త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
•ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు
•శ్రీకృష్ణునికి, శ్రీరామ స్వామి, అయ్యప్పస్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
•దీపాలంకరణ, మీనుట్టు, వేది వ���ిపాడు సేవల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన గావించారు. దీపారాధనతోపాటు ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. శంఖుచక్రాలతోపాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీ రామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించి, స��ధ్యాకాల అర్చనలు నిర్వహించారు. శ్రీరామ స్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణునికి, అయ్యప్ప స్వామకి పట్టు వస్త్రాల సమర్పించారు. అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టుకి కుడివైపు ఉన్న దక్షిణా మూర్తికి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడికి, అనంతపద్మనాభ స్వామి వారి శయన రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేల్ శాంతి(ప్రధాన అర్చకులు) శ్రీ రామన్ తిరుమేని గారు పూజ అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. అంతకు ముందు శ్రీరామ స్వామి క్షేత్రానికి విచ్చసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొచ్చిన దేవస్థానం బోర్డు ఛైర్మన్, శ్రీరామ స్వామి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
•తీర్వా నదిలో చేపలకి ఆహారం.. వేది వజిపాడు సేవకు విరాళం
శ్రీరామ స్వామి వారి దర్శనానికి ముందు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అదే ప్రాంగణంలో ఉత్తర దిక్కున ఉన్న శ్రీకృష్ణుని శ్రీ పవన్ కళ్య���ణ్ గారు దర్శించుకున్నారు. అనంతరం మీనుట్టు (చేపలకు ఆహారం అందించడం) సేవలో పాల్గొన్నారు. తీర్వా నదికి ఆలయం అనుకుని ఉండడంతో, ఆ నదిలో చేపలకి ఆహారం అందించడం ఆచారంగా వస్తోంది. ఇక్కడ చేపలకు ఆహారం అందించి మత్స్యావతార రూప���డైన విష్ణుమూర్తికి స్వయంగా ఆహారం అందించినట్టు భక్తులు భావిస్తారు. స్వామి దర్శనానంతరం వేడి వజిపాడుగా పిలిచే బాణాసంచ పేల్చే సేవలో పాల్గొన్నారు. త్రిప్రయార్ ఆలయం తెరిచి ఉన్నంత సమయం బాణాసంచా పేల్చడం ఇక్కడ ఆచారం. సీతాదేవి ఆచూకి లభించిన విషయాన్ని తన పొలికేక ద్వారా శ్రీ ఆంజనేయ స్వామి వారు శ్రీరాముడికి చేరవేయగా, రామస్వామి బాణాసంచ పేలుడుతో బదులిచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. దా���్నే త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో నేటికీ పాటిస్తున్నారు. వేది వజిపాడుగా పిలిచే ఈ సేవలో పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, 1,001 టపాసులు పేల్చేందుకు అయిన మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. చివరిగా శ్రీ శాస్తగా భక్తులు కొలుచుకునే అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
త్రిప్రయార్ లోని శ్రీరామ స్వామి విగ్రహం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిచే పూజలందుకున్నట్టు ప��రాణాలు చెబుతున్నాయి. ద్వారకానగరం సముద్ర గర్భంలో కలసిపోయిన అనంతరం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కేరళం తీరానికి కొట్టుకువచ్చినట్టు చరిత్ర చెబుతోంది. ��ేరళంలో ఆలయానికి సమీపంలో ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం స్వామి సేవలో పాల్గొన్నారు.
I am deeply grateful to the Government of Andhra Pradesh for nominating me as a Special Invitee to the Trust Board of Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri.
My heartfelt sincere thanks to Hon’ble Chief Minister Sri. @ncbn garu and Endowments Minister Sri. @AnamReddy_TDP garu for placing their trust in me.
I humbly accept this divine responsibility and look forward to serving Durga Ammavaru and contributing to the temple’s activities with utmost devotion and sincerity. 🙏
Sree Maatre Namaha 🙏🏻
Hon’ble Prime Minister Sri @narendramodi Ji,
My Heartfelt gratitude for your warm birthday wishes, kind words, and blessings. Your affection and encouragement are deeply humbling and strengthen my resolve to serve the people of Andhra Pradesh with greater commitment.
Carrying the dreams and aspirations of 1.4 billion Indians, your unwavering commitment towards building a Viksit Bharat continues to inspire the Nations aspirations. Under your visionary leadership and through the collective strength of the NDA, we shall continue working with determination for good governance, development, and the welfare of our people.
I seek your continued blessings and guidance as I carry forward my responsibilities in the service of Andhra Pradesh and Bharat.
@PMOIndia
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం
* రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
* నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
* రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు ప���డింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమ��్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, ��ాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను స��ద్ధం చేయనున్నారు.
నవంబర్ నుంచి పనులు ప్రారంభం
ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీపై జనసేన నేతల ఫిర్యాదు
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిపై ఈస్ట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్
నెల్లూరులో డీఎస్సీ అభ్యర్థుల పేరుతో చేస్తున దీక్షలో శ్రీవారి భక్తి గీతాన్ని అవహేళన చేశారు
శ్రీవారి నామాల పాటను పేరడీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు
సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఘటనపై టీటీడీ తక్షణమే స్పందించాలని జనసేన నేతల విజ్ఞప్తి
ఎమ్మెల్సీ, ఇతర నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని ,హేమ కుమార్ కిషోర్ ,మనోజ్,సాయి దేవ్ ,సాయి,పురుషోత్తం,ఆది లు మరియు జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Message is clear..
కళ్యణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ మొన్న ఏడ్చిన వాళ్ళని… మళ్లీ ఏడిపించేశారు కద సార్ @PawanKalyan 😁😁😁
జనసేన పార్టీ పేరుని వంకర్ టింకరగా మాట్లాడే సోకా��్డ్ ఫ్యాన్స్ "ప్లీజ్ క్రై మోర్" 🤡