మహాపచారం - మహాపాపం!
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో దశాబ్దాల నాటి హనుమంతుని ఆలయం నేల మట్టం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
విషయం తెలుసుకుని.. ఆలయ కూల్చివేతను అడ్డుకుని నిరసన తెలియజేస్తున్న టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు
#SaveTemplesFromTDP
#SadistChandraBabu
అక్క రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది
Akkkkkkkkooo @realyssharmila
ఇదేందక్కా?
నీ ప్లాస్టిక్ ముహం ఎక్కడ పెట్టుకుంటావ్ అక్కా?
సపోర్టు చేస్తున్న పసుపు పందుల పచ్చ ప్రతివతలు ఎక్కడున్నోరో
కృత్రిమ కొరత సృష్టించి.. బియ్యంలో భారీగా దోచుకుంటున్న చినబాబు
నెలల వ్యవధిలోనే అమాంతం పెరిగిపోయిన బియ్యం ధరలు.. ఇప్పుడు 26 కేజీల బస్తా రూ.2,700పైగా ధర పలుకుతున్న వైనం
పెంచిన రేట్లతో భారీగా జేబులు నింపుకుంటూ.. చినబాబుకి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కి ముడుపులు ఇస్తున్న ప్రముఖ బ్రాండ్ల మిల్లర్లు
మీ జేబులు నింపుకోవడానికి.. జనం జేబులకి చిల్లు పెడుతున్నారా @ncbn, @naralokesh ?
#ScamsterBabu
#CBNFailedCM
#LooterLokesh
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు?
▪️ 2024-25 విద్యా సంవత్సరం
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు.
కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించింది.
ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్ లెక్కలే.
▪️2025-26 విద్యా సంవత్సరం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు?
2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు.
కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు.
బడ్జెట్ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి.
అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి.
మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు.
మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి.
▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం
2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు.
ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్ నెల కూడా రాలేదు.
అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు?
ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు?
వారికి చెల్లింపులు ఎలా చేశారు?
▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్
వైయస్సార్సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి.
4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి.
అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం.
మరి 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి?
మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది.
మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా?
2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది.
▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు?
ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం.
మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు?
పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి?
గతంలో మా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు?
▪️వాస్తవాలు చూస్తే..
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి),
2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు.
దీనికి అదనంగా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం.
కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే.
అంటే రూ.2,800 కోట్లు.
ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు.
▪️బకాయిలు వెంటనే చెల్లించండి
చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి.
ఇదిగో ఆధారాలు…
.@ncbn గారూ.. పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయాల్లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, ప్రజల సంపదను PPP ముసుగులో కట్టబెట్టేందుకు మీరు చేస్తున్నది భారీ స్కాం.
మా ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొస్తే, అందులో 5 కాలేజీలను మేమే ప్రారంభించి, మరో 3 కాలేజీలను తరగతులకు సిద్ధం చేశాం. ఏడాదికి రూ.1000 కోట్లు పెడితే మిగిలిన 9 కాలేజీలు కూడా పూర్తవుతాయి. కాని, మీరెందుకు ఆ పనిచేయడంలేదు?
మీ PPP స్కెచ్ చూస్తేనే ఇది పక్కా స్కాం అని అర్థం అవుతోంది కదా?
▪️ కొన్ని కాలేజీలు పూర్తై, మిగిలినవి వివిధ దశల్లో ఉన్న ఈ కాలేజీలను తెగనమ్ముతున్నారు.
▪️వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు!
▪️ సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే అవకాశం!
▪️ ఈ కాలేజీలకు VGF పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ
▪️ అంతటితో ఆగకుండా డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం. మరి ఇది దోపిడీ కాక ఏమిటి? ఈ దోపిడీ ఖర్చు నెలకు రూ.5 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి.
భూములు ప్రభుత్వానివి! భవనాలన్నీ ప్రభుత్వ నిధులతో నిర్మించినవి! VGF రూపేణా ఇవ్వనున్న డబ్బుకూడా ప్రజాధనమే! సిబ్బందికి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం నుంచే. మరి ప్రైవేటు సంస్థల పేరిట ఇది స్కాం కాకపోతే మరి ఏంటి?
మేం తీసుకొచ్చిన ఈ కాలేజీలన్నీకూడా టీచింగ్ ఆస్పత్రులే. పేదలకు ఉచితంగా నాణ్యమైన మల్టీ స్పెషాల్టీ వైద్యం అందడమే కాదు, సగం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి, మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటువారితో పోలిస్తే అతితక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఆ డబ్బుతో ఈ కాలేజీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పటిష్టమైన మోడల్‌ను మేము గతంలో రూపొందించాం. నిధులకోసం ఆ మేరకు బ్యాంకులతో లింకేజీకూడా చేశాం.
