నా 'కులం+మతం+ప్రాంతం+భాష' పట్ల అభిమానం తప్ప ఆవేశం/పిచ్చి లేని ఒక సాధారణ ఆడపిల్ల తండ్రిని.
Sarpanch-Likithapudi(2013-18)
Rotarian (2014-18)
IITH Govt Employee
On this Constitution Day, I read the Preamble to the Constitution of India to uphold the values of #Justice, #Liberty, #Equality and Fraternity! Read the Preamble here : https://t.co/0z1wivvNlA https://t.co/a2v4kJuMx7 #ConstitutionDay#Democracy via @mygovindia
టెస్టోస్టెరోను/ మగవాళ్ళ లైంగిక పటుత్వం పై ఒక వ్యాసం.
టెస్టోస్టెరోను ఒక హార్మోను. ఇది వృషణాల్లో (టెస్టికల్స్) తయారవుతుంది. ఇది లైంగిక (సెక్సువల్) కోరికలు కలగడానికి, అలాగే లైంగిక క��రియ (సెక్స్)జరపడానికి, పిల్లలు పుట్టడానికి ముఖ్యమైనది. అంతే కాకుండా మగవాళ్ల మనసు, భావోద్వేగాలు(ఎమోషన్స్), రోగనిరోధకశక్తి(ఇమ్యూనిటీ), ఎముకల పటుత్వం, గుండె పనితీరు, ఆలోచనా శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. టెస్టోస్టెరాన్ తగ్గినవాళ్లలో మధుమేహం, డిమెన్షియా (మతిమరుపు), గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది.
టెస్టోస్టెరాన్ 12-13 ఏళ్లకి శరీరంలో ఎక్కువ అవటం మొదలై ఇరవయ్యేళ్లు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటుంది. 35 ఏళ్ల నుం��ీ తగ్గటం మొదలవుతుంది. నలభయ్యేళ్ల నుంచీ ఏడాదికి 1.3% తగ్గిపోతూ ఉంటుంది. దీనికి చాలా కారణాలున్నాయి.
టెస్టోస్టెరాన్ వీర్యంలో (సెమెన్) శుక్రకణాల (స్పెర్మ్స్) తయారీకి, సెక్సు చేసేటప్పుడు అంగస్తంభనకి(ఎరెక్షన్) , అలాగే సెక్సు చేయాలనే కోరిక (లిబిడో )కలగటానికి అవసరం. అది తగ్గితే ఇవి తగ్గుతాయి.
టెస్టోస్టెరాన్ తగ్గితే దానిని పెంచే ఒకే ఒక సహజమైన పద్ధతి వ్యాయామం(ఎక్సర్సైజ్). బరువులెత్తి కండల�� పెంచితే, ఆ కండరాలు దేహంలో జరిగే ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. ఇది డెబ్భైయేళ్ళు పైబడిన వాళ్ళలో కూడా జరుగుతుంది. టెస్టోస్టెరాన్ బాగా తగ్గినవాళ్ళకి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు.
ఇకపోతే భారతీయుల అంగం (పెనిస్)పొడవు లావు గురించి సందేహాలు తీర్చటానికి కేరళలో ఒక మూడొందల మంది ఆరోగ్యకరమైన మగవాళ్ళ అంగాలని కొలిచి ఒక అధ్యయనం చేశారు. దాని ప్రకారం మగవాళ్ళ అంగం సాధారణంగా ఉన్నప్పుడు దాని పొడవు 5 నుంచీ 13 సెంటి మీటర్ల ఉంటే సగటు 8 సెమీలుగా గుర్తించారు. అదే గట్టిపడినప్పుడు 10 నుంచి 17 సెమీలు ఉండగా సగటున 13 సెమీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ పొడవులని ఇస్రాయెలు, అమెరికా, జోర్డాన్, దక్షిణ కొరియా దేశస్థులతో పోల్చగా ఒక్క దక్షిణ కొరియా తప్పితే మిగతా అన్ని దేశాలతో ఒకటి రెండు సెమీల కొలత తేడా తప్ప పెద్ద వ్యత్యాసం లేదు. ఇక లావుకి ���చ్చేసరికి సాధారణంగా ఉన్నప్పుడు చుట్టుకొలత 6 సెమీల నుంచి 12 సెమీలు ఉండగా, సగటు 9 ఉంది. అదే గట్టిపడినప్పుడు 9-13 సెమీలు ఉంటే సగటు 11 సెమీలు ఉంది.
