ఈరోజు విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన జహాపనా ఎత్నిక్ మెన్స్ వేర్ షో రూమ్ ను ప్రారంభించాను. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు ఎన్ ఎమ్ డి ఫరూక్ గారు, జలీల్ ఖాన్ గారు తదితరులు కూడా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హతే ప్రధాని @narendramodiకి లేదు. ముందు ప్రత్యేక హోదా ఇచ్చి, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చి ఆ తరువాతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడండి.
నరేంద్రమోదీది ఓటమిని భరించలేని తత్వం, అందుకే అసహనంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రిపై దాడి జరిగినా ఖండించలేదు. అంటే దాడులు చేసి ఆనందపడుతున్నారా..? ఇది నీచమైన రాజకీయం కాదా..? నిన్నటిదాకా వ్యవస్థాగత దాడులు చేశారు. ఇప్పుడు భౌతిక దాడులకు తెగబడ్డారా..?
ఎన్నికల సంఘంపై గతంలో ఎప్పుడైనా ఇన్ని విమర్శలు వచ్చాయా..? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు..? ఆర్బీఐపై, సీబీఐపై, ఈడిపై ఎప్పుడైనా ఇంత విమర్శలు చెలరేగాయా..? 5 ఏళ్లలో ఏపి విభజనపై ఒక్క మీటింగ్ కూడా ఎందుకని పెట్టలేదు..? ఇది ప్రధాని నరేంద్రమోదీ వైఫల్యాలు కావా..?
@ncbn ఆ అంజనీ పుత్రుడి శక్తి ఆశీసులు ఎప్పుడు మీపై ఉండాలని
మన రాష్టాన్ని సరైన రీతిలో పాలించే క్రమంలో ఆ అంజనేయుడి తోడు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను #cmsir .....
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...
@ncbn ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రపంచంలోనే ఒక ప్రత్యేక రాష్టంగా నిలపాలనే మీ తపన తాపత్రయం యువతకు ఒక కొత్త ఉత్సహాన్ని కలిగిస్తుంది....
#ThankYouCMsir#HappyBirthdayCBN sir
ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా చూడాలన్న నా లక్ష్య సాధనలో భాగస్వాములుగా నిలిచిన ప్రజలు, ఆధికారులు, ఉద్యోగులు, మేధావులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నా జన్మదినాన్ని గుర్తుంచుకొని అభినందనలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
మన రాష్ట్రానికి మన ప్రజలకూ కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఈ యజ్ఞంలో భాగస్వాములే. రాష్ట్రం కోసం, దేశం కోసం , ప్రజాస్వామ్యం కోసం మనం ఎలుగెత్తిన గళం ఈ తరాల కోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం కూడా.
ధర్మ పోరాట దీక్ష ఆరంభించి నేటికి సంవత్సరం అయింది. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డాను. అప్పుడప్పుడూ కొంత ఆలస్యం అయినా అంతిమంగా ధర్మానిదే విజయం అని నా అనుభవంలో నేర్చుకున్నది.
@ncbn ఆడపడుచులకు తోబుట్టువై అమ్మ లకు పెద్ద కొడుకువై యువతకు ఆదర్శం అయిన మీరు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మళ్ళీ మన రాష్టాన్ని మిరే పాలించాలని కోరుకుంటూ.....జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayChandraBabuNaidu#HappyBirthdayCBN
ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం. ఇన్ని సంవత్సరాలలో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ నా శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి నన్ను కార్య సాధనకు మరింత ప్రేరేపించాయన్నది నిజం.
పోలింగ్ ఏజెంట్స్ మరియు బూత్ కి 200 మీటర్ల దూరంలో ఉన్న కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండండి
Evm పని చేయని మొదటి నిమిషం నోట్ చేయండి అలాగే అధికారికంగా పోలింగ్ సిబ్బందితో కూడా నమోదు చేయించండి
ఒక వేళ 3 గంటలు Evm లు పని చేయకపోతే ఇక ఈ రోజుకి పోలింగ్ చెయ్యకూడదు అని డిమాండ్ చేయండి