కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అమ్మవారి దర్శనానికి వెళ్తూ వారు మార్గమధ్యంలో ఇలా ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
స్వామి దీక్షలో ఉన్న భవానీ మాలధారులు ప్రయాణాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు దాటే సమయంలో ఇరువైపులా వాహనాలను గమనించి జాగ్రత్తగా వెళ్లాలని, వాహన డ్రైవర్లు వేగ నియంత్రణ పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని కోరుతున్నాను. భక్తులు గుంపులుగా ప్రయాణించేటప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలి. భక్తిశ్రద్ధలతో పాటు మన ప్రాణ రక్షణ కూడా ఎంతో ముఖ్యం. భవానీ మాలధారులందరూ సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
#AnnamRamanarayanaReddy
#KakinadaAccident
#BhavaniBhaktulu
#Accident
#AndhraPradesh
**వెంగంపల్లి నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం! **
ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం వెంగంపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కుటుంబాలు సానా నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరులోని నా నివాసంలో నా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.
ఈ సందర్భంగా వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరడం సంతోషకరం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల అభివృద్ధికి మరియు ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తాం.
**ప్రజల విశ్వాసమే మా బలం.. అభివృద్ధే మా లక్ష్యం! **
#AnamRamnarayanaReddy #TDP #Atmakur #Nellore #Vengampalli #TeluguDesamParty #CoalitionGovernment #DevelopmentAndWelfare #AndhraPradesh
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజైన నేడు (19.10.2026, సోమవారం - ఆశ్వయుజ శుద్ధ నవమి)... దుష్ట సంహారిణి, సమస్త శక్తిస్వరూపిణి అయిన శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
#AnnamRamanarayanaReddy
#Vijayawada
#DasaraSharannavaratrulu
#KanakaDurgaAmma
#SriMahishasuramardiniDevi
#Indrakeeladri
#Tyrannotitan#DinosaurDeets#DevaanshNara
Think T. rex had a monopoly on tiny arms and a massive bite? Meet Tyrannotitan, the 40-foot "Tyrant Titan" of Cretaceous Argentina! Weighing over 6 tons with solid vertebrae and chisel-like teeth, this predator meant business. Catch the full breakdown with Devaansh on Dino Deets!
Facebook - https://t.co/hhCxGdt13o
YouTube - https://t.co/tI4ysQwIMg
Instagram - https://t.co/cmA7oxAH9M
ఆత్మకూరు పట్టణ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది! జాతీయ రహదారి–67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు రూ. 8.91 కోట్లతో గతంలో రెండు వరుసలుగా ఉన్న రహదారిని, మధ్యలో డివైడర్తో పాటు సెంట్రల్ లైటింగ్, బ్యూటిఫికేషన్తో అత్యంత సుందరంగా నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేయడం జరిగింది.
ఈ ‘వాయుపుత్ర మార్గ్’ బైపాస్ రహదారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు అమరావతి నుంచి వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేయడం ఎంతో సంతోషం. ఈ సందర్భంగా ఆత్మకూరు అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితులు మరియు నా కుమార్తె లీలా కైవల్య రెడ్డి, స్థానిక మహిళలు అయోధ్య శ్రీరాముని ప్రతిమను, ప్రసాదాలను అందజేయడం జరిగింది.
మన ప్రాంత చిరకాల కోరికను నెరవేర్చడంలో సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు ఆత్మకూరు ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
#AnamRamnarayanaReddy
#Atmakuru
#VayuputraMarg
#PawanKalyan
#cmchandrababunaidu
*శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం*
నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా వేద పండితులు, స్థానిక నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో నన్ను, నా కుమార్తె లీలా కైవల్యా రెడ్డిని ఆత్మీయంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
#AnamRamnarayanaReddy #SriRajarajeswariDevi #SharannavaratriUtsavalu #Nellore #DivineBlessings #AndhraPradesh
Thank you sooo much, @naralokesh garu, for your kind words and love! ❤️🥹
Ranabaali is such an important story, bringing a chapter of our history to life, and getting to play Jayamma has been a very special experience for me.. there’s so much that this film means to all of us, and I’m truly grateful to our entire team for putting this together with so much heart and love ❤️
Can’t wait for you all to watch it in theatres and experience this story with us ❤️❤️
Thank you @naralokesh sir 🙏
One of the factors behind the character development of #RanaBaali is inspired by the local deity Shri Nettikanti Anjaneya Swamy, Kasapuram, Anantapur district, which is located in the same Rayalaseema region.
Director @Rahul_Sankrityn mentioned this in his speech.
#RanaBaaliOnOct16th
Just saw the trailer of #Ranabali and wow, what an immersive experience! The detailing in recreating 1800s Rayalaseema and capturing that heart-wrenching era of British-era famine and oppression is phenomenal.
@TheDeverakonda looks effortlessly fierce and completely at home in the soil of Seema, brilliantly anchored by @iamRashmika. Kudos to @Rahul_Sankrityn and the entire team for bringing such a powerful, untold chapter of history to life. Wishing you all huge success on October 16!
https://t.co/lHlmpxca8u
Thank you, Hon’ble Prime Minister @narendramodi Ji. 🙏
This Yatra is a small gesture of our appreciation for your 25 years of dedicated public service and your unwavering commitment to Seva and Sushasan.
For our @JaiTDP family, it was also a privilege to carry the sacred waters of the Krishna and Godavari from Andhra Pradesh to Kashi — celebrating the bonds that unite our people, our traditions and our nation.
Your words of encouragement mean a great deal to every Karyakarta who was part of this journey.
#25YearsOfSeva
**ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత.. భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం**
అమరావతి సచివాలయంలో దేవాదాయ శాఖకు సంబంధించిన **కామన్ గుడ్ ఫండ్ (CGF), ధూపదీప నైవేద్య పథకం (DDNS), గోదావరి పుష్కరాలు–2027** తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాను.
