ప్రతిష్టాత్మక NBA Accreditation సాధించిన ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను అభినందించాను.
విద్యార్థులు నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి. కళాశాలలో Centre of Excellence ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.
ఆధునిక సాంకేతిక విద్యతో ధర్మవరం విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి.
#NBAAccreditation #Dharmavaram #SkillDevelopment #TechnicalEducation
NBA Accreditation సాధించిన ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి శ్రీ @satyakumar_y గారు సందర్శించారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్ లక్ష్యాలు, కెరీర్ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిపై మాట్లాడారు. స్పష్టమైన లక్ష్యం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలతో ఉద్యోగాలు పొందేవారిగా మాత్రమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు.
కళాశాలలో Centre of Excellence ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఆధునిక సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధితో ధర్మవరం విద్యార్థులు భవిష్యత్‌లో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రివర్యులు ఆకాంక్షించారు.
#NBAAccreditation #𝖲𝗄𝗂𝗅𝗅𝖣𝖾𝗏𝖾𝗅𝗈𝗉𝗆𝖾𝗇𝗍
ఢిల్లీలో గౌరవ కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గారు, శ్రీ అర్జున్ రామ్ మెఘ్వాల్ గారు, శ్రీ ప్రతాప్రావు జాధవ్ గారు, శ్రీ కిషన్ రెడ్డి గారు, శ్రీ బండి సంజయ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులు, వైద్య-ఆరోగ్య రంగానికి కేంద్రం నుండి అందాల్సిన పూర్తి స్థాయి సహకారంపై వారితో చర్చించాను.
రాష్ట్ర పురోగతికి అవసరమైన అన్ని రకాల మద్దతు అందిస్తామని వారు సానుకూలంగా స్పందించారు. కేంద్రం-రాష్ట్రం సమన్వయంతో ఏపీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం.
#AndhraPradesh #APDevelopment #HealthSector #CentralSupport @BJP4Andhra@rajnathsingh@arjunrammeghwal@kishanreddybjp@bandisanjay_bjp
Leadership tells a powerful story.
Alphabet – Indian CEO
Microsoft – Indian CEO
IBM – Indian CEO
Adobe – Indian CEO
Palo Alto Networks – Indian CEO
Chanel – Indian CEO
India isn’t following global innovation, India is leading it! 👏
విజయవాడలో ఆయుష్ డిపార్ట్మెంట్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాను. ఆయుర్వేద, యూనానీ, హోమియోపతి, సిద్ధ వంటి సంప్రదాయ వైద్య విధానాల పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కార్యాలయం సహాయపడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్ సేవలను బలోపేతం చేసి, ప్రజలకు సమగ్ర వైద్య సేవలు మరింత చేరువయ్యేలా చేయడంలో ఇది ఎంతో దోహదపడుతుంది.
#AYUSHDepartment
#Vijayawada
#Healthcare
#AndhraPradesh
తెనాలిలోని జిల్లా ఆసుపత్రిని సహచర మంత్రివర్యులు శ్రీ @mnadendla గారితో కలిసి సందర్శించాను. ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, ల్యాబ్‌లను పరిశీలించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల స్థితిగతులను తెలుసుకున్నాము.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడాము. వారికి అందుతున్న వైద్య సేవలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల లబ్ధి, వసతులపై వివరాలు తెలుసుకున్నాము.
అనంతరం ఇటీవల మంజూరైన నూతన ట్రామా కేర్ సెంటర్ కు సంబంధించిన స్థలాన్ని సందర్శించి, ప్రతిపాదిత పనులపై అధికారులతో చర్చించాము. తెనాలి ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు ఈ ట్రామా కేర్ సెంటర్ కీలకంగా మారనుంది. ప్రజారోగ్య పరిరక్షణే మా కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
#Tenali
#DistrictHospital
#HealthcareReview
#TraumaCentre
#PublicHealth @BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ArogyaAndhra
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు(అంకాలజిస్ట్) డాక్టర్ శ్రీ నోరి దత్తాత్రేయుడు గారికి పద్మభూషణ్ పురస్కారం లభించడం హర్షణీయం. వైద్య రంగానికి ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో ఆయన చేసిన సేవలు ఎంతో అమూల్యమైనవి. రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణ, చికిత్స కోసం సలహాదారుగా ఇప్పటికే ఆయన సేవలను మా ఎన్డీయే కూటమి ప్రభుత్వం వినియోగించుకుంటోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ పురస్కారాలకు ఎంపికైన సినీ నటులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, శ్రీ గద్దె బాబూ రాజేంద్రప్రసాద్ గారు, వివిధ రంగాలకు చెందిన శ్రీ మామిడాల జగదీశ్ కుమార్ గారు, శ్రీ చంద్రమౌళి గద్దమణుగు గారు, శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, శ్రీ గూడూరు వెంకట్రావు గారు, శ్రీ కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ గారు, శ్రీ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ గారు, శ్రీ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి గారు, శ్రీ రామారెడ్డి మామిడి గారు, శ్రీ దీపికా రెడ్డి గారు, శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారికి హృదయపూర్వక అభినందనలు.
