శ్రీ @PawanKalyan గారి ఆలోచన ఎప్పుడూ జనసేన కార్యకర్తల సంక్షేమం... అభ్యున్నతి గురించే
•జన సైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుంది
•రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలం చూపిస్తూ కూటమిని మరింత బలోపేతం చేద్దాము
•కలిదిండిలో కొల్లేరు ప్రాంత జనసేన నాయకులతో పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు
జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను క్షేత్ర స్థాయిలో బలంగా ముందుకు తీసుకువెళ్ళిన జనసైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. జనసేన కార్యకర్తల సంక్షేమం, అభ్యున్నతి గురించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తారని, అటువంటి నాయకుడి అడుగుజాడల్లో పని చేయడం మనందరికీ గర్వ కారణమన్నారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో కూటమి ప్రభుత్వ నిర్వహించిన మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కొల్లేరు ప్రాంత జనసేన నాయకులతో భేటీ అయ్యారు. నాయకుల మనోభావాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “పార్టీ కోసం ఎంతో తపనతో పని చేస్తున్నవారిని రాజకీయంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నారు. మనందరం రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి. క్షేత్ర స్థాయిలో మన బలం చూపిస్తూ కూటమిని మరింత బలోపేతం చేద్దాము. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి స్ఫూర్తిని చూపించామో అదే స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లో ముందుకు వెళ్దాము. ఇందుకోసం ఇప్పటి నుంచే ఆ దిశగా, ప్రణాళికాబద్ధంగా పని చేద్దాము. కూటమి ధర్మానికి అనుగుణంగా వెళ్తూ మన సత్తా చాటుదాము.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ధిని బలంగా చెబుదాము. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం, జల్ జీవన్ మిషన్ ద్వారా మొదలైన పనులు ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందుతున్నాయి. గత ప్రభుత్వ సమయంలో గ్రామాల్లో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతోంది. వరి పండించే రైతులకి తమ పంట అమ్మిన 24 నాలుగు గంటల్లోనే సొమ్ము చెల్లిస్తున్నాము. గత పాలకులు రైతులకు రూ.16 వందల కోట్లు బకాయిపెట్టి వెళ్లిపోతే అవి కూడా తీర్చేశాము. వాళ్ళకీ, మన కూటమి ప్రభుత్వానికీ ఉన్న తేడాను ప్రజలకు తెలియచేద్దాము. ప్రజల కోసం ఎంతగా పని చేస్తున్నామో చెబుతూ స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకుందాము” అన్నారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ శ్రీ జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీపై జనసేన నేతల ఫిర్యాదు
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిపై ఈస్ట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్
నెల్లూరులో డీఎస్సీ అభ్యర్థుల పేరుతో చేస్తున దీక్షలో శ్రీవారి భక్తి గీతాన్ని అవహేళన చేశారు
శ్రీవారి నామాల పాటను పేరడీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు
సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఘటనపై టీటీడీ తక్షణమే స్పందించాలని జనసేన నేతల విజ్ఞప్తి
ఎమ్మెల్సీ, ఇతర నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని ,హేమ కుమార్ కిషోర్ ,మనోజ్,సాయి దేవ్ ,సాయి,పురుషోత్తం,ఆది లు మరియు జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలను, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం పేరడీలుగా పాడుతూ అపహాస్యం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఖండించారు. నెల్లూరు నగరంలో ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ- తన రాజకీయాలకు పవిత్ర గోవింద నామాలను పేరడీగా చేస్తూ భక్తుల మనోభావాలను కించపరచిన తీరు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారి వైనం ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. మతపరమైన విద్వేషాలు రేపే కుట్రపూరిత ఆలోచనలతో వారు చేసిన ఈ చర్యలపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ధార్మిక విశ్వాసంలో భాగమైన దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలు, కీర్తనలను అపహాస్యం కోసం వాడే విధానాన్ని అందరూ విడిచిపెట్టాలని సూచించారు.
