రుషికొండ భవనం ప్రభుత్వం వాడుకోవాల్సిందే!
రూ.500 కోట్ల ఖర్చుతో నిర్మించిన రుషికొండ భవనాలను లీజుకు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఈ భవనాల రోజువారీ నిర్వహణ, నిరంతర సంరక్షణ వ్యయం చాలా ఎక్కువ. వ్యాపార కోణంలో చూస్తే పెట్టిన పెట్టుబడికి తగ్గట్లుగా ఆదాయం రాబట్టడం కష్టమని అంతర్జాతీయ, జాతీయ హోటల్ చైన్లు నిర్ణయించుకుని వెనక్కి పోయాయి.
సీఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘన, పర్యావరణ అనుమతులు, విచారణలకు సంబంధించి కోర్టులలో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, భవిష్యత్తులో ప్రభుత్వ శాఖల తనిఖీలు, చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయనే భయంతో ప్రైవేట్ సంస్థలు దూరంగా ఉంటున్నాయి.
ఈ భవనాలను ఒక సాధారణ లగ్జరీ రిజార్ట్ లేదా హోటల్‌గా మార్చడానికి అంతర్గత నిర్మాణాల్లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని.
నూతన ప్రభుత్వం ఈ భవనాలను పర్యాటక హోటల్‌గా కాకుండా ప్రొటోకాల్ భవనాలుగా, వీఐపీ గెస్ట్ హౌస్‌లుగా లేదా ప్రభుత్వ ముఖ్య శాఖల కార్యాలయాలు, సమావేశ ప్రాంగణాలుగా ఉపయోగించడం తప్ప మరో ఆప్షన్ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
#RushikondaPalace #Visakhapatnam
BIG:
TG govt has constituted a committee to probe land-related irregularities of BRS leaders in multiple districts.
Telangana government has formally ordered a land inquiry into issues involving KCR, KTR, Harish Rao, Gangula Kamalakar, Palla Rajeshwar Reddy, Rohith Reddy, Jagadishwar Reddy and others.
From Erravelli and Janwada to Aziznagar, Shankara Hills and Mid Manair, the panel can call for records, fix accountability and recommend action.
And the G.O. leaves room to add more villages and issues.