**CGF నిధులతో** ఆలయాల్లో అత్యవసరమైన, భక్తులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించాను.
**2027 గోదావరి పుష్కరాలను** దృష్టిలో ఉంచుకుని ఘాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, పార్కింగ్, భద్రత, ఆలయ పరిసరాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించాను.
చిన్న ఆలయాల్లో నిత్య పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేందుకు **ధూపదీప నైవేద్య పథకం** నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.
మంజూరైన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, అందుబాటులో ఉన్న నిధులను **ఆర్థిక క్రమశిక్షణతో, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా** వినియోగించాలని అధికారులకు స్పష్టం చేశాను.
#AnamRamanarayanaReddy #EndowmentsDepartment #AndhraPradesh #TempleDevelopment #CGF #DDNS #GodavariPushkaralu2027
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ప్రత్యక్ష విశేష ఆర్జిత సేవల ఆన్లైన్ టికెట్లను క్యాంపు కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది.
భక్తుల సౌకర్యం, పారదర్శకత మరియు సులభతరమైన సేవలందించడమే లక్ష్యంగా... ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ (9552300009) ద్వారా ఈ విశేష సేవా టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చాము. భక్తులు కుంకుమార్చన, చండీ హోమం, ఖడ్గమాలార్చన, నవావరణార్చన వంటి సేవల్లో పాల్గొనేందుకు ఆన్లైన్లో ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించడంమైనది.
ఈ సందర్భంగా దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఈవో మరియు అర్చక బృందం మమ్మల్ని మర్యాదపూర్వకంగా కలిసి దసరా మహోత్సవాల తొలి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.
#AnamRamnarayanaReddy
#Vijayawada
#Indrakeeladri
#DasaraNavaratrulu
#KanakadurgaTemple
మహాక్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల తొలి అధికారిక ఆహ్వాన పత్రికను శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీ శ్రీనివాసరావుల నుండి స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనాలు అందుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించాము. ముఖ్యంగా రద్దీకి తగినట్లుగా క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత మరియు వసతి సదుపాయాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించడంమైనది.
భక్తులందరికీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాము.
#AnamRamnarayanaReddy
#Srisailam
#DasaraNavaratrulu
#BhramarambaMallikarjunaSwamy
#Devotional
ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటూ, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల భవనాల ప్రారంభోత్సవంతో పాటు, ఎస్సీ కాలనీ ప్రజల విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ నుండి రూ. 40 లక్షలతో రామాలయ నిర్మాణ పనులను ప్రారంభించాము. అలాగే గతంలో వేసిన సిమెంట్ రోడ్లతో పాటు, స్థానికుల కోరిక మేరకు కొత్తగా సిమెంట్ డ్రైన్ల నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చాము.
ఇక హౌసింగ్ పథకం కింద ఇల్లు లేని పేదలను ఆదుకుంటూ, కొత్తగా 17 మందికి ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే వారందరికీ మంజూరు పత్రాలు అందించి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామని భరోసా ఇచ్చాము.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతటి భారంగా ఉన్నప్పటికీ, పేద ప్రజల భవిష్యత్తు కోసం, ప్రతి కుటుంబానికి మేలు జరగాలన్న తపనతోనే అహర్నిశలు శ్రమిస్తున్నాం. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న మన ప్రభుత్వ అభివృద్ధి ప్రస్థానంలో ప్రజలందరి సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత.
#AnamRamnarayanaReddy
#RuralDevelopment
#PublicService
#Welfare
#AndhraPradesh
Meet Baryonyx, the 25-foot prehistoric predator that swapped land hunting for a seafood diet! Armed with crocodile-like jaws and a massive 12-inch hooked claw, this "heavy claw" theropod was built to snatch slippery fish right out of the water. Join Devaansh as he explores one of palaeontology’s coolest surprises. Hit play and dive into the prehistoric waters!
Youtube - https://t.co/H1DBQR1GEv
Facebook - https://t.co/lky8bkmJkX
Instagram - https://t.co/MniCCZx5WC
#DinoDeets #BeastlyBaryonyx #Baryonyx #Dinosaurs #DevaanshNara #DinosaurFacts #Fossils #JurassicWorld
When a leader doesn’t ask for questions in advance and nothing is off the table , always makes it easier. There was a time when this was the norm, now it’s sadly an exception. I hope many more take a cue from you @naralokesh . 👍🙏
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలిసి పాల్గొన్నాను. హైదరాబాద్లో ఐఎస్బీ తరహా మ్యాజిక్ ఇప్పుడు రాయలసీమలో జరగబోతోంది. యువగళంలో రైతుల కష్టాలు చూసిన తరువాత వచ్చిన హార్టికల్చర్ హబ్ ఆలోచన రాయలసీమ రైతు సత్తాను ప్రపంచానికి చాటనుంది.
@ncbn@nsitharaman@PawanKalyan
#RayalaseemaVijayeebhava
#GlobalHorticultureHub
#RayalaseemaRising
రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్కి భగవాన్ అంతిమయాత్రలో పాల్గొన్నాను.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీ కల్కి భగవాన్ (విజయ్ కుమార్ నాయుడు) గారి అంతిమ కార్యక్రమాలు తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ఏకం క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్కి భగవాన్ గారి పార్థివదేహానికి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను.
ఆధ్యాత్మిక రంగంలో కల్కి భగవాన్ గారు అందించిన సేవలను, మానవతా విలువలు మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నాను.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
వారి కుటుంబ సభ్యులకు, భక్తులకు నా ప్రగాఢ సానుభూతి.
#KalkiBhagavan #VijayKumarNaidu #KalkiBhagavanAntimayatra #EkamKshetra #Tirupati