మడకశిరలో కూటమి 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించిన సందర్భంగా మున్సిపాలిటీతో పాటు 5 మండలాల జడ్పిటిసి,ఎంపీపీ స్థానాల్లో కూటమి విజయాన్ని పురస్కరించుకుని విజయోత్సవ ర్యాలీ.
తేదీ: 12-11-2026
సమయం: ఉదయం 10 గంటలకు.
#NDAsweepsAP#APLocalBodyElections#CheppaamChestunnaam#Madakasira #MSRaju
The municipal verdict is a mandate to serve, not to celebrate. We accept it with humility as the people's blessing for the good governance of the last two and a half years. Congratulations to all the victorious TDP, JanaSena and BJP candidates, and thank you to our three parties' leaders and workers for their collective effort.
Now that the municipal elections are over, our only focus is service, for every citizen, beyond party lines. There is no room for arrogance. Keeping the trust people have placed in us is our real responsibility, and we will work harder than ever to deliver on their aspirations.
@BJP4Andhra@JanaSenaParty@JaiTDP
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Lokesh Anna sits for an interview, and @YSRCParty 's first reflex is caste.
@ysjagan , Kamma leaders stand right beside you in your own party. Yet Kamma hate is the only tool you have left to stay relevant.
It was never about Kamma, Reddy, Kapu, Raju, Brahmin, Vysya, BC, SC , ST or any caste .
It is about JOBS .. Lives & Tomorrow..
A financial criminal out on bail and his paid ₹5 PayTM handles can twist this a thousand ways. The Youth aren't buying it.
TDP has always believed in only two castes: the rich and the poor.
And we have always stood with the poor 🔥
#NaraLokesh #CBN #NDAStaysStrong #AndhraPradesh
"మడకశిరను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం"
మడకశిర మున్సిపల్ చైర్మన్‌గా గుండుమల శారద గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో, ఈరోజు మడకశిర ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ ఎం.ఎస్. రాజు గారు మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయకుండా, మడకశిర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే నూతన కౌన్సిలర్లతో కలిసి ప్రజల వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేస్తామని వెల్లడించారు.
అలాగే, రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గుండుమల శారద గారు తన విజయానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మడకశిర ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల నమ్మకమే మా బాధ్యత.. అభివృద్ధే మా లక్ష్యం.
#NDAsweepsAP #MSRaju #Madakasira #APLocalBodyElections #CheppaamChestunnaam
మడకశిర మున్సిపాలిటీలో కూటమి క్లీన్‌స్వీప్!
మొత్తం 23కి 23 స్థానాల్లో ఘన విజయం.. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన గుండుమల శారద రాధాకృష్ణ!
ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ.
ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు గారు మాట్లాడుతూ.. “గెలుపు గర్వం కోసం కాదు.. అభివృద్ధి బాధ్యత కోసం. ప్రమాణ స్వీకారానికి ముందే ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరించాలి” అని పిలుపునిచ్చారు.
ప్రజల నమ్మకానికి ప్రతిరూపం ఈ విజయం.. అభివృద్ధే మా లక్ష్యం!
#MSRaju #CheppamChestunnam #Madakasira #NDAsweepsAP #APLocalBodyElections
గత వైసీపీ పాలనలో పంచాయతీ నిధులన్నీ దారి మళ్లించి మాయం చేయడంతో గ్రామాల అభివృద్ధి ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లె పండుగ పేరుతో రూ.20,600 కోట్లతో గ్రామాలను అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
#AndhraPradesh
అమరాపురం మండలంలో జోరుగా జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థుల ముందస్తుగా విజయ ప్రచారం.