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
చెక్కకు ప్రాణం పోసే చేతికి చేయూత
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు సిద్ధం
మొదటి విడత ఆరు క్లస్టర్ల పరిధిలో ఏర్పాటుకు సన్నాహాలు
తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ
రాజమహేంద్రవరంలో వెదురు, తిరుపతిలో ఎర్రచందనం, కాపవరంలో టేకు వుడ్ బ్యాంకులు
కలప నిల్వ చేసేందుకు గోదాములు సిద్ధం చేస్తున్న అటవీశాఖ
కళాకారులకు సరిపడ కలప నిల్వల సమీకరణ
లాభాపేక్ష లేకుండా కళాకారులకు కలప సరఫరా చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలు
అటవీ సంరక్షణ - జీవనోపాధి భద్రత మధ్య సమతుల్యతకు చర్యలు
సంప్రదాయ కళాకారులకు నాణ్యమైన కలప నిరంతర సరఫరాకు ప్రణాళికలు
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు నరసాపురం నియోజకవర్గ పరిధిలో అవసరం ఉన్న 141 మంది క్రోచెట్ లేస్ హస్తకళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు.
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా క్రొచెట్ లేస్ కళాకారుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గౌ|| ఉపముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
#PawanKalyanAneNenu #CrochetLace #Artisans #Handicrafts
అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు!
క్రోచెట్ లేస్ కళాకారులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి కంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. నరసాపురంలో నిర్వహించిన శిబిరంలో కళ్లజోళ్లు అవసరమని గుర్తించిన కళాకారులకు కళ్లజోళ్లు ఏర్పాటు చేయించారు.
#PawanKalyanAneNenu #CrochetLace #Artisans #Handicrafts
ఏళ్లుగా రహదారులు, రవాణా సౌకర్యాల కోసం ఎదురుచూసిన గిరిజన గ్రామాల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఆ మార్పును స్వయంగా చూస్తూ. తమ గ్రామాలకు చేరుతున్న అభివృద్ధిని చూసి గిరిజనులు వ్యక్తం చేస్తున్న ఆనందమే ఈ దృశ్యాలకు నిదర్శనం.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో, మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, కనెక్టివిటీ మెరుగుదల పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇవి కేవలం రోడ్లు కాదు..ఆసుపత్రికి చేరువ చేసే మార్గాలు..పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే బాటలు..రైతుల పంటలకు మార్కెట్‌ను చేరువ చేసే దారులు..గిరిజన గ్రామాలను అవకాశాలతో అనుసంధానించే వంతెనలు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన మార్పు ఇప్పుడు కళ్లముందు కనిపిస్తుంటే..వారి మాటల్లో వినిపిస్తున్న ఆనందం ఈ అభివృద్ధికి నిజమైన కొలమానం.
#WorldTribalDay #AdaviThalliBaata #PawanKalyanAneNenu
జెన్ జీ గురించి వైసీపీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది
•యువశక్తిని నిర్వీర్యం చేసి, వారిని మత్తుకు బానిస చేసిందే వైసీపీ
•ప్రజా సమస్యలు గాలికొదిలేసిన వైసీపీ వాళ్ళు కూడా అభివృద్ధికి బాటలు వేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా?
