గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి చెందిన ఘటనపై శ్రీ @PawanKalyan గారు విచారం
పోలవరం జిల్లా, ఏటపాక మండల పరిధిలోని గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచా���ం వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలవరం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులకి దిశానిర్దేశం చేశారు.
- ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం