గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి 🙏
విషయం: భారీ వర్షాల కారణంగా k చాకరాపల్లి గ్రామం లో వరి పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్న సమస్యపై తక్షణ చర్యలకు విజ్ఞప్తి. మరియు ఈ గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి…
దాదాపు 75 సంవత్సరాలుగా సరైన రహదారి లేదు.
విజయనగరం జిల్లా, రాజాం నియోజకవర్గం, వంగర మండలం, K. చాకరాపల్లి గ్రామంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామంలోకి నీరు చేరడంతో పాటు, వరి పొలాలు నీటమునిగి తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
అధిక వర్షపాతం కారణంగా పొలాల్లో నీరు నిలిచిపోవడంతో వరి పంటకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పొలాల గట్లు దెబ్బతిని, సాగుభూమి క్రమంగా కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. గ్రామస్థులు, రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కావున దయచేసి సంబంధిత అధికారులను ఈ గ్రామాన్ని మరియు వరి పొలాలను తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరుచున్నాము.
• వర్షపు నీటి పారుదల కోసం తక్షణ చర్యలు చేపట్టాలి
• దెబ్బతిన్న పొలాలు, కాలువలు మరియు గట్లను పరిశీలించాలి
• రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలి
• అర్హత ఉన్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించాలి
• భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత నీటి పారుదల/డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలి.
ఈ గ్రామ ప్రజలు మరియు రైతుల సమస్యను దయచేసి పరిగణనలోకి తీసుకుని తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
-------------------------------------------
ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ గ్రామ ప్రజల రోడ్డు సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.
వర్షం వస్తే ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.
రోడ్డు బురదమయం అవుతుంది.
ప్రయాణించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి,
రైతులు పొలాలకు వెళ్లడానికి,
వృద్ధులు ఆసుపత్రులకు వెళ్లడానికి,
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ గ్రామానికి ఒక మంచి రహదారి కావాలి.
75 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ గ్రామ సమస్యను మీరు ఒక్కసారి దయచేసి గమనించండి
ఈ గ్రామానికి అధికారులను పంపించి
క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి,
రోడ్డు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని
మా గ్రామ యువత తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాము.
📍 K. చాకరాపల్లి గ్రామం
వంగర మండలం
రాజాం నియోజకవర్గం
విజయనగరం జిల్లా
ఆంధ్రప్రదేశ్
@PawanKalyan@APDeputyCMO@mvrkteja@JanaSenaParty@NagaBabuOffl
@mvrkteja;@PawanKalyan@APDeputyCMO Magic Drains are more economical and efficient than conventional drainage systems. Why are they being implemented mainly in Panchayats? Can’t this model be adopted in Municipal Corporations as well—at least for all newly planned drainage works?
మేము ఈ వీడియో ద్వారా మా ప్రాంత ప్రజల సమస్యలు మరియు మేము రోజు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వానికి మరియు మా ప్రాంత ప్రజాప్రతినిధులు కి తెలియజేయాలి అనే చిన్న ప్రయత్నం మాత్రమే, ఇది కేవలం ఒక ఊరి సమస్య కాదు రెండు నియోజక వర్గాల ప్రజల నరకయాతన @PawanKalyan@APDeputyCMO@ncbn 🙏🏻
@Shanthi03051991 One lakh istundi own money tho.. Seven lakhs icherani cheptundi govt (tax payers) money.. Chaala difference vundi renditiki.. Don’t think you have enough knowledge to understand the difference..
@KTRTRS True sir..Telangana and other states will prosper more under our APs leadership. Coz no investors will dare to come to AP and definitely other states will prosper more by grabbing those investors😜😜