ఈరోజు అమరాపురం మండలంలో జడ్పిటిసి మరియు ఎంపిటిసి అభ్యర్థుల ప్రచార కార్యక్రమంలో గౌరవనీయ ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది కేవలం సాధారణ స్థానిక ఎన్నికల ప్రచారం మాత్రమే కాదని, ముందస్తు జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థుల విజయ ప్రచారమని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారు మాట్లాడుతూ.. "గెలిచింది మేము, రోడ్లు వేసింది మేము, లైట్లు వేసింది మేము, తాగునీరు అందించింది మేము, అభివృద్ధి చేసింది మేము, సంక్షేమ పథకాలు ఇచ్చింది మేము! అదేవిధంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఓట్లు అడిగేది మేము, గెలిచేది కూడా మేమే! ప్రతిపక్ష నేతలకు మా అభివృద్ధిని చూసి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు, వారి ఫోటోలు పెట్టుకుని తిరిగే అర్హత కూడా వారికి లేదు" అని తీవ్రంగా స్పష్టం చేశారు.
అలాగే రాబోయే 2028 జనవరి లోపు అమరాపురం చెరువుకు నీళ్లు తెస్తామని ఈ ప్రచారంలో వారు ఘనంగా హామీ ఇచ్చారు.
ప్రచారంలో పాల్గొన్న గ్రామాలు మరియు పంచాయతీలు:
ఈ విజయ ప్రచార యాత్ర బసవనపల్లి, ఆలదపల్లి, శివరం, హేమవతి, నిద్రగట్ట, హలుకూరు, అమరాపురం, తమ్మడేపల్లి, వలస అగ్రహారం, మద్దనకుంట తదితర గ్రామాల్లో ఘనంగా సాగింది.
#MSRaju #CheppamChestunnam #Madakasira #MadakasiraMLA #APLocalBodyElections
కూటమి విజయయాత్రే లక్ష్యంగా గుడిబండలో జోరుగా ప్రచారం.
కూటమి విజయయాత్రే లక్ష్యంగా గుడిబండ మండలంలో స్థానిక కూటమి పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ప్రచార కార్యక్రమం హోరెత్తింది. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించాను.
#MSRaju #CheppamChestunnam #Madakasira #MadakasiraMLA #APLocalBodyElections
#3yrsSinceCBNreleased#ChandrababuNaidu#AndhraPradesh
అక్టోబర్ 31, 2023... ప్రజల కోసం పోరాడినందుకు కక్షగట్టి తనపై అక్రమ కేసులు పెడితే... చేయని నేరానికి 53 రోజులు జైల్లో ఉండి మధ్యంతర బెయిలు పై చంద్రబాబుగారు బయటకు వచ్చిన రోజు. నిజం, న్యాయం గెలిచిన రోజు. ఆయనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు జగన్ పై ఆగ్రహించిన ప్రజలే, 2024 ఎన్నికల్లో జగన్ కు శిక్ష వేశారు. చంద్రబాబుగారిని ఆశీర్వదించి పట్టం కట్టారు.
నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు...53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు. అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు...యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ఘటన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో....ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కి నాటి పాలకుల కుట్రలపై నిరసనలు తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు... రైతుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు...విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు...సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద్దతు అపూర్వం. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' అని మీ వద్దకు వస్తే....వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్టారు.
నాకు మద్దతు పలికిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి , ప్రజాస్వామ్యవాదికి, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నా కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన, మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. నా కోసం నిలిచిన మీకోసం చివరి వరకు నిలబడతాను. మీ నమ్మకం, అభిమానం నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 చేస్తానని పునరుద్ఘాటిస్తున్నాను.
పసుపు జెండా సాక్షిగా తొడకొట్టి చెప్తున్నాం..
ఇది పసుపు సైన్యం ఇచ్చిన ధైర్యం
జెండా జోలికి వస్తే ఎవడైనా సరే తొక్కేస్తాం..
ప్రజల కోసం తల వంచుతాం.. తేడా వస్తే మీసం మేలేస్తం..
జై తెలుగుదేశం.. జైజై తెలుగుదేశం
#CheppaamChestunnaam#APLocalBodyElections