ధర్మవరంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం!
సంస్కృతి సేవా సమితి, శంకర నేత్రాలయ (USA) సంయుక్త ఆధ్వర్యంలో పోతుకుంట ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని మంత్రి శ్రీ @satyakumar_y గారి సతీమణి శ్రీమతి త్రివేణి గారు ప్రారంభించారు. ధర్మవరం ప్రజల కోసం ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఏపీ లెజిస్లేచర్స్ స్పోర్ట్స్ మీట్ – 2026 సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలకు హాజరయ్యాను.
శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులతో కలిసి క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో పాల్గొన్నాను. ప్రజాప్రతినిధుల మధ్య స్నేహభావం, క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
#SportsMeet2026
#Vijayawada
#SportsSpirit @BJP4Andhra
మన ఇంట్లో భాగమైన కాడెద్దులను, పాడి పశువులను అలంకరించి, పూజించే పండుగే కనుమ. కర్షకులు, కష్టజీవుల ఇళ్లన్నీ పాడిపంటలు, ధాన్యపు సిరులతో కళకళలాడాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూ..
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
#Sankranti#kanuma2026@BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ArogyaAndhra
*నేను మంత్రి కాకపోయి ఉంటే మీ మధ్యలో కూర్చుని పవర్ స్టార్ , OG -2 అని అరిచేవాడిని , నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు - మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు*
తిరుపతిలో జరిగిన బీసీ ఆత్మ గౌరవ సభలో సహచర మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, శ్రీమతి సవిత గారితో కలసి పాల్గొన్నాను. ఆంధ్రప్రదేశ్లో బీసీ సామాజిక వర్గాల ప్రాతినిథ్యం, ఆత్మగౌరవం, గొంతుగా ఈ సభ నిలిచింది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఇది వేదికగా నిలిచింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కలలుగన్న సమ్మిళిత పాలనను అందించేందుకు కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ల తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది.
విద్య, పారిశ్రామిక, ఉద్యోగ రంగాల్లో బీసీ యువతను ప్రోత్సహించేలా పాలనాపరమైన సంస్కరణలు తీసుకొస్తున్నాము. బీసీల సాధికారత అనేది దానం కాదు.. ఇది బీసీ హక్కులు, న్యాయానికి సంబంధించిన అంశం. బీసీల కోసం చేపట్టే కార్యక్రమాలు సంక్షేమ ప్రయత్నాలు కాదు.. వారి ఆత్మగౌరవ ఉద్యమం.
ఆత్మగౌరవం, హక్కులు, సమాన అవకాశాలతో మీ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని ప్రతి బీసీ సోదర సోదరీమణులకు హామీ ఇస్తున్నాను. అన్ని రంగాల్లో బీసీల అభ్యున్నతి కోసం, వారి ఆత్మగౌరవం కాపాడేందుకు కట్టుబడి ఉన్నారు.
#BCAatmaGowravaSabha #BCWelfare #SocialJustice #BCReservation #EmpoweredBCs @ArogyaAndhra@JaiTDP@BJP4Andhra@JanaSenaParty
మంగళగిరిలో APMSIDC అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. ఆరోగ్య శాఖలో సివిల్ వర్క్స్, మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఔషధాల సేకరణ, పెండింగ్ బిల్లులు, పరికరాల సరఫరాపై APMSIDC చైర్మన్ శ్రీ చెల్లపల్లి శ్రీనివాస్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గిరీష గారు, సీనియర్ అధికారులతో చర్చించాను.
ప్రతి ప్రాజెక్ట్ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలి. అన్ని స్థాయిల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలి. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఆరోగ్య శాఖ, APMSIDC సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయం.
#APMSIDC #HealthyAndhraPradesh #HealthInfrastructure @ArogyaAndhra
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @myogiadityanath గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. ధర్మవరం పట్టు వస్త్రాన్ని, నిమ్మలకుంట కళాకారులు రూపొందించిన శ్రీ కృష్ణుని తోలుబొమ్మను ఆయనకు బహూకరించాను. ధర్మవరం పట్టు, నిమ్మలకుంట తోలుబొమ్మల విశిష్ఠతను ఆయనకు వివరించాను. మథుర శ్రీ కృష్ణుడి ప్రతిమను ఆయన నాకు బహూకరించారు.
దేశ, రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సందర్భంగా చర్చించాము. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని, అలాగే ధర్మవరం నియోజకవర్గాన్ని సందర్శించాలని ఆయనను కోరాను. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.
#uttarpradesh #BJP4ViksitBharat @BJP4Andhra@BJP4India@ArogyaAndhra
#ధర్మవరం పట్టణంలోని హైస్కూల్ మైదానంలో 15వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లా హాకీ ఛాంపియన్ షిప్ పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించాను. హాకీ క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించాను. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో క్రీడాకారులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వహకులు, అధికారులకు సూచించాను.
హాకీ మన జాతీయ క్రీడ. వరుసగా ఆరు.. మొత్తంగా 8 స్వర్ణ పథకాలు ఒలింపిక్స్ లో సాధించిన ఘనత మన భారత హాకీది. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ తో పాటు ధనరాజ్ పిళ్ళై, ముకేష్ కుమార్ లాంటి ఎంతో మంది అత్యుత్తమ క్రీడాకారులు మన హాకీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. క్రికెట్ జోరులో మన హాకీ కొంచెం వెనకబడినప్పటికీ మళ్లీ పూర్వ వైభవం దిశగా సాగుతోంది. దీనికి నిదర్శనం గత ఒలింపిక్స్ లో మన పురుషుల జట్టు కాంస్య పతకం గెలుచుకోవడం.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో కేంద్ర క్రీడా బడ్జెట్ రూ.1,300 కోట్లు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,800 కోట్లు కేటాయించారు.
అలాగే ఫిట్ ఇండియా కార్యక్రమం ప్రవేశపెట్టారు. 2030 దశకంలో మనదేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నారు. రాష్ట్రంలో సరికొత్త క్రీడా పాలసీ తెచ్చారు. ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఇచ్చే రిజర్వేషన్ పెంచారు. 2028 నాటికి అమరావతిలో ఆసియా గేమ్స్ నిర్వహించడం, దేశంలో రెండో అతిపెద్ద స్టేడియం కట్టడం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడం ప్రాధాన్యంగా పెట్టుకున్నారు.
క్రీడలు శారీరక దృఢత్వం పెంచడంతోపాటు, మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. అంతేకాదు టీమ్ గా పని చేయడం ఎలాగో నేర్పుతాయి. క్రీడాకారులు ఆదర్శవంతమైన పోటీ తత్వంతో, క్రీడా స్ఫూర్తితో ఆడాలి. ధర్మవరంలో ఆస్ట్రో టర్ఫ్ స్టేడియం నిర్మిస్తాం. జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తాం. హాకీ అంటే ధర్మవరం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతాం.
#Dharmavaram #spots #vikasitbharat @BJP4Andhra #NDA @JanaSenaParty@JaiTDP
విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్(ఏపీఎంసీ) సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎపీఎంసీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన డాక్టర్ గోగినేని సుజాత గారు, డాక్టర్ కె.వి.సుబ్బానాయుడు గారు, డాక్టర్ డి.శ్రీహరిబాబు గారు, డాక్టర్ స్వర్ణగీత గారు, ఎస్.కేశవరావు బాబు గారు, డాక్టర్ సి.మల్లీశ్వరి గారికి అభినందనలు.
రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి, నైతిక ప్రమాణాలను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి నిపుణులైన వైద్యులను ఏపీఎంసీ సభ్యులుగా నియమించడమే నిదర్శనం. అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని, వైద్య రంగాన్ని ఆదర్శనీయంగా నిలపాలని కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులను కోరుతున్నాను.
#AndhraPradesh #APMC #Health @ArogyaAndhra@BJP4Andhra@JaiTDP@JanaSenaParty
పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి సందర్భంగా ధర్మవరంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాను. సత్యసాయి చూపించిన ఆధ్యాత్మిక, సేవా మార్గం మనందరికీ ఆచరణీయం. సత్యసాయి బాబా స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులకు అభినందనలు.
ఈరోజు సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నాను. రాష్ట్ర పునర్నిర్మాణం, పాలనలో పారదర్శకత, పథకాల అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
#AndhraPradesh#Chandrababu#NDA#NDAGovernment@ncbn@PawanKalyan@satyakumar_y #collectors #Amaravati
@satyakumar_y బీసీలను వంచించి మోసం చేశావు..
ఎస్సీ కార్పొరేషన్ నిధులు మింగేశావు..
పేదల పొట్ట కొట్టి కోట్లు పోగుచేసుకున్నావు..
సిగ్గు లేకుండా సిద్ధం అంటున్నావు..
@YSRCParty@ysjagan#సదాసిద్దం