💧మా కర్ణాటక ప్రాంతంలో తీవ్ర నీటి సమస్య ఉంది.కలుషిత నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.🏥
🚰 మా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగల నాయకుడు శ్రీ @PawanKalyan గారు.🙏
కర్ణాటక వీరమహిళ.✨
Video Link - { https://t.co/UnWvjNzztz… }
#JanaSenaniInNewDelhi#JanasenaParty
జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ
- 14 మంది సభ్యులతో ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఏర్పాటు
- త్వరలో తెలంగాణ కమిటీ
జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని నియమించాము. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారి చేరికలను సమన్వయం చేస్తుంది.
ఈ కమిటీలో ఎమ్మెల్యేలు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీ పంతం నానాజీ, ఎంపీ శ్రీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ కిలారి రోశయ్య, శ్రీ సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు శ్రీ కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్, డా.పెదపూడి విజయ్ కుమార్, శ్రీ కొరికాన రవికుమార్, శ్రీ వంపూరు గంగులయ్య, శ్రీ టి సి వరుణ్, శ్రీ ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేస్తాను. ఆంధ్ర ప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నాము.
(పవన్ కళ్యాణ్) @PawanKalyan
అధ్యక్షులు, జనసేన
Janasena Chief, Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan paid tribute to India’s brave soldiers at the National War Memorial, New Delhi.
• Offered floral homage at the Amar Chakra.
• Paid respects to soldiers commemorated on the Tyag Chakra walls.
A solemn tribute to the courage, sacrifice, and service of our armed forces.
ఏది ఎవరి అయ్య జాగీరు కాదు. తెలంగాణ మాత్రమే కాదు, భారతదేశం మొత్తం మనదే. కులం, మతం, ప్రాంతం అనే భేదాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడే
మా నాయకుడు @PawanKalyan గారి సిద్ధాంతాలే మా బలం.
జై తెలంగాణ!
జై జనసేన!
జై భారత్! 🇮🇳🔥"
#JanasenaParty#PawanKalyan#indiagate#Janasena
దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
"సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం" అనే విధానంపై రేపు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
15వ తేదీన ఢిల్లీలో జనసేన సమావేశం
•సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం .. అనే విధానంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం... లాంటి సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న జనసేన పార్టీ జాతీయ సమగ్రత దృక్పథంతో " సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం.. అనే శీర్షికతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. జనసేన పార్టీ స్థాపించి పుష్కర కాలమైంది. ఈ కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, జాతీయ సమైక్యతపై జనసేన ఎటువంటి భావజాలంతో పని చేస్తుందో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశంలో వివరించనున్నారు. జాతీయతకు కేంద్ర బిందువైన దేశ రాజధానిలో ఈ సమావేశం ఏర్పాటైంది. జనసేన తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీ లో చేరిన సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రాంతీయతకు విలువ ఇస్తూనే జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా నిలబడాలి.. వర్తమాన పరిస్థితుల్లో సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకతతోపాటు జాతీయ రాజకీయాలపై నాయకులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను పార్టీ నేతలు ఢిల్లీలో పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో అశోక హోటల్లో ఈ సమావేశం మొదలై సాయంత్రం ముగుస్తుంది.
ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల బాలిక ఘటన బాధాకరం.బాధితురాలిని జనసేన నాయకులు @urRKsagar గారు పరామర్శించారు.సమాజం తలదించుకునేలా ఉన్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడికి కఠిన శిక్షతో పాటు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
#JusticeForKhammamGirl#JanaSenaParty