@naralokesh More than 4 decades of dedicated association with TDP. • Senior and experienced political leader from Kurnool district. • Strong representation of the BC–Valmiki community
ఆంధ్రప్రదేశ్ లో 2024 జూన్ లో తెదేపా-జనసేన-భాజపా కూటమి ప్రభుత్వం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో, అత్యధిక మెజారిటీతో అధికార పగ్గ���లు చేజిక్కించుకుంది. ఈ అత్యధిక మెజారిటీకి 90 శాతం క్రెడి��్ జగన్ ది మాత్రమే కానీ, ఈ సోకాల్డ్ కూటమి గొప్పతనం కాదు అన్నది ప్రజలకు తెలుసు. ఆ విషయం కూటమి పక్షాలకు తెలుసా లేదా అన్నదే మనకు ఇంకా తెలియడం లేదు.
చూస్తూ చూస్తూ రెండేళ్ళు చులాగ్గా గడిచిపోయింది. రాష్ట్రంలో గ్రోత్ ఇంజన్ శుభ్రంగా పని చేస్తోంది. చేస్తున్న భజనకు అనుగుణంగానే కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది. సరే, ఇంకా ఎక్కడైనా చిడతలు, తాళాలు దొరికితే కొనుక్కుని మరీ మరింకాస్త భజన చేయండి. ప్రజలకొచ్చిన నష్టమేమీ లేదు. మిమ్మల్ని అందలం ఎక్కించిన ప్రజలకు అందులో సమస్య ఏమీ లేదు. కానీ, ప్రజలు ఎవర్నైతే దించి విసిరికొట్టి పదకొండు సీట్లకు పరిమితం చేసారో, ఎవరి అవినీతి కథలు పుంఖాలు పుంఖాలుగా హరికథలు, బుర్రకథలుగా ప్రజలకు చెప్పి చెప్పి ఊదరగొట్టి మీరు అధికారంలోకి వచ్చారో, అలా అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తర్వాత కూడా వార�� పట్ల మీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మాత్రం చాలా అసహ్యకరంగా, అవమానకరంగా ఉంది. ప్రతీ అడ్డగాడిదనీ మీ కూటమి మూడు పక్షాల్లో ఏదో ఒకదానిలో నిర్లజ్జగా, నిస్సిగ్గుగా చేర్చుకున్నారు, చేర్చుకుంటున్నారు. ఏ ఒక్క ప్రముఖ నేరస్తుడు కానీ, నేరస్తురాలు కానీ ప్రస్తుతం జైల్లో లేరు. ప్రభుత్వ శాఖల్లో కానీ, అధికారుల్లో కానీ, వారి పనితీరులో కానీ, వారి అవినీతిలో కానీ ఎలాంటి మార్పు కంటికి కనిపించడం లే��ు, చెవులకు వినిపించడం లేదు. వచ్చిన మొదటి ఏడాదిలో కాసిని రోడ్లు వేశారు, ఇక తర్వాత అవి కూడా వదిలేశారు. పురపాలికలన్నీ ఘోరంగా ఉన్నాయి. ఏ పని చేయడానికీ, ఏ శాఖలోనూ డబ్బుల్లేవు. అన్నీ మీ ఉచిత పథకాలకే అంకితమవుతున్నాయి లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతోంది.
వెలిగొండ, పోలవరం, డీఎస్సీ ఉద్యోగాలు లాంటి జరుగుతున్న మంచి పనులు నీ కంటికి కనపడడం లేదా అని చాలామంది మీద పడి కరిచేవారు ఉంటారు. వారి���ి నేను చెప్ప��ది ఒక్కటే. వాటిమీద దుష్ప్రచారం చేస్తున్నవారిని మీరు ఎంత గొప్పగా అడ్డుకుంటున్నారు ? వారి మీద చట్టపరంగా ఏమి చర్యలు తీసుకుంటున్నారు ?
🚫తిరుమల లడ్డూ విషయం ఏమైంది?