ఇకపోతే 2005 లో చేసిన ఒక సర్వే ప్రకారం రతి సమయం (సెక్సు చెయ్యగలిగే సమయం) సాధారణంగా సగటు ఐదున్నర నిమిషాలే. ఏడు నుంచి పది నిమిషాల కాలం చెయ్యగలిగితే ఇద్దరికీ బాగుంటుంటుందని, ఇక ఆ పైన బోరు కొడుతుందని ఫలితాలు వచ్చాయి. కొంతమంది అరగంట వరకూ చేయగలిగినా అది వ��యాయామం అవుతుందే తప్ప రతి క్రియ కాదు. కొంతమందికి రెండు నిమిషాల్లోపే అయిపోవడం, లేదా తృప్తి అనిపించకముందే అయిపోవడం లేదా ఇంకా లోపలికి వెళ్ళకముందే అయిపోవడం జరుగుతుంది. దీన్ని శీఘ్రస్కలనం అంటారు. దీనికి వైద్యం ఉంది.
అలాగే పిల్లలు పుట్టాలంటే వీర్యంలో శుక్రకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) తగినంత ఉండాలి. అది కూడా ఏడాదికి 1.5% తగ్గిపోతూ ఉంటుంది. 35 ఏళ్ల తర్వాత వాటి సంఖ్య తగ్గి, ఆకారం మారిపోయి, కదలికలు తగ్గిపోవడం ఎక్కువవుతుంద��.
ఇక చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, వయసు పెరిగేకొద్దీ కెరీర్ పైకెళ్లొచ్చు లేదా వెళ్ళకపోవచ్చు కానీ టెస్టోస్టెరాన్ మాత్రం కిందకే పోతుంది. వ్యాయామం చేస్తే మంచిది.
కోహ్లీ..రిటైర్ ఐపోవాల్సిందే అని అన్నవాళ్లకు!🤭
పాడుబడ్డ ఇంటిలో కూడా బలమైన దూలాలుంటాయి, మూతపడ్డ సంస్థలో కూడా సమర్దులుంటారు పతనం కూడా ఒక స్థితే అదే అంతిమం కాదు..!
#mercymargaretboda
అనుకున్నంత ఈజీగా, ఊహించినంత అందంగా ఉండవు ఎవరి జీవితాలు.. నచ్చినట్టు జీవితాన్ని మార్చుకోడానికి కష్టాలు ఎక్కువ💔 సుఖాలు తక్కువ దాటుతూ రావాలి.. అన్నీ పూర్తి చేసి నచ్చిన జీవితం అందుకునే సరికి మళ్ళీ ఏవో ఆటంకాలు.. ఎన్నింటినో దాటితే కానీ నచ్చిన జీవితం చెంతకి రాదు♥️
శారీరక శ్రమ నుండి వచ్చే
నీటిచుక్క ,
మానసిక బాధ నుండి వచ్చే
నీటిచుక్క
రెండూ ఉప్పగానే ఉంటాయి !
కానీ...
అవే మన జీవితానికి
తియ్యదనాన్ని ఇస్తూ దారి చూపుతాయి.....కదా !
ఫార్మ్ ప్లాట్లు పేరిట అనుమతి లేని లే ఔట్లు
🔶అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని హైడ్రా సూచించింది.
🔶నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని.. వీటిని కొన్న వారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించింది.