@BJP4Andhra #PadmaAwards
ధర్మవరం పట్టణంలో నిర్వహించిన సంక్రాంతి పండుగ కార్యక్రమాల్లో భాగంగా మహిళల కబడ్డీ పోటీలను ప్రారంభించాను. మహిళలు క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలి.
అనంతరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాలు, ధర్మవరం హ్యాండ్లూమ్ కళాకృతులు, గ్రామీణ ఉత్పత్తులు, సౌర విద్యుత్ వ్యవస్థలకు సంబంధించిన స్టాల్స్‌ను ప్రారంభించాను. స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలను తెలుసుకున్నాను. ఇలాంటి స్టాల్స్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. స్వదేశీ ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.
#SankrantiSambaralu #Dharmavaram
#WomenKabaddi #TraditionalGames
#HandloomHeritage #ChenethaVastralu
#RuralDevelopment #TeluguCulture @BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ArogyaAndhra
Built for regular use, steel cloth dryers provide stability, durability, and resistance to rust. Their long-lasting performance makes them a practical and reliable choice for everyday laundry needs.
#SteelFacts#EverydaySteel#StainlessSteel#DurabilityInDesign
INS Nilgiri, the lead warship of Project 17A, is built with high-grade indigenous steel to ensure strength, resilience, and advanced combat capability. ⚓
From hull to deck, steel is the backbone of India’s naval self-reliance and maritime security.
#SteelStrength#INSNilgiri #SteelForNation #MaritimeIndia #AtmanirbharBharat
Strengthening green cover and restoring ecological balance, large-scale plantation efforts across plants and townships marked a significant step towards sustainability in 2024–25, with SAIL planting 3 lakh saplings nationwide.
Building a Greener, Healthier Tomorrow for Generations to Come. 🌍
#Sustainability #GreenCover #EcologicalBalance #ClimateAction #GreenIndia
మహిళల కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశాను. మహిళల కబడ్డీ పోటీల్లో మొత్తం 7 జట్లు పాల్గొనగా, ధర్మవరం జట్టు విజేతగా నిలిచింది.
అనంతరం 140 కిలోల బరువు గల ఇసుక సంచులను ఎత్తే పోటీలు సహా పలు గ్రామీణ సంప్రదాయ క్రీడలను తిలకించాను.
#SankrantiSambaralu #Dharmavaram
#WomenKabaddi #140KgSandBag
#TraditionalGames #TeluguCulture
#RuralSports #FestivalCelebrations @BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ArogyaAndhra
సంక్రాంతి సంబరాల్లో భాగంగా బొంగరాలు, గోళీలు, గాలిపటాలు, టగ్ ఆఫ్ వార్, చిల్లా కట్టే వంటి సంప్రదాయ ఆటల్లో పాల్గొన్నాను.
అనంతరం పురుషుల కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించాను. విన్నర్, రన్నర్స్‌అప్ జట్టుకు బహుమతులు అందజేశాను.
గ్రామీణ క్రీడలు, సంప్రదాయ ఆటలు యువతను ఆరోగ్యంగా, చైతన్యవంతులుగా చేస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు, ఆటలకు ప్రోత్సాహం కొనసాగాలి.
#SankrantiSambaralu #Dharmavaram
#TraditionalGames #Kabaddi
#TeluguCulture #FestiveSpirit @BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ArogyaAndhra
On the death anniversary of Sardar Vallabhbhai Patel Ji, we pay heartfelt tribute to the Iron Man of India, whose firm leadership and unshakable resolve united a fragmented nation into one strong Bharat.
Through courage, discipline, and an unwavering commitment to national unity, he laid the foundations of a secure and integrated India.
His legacy of decisive leadership and patriotism continues to guide and inspire generations. 🇮🇳