BZZZ! ⚡ You just got Buzzed!
Buzz me back to start our daily streak! Let’s help each other unlock Free Cash up to ₹1000. 🤑
Tap here to buzz back:
Link: https://t.co/OVTDDLs3jZ
#swiggy
ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకి మధ్యాహ్న భోజనం ఎందుకు పెట్టాలంటే …
నేను గుడివాడ దగ్గరలో గంగాధరపురం స్కూల్లో చదివేప్పుడు మా అమ్మ బాక్సులో రేషన్ బియ్యంతో వండిన అన్నం , పండుమిరపకాయ పచ్చడి వేసి ఇచ్చేది .. నెయ్యి లేక మంచినూనె (వంటనూనె ) కొద్దిగా పచ్చడిలో వేసి ఇచ్చేది .. స్కూల్లో అన్నం తినేప్పుడు మిగిలిన ఫ్రెండ్స్ మా బాక్సులో పచ్చడి చూసి నవ్వకూడదని దూరంగా వెళ్లి చెట్టుకింద కూర్చుని తినేవాడిని .. కొన్నిసార్లు పచ్చడి అన్నం తినలేక ఖాళీ కడుపుతోని పాఠాలు వినేవాడిని .. ఇలా ఎంతోమంది పేద పిల్లలు సరైన పౌష్టికాహారం లేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు .. మినపకాయ తీత కాలంలో మా అమ్మ స్కూల్ కి సెలవు పెట్టించి పనికి తీసుకెళ్లేది .. రోజుకి 15 రూపాయలు కూలి ఇచ్చేవారు .. అందుకనే .ఇప్పటి మాదిరిగా అప్పట్లో మధ్యాహ్న భోజనం లేదు .. కడుపు నిండిన వాళ్ళు మధ్యాహ్న భోజనం గురించి ఏవేవో మాటలు చెబుతున్నారు .. కానీ ఆకలి కడుపుతో క్లాస్ లో కూర్చుని పాఠాలు విన్నవాళ్ళు నాతో సహా ఎంతోమంది ఉన్నారు 🙏🙏🙏