🔶ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేదం ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలుస్తోంది.
🔶రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం, లక్ష్మిగూడ విలేజ్ సర్వే నంబరు 50లోని 1.02 ఎకరాల్లో ఫార్మ్ ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నారని సోమవారం హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులందాయి.
🔶ప్రజావాణిలో పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు నగర ప్రజలను అప్రమత్తం చేశారు.
🔶తెలంగా�� మున్సిపల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018లో పొందు పరిచిన విధంగా ఎక్కడా ఫార్మ్ ప్లాట్లు అమ్మడానికి లేదనిపేర్కొన్నారు.
🔶ఫార్మ్ ల్యాండ్ అంటే 2 వేల చదరపు మీటర్లు, లేదా 20 గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్దేశించిందని చెప్పారు.
🔶ఈ మేరకు ఫార్మ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయరాదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలు కూడా ప్రభుత్వం ఇచ్చి��� విషయాన్ని గుర్తు చేశారు.
🔶జీవో నంబరు 131 ప్రకారం 31.8.2020 తర్వాత వెలసిన అనాథరైజ్డ్ లే ఔట్లలో ప్లాట్లలో ఇల్లు నిర్మించడానికి ఎలాంటి అనుముతులు ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని అందరూ గమనించాలన్నారు.
🔶నగర పరిధిలో హెచ్ ఎండీఏ నిబంధనల ప్రకారం 10 శాతం పార్కులకోసం, 30 శాతం రహదారుల కోసం స్థలాలను కేటాయించాల్సి ఉన్నా ఎక్కడా ఆ నిబంధనలను కూడా పా���ించడంలేదని ఫిర్యాదుదారులు హైడ్రాకు నివేదించారు.
@TelanganaCMO #HYDRAA
@Comm_HYDRAA Respected sir,
I kindly request your honor to provide/publish the rules & regulations governing the land/revenue in Telangana.
వీలైతే తెలుగు ముద్రణ కూడా అందించగలరు.
ధన్యవాదములు🙏
@mflone_ I've repaid my gold loan amount on 2/11/24 at ur Muthoot SR Nagar branch Hyderabad through UPI UTR no.430701148617 & still it's not updated. What type of service you're giving to customers?
My money & gold were with ur company for 5 days and still ur cc asking time.
'క' సినిమాలో చూపించిన ఊరు నిజంగా ఉంది.. ఎక్కడంటే?
మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుందంటూ 'క' సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఉంది.
తెలంగాణలోని పెద్దపల్లికి 10K.M దూరంలో ఉన్న మూడుజాముల కొదురుపాక అనే ఊరిలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 జాములే ఉంటాయి. సాయంత్రం 4 గంటలకే అక్కడ చీకటి అవుతుంది. 4 దిక్కులా ఎత్తైన కొండలు, మధ్యలో ఊరు ఉండటంతో సూర్యుడు కొండల వెనక్కి వెళ్లి ఆ నీడ పడి త్వరగా చీకటి అవుతుంది. ఈ ఊరి గురించి మీకు ముందే తెలుసా?
ట్విట్టర్‌ని ఆనందించాలంటే ఏం చెయ్యాలి?
అనానిమస్ అకౌంట్ అనుకుని అడ్డమైన కూతలు కూయకూడదు, మనం ఇసుకలో బుర్రపెట్టి కనపడట్లేదు అనుకునే ఉష్ట్రపక్షి అని తెలుసుకుకోవాలి. కానీ అన్ని బుర్ర తక్కువ ఉష్ట్రపక్షుల్ని వేటాడరు, తెలివైనవాళ్లం అనుకునే వాళ్లని మాత్రం వేటాడేస్తారు.
