ఇదేం అవినీతి రా బాబు !!! ముట్టుకుంటే కనీసం 100 కోట్లు. అధికారులే ఇట్లా ఉంటే ఇంకా రాజకీయ నాయకుల అవినీతి ఊహించగలమా ? వీళ్ళు దొరికిన వాళ్ళు మరి దొరకని వాళ్ల సంగతి ? ఇన్వెస్టిగేట్ చెయ్యని వాళ్ల సంగతి ? అందుకే మన ప్రాజెక్టులు , మన రోడ్లు , మన చెరువులు , మన భవనాలు ఇట్లా ఉన్నాయి . గత ప్రభుత్వము నడిపిన వాళ్ళు " మేము తింటాము మీరు తినండి " అనే పద్ధతి ప్రకారం పరిపాలన చేసిన్రు. ఫార్మ్ హౌస్ ల సంస్కృతి తెచ్చిన్రు. కానీ ప్రస్తుత ప్రభుత్వం లో కూడా అవినీతి ఏమీ తగ్గలేదు. ఉత్తర భారతం లో కూడా బీజేపీ పరిపాలన లో కూడా ఇట్లాగే పాడయ్యింది. దేశం లో దొంగలు పడ్డారు. ఎమ్మెల్యే లు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు ఎవరికి ఎంత అవకాశం వస్తే అంత దోచేయడానికి సిద్ధం అవుతున్నారు. దోచుకున్న డబ్బు ను విదేశాలలో దాచుకోడం ఇప్పుడు అవలంబిస్తున్న కొత్త విధానం.
దీనికి పరిష్కారం స్వచ్ఛ రాజకీయాలు, రాజకీయాల ప్రక్షాళన, అవినీతి కి గట్టి శిక్షలు, నీతిమంతుల ( సివిల్ సొసైటీల ప్రతినిధుల తో) అవినీతి నిరోధక స్వతంత్ర సంస్థ ఏర్పాటు మొదలైనవి పరిష్కార మార్గాలు. మంచి వారు ధైర్యంగా రాజకీయాలను కడగడానికి ముందుకు రావాలి. 193 దేశాలలో మన దేశ అభివృద్ధి ర్యాంక్ 130 . నిజానికి మనం top 10 లో ఉండాల్సిన వాళ్ళము. దీనికి ప్రధాన కారణం కరప్షన్ అవినీతి భ్రష్టాచార్.
#corruption
#clean politics
#telangana