోటోలో బహుమతి పొందిన నవల "అన్వేషణ" రెండవ భాగాన్ని చదవండి.
https://t.co/QVnsjxNNxt ఈ లింక్ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి.199రూలకే మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి. #అన్వేషణ#SIRAMSETTYKANTHARAO
మన చదువు యాప్‌లో ముక్తవరం పార్థసారధి గారు సేకరించిన విశ్వ కథా శతకంలోని ‘కాథరైన్ మేన్స్ఫీల్డ్, మార్క్‌ట్వేన్’లు రాసిన కథలను చదవండి.
https://t.co/QVnsjxNfHV ఈ లింక్ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి.199రూలకే మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి. #Muktavaramparthasaradhi
రెండు తలల అమ్మాయిని ప్రేమించకండి!
ఆడవాళ్ళలో కొందరుంటారు, రెండు తలల బాపతు!
ఒకామె ఉదయాన ఓ వెర్రి వెంగళాయతో “రామూ నువ్వంటే నాకెంతో ప్రేమ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను” అంటుంది.
సాయంత్రమయేసరికి “ప్రదీపూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ - వెరీ మచ్… వెరీ మచ్...” అంటుంది మరో వెంగల్రావుతో.
ఇంకో సతీ సావిత్రి ఉంటుంది. పొద్దున్న భర్త చొక్కాకి గుండీని కుడుతూ “మీరెంత మంచివారండీ! ఏ పూర్వజన్మ సుకృతానో నాకు లభించారు,” అంటుంది. అతగాడు మూర్ఛనలు పోయేవిధంగా. ఆ తర్వాత పరమ బుద్ధిమంతురాలిలా ఒద్దికగా ఆఫీసుకు వెళ్తుంది. ఒంట్లో బాగోలేదని, ఇంటికి వెళ్తున్నాని, ఆఫీసుకు డుమ్మాకొట్టి, ఒకానొక నిర్ణీత ప్లేస్‌లో ఒకానొక కాసనోవా మెడని కావలించుకుంటూ “డార్లింగ్. పెళ్ళయాక కూడా నిన్నిలా కలుసుగోలగుతానని ఏనాడూ అనుకోలేదు. హౌ స్వీట్ యు ఆర్!” అంటుంది స్వీటు స్వీటుగా గ్రంధసాంగీకరిస్తూ.
పాపం అదే సమయాన వెర్రిముండావాడు, ఆమె భర్తవాడు తన సతీసావిత్రి ఉద్యోగ భారంతో ఎంత సతమతమవుతోందో, తానెంత అదృష్టవంతుడోనని చంకలు గుద్దుకుంటూ ఫస్టునాటికి ఆమె తేబోయే జీతాన్ని తల్చుకుంటూ చొంగలు కార్చుకుంటుంటాడు.
ఇలాంటి రెండు తలల ఆడవాళ్ళకు సంబంధించినది కాదీ కథ...
నిజంగానే రెండు తలలు 'శారీరకంగా రెండు తలలు' కలిగి వున్న అమ్మాయికి చెందిన కథ!
-----
కంఠంనేని రాధాకృష్ణమూర్తి రాసిన "రెండు తలల అమ్మాయిని ప్రేమించకండి" అనే కథ ఇలా మొదలవుతుంది. ఈ కథలో అమ్మాయికి నిజంగానే రెండు తలలుంటాయి. విచిత్రంగా ఉన్నా, కంఠంనేని తన కథల్లో ఇలాంటి విచిత్రాలెన్నింటినో ఎంతో ఆర్గానిక్ గా ఇమడ్చగలిగే ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్.
ఈయన కథలకు రావాల్సిన గుర్తింపు రాలేదు. కానీ తెలుగు సాహిత్యపు సమాజోద్ధరణ అనే ముసుగు తీసి చూడగలిగితే ఇవి world class stories అని గట్టిగా చెప్పగలను.
అప్పుడప్పుడే నగరం వైపు పరిగెడ్తున్న జీవితాలు, అందులోని కాంప్లెక్సిటీస్ ని చిన్న కథలుగా రాసిన "సిటీ లైట్స్" అనే పుస్తకం ద్వారా నాకు ఆయన రచనలు పరిచయం అయ్యాయి. ఆ తర్వాత "కంఠంనేని కథానికలు" అనే పుస్తకం ద్వారా నేను ఆయనకు ఫ్యాన్ అయిపోయాను.