వాదనల వలన ఉపయోగం లేదు, మీరు ఎవరి అభిప్రాయాల్నీ ఇక్కడ మార్చలేరు, మార్చినందువలన మీరేం పొందేది లేదు. మన అభిప్రాయం నచ్చని వాళ్లని ద్వేషించక్కర్లేదు. వాడి మానాన వాడే పోతాడు అనుకోవాలి. అవతలివాడు కూడా నీగురించి ఇలాగే అనుకుంటాడు.
ముఖ్యంగా డిఎంలో కెలికే సందేశాలు పంపొద్దు, అవన్నీ పడుకున్న పాములు, లేచి ఎప్పుడో ఆకలేస్తే స్క్రీన్షాట్ల రూపంలో కాటేస్తాయి. నీ డిఎంలకి నువ్వే ఆహారం అయిపోతావ్.
నచ్చకపోతే బ్లాకు, మ్యూటు చక్కగా ఉన్నాయి, బోల్డంత ప్రశాంతత. వెంటబడి వేధించక్కర్లేదు. నీకు పనిలేదనుకుంటారు లేదా నిజంగా నీకు పని ఉండకపోవచ్చు లేదా ఇంక ఇదే త���్ప వేరే పనిలేక ఇక్కడే ఉండిపోయుంటావు.
ట్విట్టర్లో చాలా రకాల మనస్తత్వాలున్నవాళ్లు ఉంటారు. వీళ్లలో కొంతమందికి తీవ్రతరమైన ఆలోచనాసరళి ఉంటుంది. తర్కానికి అందదది. వాళ్లతో మాట్లాడటం, వాళ్లకి వివరించటం, నచ్చజెప్పటం లాంటివి చెయ్యటం ఎండిపోయిన బావిలో చేదవేసి నీళ్లు తీయడం లాంటిది, దాహం పెరుగుతుంది, ఇంకోవైపు భుజాలు పీకేస్తాయి. నిన్నిలా చూస్తున్నవాళ్లు నీకేదో అయ్యింది అనుకుంటారు.
ఫాల�� అయ్యేవాళ్లందరూ నిన్ను నచ్చి లేదా నీ ఆలోచనలు నచ్చి కాదు, నువ్వేదో పుసుక్కున ట్వీటేస్తే లటక్కన పట్టేసి వాడు ఎప్పట్నుంచో నీగురించి అనుకుంటున్న ఒక థియరీని నిరూపించడానికి సాక్ష్యంగా వాడేసేదానికి ఫాలో అవుతుంటారు. చచ్చిపోయిన షెర్లాక్ హోమ్స్ ఆత్మ ముక్కలయ్యి ప్రేతాత్మల్లా వీళ్ళిక్కడ ట్విట్టర్లో తిరుగుతుంటారు.
ట్విట్టర్లో మొత్తం కెరీర్ నే నిర్మించడానికి వచ్చినవాళ్లుంటారు. వీళ్లలో రెండు రకాలు ఒకటి నేన���ది, నేనిదే చేస్తా అని చెప్పేవాళ్లు వాళ్లతో ఇబ్బందేం లేదు. చాలా స్పష్టంగా ఉంటారు. రెండోది నేనిది అని చెప్తూ అప్పుడప్పుడూ కమల్ హాసన్ పాటలో పువ్వు నవ్వు లాంటివి రాసుకో అన్నట్లు రాసి మొత్తంగా వాళ్ల ఎజెండాని మెల్లిగా బయటపెడుతుంటారు. మొదట్లో
మనం కొంత అయోమయానికి గురైనా తర్వాత తెలిసిపోతుంది. ఇక అక్కడ్నుంచీ పట్టుకోవాలో వదిలేయాలో మీ ఇష్టం.
ఇకపోతే బహిరంగంగా మోసంచేసేవాళ్లు, బెదిరించే���ాళ్లు, బూతులుతిట్టేవాళ్లు, కించపరిచేవాళ్లు ఇంకా ఇలాంటి కోవలు చాలా, వాళ్ళందరూ కోకొల్లలు. పచ్చనిపైరులో కలుపుమొక్కలు వీళ్లు. బ్లాక్ అనే మందుచల్లేసి పోడమే. మళ్లీ పుడతాయి. వాటికేమన్నా సిగ్గా ఎగ్గా.
