వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ పోలీసులం అంటూ అరెస్ట్ చేశారని తెలిపిన కుటుంబసభ్యులు
గుంటూరులోని ఇంటికి వెళ్లి నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తామని తెలిపిన పోలీసులు
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యుల ఆందోళన
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
Vizag లో data centre కోసం.. 25000 చెట్లు కొట్టేస్తున్నారు.
ఇప్పుడు మొరగరు ఎందుకు..?
ఓహో... జగన్ అధికారంలో ఉంటే గాని ప్రకృతి మీద ప్రేమ ప్యాకేజీ రూపంలో పుట్టుకు రాదా...!
#SaveAPFromKutami#SaveAPFromTDP
ఎందన్న ఈ ఫైర్ @DrPradeepChinta 💥🔥
అన్ని ఆధారాలతో చర్చకు సిద్ధం , సవాల్ స్వీకరించే దమ్ము నీకు ఉందా @kanduladurgesh ?
అసలు రాజకీయాల్లోకి ఈ నీచ సంస్కృతిని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో అందరికి తెలుసు..!
అనంతపురంలో గంజాయి బ్యాచ్ వీరంగం
ఇంటి వద్ద న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజేష్, ఉమా దంపతులు
అర్ధరాత్రి సమయంలో ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించిన ఆకతాయిలు
ఇంట్లోకి పెట్రోల్ విసిరి దాడికి యత్నం.. అనంతపురం నగరంలోని హమాలీ కాలనీ లో ఘటన
ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేసిన బాధితులు
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు
వైసీపీ నేత శృంగారపాటి సందీప్ అరెస్ట్
తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా టోల్గేట్ వద్ద మఫ్టీలో వచ్చి సందీప్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
సందీప్‌ను కారు దింపి బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయిన పోలీసులు
ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా బలవంతంగా తీసుకువెళ్లిపోయిన పోలీసులు
15 రోజుల నుంచి తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, సందీప్ ఇంట్లో లేని సమయంలో వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించారంటున్న కుటుంబ సభ్యులు
సందీప్‌ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకపోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు
హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
🚨 కూటమి పాలనలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు
గుంటూరు:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ అక్రమ అరెస్ట్
తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా టోల్ గేట్ వద్ద శృంగారపాటి సందీప్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
సందీప్ ని కారు దింపి బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయిన పోలీసులు
ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని పోలీసులు సందీప్ ప్రశ్నించిన సమాధానం చెప్పకుండా బలవంతంగా సందీప్ ని తీసుకువెళ్లిపోయిన పోలీసులు
15 రోజుల నుంచి సందీప్ ఇంటి చుట్టూ తిరుగుతున్న పోలీసులు
కారణం చెప్పకుండా పోలీస్ స్టేషన్ రావాలని సందీప్ ని వేధిస్తున్న తుళ్లూరు పోలీసులు
శృంగారపాటి సందీప్ ఇంట్లో లేని సమయంలో పోలీసులు ఇంటికి వెళ్లి సందీప్ ని అరెస్ట్ చేస్తామని కుటుంబ సభ్యులను బెదిరించిన పోలీసులు
సందీప్ ను పోలీసులు ఎక్కడికి తీసుకు వెళ్లారో తెలియకపోవడంతో ఆందోళనలో సందీప్ కుటుంబ సభ్యులు.
#CBNJungleRaj #YSRCP #AndhraPradesh #JaganannaConnects
నేను జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తుంటే.. నంద్యాల జిల్లాలో టీడీపీ వాళ్లు నా భూమిని ఆక్రమించేస్తున్నారు!
టీడీపీ మండల అధ్యక్షుడు కంచెర్ల శివ 2.30 ఎకరాల భూమిని మా కుటుంబ సభ్యుల్ని బెదిరించి కబ్జా చేస్తున్నాడు
దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న నా ఆవేదనను అర్థం చేసుకుని.. నా ఆస్తిని కాపాడండి అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి సైనికుడు భాష్యం మహేష్ అభ్యర్థన
కొంచెం కూడా మీకు సిగ్గుగా అనిపించడం లేదా @ncbn ?
#SadistChandraBabu