Happy birthday to the visionary leader, Chief Minister Y S Jagan Mohan Reddy! Your commitment to the welfare of Andhra Pradesh is truly commendable. #HBDYSJagan
Happy Birthday, dear brother Tarak! May God bless you with good health, happiness, and the strength to stand firm for the people. Wishing you continued success and a wonderful year ahead!
@KTRBRS
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
Remembering senior Congress leader and former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.
A true statesman, he uplifted countless lives through his unwavering commitment to the welfare of the people of Andhra Pradesh. His service to the people will always be remembered.
Heartiest birthday wishes to Brother Vijay, the Hon’ble Chief Minister of Tamil Nadu. May you be blessed with good health and success in all your endeavors.
@TVKVijayHQ
రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !
ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు
1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబుగారూ? అని.
2.రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!
3.ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం! సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన!
4.వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?
5. అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
6.మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు! ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది! దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది.
7.విద్యా రంగం దెబ్బతింది! వైద్య రంగం దెబ్బతింది! వ్యవసాయం సంక్షోభంలో ఉంది! ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు! నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
8.ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
9.చంద్రబాబుగారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు.
10.ఈ “నారాసుర పాలన’’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు.
#2YearsForCBNBackStabbing
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అరెస్ట్ చేయాలని, తమ వాళ్ల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
అంతేకాదు, రాజకీయాల్లో తాత్కాలిక, పర్మినెంట్ మిత్రులెవరో, ఎలా వుండాలో కూడా పవన్‌కు అమిత్‌షా హితబోధ చేసి పంపారంట.
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
Words uttered: “If tomorrow YS Jagan Mohan Reddy says that your wives are not your wives, they would blindly believe it and even go to the extent of treating their own wives as sisters and shamelessly look for marriage alliances; such are the spineless leaders in the YSR Congress Party!”
These words were uttered by Vemuri Radha Krishna on ABN Channel. Using such repulsive language and dragging women into political discourse is not criticism; it is a disgraceful and demeaning attack on women that raises serious questions about the kind of partisan journalism being practiced.
We strongly condemn these remarks and emphasize that such statements are a deliberate attempt to insult women and distort public discourse. The real issue is that, unable to counter the “MAVIGUN” proposal politically, Chandrababu Naidu and his aligned media have resorted to diversion, misinformation, propaganda, and abuse.
We held peaceful protests demanding strict action against Radha Krishna and his unconditional apology. Despite such offensive remarks, our cadre showed restraint and did not resort to violence, demonstrating our commitment to democratic values.
Instead of condemning this disgusting narrative, @ncbn, @naralokesh, and @PawanKalyan backed and amplified these remarks. This reflects their clear misogynistic attitude. We demand immediate action against Radha Krishna and strongly condemn these leaders for supporting such a toxic and outrageous utterances.
“ రేపు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముకలేని నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వ్యాఖ్యానించారు.
మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదు. ఆ వ్యాఖ్యలు మహిళలను అవమాన పరచడమే కాకుండా, వారిని కించపరిచేలా చేసిన దాడిగానే భావించాలి. ఎలాంటి వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్నదానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి మహిళలను అవమానించడానికే కాదు, ప్రజల్లో “MAVIGUN” ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. “MAVIGUN” ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక, చంద్రబాబు, ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు కూడా దిగారు.
మేము శాంతియుతంగా నిరసనలు చేపట్టి, రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాము. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు.
ఈ జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకుండా, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఈ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం, మహిళల పట్ల వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
Votes in 6 seconds, 4% cast after midnight: Major allegations over Andhra polls
Several 'unusual' voting patterns in the 2024 Andhra Pradesh assembly elections were flagged at a press conference in Delhi. Economist Parakala Prabhakar claimed that around 4.16% of the total votes were cast between 11.45 pm and 2 am in Andhra, which was won by the NDA.
Story by @AishPaliwal - https://t.co/Jazfw7LcIr
వైయస్సార్సీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు.
ఉగాది వేడుకలకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్, శ్రీమతి వైయస్ భారతి దంపతులు.
సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాలో ఉగాది వేడుకలకు హాజరైన శ్రీ వైయస్ జగన్.
ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి వచ్చిన శ్రీ వైయస్ జగన్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు.
ఉగాది వేడుకలకు హాజరైన శ్రీ వైయస్ జగన్ దంపతులకు ఆహ్వానం పలికిన పార్టీ ముఖ్యనేతలు, నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు.
ఉగాది వేడుకల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు. పూజా మందిరంలా వేదిక. శాస్త్రోక్తంగా పూజ తర్వాత పంచాంగ శ్రవణం వినిపించిన పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి.
పంచాంగ శ్రవణం అనంతరం శ్రీ వైయస్ జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధప్రసాదాలు అందించిన వేదపండితులు.
శ్రీ వైయస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు:
పంచాంగ శ్రవణం అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్న అందరికీ శ్రీ వైయస్ జగన్, హృదయపూర్వకంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం పంచాంగ శ్రవణం చేసిన పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రితో పాటు, వేద పండితులను శ్రీ వైయస్ జగన్ సన్మానించారు.
#Ugadi2026
#YSJagan
#AndhraPradesh