అయితే ఈ పైనున్న చిన్నా చితకా విషయాలు వదిలేస్తే, ట్విట్టర్ ప్రపంచం అనేది నాగ్ అశ్విన్ కట్టిన కాంప్లెక్స్ లాంటిది. మొదటిసారి వెళ్లిన భైరవలాగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడ వినోదం, స్నేహం, పరిచయాలు, దారులు, సలహాలు, సాహిత్యం, ఆదరణ, అభిమానం ఇలా చాలావాటికి కొదువలేదు. ఆస్వాదించటమే.
ఎంతోజాగ్రత్తగా ఉన్నా, ఎవరి మనసు నొప్పించకూడదనుకున్నా, మనసు కదా బాధపడటం దాని లక్షణం. లేకపోతే నాలాంటివాళ్లకి పనుండదు కదా. అలా కొందరు బాధపడుతుంటారు. మీరు నిజంగా తెలిసో తెలీకో బాధపెడితే క్షమించండి అని అడిగేసి ముందుకుపోండి. లేదనుకుంటే బ్లాకేసుకోండి. వాళ్లే మీరు బ్లాకిన స్క్రీన్ షాట్ వేసుకుని ���వో బూతులు రాసుకోడమే లేక మనసు చల్లబరుచుకునే మాటలు రాసుకోడమో చేస్తారు.
అప్పుడప్పుడూ ఈ ట్విట్టర్‌కి కూడా సెలవిచ్చి వస్తుంటే ఇంకా బాగుంటుంది.
కిందన చిరంజీవి క్లిక్‌బెయిట్, అంతే అంతకుమించి
సంబంధం లేదు.
ఈరోజు ఒక బిల్డర్ నా దగ్గరికి లీగల్ ఒపీనియన్ కోసం ఈ కింద డాక్యుమెంట్లు పంపడం జరిగింది.
ప్రాథమికంగా పరిశీలించగా ఇది ప్రభుత్వ అసైన్డ్ భూమి సర్వే నంబర్ 126 ఇంద్రకరణ్ విలేజ్ కంది మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని తేలింది, ఇందులో లేఔట్ చేసి ప్లాట్లు అమ్మిన చూస్తూ ఊరుకున్న పంచాయితీ మరియు రెవిన్యూ అధికారులను ఏమనాలి? ఈ లేఔట్ లో చేసిన ప్లాట్లకు రెగ్యులరైజ్ చేసిన అధికారులను ఏమనాలి? ఈ ప్లాట్ లను రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ ని ఏం చేయాలి? ఇవి కొని వీటిల్లో రేపొద్దున ఇల్లు కడితే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి కూల్చివే���్తే ఆ ఇల్లు కట్టుకున్న వారి పరిస్థితి ఏంటి? ప్రజలు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. జీవో ఎంఎస్ నెంబర్ 1406 ఆఫ్ 1958 వచ్చిన తర్వాత అసైన్ చేసిన ఏ ప్రభుత్వ భూమి అయినా ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించిన భూములు తప్ప ఏవీ కూడా అమ్మడానికి కొనడానికి వీలు లేదు అది ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆక్ట్ 1977 పరిధిలోకి వస్తుంది. అది చట్టరీత్యా నేరం.
@Collector_SRD
@jc_srd @cdmatelangana @HUMTA_hmdagov @DtcpTs @PrlsecyMAUD @revanth_anumula @TelanganaCS @TelanganaCMO @Comm_HYDRAA
అప్పటి వరకూ ఒక లెక్క #వేటూరి గారు వచ్చాకా ఇంకో లెక్క....