ఈ పుస్తకం మొదటి పేజీలో, "చదివితే చదవండి. లేకపోతే పొండి," అనే ధిక్కార ధోరణితోనే ఆయన మనస్తత్వం కొంచెం అర్థమయింది, ఉత్తమ సాహిత్యం అంటే ఇదే అనే గిరిగీసిన తెలుగు సాహిత్యకారులపై ఆయన కోపం అక్కడే తెలిసిపోయింది.
నాకు కంఠంనేని పరిచయమయ్యాక నేను ఈ కథలను చాలామంది చేత చదివించాను. ప్రతి ఒక్కరూ ఆనందించారు, ఆశ్చర్యపోయారు. ఈ పుస్తకం ప్రచురించడం ద్వారా మరింతమందికి అయన సాహిత్యాన్ని చదివి ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది.
త్వరలో Anvikshiki Publishers ద్వారా ఈ పుస్తకం అందుబాటులోకి రానుంది.
మన చదువు యాప్‌లో కె. సదాశివరావు గారు పరిచయం చేసిన గ్రాండ్ మాస్టర్ (రాబర్ట్ ఎ. హైన్లీన్)ల గురించి చదవండి.
https://t.co/QVnsjxNNxt ఈ లింక్ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి.199రూలకే మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి.
'ఎలిజీలు' అనేది గొల్లపూడి మారుతీరావు రాసిన జ్ఞాపకాల సేకరణ. ఇది ఆయన జీవితంలో ఎదురైన వ్యక్తులు, అనుభవాలు మరియు సమకాలీన సామాజిక విషయాలపై ఆయన ఆలోచనలను ప్రతిబింబిస్తుంది.
https://t.co/QVnsjxNNxt ఈ లింక్ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి.199రూలకే మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి.
చూడ్డానికి ఇదొక మామూలు కవర్ పేజ్ లా అనిపించవచ్చు. కానీ దీని వెనుక తెలుగు సాహిత్యాన్ని మార్చేసిన ఒక పెద్ద కథ ఉంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం... "తెలుగులో వెయ్యి పుస్తకాలు కొనే పాఠకులు కూడా లేరా?" అనే ప్రశ్నకు సమాధానంగా, 12 మంది రచయితలు కలిసి చేసిన ఒక ఏడ్వచర్ ఇది. అప్పటికింకా 'ఆన్వీక్షికి' లేదు. 'న్యూ వేవ్ పబ్లిషర్స్' పేరుతో, చేతిలో కేవలం ఈ ఒక్క పుస్తకంతోనే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో అడుగుపెట్టాం. వెయ్యి కాపీలు అమ్మగలమా అని భయపడ్డాం... కానీ వెయ్యి కాదు, ఏకంగా రెండు వేల కాపీలు కొని పాఠకులు మాకు కొండంత ధైర్యాన్నిచ్చారు. ఆ విజయమే, ఆ ఉత్సాహమే నేటి 'ఆన్వీక్షికి' ప్రస్థానానికి పునాది.
Seven years to an idea and seven million thanks to everyone who stood by us in this journey.
శ్రీపతి గారి కథానికలు సమకాలీన గ్రామీణ సమాజంలో నెలకొన్న లోతైన సామాజిక, ఆర్థిక వైరుధ్యాలను ప్రతిబింబించే కథలు. ఈ రచనలు గ్రామంలో ఆర్థిక అసమానతలు పెరగడాన్ని, చిన్న రైతులు అకస్మాత్తుగా సంపన్న వర్గాలుగా ఎదిగి, స్థానికంగా నిరంకుశంగా అధికారాన్ని ఎలా చెలాయించారో వివరిస్తాయి.
పేద రైతులు, కూలీలు ధనిక యజమానుల కింద శ్రమదోపిడీకి గురి కావడం, పెద్ద మనుషులు ఇచ్చే ఏకపక్ష తీర్పుల కింద నలిగిపోవడం కనిపిస్తుంది. కుల భేదాలను రూపుమాపే ఆదర్శాలతో కులాంతర వివాహం చేసుకున్న యువకులు విషాదకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో చూపిస్తుంది. నక్సలైట్ ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాలలో, అమాయకులు పాలకవర్గాలు, పోలీసుల హింసకు బలైపోవడం ఈ కథల్లోని చీకటి కోణం.