టీచింగ్ ఆస్పత్రులు కాబట్టి, ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్లు, చదువుకునే వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులే వైద్య సేవల్లో నిమగ్నం అవుతారు. టీచింగ్ ఆస్పత్రుల వల్ల, ఈ మెడికల్ కాలేజీల నిర్వహణలో వయబిలిటీ ఉంటుంది. అలాంటి ఏర్పాట్లు ఉండగా, పీపీపీ ముసుగులో అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
అంతేకాదు, ఈ మెడికల్ కాలేజీలు, ఆయా జిల్లా పరిధిలో ఉండే ఏరియా ఆస్పత్రులు, CHCలు, PHCలు, విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమై, ఒక నెట్వర్క్ మాదిరిగా ఏర్పడి గ్రామస్థాయి వరకూ నాణ్యమైన మల్టీస్పెషాల్టీ వైద్యసేవలు అందించగలుగుతాయి. ప్రభుత్వ వైద్యసేవల క్వాలిటీ పెరగడంతో, తద్వారా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సరసమైన ధరలకు వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాలేజీలను తెగనమ్మడం దారుణం కాదా?
చంద్రబాబుగారూ.. ఇప్పటికే మీ పాలనలో ప్రభుత్వ వైద్యరంగాన్ని దెబ్బతీశారు.
▪️ రూ.25 లక్షల ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నెట్వర్క్ ఆస్పత్రులకు వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లింపులు, బాండ్ల రూపంలో అప్పులుగా ఇస్తుండటంతో, ఆ తర్వాత కూడా రూ.3వేల కోట్ల బకాయిలు ఇంకా ఉండడంతో, ఆ నెట్వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు దూరమవుతున్నాయి.
▪️ మా హయాంలో GMP/WHO ప్రమాణాల మందులు అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూది కూడా లేవు.
▪️ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61% ఉంటే, మా జీరో వేకెన్సీ పాలసీతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ ఖాళీలను 4%కి తగ్గించాం. ఇప్పుడు ఆ పాలసీకి మంగళంపాడి, గవర్నమెంటు ఆస్పత్రులను అదే పాతపరిస్థితికి తీసుకువచ్చి, మళ్లీ ఖాళీలు పెంచుతున్నారు.
▪️ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులను పూర్తిగా నిలిపేశారు.
▪️విలేజ్ క్లినిక్స్‌ను నిర్వీర్యంచేశారు.
▪️108, 104 పరిస్థితి అగమ్యగోచరంగా తయారు చేశారు.
చంద్రబాబుగారూ…, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, మా పార్టీ ఆధ్వర్యంలో కోటిమంది ప్రజలు సంతకాలు చేసి మీ నిర్ణయం పట్ల నిరసన తెలిపినా కూడా, మీరు ముందడుగు వేయడం దుర్మార్గం. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యవహారంలో, ఎవరు ఈ స్కాంలో భాగస్వాములైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అరెస్టులకూ వెనుకాడం! మీరు స్కాంలు చేస్తూ ప్రజల ఆస్తులను లూటీ చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. తగిన గుణపాఠం చెప్తారు.
#SaveMedicalCollegesInAP
అధికారులు:- కందిపప్పు ధరలు పెరిగాయి
బాబు :- కేంద్రంతో మాట్లాడతా!
ఓహో మీరు అధికారంలో అంటే ధరల నియంత్రణ కేంద్రం పరిధిలో ఉంటుంది అన్న మాట ..అదే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే నిత్యావసర వస్తువుల ధరలు పెంచాడు అని గగ్గోలు పెడతారు అన్నమాట 😏😏😏
రేపు ఫించన్ల పంపీణీకి వాలంటీర్ల మాదిరి ఇంటింటీకి వెళ్ళనున్న చంద్రబాబు.
ఈ రెండు మాటల మీద క్లారిటీ ఇవ్వాలి.
గోనెసంచులు మోసుకుని వెళతారా?
ఇంట్లో అందరూ ఉన్నపుడే వెళతారా?
#YSRCP#YSJagan
పార్టీ ఆఫీసులు కూల్చడానికా ప్రజలు అధికారం ఇచ్చింది.
టిడిపి సెంట్రల్ కార్యాలయానికి అనుమతి ఉందా.
టిడిపి కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించాలి.
- జడ శ్రావణ్ కుమార్