ఇందువదన (చందమామ లాంటి మ��ఖం)
కుందరదన ( నిధి లాంటి దంతాలు)
మందగమన ( వయ్యారంగా నడుస్తూ)
మధుర వచన (��్రియంగా మాట్లాడుతూ)
గగన జఘన ( ఆకాశంలా శూన్యంగా ఉండే నడుము)
సొగసు లలనకి ( మనోహరమైన స్త్రీకి)
ప్రేమతో పొగుడుతూ ప్రేమలేఖ 💕🫡
దేశంలో, రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న, జరుగబోయే అన్ని అనర్థాలకు ప్రభుత్వ అధికారులు, మరియు భయపెట్టో.. ప్రలోభపెట్టో .. గద్దె నెక్కిన నీచ రాజకీయ నాయకులు మాత్రమే..
ప్రభుత్వ అధికారులు, ప్రజలు ఇకనైనా మారాలి లేకపోతే @PawanKalyan గారు కోరుకున్న మార్పు అన్నది తాత్కాలికమే అవుతుంది..
ఈ విషయంలో నేను అభిమానించే ఈ ఏ ఎస్ శర్మ గారు అన్నది అక్షర సత్యం..
"ఒక ప్రభుత్వ అధికారి నిజాయితీగా ఉంటే, ఎవరూ వారిని ప్రభావితం చేసే సాహసం చేయ��ు. గరిష్టంగా, రాజకీయ నాయకులు వారిని బదిలీ చేయవచ్చు. వ్యవస్థలో మనుగడ సాగించాలంటే అధికారులు.చిత్త శుద్ధితో పనిచేయాలి, బదిలీకి సిద్ధంగా ఉండాలి," ఇది చెప్పింది 35 సంవత్సరాల సర్వీసులో 26 సార్లు బదిలీ చేయబడి, AP రాష్ట్ర & కేంద్రంలో ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశాన్ని వదులుకున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి EAS శర్మ గారు
"If a bureaucrat is honest, nobody would dare influence him/her. At the most, the politicians can get them transferred...and every bureaucrat do their work sincerely and be prepared to get transferred to help the survival of the system," this is the statement of EAS Sarma (retd IAS) who has been transferred 26times in 35years of service and forgone the opportunity to become Chief Secretary of AP State & in the Centr
80ఏళ్ల శర్మగారు ఈ రోజుకు ఏదైనా పొరపాటు జరిగితే బాధ్యతతో ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తారు, ప్రభుత్వం తప్పు సరిద్దిద్దక పోతే కోర్టుకు వెళతారు.. యువత https://t.co/JGRHTIeKCv చూసి ఆయన నుండి స్ఫూర్తి పొంది ముందుకు రావాలి..
ఇప్పుడు విశాఖ @JanaSenaParty కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు శర్మ గారిని త్రికరణ శుద్ధిగా అనుచరిస్తున్నట్టు అనిపిస్తుంది.. ఒక కార్పొరేటర్ గా ఉంటూనే తప్పు చేసింది నగర మేయర్ అయినా, పెద్ద రాజకీయ నాయకుడు అయినా, జిల్లాలో పెద్ద అధికారి అయినా, ఆఖరికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయినా నిర్భయంగా ఆధారాలతో ఆరోపిస్తున్నారు, అవసరమైతే కోర్టుకు వెళ్లి అవినీతి పరులకు నిద్ర పట్టనివ్వ కుండా #అవినీతిపై_రాజీలేని_పోరాటం చేస్తున్నారు..
అవినీతిని అంతం చేయడం కేవలం ఒకరిద్దరితో అయ్యే పని కాదు "రంగస్థలం" సినిమాలో చూపినట్టు ప్రజల్లో చైతన్యం రావాలి.. తిరగబడాలి.. ఆరోజు త్వరలోనే వస్తుందన్న నమ్మకం నాకు ��ంది..
#ధర్మో_రక్షతి_రక్షితః
#వృక్ష్యో_రక్షిత_రక్షితః
@JanaSenaParty
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం
#JSPforNewAgePolitics