ఇక ‘సత్యజిత్ రాయ్ ఎవరు?’ అనే కథానిక, కళాత్మక ఆదర్శాలకు ప్రతీకగా ఉన్న సత్యజిత్ రాయ్ పేరును ఒక కార్యకర్త తన ఉద్యమ నిధుల దుర్వినియోగాన్ని దాచిపెట్టుకోవడానికి ఎలా వాడుకున్నాడో వివరిస్తుంది. ఆత్మ సంస్కారం లోపించినప్పుడు, గొప్ప ఆదర్శాలు కూడా వ్యక్తిగత స్వార్థానికి ముసుగులుగా మారతాయని ఈ కథ సూచిస్తుంది. మొత్తం మీద, ఈ కథలు నాటి సామాజిక పోరాటాన్ని, నైతిక క్షీణతను అద్భుతంగా ఆవిష్కరించాయి.
ఈ కథానికలు కేవలం కల్పిత కథనాలు కావు, ఇవి సమాజంలోని లోతైన వాస్తవాలను, సామాజిక పోరాటాలను ప్రతిబింబించే సోషల్ డాక్యుమెంట్స్.
కథలో main characters - రాము, భాస్కర్, సూర్యం, సదాశివు, సుభద్ర - వీళ్లందరూ సత్యజిత్ రాయ్ సినిమాల అభిమానంతో కలిసిన friends. వీళ్ల friendship ఎలా form అయింది, ఎలా evolve అయింది, ఎలా break అయింది అనేది కథలో చాలా nuanced గా చూపించబడింది. నాకు ఈ కథలో నచ్చిన aspect ఏమిటంటే - ఇది just revolutionary politics గురించి మాత్రమే కాదు. మనుషుల మధ్య relationships గురించి ఈ కథ చర్చిస్తుంది.
ఒక విప్లవోద్యమ నాయకుడు భాస్కర్ అరెస్ట్ అయిన వార్తతో కథ మొదలవుతుంది. ఆ వార్తని భాస్కర్ భార్య సుభద్రకి చెప్పాల్సిన బాధ్యత కథానాయకుడి మీద పడుతుంది. భాస్కర్ కి, కథనాయకుడికి మధ్య ఒక సంవత్సరంగా గొడవ. పెద్దగా మాటలుండవు. వాళ్ల friendship ఎలా మొదలైంది, ఎందుకు గొడవైంది అనే నేపధ్యంలో కథ నడుస్తుంది.
"సత్యజిత్ రాయ్ ఎవరు?" అనే title కూడా చాలా layers ఉన్న ప్రశ్న. ఇది మామూలు ప్రశ్నే! కానీ నిజానికి ఇది identity గురించి, authenticity గురించి. మనం follow చేసే ideals జెన్యూనా లేక పైపైనేనా అనే ప్రశ్నిస్తుంది.
ఈ కథ 1991లో ప్రచురించబడింది, కానీ దీనిలో ఉన్న themes ఇప్పటికీ relevant గానే ఉన్నాయి. Activism vs opportunism, idealism vs pragmatism, personal ethics vs collective goals - ఇవన్నీ ఇప్పటికీ మనం face చేసే dilemmas. కథలో సూర్యం ఒక తప్పు చేసినప్పుడు, అందరూ రకరకాలుగా respond అవుతారు. కొందరు blind loyalty చూపిస్తారు, మరికొందరు moral questions raise చేస్తారు. కొంతమంది అదేమంత పెద్ద తప్పు కాదంటారు. ఇది మనకి ఒక important question వేస్తుంది - మంచి పని కోసం కొంత చెడు చేయడం తప్పుకాదా?
"సత్యజిత్ రాయ్ ఎవరు?" అనే కథ మనలను ఆలోచింపజేస్తుంది - మన నమ్మకాల వెనుక మనం నిజంగా ఎవరం? భాస్కర్, సూర్యం లాంటి పాత్రలు గొప్ప ఆదర్శాలు ఉన్నా, తప్పులు చేస్తారు. మంచి ఉద్యమాలలో కూడా మనుషులు మనుషులే. పెద్ద మాటలు చెప్పడం కన్నా, చిన్న పనులలో నిజాయితీగా ఉండటం ముఖ్యమా? ఒక్కోసారి నిజం చెప్పడానికి ధైర్యం కావాలి, అందరూ ఒకటే మాట మీదున్నా మనం వేరే మాట చెప్పగలగాలి. అని ఈ కథ మనకి నేర్పిస్తుంది.
నిజమైన విప్లవం బయట కాదు, మన మనసులో మొదలవుతుందా?
త్వరలో @AnvikshikiPub ద్వారా వస్తోన్న శ్రీపతి కథల పుస్తకం "సత్యజిత్ రాయ్ ఎవరు?" చదివి తెలుసుకోండి.
“If you only read the books that everyone else is reading, you can only think what everyone else is thinking,” అంటాడు మురాకమీ.
తెలుగులో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. కానీ ఆ కథలకు రావాల్సిన గుర్తింపు రాలేదు. తెలుగు సాహిత్యంలో శ్రీపతి పేరుతో పాపులర్ అయిన పుల్లట్ల చలపతిరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బైరిపురం. విప్లవ రచయితల సంఘం ఏర్పాటు కావడానికి శ్రీపతి రాసిన ‘నర్తోడు’ కథ ప్రధాన పాత్ర వహించింది అంటారు. ఆయన రాసిన ‘మంచుపల్లకి - మరితొమ్మిది’, ‘కాటుక కళ్లు - కథలు’, ‘సత్యజిత్ రాయ్ ఎవరు’ తదితర రచనలు కథా సంపుటాలుగా వెలువడ్డాయి.
ఒకరోజు లైబ్రరీలో ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే నాకు "సత్యజిత్ రాయ్ ఎవరు?" అనే పుస్తకం కనిపించింది. టైటిల్ చూడగానే చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. ముందు సినిమా పుస్తకం అనుకున్నాను. కానీ కథల పుస్తకం అంటే ఇంకా ఆసక్తిగా అనిపించింది. వెంటనే టైటిల్ స్టోరీనే చదవడం మొదలు పెట్టాను.
ఈ కథ చదివాక నేను కొంచెం సేఫు షాక్‌లో ఉన్నాను. ఒకటి ఈ కథ ఒక తరం ఆలోచనలు మన ముందు పెడ్తుంది. నక్సలైట్/విప్లవ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు జరిగే కథ ఇది. అయితే ఈ కథను సత్యజిత్ రాయ్ కు ముడిపెట్టడం నిజంగా చాలా బావుంది. ’తెలుగులో మంచి కథలు చాలానే ఉన్నాయి. మనకి తెలియదు అంతే!’ అని నా నమ్మకాన్ని నిజం చేసిన కథ ఇది.
శ్రీపతి రాసిన ఈ కథ 1990s నాటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక specific time period ని capture చేస్తుంది. ఆ రోజుల్లో విప్లవోద్యమాలు, radical politics, intellectual circles, మరియు cultural movements - ఇవన్నీ ఒక vibrant ecosystem లా ఉండేవి. ఆ రోజుల్లో హైదరాబాద్ లో ఆబిడ్స్ లో ఉన్న పాత పుస్తకాల షాపులు, మాక్స్ ముల్లర్ భవన్ లో జరిగే art exhibitions, నిజాం కాలేజీ మైదానంలో జరిగే political rallies - ఇవన్నీ ఈ కథ జరిగిన కాలాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేశాయి.
నేను ఈ కథ చదివినప్పుడు, నాకు ఆ రోజుల్లో ఉన్న youth activism, idealism గురించి తెలిసింది. ఇప్పుడు social media activism era లో, ఆ రోజుల్లో ఉన్న ground-level activism, face-to-face debates, మరియు real-world consequences ఎలా ఉండేవో ఈ కథ చాలా authentic గా చూపిస్తుంది.