•జగన్ మెప్పు కోసం కాదు.. ప్రజల కోసం పని చేయండి
•దొంగచాటుగా అసెంబ్లీ రికార్డుల్లో సంతకాలు చేసేవాళ్ళకి విమర్శించే అర్హత లేదు
•శస్త్ర చికిత్స అనంతరం కొద్ది రోజులకే ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై.. అభివృద్ధికి అంకితమైన నిజమైన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ డా. పెదపూడి విజయ్ కుమార్, జనసేన రాష్ట్ర కార్యదర్శి, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బేతపూడి విజయ్ శేఖర్
‘అనునిత్యం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం పాలన మొదలైన రెండేళ్లలోనే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 8,571 కిలోమీటర్ల సీసీ రోడ్లు, వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించారు. అటవితల్లి బాట కార్యక్రమం కింద డోలీ రహిత గ్రామాల కోసం 2,710 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టారు. ఇదీ బాధ్యత కలిగిన నాయకుడు చేసే అభివృద్ధి. గత వైసీపీ పాలనలో శ్రీ జగన్ రెడ్డి ఏ రోజైనా రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల గురించి ఆలోచన అయినా చేశారా?’ అని ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. పెదపూడి విజయ్ కుమార్ ప్రశ్నించారు. గెలిచిన నాటి నుంచి ప్రజా సమస్యలపై ఒక్క రోజు కూడా మాట్లాడని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్.. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదు అన్నారు. దొంగచాటుగా అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు చేసే శ్రీ చంద్రశేఖర్‌కు మా నాయకుడు, ఉప ముఖ్య్మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు. పదవి పోతుందనే భయంతో శాసనసభలో దొంగచాటుగా సంతకాలు పెట్టి వెళ్లిపోయే వ్యక్తి.. ప్రజల సమస్యల గురించి, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌ను మెప్పించేందుకు నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీ బేతపూడి విజయ్ శేఖర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా డా. పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ... “ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్న వైసీపీ నాయకులు ఐడెంటీటీ క్రైసిస్ తో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తు ఉన్నారు. ఆ విధంగా అయినా పాపులర్ అవ్వొచ్చు, జగన్ దగ్గర మార్కులు కొట్టేయొచ్చు అనే నీచ ఆలోచనలో ఉననృ. చంద్రశేఖర్ రెండు నెలలకు ఒకసారి ఎర్రగొండపాలెం వచ్చి హడావుడి చేస్తారు. జగన్ బెంగళూరుకు మకాం మార్చినట్లు, ఈయన హైదరాబాద్‌కు మకాం మార్చారు. ప్రజలు మర్చిపోతారనే భయంతో అప్పుడప్పుడు వచ్చి ఇలా అవాకులు, చెవాకులు పేలుతుంటారు.
•జల్ జీవన్ మిషన్ పనుల శంకుస్థాపనకు ఎందుకు రాలేదు?
మార్కాపురంలో జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినప్పుడు మిమ్మల్ని అధికారికంగా ఆహ్వానించినప్పటికీ ఎందుకు హాజరు కాలేదు? నిజంగా ప్రజల మేలు, నియోజకవర్గ అభివృద్ధి కోరుకునే ప్రజాప్రతినిధి అయితే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు తప్పకుండా హాజరై ఉండేవారు. కానీ మీకు రాజకీయ విమర్శలు చేయడం తప్ప, అభివృద్ధిపై దృష్టి పెట్టడం చేతకాదు. మీరు పట్టించుకోకపోయినా మీ నియోజకవర్గంలో దాదాపు రూ. 200 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం.
•జెన్ జీ గురించి మాట్లాడం విడ్డూరంగా ఉంది
వైసీపీ నాయకులు ఇప్పుడు ‘జెన్ జీ వార్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ గత ఐదేళ్ల పాలనలో యువతకు సకాలంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారు. కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను నిరాశకు గురి చేశారు. అంతేకాకుండా, యువత గంజాయి, మాదకద్రవ్యాలకు బానిసలను చేశారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రించేందుకు ప్రయత్నించిన అధికారులను బదిలీలు చేస్తూ, యువత భవిష్యత్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. యువతను హింస వైపు ప్రేరేపించేలా రాజకీయాలను నడిపించిన మీరు ఇప్పుడు ‘జెన్ జీ’ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
•కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీ కంటికి కనిపించలేదా?
Link: https://t.co/hIyfxclWud
#HBDSuperstarMahesh
Deputy CM, JanaSena Chief Sri @PawanKalyan garu :
శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ప్రముఖ కథానాయకుడు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరిన్ని విజయాలు సాధించి ప్రేక్షకులను మెప్పించాలి. శ్రీ మహేష్ బాబు గారికి సుఖసంతోషాలు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను..
After watching this interview by
Sri Arnab with Shri Harish Salve ,Former Solicitor General of India on @republic channel. I have felt lot of apprehensions will be cleared to anyone who is opposing FCRA Bill.
Sri Harish Salve being a devout Christian says that, FCRA bill is not against one particular ‘religion or two’ but making foreign funded NGOs accountable and transparent in the interest of our country.
https://t.co/iRwFKQ29VV
The forests have protected our Tribal communities for generations, and in return, they have protected the forests as guardians of nature, culture and ancient wisdom. On the International Day of the World’s Indigenous Peoples, I extend my heartfelt greetings to all my Tribal brothers and sisters.
