Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
🏆 #1 in Panchayat Raj Framework
🛣️ #2 in Rural Road Quality (PMGSY)
From King of Andhra to making Andhra Pradesh the King of National Wide Rankings.
@PawanKalyan 🫡👏
Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.
@PawanKalyan
రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించి... రాముడు, సీతమ్మలపై నీచంగా మాట్లాడి... తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ను సమర్థించాడు. అలాంటి వ్యక్తికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది. ఎంత బరితెగింపు?
— సీఎం చంద్రబాబు
#AndhraPradesh#ChandrababuNaidu#GoddaliParty
#PawanKalyanAneNenu
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం సందర్భంగా హస్తకళాకారులు, చేనేత కార్మికులతో జరిగిన ఆత్మీయ సంభాషణల్లో వారి వృత్తి సంబంధిత ఆరోగ్య సమస్యలను ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తెలుసుకున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను తమ చేతులతో కాపాడుతున్న కళాకారుల ఆరోగ్య సంరక్షణను కూటమి ప్రభుత్వం తన బాధ్యతగా భావిస్తోంది.
ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా హస్తకళా, చేనేత కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు చర్యలు చేపట్టిన అధికారులు.
📍09.07.2026 – కొండపల్లి బొమ్మలు, ఉప్పాడ, మాధవరం, యడికి చేనేత కళాకారులు
📍10.07.2026 – బొబ్బిలి వీణ, ఎటికొప్పాక, ఏలూరు వూలెన్ పైల్ కార్పెట్, మదనపల్లె చేనేత కళాకారులు
📍11.07.2026 – ధర్మవరం, బుడితి ఇత్తడి, పెడన బ్లాక్ కలంకారీ, తిరుపతి చెక్క శిల్ప కళాకారులు
ఈ వైద్య శిబిరాల ద్వారా ఆరోగ్య పరీక్షలు, నిపుణుల వైద్య సేవలు, అవసరమైన చికిత్సకు మార్గదర్శకత్వం అందించడంతో పాటు, మరిన్ని కళాకారుల క్లస్టర్లలో కూడా ఈ కార్యక్రమాన్ని దశలవారీగా కొనసాగించనున్నారు.
కళను కాపాడే చేతులకు ఆరోగ్య భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వ సంకల్పం.
హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
•హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
•ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ @PawanKalyan గారు
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరుసటి రోజే ఆచరణలో పెట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రారంభం అయ్యాయి. బుధవారం నరసాపురం లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళ్ల జోళ్లు వేయించే ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
•శ్రీమతి మహాలక్ష్మికి శంకర నేత్రాలయలో పరీక్షలు
హస్తకళా మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం, పసలదీవికి చెందిన లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తమకు నేత్ర సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయన్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం శ్రీమతి మహాలక్ష్మితోపాటు శ్రీమతి అందే లక్ష్మి అనే మరో లేస్ కళాకారిణిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పిలిపించి పరీక్షలు చేయించారు. ఇరువురికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్, మందులు ఇప్పించి పంపారు.
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan