Freedom of expression is not an absolutely unlimited right.
It has limitations, and when it reaches the extent of violating others' rights, legal consequences are inevitable.
- Hon'ble Dy. CM @PawanKalyan Garu
Good decision by Deputy CM @PawanKalyan garu. 👏
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఫిర్యాదులను స్వీకరించేందుకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నాం - @PawanKalyan గారు.
ఈ రోజు ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల సమాచార సేకరణ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, నిర్వహణ విధానంపై సమీక్ష నిర్వహించి, పార్టీని సంస్థాగత నిర్మాణంలో భాగమై నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
ప్రజల కష్టాలు తీర్చే పవర్ హౌస్లా పంచాయతీరాజ్ వ్యవస్థ మారాలి
•గత ప్రభుత్వ విజన్ లేని పాలన వల్లే పంచాయతీలు దెబ్బ తిన్నాయి
•గత రెండేళ్లలో గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా రూ.4,200 కోట్లు బదిలీ
•వ్యవస్థలు బలంగా నడవాలంటే ఉద్యోగుల పాత్రే కీలకం
•ప్రజల కోసం మీరు ఒక అడుగు వేస్తే... మీ కోసం నేను వంద అడుగులు వేస్తా
•మనం చేసే ప్రతి పనిలో పారదర్శకత ఉండాలి
• శ్రీ వెంకట కృష్ణ గారి లాంటి అధికారుల వల్లే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది
•పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు
•ప్రభుత్వ అదనపు కార్యదర్శి శ్రీ కె. వెంకటకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం పిటీషన్లు తీసుకొని వాటిని పైకి నెట్టేసే వ్యవస్థలా కాకుండా... ప్రజల కష్టాలు తీర్చే పవర్హౌస్ లా మారాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సరైన ప్రణాళికలు, విజన్ లేకపోవడం వల్లే గ్రామ పంచాయతీలు తమ పూర్తి సామర్థ్యాన్ని కోల్పోయి నిర్వీర్యమయ్యాయని, స్థానిక సంస్థల నిధులను దారి మళ్లించడం, గ్రామ సభలను నిర్లక్ష్యం చేయడం వల్ల గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోపాలను సరిదిద్ది, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలను మళ్లీ పూర్వవైభవానికి తీసుకురావడానికి గట్టి పట్టుదలతో పని చేస్తుందని స్పష్టం చేశారు. గడిచిన రెండేళ్ల కాలంలో రూ.4200 కోట్ల నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలకు బదిలీ చేశామని తెలిపారు. మంగళవారం రాత్రి ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి గారి ఒ.ఎస్.డి. శ్రీ కఠారి వెంకటకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “పాలనాపరంగా నాకు పెద్దగా అనుభవం లేకపోయినా, 2 లక్షల మంది ఉద్యోగులతో కూడిన పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంత విజయవంతంగా నిర్వహించడానికి శ్రీ వెంకట కృష్ణ గారే కారణం. ఆయన దగ్గర ఒక విద్యార్థిలా మారి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. 36 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఆయనపై చిన్నపాటి మరక కూడా లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. అలాంటి వ్యక్తి రిటైర్ అయిపోతున్నారని తెలియగానే భుజం కొట్టేసినట్లు అనిపించింది. అందుకే ఆయన సేవలు మరో మూడేళ్లు కొనసాగేలా చర్యలు తీసుకున్నాం.
• ఇటువంటి అధికారుల వల్లే వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుంది
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో ఉన్నతమైన ప్రభుత్వ పథకాల రూపకల్పనలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం పథకాలను రూపొందించడమే కాదు... ప్రభుత్వ వ్యవస్థల నియంత్రణలో, ప్రగతిశీల అభివృద్ధిలో, అత్యుత్తమ పరిపాలనా విధానాల అమలులో ఆయన చూపిన చొరవ అసాధారణమైనది. ప్రభుత్వ రంగంలో ఆయనకున్న అపార అనుభవం, సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు, చూపిన మేధస్సు నేటికీ, రేపటికీ ఎప్పటికీ ఎంతో మంది అధికారులకు, ఉద్యోగులకు ఒక దిక్సూచిలా, మార్గదర్శకంగా నిలుస్తాయి. పాలసీ మేకింగ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వరకు.. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నుండి బడ్జెట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వరకు.. యాంటీ కరప్షన్ స్ట్రాటజీస్ నుంచి లీగల్ అఫైర్స్ వరకు ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి విభాగంలోనూ ఆయన ముద్ర కనిపిస్తుంది. ఇటువంటి అధికారుల వల్లే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం రెట్టింపు అవ్వడంతో పాటు, వ్యవస్థలు బలోపేతం అవుతాయి.
(1/3)
It was a true pleasure meeting and hosting you in Mumbai, DCM Pawan Kalyan ji.
Maharashtra is incredibly proud to support Andhra Pradesh in this landmark wildlife conservation initiative. Restoring the tiger population in the Eastern Ghats is an important ecological mission.
We are glad that the translocation of these two tigresses from Maharashtra will actively address the challenges of inbreeding, bring much-needed genetic diversity, and lay the foundation for a healthy, self-sustaining tiger landscape in your region.
Maharashtra remains fully committed to working hand-in-hand with Andhra Pradesh across all sectors, including environmental preservation, to ensure a greener and more prosperous future for our states!
@PawanKalyan
#Maharashtra #AndhraPradesh #WildlifeConservation
Had a warm and productive meeting with the Hon'ble Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji. We discussed a range of issues of mutual interest and explored opportunities for greater cooperation between our two States.