ప్రపంచ సినిమా చర్రిత్రలో greatest twist endings ఉన్న సినిమాల్లో సిక్స్త్ సెన్స్, ఫైట్ క్లబ్, సిటిజెన్ కేన్ ఇలా చాలా సినిమాలు చెప్పుకుంటారు. అలాంటి సినిమాలో వరసలో ఉండే మరొక గొప్ప సినిమా - The Secret in Their Eyes అనే అర్జెంటినా సినిమా. ఈ సినిమాలోని ట్విస్ట్ ఎండింగ్ ఇన్స్పిరేషన్ తోనే కుమారి 21F సినిమా క్లైమాక్స్ కూడా తీశారు. ఆ తర్వాత ఈ సినిమాని హాలీవుడ్ లో కూడా రీమేక్ చేశారు కానీ, ఎండింగ్ మార్చారు. ఈ సినిమా ఒక స్పానిష్ నవల అధారంగా రూపొందించారు. సినిమా చూసినప్పుడు, వావ్, వాట్ ఏన్ ఎండింగ్ అనుకున్నాను. కానీ ఈ మధ్యన Mrunalini Chunduri గారు చాలా ఏళ్ల క్రితం హిచ్ కాక్ మ్యాగజైన్లో వచ్చిన కథలను తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేశారని తెలిసి, ఆ కథలను ఒక పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక చిన్న రెండు పేజీల కథ చదివి షాక్ అయ్యాను. ఏ ట్విస్ట్ ఎండింగ్ అయితే చూసి నేను ఆహా ఓహో అనుకున్నానో ఆ ట్విస్ట్ తో ఉన్న కథ ఈ సంకలనంలో ఉంది.
మృణాళిని గారు ఈ కథలను ఎప్పుడో చాల ఏళ్ల క్రితం చేశారు. పత్రికలో వచ్చాయి. ఈ కథల ఒరిజినల్ రచయిత గురించి గానీ, కథ ఒరిజినల్ టైటిల్ కానీ ఆ పత్రికలో ప్రచురించలేదు. దాంతో ఈ కథల వెనకున్న అసలు కథేంటో తెలుసుకోవడం కష్టమైపోయింది. కొన్ని ఫేమస్ కథలు ఎవరు రాసారో తెలిసింది కానీ, ముఖ్యంగా ఈ కథ ఎవరు రాసారో మాత్రం తెలియలేదు. గూగుల్, AI, Quora, Reddit అన్నీ అడిగాను. దొరకలేదు. కానీ సినిమా చరిత్రలో గొప్పగా నిలిచిన ఒక సినిమా వెనుక ఉన్న అసలు కథ రికార్డ్ చేసిన పుస్తకంగా మాత్రం - Anvikshiki Publishers ప్రచురిస్తున్న "హిచ్ కాక్ మెచ్చిన కథలు" పుస్తకంలోనే దొరుకుతుంది. అసలా కథేంటో తెలుసుకోవాలంటే ఈ సంకలనంలోని "శిక్ష" కథ చదవాలి.
ఈ సంకలనంలో కొన్ని ఇది వరకే తెలిసిన కథలున్నాయి. తెలియని కథలున్నాయి. అన్నింటికీమించి ప్రతి కథలోనూ అద్భుతమైన ట్విస్ట్‌లు ఉన్నాయి. సరదాగా చదువుకోవాల్సిన సంకలనం మాత్రమే కాదు, తెలుగులో క్రైం ఫిక్షన్ రాసేవాళ్లకి మంచి రిఫరెన్స్ గా కూడా ఈ పుస్తకం పనికొస్తుంది.
"హిచ్‌కాక్ మెచ్చిన కథలు – మళ్లీ చెప్పింది మృణాళిని" అనే పేరుతో ఉదయం వారపత్రికలో ప్రచురితమైన రోజుల్లోనే పాఠకుల ఆదరణ పొందాయి. కాలగమనంలో పాత సంచికల్లో మిగిలిపోయిన ఈ కథలను ప్రత్యేకంగా శోధించి సేకరించి, ఈ పుస్తక రూపంలో తీసుకువాడం సంతోషంగా ఉంది.
హిచ్‌కాక్ ఎన్నటికీ పాతబడడు.
అందువల్ల ఈ కథలూ పాతబడవు.
ఇప్పుడు మన చదువు యాప్‌లో శిరంశెట్టి కాంతారావు గారు రచించిన, చదువు యాప్ - ఆన్వీక్షికి పబ్లికేషన్ నిర్వహించిన ఉగాది నవలల పోటీలో బహుమతి పొందిన అన్వేషణ నవల మొదటి భాగం చదవండి.
తెలుగు సాహిత్యం ఇష్టపడేవాళ్లకి ఈ పుస్తకం చదవకపోవడం ఒక పర్సనల్ లాస్ అని గట్టిగా చెప్పగలను.