🚫మదనపల్లి ఫైల్స్ విషయం ఏమైంది?
🚫అప్పుడెప్పుడో జరిగిన వివేకా హత్య విషయం ఏమైంది?
🚫2019-24 మధ్యకాలంలో జరిగిన అనేకానేక అక్రమాల కేసులన్నీ ఏమయ్యాయి?
🚫అమరావతి రైతుల మీద పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకున్నారా, లేక దానికి కూడా రెం���ేళ్ళు సరిపోలేదా ?
🚫పెద్దిరెడ్డి ఆక్రమణల విషయం ఏమైంది?
🚫ద్వారంపూడి అక్రమాల విషయం ఏమైంది?
ఆడుదాం ఆంధ్ర అవకతవకల విషయం ఏమైంది?
🚫అసలు మా చెవుల్లో రక్తాలు తెప్పించి ఊదరగొట్టిన రెడ్ బుక్ ప్రస్తుతం ఏ అల్మైరాలో బూజు పట్టింది ?
🚫మీరు ఎంత భజన చేసినా సుప్రీంకోర్టులో 17ఎ తీర్పు ఇంకా ఎందుకు రావడంలేదు?
🚫పదమూడేళ్ళకు పైగా బెయిల్ మీద ఉన్న ఆర్థిక ఉగ్రవాదిని ఏ అదృశ్య శక్తి కాపాడుతోందో రెండేళ్ళ��� దాటినా కనుక్కోలేకపోయారా లేక కనుక్కున్నా కూడా ఉదాసీనత వహిస్తున్నారా?
ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, మీరు ఈ దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కాబట్టి, మీ పరిపాలనానుభవం ఒక పది తరగతుల టెక్స్ట్ బుక్కులతో సమానం కాబట్టి, ప్రజలకు సహజంగానే మీమీద ఎక్స్పెక్టేషన్స్ ఎవరెస్టు స్థాయిలో ఉంటాయి. కానీ 1995-99 నాటి ముఖ్యమంత్రిలాగా ఉంటానని చెప్పిన మీరు, అందులో కనీసం పావు భాగం లాగా కూడా లేకపోవడం వ��్ల మీమీద గౌరవం, అభిమానం, మర్యాద, ఇవన్నీ తగ్గుముఖం పడుతున్నాయని గ్రహించుకోండి. 1983 నుంచీ పార్టీని చూస్తూ పెరిగిన మావంటివారికి అది నచ్చదు. మీ పరువు కానీ, పార్టీ పరువు కానీ తగ్గిపోతూంటే, నిందలు పడుతూంటే చూసి సహించలేం. అదే సమయంలో, గుడ్డిగా మిమ్మల్ని అన్నింటికీ సమర్థించనూ లేము.
కాబట్టి, దయచేసి మీ ప్రాధాన్యతలు, పద్ధతులు మార్చుకోండి. రోజూ భజన చేస్తే కానీ ముద్�� దిగనివారికి భజన చేసుకోండి మాకేమీ నష్టం లేదు. కానీ, ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో వాటిని మరువకండి. లోపాయకారీ ఒప్పందాలు చేసుకుంటున్నారు అన్న నిందలు రానివ్వకండి. ఏ పార్టీని, ఏ నాయకుణ్ణి రోజంతా తిట్టుకుంటామో, అందులోంచి వచ్చే వ్యక్తులను ఆదరించకండి, మీ కూటమి పార్టీల్లో చేర్చుకోకండి. వాళ్ళు మీ విధానాలకు ఆకర్షితులై రావడం లేదు, వారి మీద కేసులు తప్పించుకోవడానికే వస్తున్నారు అన్న��ి బహిరంగ రహస్యం. మీరు వాళ్ళను ఎంటర్టైన్ చేస్తే, వాళ్ళమీద కంటే ముందు మీ మీదనే అనుమానం వస్తుంది.
దయచేసి ఇకనైనా జాగ్రత్త పడండి.
@ncbn 🙏🙏