I conveyed my sincere thanks to him for Maharashtra's support in facilitating the translocation of two female tigers to Andhra Pradesh. This generous gesture marks an important milestone in our efforts to restore a thriving tiger population in the Eastern Ghats. The introduction of female tigers will help overcome the challenges of inbreeding, enhance genetic diversity, strengthen the long-term viability of the population, and contribute to a healthy, self-sustaining tiger landscape.
This collaborative conservation effort reflects our shared commitment to protecting biodiversity through science-based and sustainable wildlife management. I am confident that the partnership between Andhra Pradesh and Maharashtra will contribute significantly to the long-term conservation of tigers in the Eastern Ghats.
I also express my gratitude to the Hon'ble Union Minister for Environment, Forest and Climate Change, Shri @byadavbjp Ji, for his continued guidance in taking this initiative forward. I look forward to continued collaboration with the Government of Maharashtra and all stakeholders in advancing wildlife conservation.
@PMOIndia@moefcc@AndhraPradeshCM@CMOMaharashtra@ntca_india
🔸Andhra Pradesh DCM Pawan Kalyan paid a courtesy visit to CM Devendra Fadnavis at Varsha Bungalow in Mumbai today. CM Fadnavis welcomed him.
🔸मुख्यमंत्री देवेंद्र फडणवीस यांची आज आंध्र प्रदेशचे उपमुख्यमंत्री पवन कल्याण यांनी मुंबई येथील वर्षा निवासस्थानी सदिच्छा भेट घेतली. यावेळी मुख्यमंत्री फडणवीस यांनी त्यांचे स्वागत केले.
🔸मुख्यमंत्री देवेंद्र फडणवीस इनसे आज आंध्र प्रदेश के उप मुख्यमंत्री पवन कल्याण इन्होंने मुंबई स्थित वर्षा आवास पर सदिच्छा भेंट की। इस अवसर पर मुख्यमंत्री फडणवीस इन्होंने उनका स्वागत किया।
🕥 10.15am | 30-6-2026📍Varsha Bungalow, Mumbai | स. १०.१५ वा. | ३०-६-२०२६📍वर्षा निवासस्थान, मुंबई.
@Dev_Fadnavis@PawanKalyan
#Maharashtra #DevendraFadnavis #Mumbai
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @Dev_Fadnavis గారితో శ్రీ @PawanKalyan గారు భేటీ
•తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ
•ఆంధ్రప్రదేశ్ కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుంది. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుంది.
శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోంది. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాకు నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామ”న్నారు.
నిన్న రాత్రంతా నిద్ర రాలేదు… ఒకటే ఆలోచన…
ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం.
నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం… గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం… వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం… ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి.
ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు… మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం.
“ముందు సినిమా పూర్తి చేద్దాం… నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు… ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు…” అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని, ఆపరేషన్ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు.
ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు… జీవితాంతం మర్చిపోలేని ఋణం. ఆ ఋణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను.
ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో… కానీ ఈ రోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతోంది.
దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను… మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు… నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో.
మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే… మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం.
@PawanKalyan sir
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు పాముల గణపతి కాకినాడ వెంకట నగర్ కు చెందిన విష్ణుమూర్తి గారిపై తప్పుడు కేసులు పెట్టించడమే కాకుండా లక్షల రూపాయలు నష్టపోయేటట్టు చేశాడు
విష్ణుమూర్తి గారికి జరిగిన అన్యాయం పైన కాకినాడ అప్పటి 2 Town సిఐ గారు కేసు తీసుకోకపోగా వారి అండతో తప్పుడు కేసులు పెట్టించారని బాధపడుతూ జనసేన జనవాణి కార్యక్రమంలో
సంపత్ నాయక్ గారికి చెప్పడంతో సంపత్ నాయక్ గారు వెంటనే స్పందించి కాకినాడ టూ టౌన్ సిఐ అప్పలనాయుడు గారికి కాల్ చేయడమే కాకుండా విష్ణుమూర్తి గారికి సంబంధించిన కంప్లైంట్ తీసుకొని నిజానిజాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా CI గారితో మాట్లాడారు.
#JanaVaaniJanaSenaBharosa #JanaSenaTelangana
నర్సాపురం పార్లమెంట్ లో ప్రారంభమైన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం.
ఈరోజు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు శ్రీ పంతం నానాజీ @pantham_nanaji గారి నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం భీమవరం బ్యాంక్ కాలనీ దగ్గర శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మడపంలో జనసేన పార్టీ నాయకుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం జరిగింది. పార్టీ కమిటీల్లో బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు, జనసైనికుల నుండి దరఖాస్తులు సేకరించి, పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి వీటిని తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
#JSPMembershipToLeadership #JSPForNewAgePolitics
మంగళగిరి CK కన్వెన్షన్ హాల్లో గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి అధ్యక్షతన 'జనసేన సమాచార సేకరణ కమిటీ' సమావేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ రూరల్ శాసనసభ్యులు, నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ శ్రీ పంతం నానాజీ గారు.
అరకు పార్లమెంట్ లో ప్రారంభమైన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం.
ఈరోజు ఉదయం అరకు పార్లమెంట్ పరిశీలకులు శ్రీ @NagaBabuOffl గారి నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం అరకు లోని గుడ్ మార్నింగ్ రిసార్ట్స్ లో జనసేన పార్టీ నాయకుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం జరిగింది. పార్టీ కమిటీల్లో బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు, జనసైనికుల నుండి దరఖాస్తులు సేకరించి, పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి వీటిని తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
#JSPMembershipToLeadership #JSPForNewAgePolitics