ఏ పుస్తకం?
జేబు రుమాలు!
ఎవరిదీ పుస్తకం?
బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం రాసిన కథల పుస్తకం.
ఈయనెవరు? ఎప్పుడూ వినలేదే!
ఈ పేరు తెలుగు వాళ్లకి చాలామందికి తెలిసుండకపోవచ్చు.
అది మన దురదృష్టం.
SL భైరప్ప వంశ వృక్షం నవల రాకముందు నలభై ఏళ్ల క్రితమే, ఈయన “వంశవృక్షం,” అనే కథ రాయడమే కాదు. దాదాపుగా రెండిండిలోనే ఒక కథ.
దాదాపు వందేళ్ల క్రితమే ప్యారిస్, ఆఫ్రికా నేపథ్యంలో కథలు రాసారు. ఆయన కథల్లోని ఆధునికత ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా అప్పట్లోనే ఎన్నో దేశాలు తిరిగుండడం ఆయన ఎడ్వాంటేజ్ అయ్యుంటుంది. స్త్రీ పురుష సంబంధాలు, మనలోనే ఉన్న ఎన్నో ప్రపంచాలు, వాటి మధ్య ఉన్న అగాధాల గురించి ఎంతో నైపుణ్యంగా తన కథల్లో చిత్రించారు.
తెలుగులో గొప్ప కథకుల్లో ముందు వరసలో ఉండాల్సిన పేరు బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం గారిది.
ఆయన గురించి తెలిసిన వాళ్లకి కూడా, “జేబు రుమాలు,” కథ గురించి తెలుసుంటుంది. లేదంటే “ప్యారిస్,” అనే కథ తెలిసుంటుంది. ఈయన కథలన్నీ చదివాక, అలా ఎలా వదిలేసుకున్నాం ఈ రచయితని మనం అనుకున్నాను.
తెలుగు సాహిత్యంలో ట్రెండ్ సెట్టర్ ఈయన.
ఈ విషయం నేను మాత్రమే అనడం లేదు. తెలుగు కథకులు - కథన రీతులు అనే పుస్తకంలో మధురాంతకం రాజారాం గారు, “పద్మరాజు, బుచ్చిబాబు గార్లకంటే ముందుగానే మానవ మనస్తత్వ విచిత్ర వైఖరిని చిత్రిస్తూ గొప్ప కథలు రాసిన బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం గారు ఈ కోవలో ట్రెండ్ సెట్టర్‌గా కనిపిస్తారు, అని రాశారు.
ఆయన రాసింది పది కథలే అనుకుంటాను. కానీ ప్రతి కథా విలక్షణమైనదే! అంతే కాదు దాదాపు వందేళ్ల క్రితం రాసిన ఈ కథలను, గత సంవత్సరం రాసిన కథగా ప్రచురించినా ఎవరికీ ఏ అనుమానం రాదు. అప్పట్లోనే ఇంత మాడ్రన్ థాట్స్ ఉండడం ఒక ఎత్తైతే, అప్పట్లనే అంతట సరళమైన భాష రాయడం మరొక ఎత్తు.
ఈ కథలన్నీ చదివాక మీరు షాక్ అవుతారు. ఒకటి, ఇంతమంచి కథలు ఇన్ని రోజులూ మనకి తెలియకుండా ఉన్నందుకు, రెండు, తెలుగులో వందేళ్ల క్రితమే ఇంత ఆధునిక ఆలోనలున్న కథలు ఉన్నందుకు.
ఈయన కథలన్నీ నాకు విపరీతంగా నచ్చాయి. అందుకే ఈ కథలు మరికొంతమంది చదవాలనే ఉద్దేశంతో ఆ కథలన్నీ కలిపి – “జేబు రుమాలు” పేరుతో మీ ముందుకు తీసుకొస్తున్నాం.
తెలుగు సాహిత్యం ఇష్టపడేవాళ్లకి ఈ పుస్తకం చదవకపోవడం ఒక పర్సనల్ లాస్ అని గట్టిగా చెప్పగలను.
త్వరలో ఆన్వీక్షికి ద్వారా ఈ పుస్తకాన్ని తీసుకురావడం మాకు చాలా గర్వంగా ఉంది.
#HyderabadBookFair2025 #38thHyderabadBookFair
#ఇంకాఅయిపోలేదు