This year’s theme, “Honouring Indigenous Midwives: Safeguarding Life and Well-being,” reminds us of the invaluable traditional knowledge passed down through generations and the vital role Indigenous women and communities play in protecting life, health, culture and heritage.
My bond with our Tribal communities is deeply personal. Their affection and trust have always strengthened my resolve to work for their dignity and welfare. Through initiatives such as Adavi Thalli Baata, improved connectivity to remote habitations, livelihood opportunities, and stronger protection of forests and wildlife, we are working to ensure that development reaches every Tribal family while their identity and traditions remain protected.
Their trust is a responsibility. Their heritage is our pride. Their progress is our commitment.
Let us walk together towards a future where every Tribal family lives with dignity, opportunity, security and hope.
Jai Hind!
- @PawanKalyan@TribalAffairsIn@PIB_India@IPR_AP@pibvijayawada
ప్రకృతిని పూజించే అడవితల్లి బిడ్డలు, మన సంస్కృతి పరిరక్షకులైన ఆదివాసీలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.
కేవలం ఓట్లకో, జనాభా లెక్కలకో కాదు. ఆదివాసీలకు కూడా అందరిలా అన్ని మౌలిక సదుపాయాలు అందాలని వారి జీవనాభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, కరెంటు సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
#Aadiwasi
#WorldTribalDay
నరసాపురం క్రోచెట్ లేస్ కళాకారులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది క్రోచెట్ లేస్ హస్తకళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే శ్రీ @BNayakar_JSP చేతుల మీదుగా లేసు కళాకారులకు ఈ కళ్లజోళ్లను పంపిణీ చేశారు. విజయవాడలో జరిగిన హస్తకళా మహోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హస్తకళాకారులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఆ ఆదేశాల మేరకు గత నెలలో నరసాపురంలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 141 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి అవసరమైన 141 మంది కళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు. కళాకారులకు అందించే కళ్లజోళ్ల నాణ్యత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరి క్యాంపు కార్యాలయంలో స్వయంగా పరిశీలించిన అనంతరం కళాకారులకు పంపించారు.
ఏళ్ల నిరీక్షణకు..ఒక కొత్త బాట..
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరప్రాంత మార్గంలో, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రహదారి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఇది కేవలం ఒక రహదారి నిర్మాణం కాదు..ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఒక ఉపశమనం.
ప్రాంత అభివృద్ధికి ఒక కొత్త మార్గం!
#Uppada #Pithapuram #PawanKalyanAneNenu #IdhiManchiPrabhutvam
ఏళ్లుగా సరైన రహదారి కోసం ఎదురుచూస్తున్న గిరిజన గ్రామాలకు ఇప్పుడు ‘అడవితల్లి బాట’ రూపంలో అభివృద్ధి చేరువవుతోంది.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిరంతర పర్యవేక్షణలో, మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
‘అడవితల్లి బాట’ తొలి దశలో ₹1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టగా, ‘అడవితల్లి బాట 2.0’ ద్వారా మరో ₹2,078 కోట్లతో మొత్తం 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.
ఇవి కేవలం రహదారులు కాదు...
గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా, విద్య, వైద్యం, మార్కెట్లు, అవకాశాలకు చేరువ చేసే అభివృద్ధి మార్గాలు.
మారుమూల ప్రాంతం అన్న కారణంతో ఏ గ్రామమూ వెనుకబడకూడదనే ఆలోచనకు... ‘అడవితల్లి బాట’ ఒక ముందడుగు.
#AdaviThalliBaata #PawanKalyanAneNenu
గిరిజన గ్రామాలు...అడవి తల్లి బాటలు!
• ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిరంతర పర్యవేక్షణలో వేగంగా రహదారి నిర్మాణ పనులు
• 'అడవితల్లి బాట' తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
• ‘అడవితల్లి బాట 2.0'తో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
#AdaviThalliBaata #PawanKalyanAneNenu
గిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి
• అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
• అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
• విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి
• పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రివర్యులు
• మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
• అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి
• వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి
• డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపు
#AdavithalliBata